న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటన.. ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభం | Delhi Railway Station stampede live updates | Sakshi
Sakshi News home page

Delhi Railway Station stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు ఎక్స్‌గ్రేషియా

Published Sun, Feb 16 2025 6:57 AM | Last Updated on Sun, Feb 16 2025 2:00 PM

Delhi Railway Station stampede live updates

New Delhi Railway Station Stampede Live Updates:

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో (New Delhi Railway Station) తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

2:00pm
తొక్కిసలాటకు కారణాలేంటి?

  • ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్ల ఆలస్యం కారణంగా ఫ్లాట్‌ఫామ్‌పై వేల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులు
  • రద్దీ గమనించకుండా గంటలోనే 1500 జనరల్ టికెట్లను అమ్మిన రైల్వే శాఖ  
  • అప్పటికే ఫ్లాట్‌ఫామ్‌లపై ఉన్న రద్దీకి తోడు కొత్తగా టికెట్లు ఇవ్వడంతో  పెరిగిన రద్దీ 
  • 16వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌ పైకి స్పెషల్ ట్రైన్ వస్తుందని రైల్వే అనౌన్స్‌మెంట్‌
  •  అనౌన్స్‌మెంట్‌ విని 14,14,15 ప్లాట్ ఫామ్‌లో ఉన్న ప్రయాణికులు 16వ ప్లాట్ ఫామ్‌ పైకి పరుగులు   
  • పరుగులు తీయడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట 
  • శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో కనీ విని ఎరుగని స్థాయిలో పెరిగిన రద్దీ 
  • ఈనెల 26వ తేదీతో మహాకుంభమేళా ముగుస్తుండడంతో ఎలాగైనా అక్కడికి చేరుకోవాలని భక్తులు ఆత్రుత 
  • సరైన మేనేజ్మెంట్ లేక చేతులెత్తేసిన రైల్వే శాఖ పోలీసులు 
  • ఫలితంగా 18 మంది ప్రయాణికుల మృతి 50 మందికి పైగా గాయాలు
  • ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితి. యధావిధిగా ట్రైన్ ఆపరేషన్స్

12:06pm
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ద్విసభ్య కమిటీలో నార్తన్‌ రైల్వేకు చెందిన నర్సింగ్‌ దేవ్‌,పంకజ్‌ గంగ్వార్‌లను సభ్యులుగా చేర్చింది. 

11:40am
ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటన, కుంభమేళాకు వెళ్లే రైళ్ల జనరల్‌ భోగి టికెట్ల అమ్మకమే ప్రధాన కారణమని సమాచారం.  

10:40am
ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

9:40am
ఢిల్లీ దుర్ఘటన.. యూపీ పోలీసుల అప్రమత్తం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటనతో ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీల వద్ద భారీ ఎత్తున బందుబస్తు పటిష్టం చేశారు. రైల్వే స్టేషన్‌లలో హై అలర్ట్‌ ప్రకటిస్తున్నారు. 

8:50am
తొక్కిసలాటకు ప్రభుత్వ అసమర్థతే కారణం
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను కలచివేస్తోంది. మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోంది ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న భక్తుల విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్‌లో మెరుగైన ఏర్పాట్లు చేయాల్సింది. ప్రభుత్వంతో పాటు పరిపాలన యంత్రాంగం కూడా నిర్లక్ష్యం, అసమర్ధతే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసినా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

 మృతులకు ఎక్స్‌ గ్రేషియా
ఢిల్లీ తొక్కిసలాట మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయాపడిన వారికి రూ.2.5లక్షలు,స్వల్పంగా గాయపడిన వారికి  ఒక లక్ష ఎక్స్‌ గ్రేషియా ఇచ్చింది.  

ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతి
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ పెను విషాదంపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనతో ఆందోళనకు గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి : రాష్ట్రపతి 
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. 

 పరిస్థితి అదుపులోనే ఉంది : అశ్విని వైష్ణవ్
రైల్వే స్టేషన్‌లో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు, నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. 

 

 
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన దుర్ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్ కుమార్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవాలని, సహాయక సిబ్బందిని నియమించాలని సీఎస్‌ను ఆదేశించాం. ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను నియంత్రించాలని సీఎస్‌ అండ్‌ సీపీని ఆదేశించాం. నిరంతరం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాను’ అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ప్రయాణికులు మా మాట వినలేదు
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట దుర్ఘటనపై మరో ప్రత్యక్ష సాక్షి ఐఏఎఫ్‌ సార్జెంట్ అజిత్‌  మీడియాతో మాట్లాడారు. ‘రైల్వే స్టేషన్‌లో మాకు ట్రై సర్వీస్ కార్యాలయం ఉంది. నేను నా డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణికులు కిక్కిరిపోయారు. దీంతో నేను ముందుకు వెళ్లలేకపోయాను. గుమిగూడొద్దని నేను ప్రయాణికులకు చెప్పి చూశా. రైల్వే అధికారులు సైతం ప్రయాణికులు గుమిగూడకుండా ఉండేలా చూసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ప్రయాణికులు ఎవరూ వినలేదు’అని తెలిపారు.  


 విషాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే? 
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షి రవి మాట్లాడుతూ.. సుమారు 9.30 గంటల సమయంలో అనుకుంటా.  కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఫ్లాట్‌ఫారమ్స్‌ మారనప్పటికి కిక్కిరిసిన 13వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రయాణికులు 14, 15 ప్లాట్‌ఫారమ్‌లో రైళ్లను చూసి అటువైపు పరిగెత్తారు.రద్దీ విపరీతంగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో విషాదకరమైన తొక్కిసలాటకు దారితీసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement