రిక్షావాలా లక్ష్యం.. మూడువేల కిలోమీటర్లు! | Ladakh expedition on a rickshaw | Sakshi
Sakshi News home page

రిక్షావాలా లక్ష్యం.. మూడువేల కిలోమీటర్లు!

Published Thu, Jul 3 2014 4:41 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

Ladakh expedition on a rickshaw

 కోల్ కతా: తన సుదీర్ఘ ప్రయాణం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు ఓ రిక్షావాలా. అంతే వచ్చిన ఆలోచనే తడువుగా తన ప్రయాణాన్ని రిక్షాలో ఆరంభించాడు. ఇంతకీ ఎన్నికిలోమీటర్లో చెప్పలేదు కదూ. అచ్చంగా మూడు వేలకిలోమీటర్లు. తాను నిర్దేశించుకున్నలక్ష్యం చేరేవరకూ ఈసారి మాత్రం అలసిపోనని అతను స్పష్టం చేస్తున్నాడు. కోల్ కతా కు చెందిన రిక్షావాలా సత్యేన్ దాస్(40) రిక్షాలో తన సామాగ్రిని తీసుకుని దేశంలోని మూడు వేల కిలోమీటర్లు చుట్టిరావడానికి గత నెలలో పయనమైయ్యాడు. కోల్ కతా నుంచి బయల్దేరిన అతను లడఖ్ వరకూ ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం స్థానికుల్ని నుంచి కొంత సొమ్మును పోగుచేసుకున్నాడు.

 

ఇంతకీ ఆప్రయాణం చేయడానికి  కారణం లేకపోలేదు.  'రిక్షా'ను బతికించాలనే ఉద్దేశంతోనే అతను ఈ జర్నీ చేపట్టాడట. 'ప్రస్తుతం ఈ గ్లోబలైజేషన్ లో రిక్షాను ఉపయోగించడమే గగనమైపోయింది. ఇందుకోసం ఒక విన్నూత్న పద్దతిని ఎంచుకున్నాను. రిక్షా అనేది అత్యంత చౌకబారు రవాణా వస్తువే కాకుండా , సురక్షితమైనదిగా తెలియచెప్పడమే దీని ఉద్దేశ్యం' అని దాస్ తెలుపుతున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ చేరుకున్న ఆ రిక్షావాలా శ్రీనగర్ మీదుగా కార్గిల్ కు వచ్చే నెలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం గమ్యాన్ని చేరుకోవడానికి ఐదునెలల సమయం పడుతుందని అంచనా. దీని ద్వారా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు' లో స్థానం సంపాదించడంపై కూడా రిక్షావాలా దృష్టి సారించాడు. 2008 లో ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టినా అందులో అతను సఫలం కాలేకపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement