భారతీయ యువతికి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని.. | 18 Year Old Arti UPs First Female Pink E Rickshaw Driver | Sakshi
Sakshi News home page

భారతీయ యువతికి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..

Published Tue, May 28 2024 12:38 PM | Last Updated on Tue, May 28 2024 4:22 PM

18 Year Old Arti UPs First Female Pink E Rickshaw Driver

ఓ టీనేజ్‌ అమ్మాయి లండన్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్‌ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్‌ లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన అమల్‌ కూన్లీ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్‌ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్‌ ట్రస్ట్‌చే స్పాన్సర్‌ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్‌ బారిస్టర్‌ అమల్‌ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్‌ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. 

పింక్‌ రిక్షా ఇనిషియేటివ్‌ అంటే..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్‌ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్‌ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. 

ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్‌ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్‌ ఈ రిక్షా డ్రైవర్‌ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్‌ ట్రస్ట్‌ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్‌ ట్రస్ట్‌. 

ఆర్తీ తొలి పింక్‌ ఈ రిక్షా డ్రైవర్‌గా ఎలా మారిందంటే..
ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో కింగ్‌ చార్లెస్‌ని కలిసే అవకాశం లభించేలా చేసింది.

ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్‌ తనకు ఈ రిక్షా డ్రైవింగ్‌ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. 

(చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement