జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.
నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..
జెట్ ఎయిర్‌వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment