![Delhi Rickshaw Puller Fluent English Skills Amaze Tourists - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/18/rkhsawala.jpg.webp?itok=06EL1I00)
ఇంగ్లీష్‌లో తట్టుకుంటూ మాట్లాడటం వేరు, భయంగా మాట్లాడటం వేరు. ఫ్లుయెంట్‌గా, ధైర్యంగా మాట్లాడటం వేరు. దిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో తన రిక్షాలో కూర్చున్న విదేశీ దంపతులతో ఒక రిక్షావాలా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం చూస్తుంటే ‘మైండ్‌బ్లోయింగ్ మచ్చా’ అనిపిస్తుంది.
‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారిలో ధైర్యం నింపుతోంది. ఈ వీడియోలాగే ఇటీవల మరో వీడియో వైరల్ అయింది. గోవా బీచ్‌లో గాజులు అమ్మే మహిళ ఆ ప్రాంతం గురించి విదేశీ టూరిస్టులతో గడ గడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి గోవా బీచ్‌లో తల్లిదండ్రులతో కలిసి తిరిగిన ఆమెకు ఆ పరిసర ప్రాంతాల్లో వినిపించే మాటలే ఇంగ్లీష్ నేర్చుకునే పాఠాలు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment