rickshaw walla
-
మచ్చా... మైండ్‌బ్లోయింగ్! ’ ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతడు
ఇంగ్లీష్‌లో తట్టుకుంటూ మాట్లాడటం వేరు, భయంగా మాట్లాడటం వేరు. ఫ్లుయెంట్గా, ధైర్యంగా మాట్లాడటం వేరు. దిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో తన రిక్షాలో కూర్చున్న విదేశీ దంపతులతో ఒక రిక్షావాలా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం చూస్తుంటే ‘మైండ్‌బ్లోయింగ్ మచ్చా’ అనిపిస్తుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారిలో ధైర్యం నింపుతోంది. ఈ వీడియోలాగే ఇటీవల మరో వీడియో వైరల్ అయింది. గోవా బీచ్‌లో గాజులు అమ్మే మహిళ ఆ ప్రాంతం గురించి విదేశీ టూరిస్టులతో గడ గడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి గోవా బీచ్‌లో తల్లిదండ్రులతో కలిసి తిరిగిన ఆమెకు ఆ పరిసర ప్రాంతాల్లో వినిపించే మాటలే ఇంగ్లీష్ నేర్చుకునే పాఠాలు అయ్యాయి. -
రిక్షావాలా లక్ష్యం.. మూడువేల కిలోమీటర్లు!
కోల్ కతా: తన సుదీర్ఘ ప్రయాణం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు ఓ రిక్షావాలా. అంతే వచ్చిన ఆలోచనే తడువుగా తన ప్రయాణాన్ని రిక్షాలో ఆరంభించాడు. ఇంతకీ ఎన్నికిలోమీటర్లో చెప్పలేదు కదూ. అచ్చంగా మూడు వేలకిలోమీటర్లు. తాను నిర్దేశించుకున్నలక్ష్యం చేరేవరకూ ఈసారి మాత్రం అలసిపోనని అతను స్పష్టం చేస్తున్నాడు. కోల్ కతా కు చెందిన రిక్షావాలా సత్యేన్ దాస్(40) రిక్షాలో తన సామాగ్రిని తీసుకుని దేశంలోని మూడు వేల కిలోమీటర్లు చుట్టిరావడానికి గత నెలలో పయనమైయ్యాడు. కోల్ కతా నుంచి బయల్దేరిన అతను లడఖ్ వరకూ ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం స్థానికుల్ని నుంచి కొంత సొమ్మును పోగుచేసుకున్నాడు. ఇంతకీ ఆప్రయాణం చేయడానికి కారణం లేకపోలేదు. 'రిక్షా'ను బతికించాలనే ఉద్దేశంతోనే అతను ఈ జర్నీ చేపట్టాడట. 'ప్రస్తుతం ఈ గ్లోబలైజేషన్ లో రిక్షాను ఉపయోగించడమే గగనమైపోయింది. ఇందుకోసం ఒక విన్నూత్న పద్దతిని ఎంచుకున్నాను. రిక్షా అనేది అత్యంత చౌకబారు రవాణా వస్తువే కాకుండా , సురక్షితమైనదిగా తెలియచెప్పడమే దీని ఉద్దేశ్యం' అని దాస్ తెలుపుతున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ చేరుకున్న ఆ రిక్షావాలా శ్రీనగర్ మీదుగా కార్గిల్ కు వచ్చే నెలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం గమ్యాన్ని చేరుకోవడానికి ఐదునెలల సమయం పడుతుందని అంచనా. దీని ద్వారా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు' లో స్థానం సంపాదించడంపై కూడా రిక్షావాలా దృష్టి సారించాడు. 2008 లో ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టినా అందులో అతను సఫలం కాలేకపోయాడు.