first class
-
నేనూ అమ్మ... క్లాస్మేట్స్.. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని...
‘‘చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుంది... అమ్మతో కలిసి కాలేజ్‌కి వెళ్లడం, పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇంకా బాగుంది’’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. పీహెచ్డీ సహా పలు డిగ్రీలు అందుకుని అటు చదువులో ఇటు క్రీడల్లోనూ పిన్న వయస్కురాలిగా ఎన్నో విజయాలు లిఖించిన నైనా... తాజాగా తన తల్లి భాగ్యలక్ష్మి తో కలిసి ఎల్ఎల్బీ లో చేరింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో అమ్మకు క్లాస్మేట్గా తన అనుభవాలను పంచుకున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని... ‘‘నాన్న (అశ్విన్) న్యాయవాది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ను గమనించేదాన్ని. న్యాయ స్థానాల్లో వాదోపవాదాలు ఆసక్తిగా అనిపించేవి. అయితే ‘లా’ ను కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం క్రీడాకారిణిగా బిజీగా ఉన్నాను. ఎల్ఎల్బీ తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను. దానికి లా చదవడం కొంత మేర ఉపకరిస్తుందని భావించాను. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారని, తొలి మార్గదర్శకత్వం తమదే ఉండాలని మా పేరెంట్స్ అభిప్రాయం. అందుకే వీలైన అన్ని అంశాల్లో వాళ్లు ముందడుగు వేసి ఆ తర్వాత మాకు తగిన గైడెన్స్ ఇస్తుంటారు. పదకొండేళ్ల టీనేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సహకరించడం కోసం నాన్న నా కన్నా ముందే మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా సాధించి, ఆ తర్వాత నాకు సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను లా చేద్దామని అనుకున్నప్పుడు మా అమ్మగారు (భాగ్యలక్ష్మి జైస్వాల్) నాకు తోడయ్యారు. మా అమ్మ ఇప్పటికే ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేశారు. క్రీడల్లో బిజీగా ఉండే నాకు సపోర్ట్‌గా ఉండడానికి తాను కూడా లా విద్యార్థినిగా మారారు. ఫ్రెండ్స్‌లా ఉన్నాం... నాతోపాటు అమ్మ కూడా లా కోర్సులో జాయిన్ అవడం నాలో కొత్త ఉత్సాహం తెచ్చింది. బాగ్ లింగంపల్లిలోని ‘బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్’ లో మా న్యాయశాస్త్ర విద్యాభ్యాసం సాగింది. మేం ఇద్దరం తల్లీకూతుళ్లుగా క్లాస్మేట్స్గా ఉండడం చూసి అందరూ షాక్ అయ్యేవారు(నవ్వుతూ). ఇద్దరం కలిసి చదువుకోవడం, కేస్ స్టడీస్ అధ్యయనం చేయడం, పరీక్షలు రాయడం వైవిధ్యభరిత అనుభూతి అనే చెప్పాలి. అమ్మతో కలిసి చదువుతుంటే ఫ్రెండ్స్‌లా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టే అనిపించింది. చదువంటే విజ్ఞానం అమ్మతో కలిసి మళ్లీ మరో కోర్సు చేసే అవకాశం వస్తే నేనైతే వెంటనే ఓకే అంటాను. నేను భవిష్యత్తులో లాయర్ అవుతానో లేదో చెప్పలేను. మా కుటుంబం దృష్టిలో... చదువు అంటే డిగ్రీలు కాదు... విజ్ఞానం సంపాదించడం, దాన్ని నిత్యజీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడేలా చేసుకోవడం’’ అన్నారు నైనా జైస్వాల్. -
ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో మరో సదుపాయాన్ని కల్పించారు. ఫస్ట్‌క్లాస్ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్లో సబర్బన్ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రతి సింగిల్ రూట్ ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు గ్రేటర్‌లోని సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్‌నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్ వరకు 29 స్టేషన్ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. (క్లిక్: పక్కాగా ప్లాన్.. కథ మొత్తం కారు నుంచే..) 50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ( ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు) -
ఫస్ట్ క్లాస్ సీట్లకు మంగళం!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కంపెనీ బోయింగ్ 777 విమానాల్లో ఫస్ట్‌క్లాస్ సీట్లకు మంగళం పాడనున్నది. వ్యయాలు తగ్గించుకోవడం, రాబడి పెంచుకోవడం ప్రధాన లక్ష్యాలుగా దూర ప్రయాణం చేసే ఈ విమానాల్లో ఫస్ట్ క్లాస్ సీట్లను పూర్తిగా తీసివేయాలని ఈ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం బోయింగ్ 777 విమానాల్లో 8 ఫస్ట్ క్లాస్, 30 బిజినెస్, 308 ఎకానమీ క్లాస్ సీట్లు.. మొత్తం 346 సీట్లు ఉన్నాయి. 8 ఫస్ట్‌క్లాస్ సీట్లను తొలగించి మొత్తం సీట్ల సంఖ్యను 346 నుంచి 400కు పెంచాలని ఈ కంపెనీ ఆలోచన. ఈ మార్పు 2019 నుంచి అమల్లోకి రానున్నదని ఈ నెల 20న జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమావేశంలో వ్యూహాత్మక వృద్ధి సాధనకు సంబంధించిన ప్రణాళికలను ఇన్వెస్టర్లకు వివరించింది. 2019 జనవరి నుంచి నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టిసారించనున్నామని ఈ ప్రజెంటేషన్‌లో కంపెనీ పేర్కొంది. అనుబంధ ఆదాయం రూ.250 కోట్ల మేర పెంచుకోవడంపై దృష్టి పెడతామని వివరించింది. -
ఫస్ట్ క్లాస్ సీట్లకు మంగళం!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కంపెనీ బోయింగ్ 777 విమానాల్లో ఫస్ట్‌క్లాస్ సీట్లకు మంగళం పాడనున్నది. వ్యయాలు తగ్గించుకోవడం, రాబడి పెంచుకోవడం ప్రధాన లక్ష్యాలుగా దూర ప్రయాణం చేసే ఈ విమానాల్లో ఫస్ట్ క్లాస్ సీట్లను పూర్తిగా తీసివేయాలని ఈ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం బోయింగ్ 777 విమానాల్లో 8 ఫస్ట్ క్లాస్, 30 బిజినెస్, 308 ఎకానమీ క్లాస్ సీట్లు.. మొత్తం 346 సీట్లు ఉన్నాయి. 8 ఫస్ట్‌క్లాస్ సీట్లను తొలగించి మొత్తం సీట్ల సంఖ్యను 346 నుంచి 400కు పెంచాలని ఈ కంపెనీ ఆలోచన. ఈ మార్పు 2019 నుంచి అమల్లోకి రానున్నదని ఈ నెల 20న జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమావేశంలో వ్యూహాత్మక వృద్ధి సాధనకు సంబంధించిన ప్రణాళికలను ఇన్వెస్టర్లకు వివరించింది. 2019 జనవరి నుంచి నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టిసారించనున్నామని ఈ ప్రజెంటేషన్‌లో కంపెనీ పేర్కొంది. అనుబంధ ఆదాయం రూ.250 కోట్ల మేర పెంచుకోవడంపై దృష్టి పెడతామని వివరించింది. -
ఎవరెస్ట్ అధిరోహకుడికి ఫస్ట్‌క్లాస్
చండ్రుగొండ: ఏడాది క్రితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి దేశానికే గర్వకారణంగా నిలిచిన సాధనపల్లి ఆనంద్‌కుమార్ చదువులోనూ ప్రతిభ కనబరిచాడు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో చదువుకుంటున్న ఆనంద్‌కుమార్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీలో 721 మార్కులు (72 శాతం) మార్కులు సాధించాడు. ఆనంద్ చదువులోనూ రాణించడంతో కళాశాల ప్రిన్స్‌పాల్ శివన్నారాయణ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.