Online Auto
-
ఇక ఫోన్ చేస్తే ఆటో..!
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో ఆన్లైన్ ఆటో రిక్షా సర్వీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ శనివారం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని పలు నగరాల్లో ఈ సేవలు విజయవంతంగా అందుతున్నాయని, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నిర్మల్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ‘జీ-ఆటో’ సేవలను ప్రారంభించామని ఈడీఎంసీ అధికారులు తెలిపారు. సేవలను మేయర్ రామ్ నారాయణ్ దుబే పట్పర్గంజ్లో ఉన్న పరిపాలనా విభాగం ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. మొదటి విడతగా 50 ఆటోలను అందుబాటులోకి తెచ్చారు. తూర్పు ఢిల్లీవాసులు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 011-6444-4441 నంబర్‌కు ఫోన్ చేసి వీటి సేవలను కోరవచ్చని, అలాగే ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జి-ఏయూటీవో. ఓఆర్జీ ద్వారా సేవలను పొందవచ్చునని ఈడీఎంసీ ప్రజా సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా కృషిచేస్తామని ఆయన వివరించారు. వీటికి ప్రభుత్వ రేట్ల ప్రకారమే చార్జీలు ఉంటాయని, అయితే ఈ-సేవల నిమిత్తం మరో రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మాన్ చెప్పారు. ప్రస్తుతం వీటి కోసం దిల్షాన్ గార్డెన్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాగా, ముఖ్యంగా తూర్పు ఢిల్లీవాసుల కోసమే ఈ సేవలు ప్రారంభించామని, వారికే మొదటి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అయితే దూరప్రయాణాలకు ఈ ఆటోలను వినియోగించడం నిషిద్ధమన్నారు. బుకింగ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత ప్రయాణికులకు ఆటో నంబర్, డ్రైవర్ పేరు, అతడి మొబైల్ నంబర్ వివరాలు అందుతాయి. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత ప్రకటనల రూపంలో ఈడీఎంసీకి ఆదాయం వచ్చే అవకాశముందని మాన్ వివరించారు. నగరంలోని మిగిలిన పాలనా విభాగాల భాగస్వామ్యంతో ఈ ఫౌండేషన్ త్వరలోనే ఢిల్లీ అంతటా తన సేవలను విస్తరించనుందని మాన్ తెలిపారు. స్థాయీ కమిటీ చైర్మన్ సంజయ్ సుర్జన్ మాట్లాడుతూ ఈ సేవల్లో కార్పొరేషన్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, మీడియా సిబ్బందికి రూ.15 ల రాయితీ లభిస్తుందని వివరించారు. కాగా, ఐఐఎం-ఏ పూర్వవిద్యార్థి ఆలోచనతో ఏర్పాటైన ఈ ‘జీ-ఆటో’ వ్యవస్థలో అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా తదితర ప్రాంతాల్లో సుమారు 1,000కి పైగా ఆటోలు నడుస్తున్నాయి. -
45 నిమిషాల్లో ముంగిట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ : నగరవాసులకు ఇకపై ట్యాక్సీల మాదిరిగానే ఆటో సేవలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ చేసిన 45 నిమిషాల్లోనే ఇంటిముం దుకు ఆటో వస్తుంది. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఆటోను బుక్ చేసుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే 24 గంటల ముందుకూడా ఆటోను బుక్ చేసుకునే వీలుంది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం నిర్వహించిన ట్రయల్న్ రవిజయవంతం కావడంతో తొలి విడతలోభాగంగా 200 ఆటోలను ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కిందికి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సదుపాయం ‘జీ ఆటో’ పేరిట గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్‌కోట్, సూరత్‌లో అమ ల్లో ఉంది. నగరంలో రెండు నెలల క్రితం 50 ఆటోలతో ప్రయోగాత్మకంగా నడిపారు. ‘జీ..ఆటో’ సేవ లు అందుబాటులోకి వస్తే ఎవరైనా వీటిని సులువుగా వాడుకోవచ్చు. ప్రత్యేకించి రోగులు, వృద్ధులతోపాటు నడవలేనివారికి ఈ సేవలు అత్యంత ఉపయోగకరంగా కానున్నాయి. అలాంటి వారు అవసరాన్ని బట్టి 24 గంటల ముందే ఆటోను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ విషయమై ‘జీ ఆటో’ అధికారి నిర్మల్ మాలిక్ మాట్లాడుతూ..త్వరలోనే ఈ సేవలను నగరవ్యాప్తంగా విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రవా ణా శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కి ఓ నివేదిక పంపినట్టు ఆయన పేర్కొన్నారు. మంత్రి ఆమోదం మేరకు రెండో దఫాలో 1,000 ఆటోలను ఈ సేవల పరిధిలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ సదుపాయం కిందకు తెచ్చే ఆటో డ్రైవర్లను పోలీసు వెరిఫికేషన్‌తోపాటు అన్ని ఆటోల్లో జీపీఎస్ సదుపాయం అమర్చనున్నారు. ప్రయాణికుల భద్రత పెరుగుతుంది. ఇందుకు సంబంధించి ఆటోడ్రైవర్లకు సహరించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సిద్ధం గా ఉన్నట్టు ట్రాఫిక్ కమిషనర్అనిల్శుక్లా తెలిపారు.ఆటోవాలాలకు ఊరట ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఆటోవాలాలకు ఊరట లభిస్తుంది. ప్రయాణికుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సమయంతోపాటు ఇం ధనం కూడా మిగులుతుంది. ఈ విధానం వల్ల నాలుగు ఐదు గంటల్లోనే రూ.వెయ్యికి పైగా సంపాదించుకోవచ్చు. వీలును బట్టి రోజులో కొంతసమయం కుటుంబం కోసం గడపడం, మరేదైనా పార్ట్‌టైం పని చేసుకునే వీలుకూడా కలుగుతుంది.