rickshaw
-
భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..
ఓ టీనేజ్ అమ్మాయి లండన్ ప్రిన్స్ చార్లెస్‌ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్ లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్ట్చే స్పాన్సర్ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పింక్ రిక్షా ఇనిషియేటివ్ అంటే..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్ ట్రస్ట్. ఆర్తీ తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా ఎలా మారిందంటే..ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ని కలిసే అవకాశం లభించేలా చేసింది.ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. (చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?) -
మచ్చా... మైండ్‌బ్లోయింగ్! ’ ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతడు
ఇంగ్లీష్‌లో తట్టుకుంటూ మాట్లాడటం వేరు, భయంగా మాట్లాడటం వేరు. ఫ్లుయెంట్గా, ధైర్యంగా మాట్లాడటం వేరు. దిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో తన రిక్షాలో కూర్చున్న విదేశీ దంపతులతో ఒక రిక్షావాలా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం చూస్తుంటే ‘మైండ్‌బ్లోయింగ్ మచ్చా’ అనిపిస్తుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారిలో ధైర్యం నింపుతోంది. ఈ వీడియోలాగే ఇటీవల మరో వీడియో వైరల్ అయింది. గోవా బీచ్‌లో గాజులు అమ్మే మహిళ ఆ ప్రాంతం గురించి విదేశీ టూరిస్టులతో గడ గడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి గోవా బీచ్‌లో తల్లిదండ్రులతో కలిసి తిరిగిన ఆమెకు ఆ పరిసర ప్రాంతాల్లో వినిపించే మాటలే ఇంగ్లీష్ నేర్చుకునే పాఠాలు అయ్యాయి. -
రిక్షాలో మంత్రి ఆర్కే రోజా ప్రయాణం
-
Rk Roja: రిక్షాలో మంత్రి ఆర్కే రోజా ప్రయాణం
నగరి(చిత్తూరు జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆర్కే రోజా వెళ్లారు. అయితే వారణాశిలోని వీధుల్లో మంత్రి రోజా రిక్షాలో తిరుగుతూ సందడి చేశారు. 144 ఏళ్ల తరువాత శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి రావడంతో ఈ పర్వదినాన కాశీవిశ్వేశ్వరుని శనివారం ఆమె దర్శించుకున్నారు. గంగా హారతి అనంతరం తానో మంత్రి, సెలబ్రిటీ అని మరచి కాసేపు ఓ సాధారణ భక్తురాలిలా రిక్షాలో ప్రయాణించారు. -
మహా శివరాత్రికి కాశీలో ఏపీ మంత్రి రోజా
-
RK Roja: కాశీలో ఏపీ మంత్రి రోజా
సాక్షి, వారణాసి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక నగరం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని.. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై.. కాశీ వీధుల్లో రిక్షాలో మంత్రి రోజా చక్కర్లు కొట్టారు. రిక్షా ఎక్కి ఆమె నగరంలో పర్యటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చదవండి: సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు -
సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్‌లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా? నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు. సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్‌లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే. కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు. ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు. ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్‌లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా? సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ. కొత్తొక రోత. పాతొక వింత. మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. -
బ్యాటరీ బిజినెస్‌పై ఓయ్! రిక్షా వేలకోట్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఓయ్! రిక్షా దేశీయంగా బ్యాటరీల స్వాపింగ్ సౌకర్యాలపై దృష్టి పెట్టింది. ఇందుకు రానున్న మూడేళ్లలో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్ మౌలికసదుపాయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీఈవో మోహిత్ శర్మ పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ విస్తరణకుగాను రెండేళ్లలో రూ. 150–220 కోట్లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 10,000 లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బతీయడంతో 5,000 వాహనాలకు సరిపడా 6,500 బ్యాటరీలను అందించాలని ఆశిస్తోంది. 5,000 మంది డ్రైవర్ల భాగస్వామ్యంతో ఈరిక్షాల ద్వారా వినియోగదారులకు షేర్డ్, ఎలక్ట్రిక్, మైక్రో మొబిలిటీ సేవలు అందిస్తోంది. బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్‌లోకి కొత్తగా ప్రవేశించినప్పటికీ 250–300 మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేసుకున్నట్లు శర్మ వెల్లడించారు. -
రయ్.. రయ్.. ఐడియా ఆన్ వీల్స్!
ఆలోచనే మనిషికి ఇం‘ధనం’. దాన్నే పెట్టుబడిగా చేసుకుని ‘రోడ్డెక్కితే’ ఎన్నో కొత్త అంశాలు ఆవిష్కృతమవుతాయి. ‘మేనుకు చేవ / చేతికి రొక్కం’ రెండూ దక్కుతాయి. అసలు మస్తిష్కానికి పదును పెట్టాలే గానీ అద్భుతాలు మన ముంగిటే వచ్చి వాల్తాయి. అలాంటి అద్భుతాన్ని ఇదిగో ఇలా చేసి చూపించాడు ఓ రిక్షావాలా. చిన్న ద్విచక్ర వాహన ఇంజినుకు రిక్షాను అనుసంధానించి రయ్ మంటూ విజయవాడ వీధులో వెళ్తున్న ఈ రిక్షావాలా ప్రయోగాన్ని అందరూ ముక్కున వేలేసుకుని మరీ చూస్తున్నారు. భళిరా! నీ ఆలోచన అంటూ అభినందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇక్కడ చదవండి: Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా Photo Feature: విరగకాసిన పనస చెట్టు -
తబారక్... ముబారక్
ఆకలితో చచ్చేట్టు మేము అక్కడ.. నా ఇద్దరు కూతుళ్లు ఇక్కడ.. మేం పడ్డ బాధ మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అందరం ఒకే చోట ఉన్నాం.. ఈ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు’ ఒక వలస కార్మికుడి భార్య మాట ఇది. ఆమె పేరు సోర్గా. అయితే ఈ కథనం ఆమె గురించి కాదు.. వలస కార్మికుడైన ఆమె భర్త ఇస్రాఫిల్ గురించీ కాదు. వాళ్లబ్బాయి పదకొండేళ్ల తబారక్ గురించి.. తల్లిని, తండ్రిని రిక్షాలో కూర్చోబెట్టుకొని ఆరువందల కిలోమీటర్లు రిక్షాతొక్కాడు తబారక్. ∙∙ తబారక్‌ది బిహార్‌లోని, అరారియా జిల్లా జోకిహత్. ఆరుగురు సంతానంలో తబారక్ అయిదోవాడు. ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి. జోకిహత్‌లో ఒక పూరి గుడిసె తప్ప ఏమీ లేదు ఆ కుటుంబానికి. ఇరౖÐð ఏళ్ల కిందట వారణాసికి వలస వెళ్లాడు తబారక్ తండ్రి ఇస్రాఫిల్. అక్కడ ఓ మార్బుల్ షాప్‌లో పనికి కుదిరాడు. పిల్లలను చూసుకుంటూ.. దొరికిన పనిచేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయింది తబారక్ తల్లి సోర్గా. ఒకసారి పనిచేస్తుండగా కంటికి దెబ్బతగిలి చూపు కోల్పోయింది సోర్గా. దాంతో ఇంటికే పరిమితమైపోయింది ఆమె. అక్కడ వారణాసిలో.. దుకాణంలో రాళ్లు మోసే కూలీగా వస్తున్న జీతంలోంచి కొంత ఇంటికి పంపి.. మిగిలిన దాంతో తన ఖర్చులను వెళ్లదీసుకుంటున్న 55 ఏళ్ల ఇస్రాఫిల్ ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగింది. ఈ విషయం తెలియగానే తబారక్‌ను తోడు తీసుకుని వారణాసి వచ్చింది సోర్గా. భర్త ఆరోగ్యం కాస్త కుదుట పడగానే తిరగి ఊరెళ్లిపోదామనుకుంది. కాని ఈలోపే కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో వారణాసిలోనే చిక్కుకు పోవాల్సి వచ్చింది. దెబ్బతగిలి అప్పటికే నెల రోజులుగా సెలవులో ఉన్న ఇస్రాఫిల్ దగ్గర దాచుకున్న డబ్బంతా అయిపోయింది. లాక్డౌన్ బంద్ వల్ల పనీ పోయి.. ఆకలితో అలమటించే రోజులు వచ్చాయి. ఇక అక్కడ ఉండే కన్నా కష్టమో నష్టమో సొంతూరుకు వెళ్లడమే నయమనే అభిప్రాయానికి వచ్చేశాడు. అతనికి ఒక సైకిల్ రిక్షా ఉంది. దాంట్లోనే జోకిహత్‌కు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అదేవిషయం భార్యకు, కొడుకుకూ చెప్పాడు. కాలిగాయంతో బాధపడుతున్న తండ్రి రిక్షాను ఎలా నడుపుతాడు అని ఆలోచించాడు తబారక్. తెల్లవారి పొద్దున్నే అమ్మానాన్నకంటే ముందే తయారై రిక్షా ఎక్కాడు తబారక్. వెనక కాదు.. ముందున్న సైకిల్‌మీద. అమ్మానాన్నని ఎక్కించుకొని రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వారణాసి నుంచి బిహార్‌లోని జోకిహత్ వరకు మొత్తం 600 కి.మీ. ఎదురైన అడ్డంకులన్నిటినీ అధిగమించి తల్లిదండ్రులను క్షేమంగా సొంతూరు చేర్చాడు. ప్రస్తుతం.. ఇస్రాఫిల్, తబారక్ ఇద్దరూ కూడా జోకిహత్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్నారు. పదకొండేళ్ల తబారక్.. తన తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని రిక్షా తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పిల్లాడి అన్న కూడా వలసకార్మికుడే. ప్రస్తుతం తమిళనాడులో చిక్కుకుపోయాడు. -
బిల్డింగ్ పైనుంచి రిక్షాలో పడ్డ చిన్నారి..
భోపాల్ : రోడ్డుపై వెళ్తున్న ఓ రిక్షా చిన్నారి ప్రాణాలను కాపాడింది. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి జారీన బాలుడు.. సరిగా రిక్షాలోని సీట్‌పై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని టికమ్‌ఘర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టికమ్‌ఘర్‌లోని ఓ బిల్డింగ్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారీపడ్డాడు. అదే సమయంలో బిల్డింగ్ కింద రోడ్డుపై నుంచి రిక్షా వెళ్తుంది. దీంతో బాలుడు రిక్షాలోని సీటుపై పడటంతో.. స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న బాలుడు క్షేమంగా ఉన్నాడు. రెండో అంతస్తులో కుటుంబసభ్యులతో కలిసి ఆడుకుంటుంగా బాలుడు అనుకోకుండా కిందకు జారీ పోయాడని అతని తండ్రి అశిష్ జైన్ తెలిపాడు. రెయిలింగ్‌ను పట్టుకుని ఉన్న బాలుడు ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పాడు. కాగా, బాలుడు రిక్షాలో పడుతున్న దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో నమోదు అయ్యాయి. -
బిల్డింగ్ పైనుంచి రిక్షాలో పడ్డ చిన్నారి..
-
యూపీలో మగ్గాలు నేస్తున్న టీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లహర్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ అక్రమ్ తెల్లవారు జామున మూడు గంటలకే నిద్ర లేస్తారు. ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఇంటికి సమీపంలోనే ఉన్న రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తారు. అక్కడి నుంచి ఇంటికెళ్లి ఇంత టిఫిన్ తిని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిశ్వాన్ మదర్సాకు సైకిల్‌పై వెళతారు. ఉదయం 9 గంటల నుంచి 2.30 గంటల వరకు అక్కడ పనిచేస్తారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాక సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మరో రెండు గంటలు రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తారు. కాన్పూర్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న అక్రమ్ బిశ్వాన్ మదర్సాలో లెక్కలు, ఇంగ్లీషు చెప్పేందుకు 2009లో నియమితులయ్యారు. 2016 వరకు ఆయన జీవితం కాస్త సాఫీగానే సాగింది. అప్పటి నుంచి జీతం రాకుండా నిలిచి పోవడంతో రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అందులో రోజుకు 150 రూపాయలు వస్తాయట. ఎప్పటికైనా జీతానికి సంబంధించిన ఎరియర్స్ వస్తాయన్న ఆశతో ఆయన క్రమం తప్పకుండా మదర్సాకు వెళ్లి పిల్లలకు చదువు చెబుతూనే ఉన్నారు. అక్రమ్ ఒక్కడిదే కాదు ఈ బాధ. యూపీలోని మదర్సాల్లో ఆధునిక విద్యను బోధించేందుకు నియమితులైన 20 వేల మంది టీచర్ల పరిస్థితి ఇదే. వారిలో కొందరు పార్ట్‌టైమ్‌గా ఇళ్ల వద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. కొందరు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు నడుపుతున్నారు. మరి కొందరు ఇంటింటికి సరకులు మోస్తూ బతుకుతున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నడుస్తున్న ‘స్కీమ్ ఫర్ ప్రొఫైడింగ్ ఎడ్యుకేషన్ టు మదర్సాస్ అండ్ మైనారిటీస్’ కింద మదర్సాలలో మ్యాథమేటిక్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్ బోధించేందుకు నియమితులైనవారు. మదర్సా నిర్వహణకు, గ్రంధాలయం లాంటి మౌలిక సదుపాయాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ప్రతి మదర్సాకు ముగ్గురు టీచర్ల చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తుంది. గ్రాడ్యువేట్ టీచర్లకు ఆరు వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు 12వేల రూపాయలను చెల్లిస్తుంది. దానికి తోడుగా గ్రాడ్యుయేట్లకు యూపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు మూడు వేల రూపాయలను చెల్లిస్తూ వచ్చింది. 2016, మార్చి నెల నుంచి వీరి జీతాలన్ని నిలిచిపోయాయి. ఈ మదర్సాలలో ముస్లిం పిల్లలే కాకుండా 30 శాతం మంది హిందూ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇందుకు తమ తప్పేమి లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడమే కారణమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాదిస్తోంది. గ్రాంటును మంజూరు చేసినప్పటికీ 284.87 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయలేదు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ఈ కేంద్రం స్కీమ్‌ను అమలు చేస్తున్నప్పటికీ ఒక్క యూపీకే ఈ సమస్య రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని 8,584 మదర్సాలు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో 18,27,566 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వెయ్యికిపైగా మదర్సాలు ఉన్నాయి తప్పా, మిగితా రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్నాయి. మదర్సాలంటే ఏమిటీ? మదర్సా అనే పదం అరబిక్ నుంచి వచ్చింది. అరబిక్‌లో దరా అంటే నేర్చుకోవడం అనే అర్థం. మదర్సా అంటే నేర్కుకునే బడి అని అర్థం. దేశ స్వాతంత్య్రానికి ముందు భారత్‌లో బ్రిటీష్ ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాలు, ముస్లిం సామాజిక వర్గం నడిపే మదర్సాలు రెండు రకాలు ఉండేవి. ప్రైవేటు మదర్సాల్లో ఇస్లాం మతంతోపాటు అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలను నేర్పేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాల్లో కేవలం అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలను మాత్రమే నేర్పేవారు. దేశానికి స్వాతంత్వ్రం వచ్చిన తర్వాత వీటిని మైనారిటీ వర్గానికి చెందిన ప్రాథమిక విద్యాకేంద్రాలుగానే పరిగణించారు. ప్రైవేట్ మదర్సాలలో ఇస్లాంను బోధిస్తారుకనుక అందులో చదువుకున్న వారు ఎక్కువగా ఇమామ్‌లు, ముస్లిం మత గురువులు అయ్యేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాలలో చదువుకునే వారు ఆ తర్వాత చదువుకు స్వస్తి చెప్పడమో, ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమో చేసేవారు. సంస్కరణలు, ఆధునీకరణ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న మదర్సాల సంస్కరణలకు భారత ప్రభుత్వం 1993 నుంచి కృషి చేస్తోంది. ‘ఏరియా ఇంటెన్సివ్ ప్రోగామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ అండ్ ఫైనాన్సియల్ అసెస్టెంట్స్ ఫర్ మోడరనైజేషన్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్’ అనే రెండు స్కీమ్‌లు తెచ్చింది. వీటికి హిందువుల పిల్లలకు కూడా అనుమతి ఉండడంతో వారికి అరబిక్, పర్షియన్ భాషలకు బదులుగా సంస్కృతం బోధిస్తూ వస్తున్నారు. కేవలం భాషలకు, భాషా సంస్కృతి, సంప్రదాయాలకు పరిమితం అవుతున్న వీటిని ఆధునిక విద్యా కేంద్రాలుగా మార్చాలన్న ఉద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం 2009లో ‘స్కీమ్ ఫర్ ప్రొఫైడింగ్ ఎడ్యుకేషన్ టు మదర్సాస్ అండ్ మైనారిటీస్’ ప్రైవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద మదర్సాల్లో చదువుకున్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా తొమ్మిదవ తరగతిలో చేరుతున్నారు. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు యూపీ స్కూళ్లలో చేరుతున్న వారిలో 25 శాతం మంది మదర్సా విద్యార్థులే ఉంటున్నారు. నిధుల విడుదలకు కఠిన నిబంధనలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో మదర్సాలకు నిధులు విడుదల చేయడానికి నిబంధనలను కఠినతరం చేసింది. మదర్సాల ఆర్థిక సహాయం స్కీమ్‌ను కొనసాగించాలా, వద్దా? అన్న అంశంపై 2018లో మదర్సాల పనితీరును సమీక్షించింది. మరో రెండేళ్లపాటు 2020 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా రాష్ట్రాల విద్యాబోర్డు అనుమతిని తప్పనిసరి చేసింది. అయితే నిధుల విడుదలలో తాత్సారం చేస్తోంది. యూపీ మదర్సా టీచర్లు ఢిల్లీ జంతర్‌మంతర్‌కు వెళ్లి ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. -
పేదోడి పెద్ద మనసు
-
రియో చేరిన ‘రిక్షావోడు’
రియో: చైనా రైతు చెన్ గ్వాన్‌మింగ్ తనను తాను ‘ఒలింపిక్ పిచ్చోడు’గా చెప్పుకున్నాడు. అతని ప్రస్థానం చూస్తే మనం కూడా అదే మాట అంటాం. రిక్షా తొక్కుతూ 2010లో బీజింగ్‌లో ప్రయాణం ప్రారంభించిన 60 ఏళ్ల గ్వాన్‌మింగ్...ఆపై లండన్ ఒలింపిక్స్‌కు వెళ్లి, అక్కడినుంచి ఇప్పుడు రియోకు కూడా వచ్చేశాడు. ఇదంతా తన రిక్షాతోనే కావడం పెద్ద విశేషం. సముద్ర సరిహద్దులు ఎదురైన సమయంలో ఓడలో రిక్షాను పంపించి తాను ఫ్లైట్ ద్వారా దానిని దాటేవాడు. ఒలింపిక్ స్ఫూర్తిని చాటడం, సవాళ్లంటే భయపడేవారిని ప్రోత్సహించడమే తన రిక్షా యాత్రను సాగించేందుకు కారణమని అతను అన్నాడు. పెద్దగా డబ్బులు లేకపోయినా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎవరో ఒకరు సహకరిస్తుండటంతో ఇది సాగిందని చెన్ వెల్లడించాడు. అయితే ఇంతా చేసి గ్వాన్‌మింగ్ ప్రత్యక్షంగా ఏ ఒలింపిక్ క్రీడలూ చూడలేదు... కేవలం ప్రధాన వేదిక వద్దకు చేరడంతోనే అతను తన పని ముగించేవాడు. -
రిక్షాలో దర్జాగా తిరిగేవాళ్లం..
జ్ఞాపకం గొల్లపూడి మారుతీరావు.. పరిచయం అక్కరలేని ప్రముఖ రచయిత, గొప్ప నటుడు. కాలమిస్టు. భాగ్యనగరంతో ఆయనది 64 ఏళ్ల బంధం. ఇక్కడ జరిగిన ప్రతి మార్పును దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆ జ్ఞాపకాల దొంతరలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘విసిరేసినట్లు జనం..! విపరీత చలి.. సాయంత్రమైతే నక్కల అరుపులు.. దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ ఓ పల్లె వాతావరణాన్ని తలపించేది. ఇప్పుడు మహానగరంగా మారిపోయింది. 1952లో నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి హైదరాబాద్ వచ్చాను. పంజగుట్టలో నా బాల్య స్నేహితుల ఇళ్లు ఉండేది. అక్కడకు వచ్చేవాడిని. అప్పుడు బిక్కు బిక్కు మనేలాంటి పరిస్థితి. అక్కడక్కడ విసిరేసినట్టుగా జనం కన్పించేవారు. మడతలో కూర్చొని ప్రయాణించే రిక్షాలు రవాణా సాధనాలు. అప్పుడు లక్డీకాపూల్ చిన్న సెంటర్లా ఉండేది. తర్వాత ఖైరతాబాద్ ఉన్నట్టు లేనట్టు కన్పించేది. ఖైరతాబాద్‌కు ఎడమవైపు పెద్ద పెద్ద గుట్టలు దర్శనమిచ్చేవి. పంజగుట్ట ఎత్తు భాగంలోని ప్రస్తుత శ్రీనగర్ కాలనీ రోడ్డులో మా మిత్రుని ఇల్లు చివరగా ఉండేది. ఆ తర్వాత ఎటు చూసినా ఖాళీ ప్రదేశమే. అమీర్‌పేట, మైత్రీవనం, భరత్ నగర్ ఇవేమీ అప్పటికి లేవు. అక్కడక్కడ చిన్నచిన్న పల్లెలు మాత్రమే ఉండేవి. సాయంత్రం 4 దాటిందంటే నక్కల అరుపులు విపరీతంగా వినిపించేవి. కొత్తవాళ్లు జడుసుకునే వారు. ఇప్పటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు లేవు. ఆ ప్రాంతమంతా కొండలే. పక్షుల కిలకిల రావాలు వినసొంపుగా వినిపించేవి. పిచ్చుకలు, గువ్వల సవ్వడులు ప్రతిధ్వనించేవి. 40 ఏళ్ల తర్వాత.. సుమారు 40 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. అప్పటికి బంజారాహిల్స్‌కు కొంత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం విపరీతమైన చలి ఉండేది. పంజగుట్ట నుంచి ఇప్పటి బంజారాహిల్స్, అమీర్‌పేట, హుస్సేన్‌సాగర్ వైపు చూస్తే పచ్చని పొలాలతో చూడచక్కని నిర్మానుష్య ప్రాంతం. కార్లు ఎక్కడా కనిపించేవి కావు. దూరప్రాంతాలకు రిక్షాలే దిక్కు. వాటిలో దర్జాగా కాలుమీద కాలు వేసుకొని కూర్చొని ప్రయాణించే అమరిక ఉండేది. రిక్షాలు చాలా పొడవుగా ఉండేవి. పబ్లిక్‌గార్డెన్ ఒక ఆకు పచ్చని మహావనం. ఇప్పటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలను తలపించే వాతావరణం హైదరాబాద్ సొంతం. చల్లటి, సుందర, ప్రశాంత నగరం మన హైదరాబాద్. ఎంత మధురంగా ఉండేదో వర్ణించలేను. ఆ వాతావరణాన్ని మళ్లీమళ్లీ ఆస్వాదిద్దామా! అన్నట్టు మనసు పులకించేది. ఆ చల్లటి వాతావరణం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మనసు పులకిస్తుంది. ఇప్పుడు ఆ పచ్చదనం పోయి జనం మహావృక్షంలా పెరిగిపోయారు. నగరం మెట్రో స్థాయికి చేరింది’. -
జగన్ దీక్షకు మద్దతుగా రిక్షా తొక్కిన ఎమ్మెల్యే
బద్వేలు అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జయరాములు పార్టీ అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం రిక్షా తొక్కారు. బద్వేలు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి సిద్ధవటం రోడ్డులోని వినాయకుడి గుడి వరకు రిక్షా తొక్కుకుంటూ వెళ్లారు. 101 కొబ్బరికాయలను రిక్షాలో తీసుకెళ్లి ఆలయం వద్ద కొట్టారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ఆయన వెంట మాజీ మునిసిపల్ చైర్మన్ మున్నెయ్య, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇది కాదు హాయి నిదుర... గిరాకీ లేదు సోదరా!
‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ ... రిక్షావాలా జిందాబాద్’ అంటూ కథానాయకుడు పాట పడుతుంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని హుషారు. రిక్షా వారికైతే ఆ పాటంటే ఎంత మక్కువో చెప్పక్కర లేదు. ఇదంతా గతం. హైదరాబాద్ మహా నగరంలో రిక్షాలది అంతరించిన వైభవం. వాటిని నమ్ముకున్న వారి పరిస్థితీ అంతంతే. అక్కడక్కడ అరకొరగా మిగిలిన రిక్షా కార్మికులకు ఆదరణ లేక తమ వాహనాలపైనే ఇలా నిద్రపోవాల్సిన దుస్థితి నెలకొంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ‘సాక్షి’ కెమెరాకు శుక్రవారం చిక్కిన దృశ్యమిది. ఫొటో : మరికంటి రవికుమార్ -
రిమ్జిమ్ రిమ్జిమ్ ఇ-రిక్షా
కొందరికి అవి జీవనాధారం: మరి కొందరికి ఓ బెడద న్యూఢిల్లీ: బన్సీలాల్ రిక్షా తొక్కి నెలకు ఐదువేల రూపాయలు సంపాదించేవాడు. ఇప్పుడు కాళ్లతో తొక్కే రిక్షాకు బదులుగా బ్యాటరీతో నడిచే దానికి మారాడు. ఇప్పుడు అతని ఆదాయం నెలకు రూ.15వేలపైనే. రాజధాని నగరంలో ఇ-రిక్షాల ఆగమనం ఎందరికో తిండి పెడుతూ, అటు పేదలు ఇటు పర్యావరణవేత్తల ఆదరణ చూరగొంటున్నాయి. ఇదివరకు ‘చేతికి-నోటికి’ అన్న చందంగా బతుకు గడిపిన రిక్షా కార్మికులు ఇప్పుడు కొంత మెరుగైన జీవనం గడుపుతున్నామంటున్నారు. ఇ-రిక్షాలకు మారిన ఎందరో కార్మికులు ఇక తమ జీవనం సుఖప్రదం కాగలదని భావిస్తున్న తరుణంలోనే పూర్వ యూపీఏ ప్రభుత్వం వాటిని చట్ట వ్యతిరేకమైనవిగా ప్రకటిస్తూ ఏప్రిల్ 24న నోటిఫికేషన్జారీ చేసింది. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల అనంతరం స్పందించిన రవాణా అధికారులు ఇ-రిక్షాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని సుమారు 30వేల ఇ-రిక్షాల కార్మికులు, వారి కుటుంబాలు భయాం దోళనకు గురయ్యారు. అయితే నూతన ప్రభుత్వంలో రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతవారం చేసిన ప్రకటన ఈ కుటుం బాలకు ఊపిరిలూదింది. రాజధాని నగరంలో 30 వేలకు పైగా ఇ-రిక్షాలు తిరుగుతున్నాయని బ్యాట రీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అనుజ్ శర్మ చెప్పారు. ఈ సంఖ్యకు కార్మికుల కుటుంబాలను కూడా చేరిస్తే కనీసం 1.20 లక్షల మంది ఇ-రిక్షాలపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ‘‘ఇ-రిక్షాను కొన్నప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. రోజంతా సైకిల్‌రిక్షా తొక్కి సాయంత్రానికి అలసిపోయే వాడిని. ఇప్పుడు ఈ కొత్త రిక్షాలో ఎక్కువ మందిని ఎక్కిం చుకోవచ్చు, ఎక్కువగా సంపాదించవచ్చు’’ అని 40 ఏళ్ల బన్సీలాల్ పేర్కొన్నారు. పర్యావరణ వేత్తలు సైతం ఇ-రిక్షాలను ‘మాధ్యమిక’ ప్రజా రవాణా వ్యవస్థగా అభివర్ణించా రు. వీటి నుంచి ఎటువంటి కాలుష్య ఉద్గారాలు వెలువడవని పేర్కొన్నారు. అయితే వీటిని నడిపే డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రతాపరమైన మార్గదర్శకాలు రూపొందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ‘‘కాలుష్యాన్ని, కార్ల వినియోగాన్ని తగ్గించడంలో ఈ నూతన రవాణా సాధనం ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొం దించాలి’’ అని శాస్త్ర, పర్యావరణ కేంద్ర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అరుంధతీ సీజెల్ సూచించారు. ఇ-రిక్షాలు కామన్వెల్త్ క్రీడలకు ముందు 2010 లో ఢిల్లీలో మొదటిసారిగా దర్శనమిచ్చాయి. నగరమంతటా అవి విస్తరించడానికి మూడేళ్లు పట్టింది. ఢిల్లీ మెట్రో ఫీడర్ బస్సుల వైఫల్యం కారణంగానే ఇ-రిక్షాలు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి తమ నివాస ప్రాం తాలకు చేరవేసేందుకు ఫీడర్ బస్సులను ప్రవేశపెట్టారు. అయితే అవి సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇ-రిక్షాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతకాలం క్రితం వరకు బస్తీల వరకే పరిమితమైన ఇ-రిక్షాలు ఇప్పు డు రద్దీగా ఉండే రోడ్లు, ఫ్లైఓవర్లపై పరుగులు తీస్తున్నాయి. శిక్షణలేని డ్రైవర్లు వాటిని దురుసుగా నడుపుతుండడంతో ఇతర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రంతా బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు పని చేస్తుందని, గంట కు 20-30 కిలోమీటర్ల వేగంతో వెళుతుం దని బన్సీలాల్ చెప్పారు.ఇ-రిక్షా ఖరీదు రూ.85వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంది. ఇరుకు సందుల్లో కూడా దూసుకుపోతుంది. రవాణా మంత్రి గడ్కరీ ప్రకటన నేపథ్యంలో నగర మున్సిపల్ కార్పొరేషన్లు ఇ-రిక్షాలను ఈ నెలాఖరుకు క్రమబద్ధం చేయాలని నిర్ణయించాయి. వీటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేకపోవడం సమస్యగా మారిందని ట్రాఫిక్ పోలీసులంటున్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు డ్రైవర్లకు జరిమానాలు విధిస్తున్నామన్నారు. ఇ-రిక్షాల డిజై న్ లోపాలతో కూడి ఉందని, శిక్షణ లేని డ్రైవర్ల వల్ల ప్రయాణికులకు ప్రమాదకరమని రవాణా విభాగం అధికారి పేర్కొన్నారు. -
ఇక ఫోన్ చేస్తే ఆటో..!
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో ఆన్లైన్ ఆటో రిక్షా సర్వీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ శనివారం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని పలు నగరాల్లో ఈ సేవలు విజయవంతంగా అందుతున్నాయని, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నిర్మల్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ‘జీ-ఆటో’ సేవలను ప్రారంభించామని ఈడీఎంసీ అధికారులు తెలిపారు. సేవలను మేయర్ రామ్ నారాయణ్ దుబే పట్పర్గంజ్లో ఉన్న పరిపాలనా విభాగం ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. మొదటి విడతగా 50 ఆటోలను అందుబాటులోకి తెచ్చారు. తూర్పు ఢిల్లీవాసులు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 011-6444-4441 నంబర్‌కు ఫోన్ చేసి వీటి సేవలను కోరవచ్చని, అలాగే ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జి-ఏయూటీవో. ఓఆర్జీ ద్వారా సేవలను పొందవచ్చునని ఈడీఎంసీ ప్రజా సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా కృషిచేస్తామని ఆయన వివరించారు. వీటికి ప్రభుత్వ రేట్ల ప్రకారమే చార్జీలు ఉంటాయని, అయితే ఈ-సేవల నిమిత్తం మరో రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మాన్ చెప్పారు. ప్రస్తుతం వీటి కోసం దిల్షాన్ గార్డెన్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాగా, ముఖ్యంగా తూర్పు ఢిల్లీవాసుల కోసమే ఈ సేవలు ప్రారంభించామని, వారికే మొదటి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అయితే దూరప్రయాణాలకు ఈ ఆటోలను వినియోగించడం నిషిద్ధమన్నారు. బుకింగ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత ప్రయాణికులకు ఆటో నంబర్, డ్రైవర్ పేరు, అతడి మొబైల్ నంబర్ వివరాలు అందుతాయి. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత ప్రకటనల రూపంలో ఈడీఎంసీకి ఆదాయం వచ్చే అవకాశముందని మాన్ వివరించారు. నగరంలోని మిగిలిన పాలనా విభాగాల భాగస్వామ్యంతో ఈ ఫౌండేషన్ త్వరలోనే ఢిల్లీ అంతటా తన సేవలను విస్తరించనుందని మాన్ తెలిపారు. స్థాయీ కమిటీ చైర్మన్ సంజయ్ సుర్జన్ మాట్లాడుతూ ఈ సేవల్లో కార్పొరేషన్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, మీడియా సిబ్బందికి రూ.15 ల రాయితీ లభిస్తుందని వివరించారు. కాగా, ఐఐఎం-ఏ పూర్వవిద్యార్థి ఆలోచనతో ఏర్పాటైన ఈ ‘జీ-ఆటో’ వ్యవస్థలో అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా తదితర ప్రాంతాల్లో సుమారు 1,000కి పైగా ఆటోలు నడుస్తున్నాయి.