న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో ఆన్‌లైన్ ఆటో రిక్షా సర్వీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ శనివారం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని పలు నగరాల్లో ఈ సేవలు విజయవంతంగా అందుతున్నాయని, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నిర్మల్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ‘జీ-ఆటో’ సేవలను ప్రారంభించామని ఈడీఎంసీ అధికారులు తెలిపారు. సేవలను మేయర్ రామ్ నారాయణ్ దుబే పట్పర్‌గంజ్‌లో ఉన్న పరిపాలనా విభాగం ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. మొదటి విడతగా 50 ఆటోలను అందుబాటులోకి తెచ్చారు. తూర్పు ఢిల్లీవాసులు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 011-6444-4441 నంబర్‌కు ఫోన్ చేసి వీటి సేవలను కోరవచ్చని, అలాగే ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జి-ఏయూటీవో. ఓఆర్‌జీ ద్వారా సేవలను పొందవచ్చునని ఈడీఎంసీ ప్రజా సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ తెలిపారు.
భవిష్యత్తులో ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా కృషిచేస్తామని ఆయన వివరించారు. వీటికి ప్రభుత్వ రేట్ల ప్రకారమే చార్జీలు ఉంటాయని, అయితే ఈ-సేవల నిమిత్తం మరో రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మాన్ చెప్పారు. ప్రస్తుతం వీటి కోసం దిల్షాన్ గార్డెన్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాగా, ముఖ్యంగా తూర్పు ఢిల్లీవాసుల కోసమే ఈ సేవలు ప్రారంభించామని, వారికే మొదటి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అయితే దూరప్రయాణాలకు ఈ ఆటోలను వినియోగించడం నిషిద్ధమన్నారు. బుకింగ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత ప్రయాణికులకు ఆటో నంబర్, డ్రైవర్ పేరు, అతడి మొబైల్ నంబర్ వివరాలు అందుతాయి.
ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత ప్రకటనల రూపంలో ఈడీఎంసీకి ఆదాయం వచ్చే అవకాశముందని మాన్ వివరించారు. నగరంలోని మిగిలిన పాలనా విభాగాల భాగస్వామ్యంతో ఈ ఫౌండేషన్ త్వరలోనే ఢిల్లీ అంతటా తన సేవలను విస్తరించనుందని మాన్ తెలిపారు. స్థాయీ కమిటీ చైర్మన్ సంజయ్ సుర్జన్ మాట్లాడుతూ ఈ సేవల్లో కార్పొరేషన్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, మీడియా సిబ్బందికి రూ.15 ల రాయితీ లభిస్తుందని వివరించారు. కాగా, ఐఐఎం-ఏ పూర్వవిద్యార్థి ఆలోచనతో ఏర్పాటైన ఈ ‘జీ-ఆటో’ వ్యవస్థలో అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా తదితర ప్రాంతాల్లో సుమారు 1,000కి పైగా ఆటోలు నడుస్తున్నాయి.
ఇక ఫోన్ చేస్తే ఆటో..!
Published Sat, Feb 15 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement