45 నిమిషాల్లో ముంగిట్లోకి | Online Auto booking in New Delhi | Sakshi
Sakshi News home page

45 నిమిషాల్లో ముంగిట్లోకి

Published Mon, Jan 13 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

Online Auto booking in New Delhi

 
 సాక్షి, న్యూఢిల్లీ : నగరవాసులకు ఇకపై ట్యాక్సీల మాదిరిగానే ఆటో సేవలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ చేసిన 45 నిమిషాల్లోనే ఇంటిముం దుకు ఆటో వస్తుంది. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఆటోను బుక్ చేసుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే 24 గంటల ముందుకూడా ఆటోను బుక్ చేసుకునే వీలుంది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం నిర్వహించిన ట్రయల్న్ రవిజయవంతం కావడంతో తొలి విడతలోభాగంగా 200 ఆటోలను ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం కిందికి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సదుపాయం ‘జీ ఆటో’ పేరిట గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్‌కోట్, సూరత్‌లో అమ ల్లో ఉంది.
 
 నగరంలో రెండు నెలల క్రితం 50 ఆటోలతో ప్రయోగాత్మకంగా నడిపారు. ‘జీ..ఆటో’ సేవ లు అందుబాటులోకి వస్తే ఎవరైనా వీటిని సులువుగా వాడుకోవచ్చు. ప్రత్యేకించి రోగులు, వృద్ధులతోపాటు నడవలేనివారికి ఈ సేవలు అత్యంత ఉపయోగకరంగా కానున్నాయి. అలాంటి వారు అవసరాన్ని బట్టి 24 గంటల ముందే ఆటోను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ విషయమై ‘జీ ఆటో’ అధికారి నిర్మల్ మాలిక్ మాట్లాడుతూ..త్వరలోనే ఈ సేవలను నగరవ్యాప్తంగా విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రవా ణా శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కి ఓ నివేదిక పంపినట్టు ఆయన పేర్కొన్నారు. మంత్రి ఆమోదం మేరకు రెండో దఫాలో 1,000 ఆటోలను ఈ సేవల పరిధిలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. 
 
 ఈ సదుపాయం కిందకు తెచ్చే ఆటో డ్రైవర్లను పోలీసు వెరిఫికేషన్‌తోపాటు అన్ని ఆటోల్లో జీపీఎస్ సదుపాయం అమర్చనున్నారు. ప్రయాణికుల భద్రత పెరుగుతుంది. ఇందుకు సంబంధించి ఆటోడ్రైవర్లకు సహరించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సిద్ధం గా ఉన్నట్టు ట్రాఫిక్ కమిషనర్‌అనిల్‌శుక్లా తెలిపారు.ఆటోవాలాలకు ఊరట ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఆటోవాలాలకు ఊరట లభిస్తుంది. ప్రయాణికుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సమయంతోపాటు ఇం ధనం కూడా మిగులుతుంది. ఈ విధానం వల్ల నాలుగు ఐదు గంటల్లోనే రూ.వెయ్యికి పైగా సంపాదించుకోవచ్చు. వీలును బట్టి రోజులో కొంతసమయం కుటుంబం కోసం గడపడం, మరేదైనా పార్ట్‌టైం పని చేసుకునే వీలుకూడా కలుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement