భోపాల్ : రోడ్డుపై వెళ్తున్న ఓ రిక్షా చిన్నారి ప్రాణాలను కాపాడింది. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి జారీన బాలుడు.. సరిగా రిక్షాలోని సీట్‌పై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని టికమ్‌ఘర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టికమ్‌ఘర్‌లోని ఓ బిల్డింగ్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారీపడ్డాడు. అదే సమయంలో బిల్డింగ్ కింద రోడ్డుపై నుంచి రిక్షా వెళ్తుంది. దీంతో బాలుడు రిక్షాలోని సీటుపై పడటంతో.. స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న బాలుడు క్షేమంగా ఉన్నాడు.
రెండో అంతస్తులో కుటుంబసభ్యులతో కలిసి ఆడుకుంటుంగా బాలుడు అనుకోకుండా కిందకు జారీ పోయాడని అతని తండ్రి అశిష్ జైన్ తెలిపాడు. రెయిలింగ్‌ను పట్టుకుని ఉన్న బాలుడు ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పాడు. కాగా, బాలుడు రిక్షాలో పడుతున్న దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment