
మహా కుంభ మేళా ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో అక్కడకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఒకసారి మహా కుంభ మేళా వెళ్లి అక్కడ పుణ్య స్నానం రావాలనేది భక్తుల తాపత్రయం. ఈ క్రమంలోనే ఎవరికి దొరికిన వాహనాల్లో వారు ప్రయాగ్ రాజ్ కు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది రైలు మార్గంలోనే ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇందులో కొందరు టికెట్ తీసుకుని వెళ్లేవారైతే, కొందరు టికెట్ లేకుండానే అక్కడకు వెళుతున్నారు.
తాజాగా ఓ ప్రయాణికుడు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలు ఎక్కాడు. అతనికి కేటాయించిన క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు. అంతా బానే ఉంది. ఫస్ట్ క్లాస్ టికెట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు సదరు ప్రయాణికుడు. కానీ ఒకానొక సందర్భంలో లేచి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్తా జనరల్ బోగీల కనిపించింది. దాన్ని వీడియోలో బంధించాడు. కనీసం బాత్రూమ్‌కు వెళ్లే దారి కూడా లేకపోవడంతో 16 గంటల పాటు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లోనే ‘హౌస్ అరెస్టు’ అయినట్లు ఆ ప్రయాణికుడు తెలిపాడు. దీన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 26 మిలియన్ వ్యూస్ వచ్చాయట.
Comments
Please login to add a commentAdd a comment