న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ బోయింగ్ 777 విమానాల్లో ఫస్ట్‌క్లాస్ సీట్లకు మంగళం పాడనున్నది. వ్యయాలు తగ్గించుకోవడం, రాబడి పెంచుకోవడం ప్రధాన లక్ష్యాలుగా దూర ప్రయాణం చేసే ఈ విమానాల్లో ఫస్ట్ క్లాస్ సీట్లను పూర్తిగా తీసివేయాలని ఈ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం బోయింగ్ 777 విమానాల్లో 8 ఫస్ట్ క్లాస్, 30 బిజినెస్, 308 ఎకానమీ క్లాస్ సీట్లు.. మొత్తం 346 సీట్లు ఉన్నాయి. 8 ఫస్ట్‌క్లాస్ సీట్లను తొలగించి మొత్తం సీట్ల సంఖ్యను 346 నుంచి 400కు పెంచాలని ఈ కంపెనీ ఆలోచన.
ఈ మార్పు 2019 నుంచి అమల్లోకి రానున్నదని ఈ నెల 20న జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమావేశంలో వ్యూహాత్మక వృద్ధి సాధనకు సంబంధించిన ప్రణాళికలను ఇన్వెస్టర్లకు వివరించింది. 2019 జనవరి నుంచి నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టిసారించనున్నామని ఈ ప్రజెంటేషన్‌లో కంపెనీ పేర్కొంది. అనుబంధ ఆదాయం రూ.250 కోట్ల మేర పెంచుకోవడంపై దృష్టి పెడతామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment