indian american scientist
-
భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
హాంకాంగ్: విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామాకిరణాల వెల్లువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనలకు గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి.. ప్రఖ్యాత ‘షా’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆ్రస్టానమీ, ప్లానెటరీ సైన్స్, డివిజన్ ఆఫ్ ఫిజిక్స్, మేథమేటిక్స్, ఆ్రస్టానమీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత జ్వికీ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీల్లో టెలిస్కోప్‌ల సాయంతో రోదసీలో నిర్దిష్ట ప్రాంతంలోని ఖగోళ అంశాలను పరిశీలించి వాటిపై విశేష పరిశోధనలు చేసినందుకుగాను ఈ అవార్డ్‌ను శ్రీనివాస్‌కు ప్రదానం చేయనున్నారు. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్‌కు అవార్డ్ ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది. -
భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు. కింది స్థాయి నుంచి... ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు. -
ఈమెయిల్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా?
ఈమెయిల్‌ను ఎవరు కనుగొన్నారో తెలుసా.. భారతీయుడే!! అవును.. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను తొలిసారిగా 32 ఏళ్ల క్రితం కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్‌ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. వాస్తవానికి ఆయన 1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అయితే 1982లో దానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీరైట్ పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్‌హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అయితే.. ఆయనే ఈమెయిల్‌ను కనుగొన్నా.. కంప్యూటర్ చరిత్రలో మాత్రం వేరేవాళ్లు కూడా తామే కనుగొన్నట్లు చెబుతుండటంతో కొంత వివాదం ఏర్పడి ఆయన పేరు పెద్దగా బయటకు రాలేదు.