ఇది కాదు హాయి నిదుర... గిరాకీ లేదు సోదరా!
‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ ... రిక్షావాలా జిందాబాద్’ అంటూ కథానాయకుడు పాట పడుతుంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని హుషారు. రిక్షా వారికైతే ఆ పాటంటే ఎంత మక్కువో చెప్పక్కర లేదు. ఇదంతా గతం. హైదరాబాద్ మహా నగరంలో రిక్షాలది అంతరించిన వైభవం. వాటిని నమ్ముకున్న వారి పరిస్థితీ అంతంతే.
అక్కడక్కడ అరకొరగా మిగిలిన రిక్షా కార్మికులకు ఆదరణ లేక తమ వాహనాలపైనే ఇలా నిద్రపోవాల్సిన దుస్థితి నెలకొంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ‘సాక్షి’ కెమెరాకు శుక్రవారం చిక్కిన దృశ్యమిది.
ఫొటో : మరికంటి రవికుమార్