bail announcement
-
పిన్నెల్లి బెయిల్‌పై నేడే తీర్పు
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు(మంగళవారం) ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్‌లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది. ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌కి హైకోర్టుని మరోసారి పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. చదవండి: చంద్రబాబు సేవలో బదిలీ బలగాలు!హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్‌కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు. -
నరేష్ గోయెల్‌కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు. -
మనీ లాండరింగ్ కేసులో ఆ హీరోకు బెయిల్..
Special Court Grants Bail To Sachin Joshi In Money Laundering Case: 'మౌనమేలనోయి' సినిమాతో 2002లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వ్యాపారవేత్త సచిన్ జోషి. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తోనూ సచిన్ సుపరిచితుడే. ఇవే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ అలరించాడు సచిన్ జోషి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 (పీఎంఎల్ఏ) కింద 2021 ఫిబ్రవరి 14న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం, మళ్లించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సచిన్. తాజాగా ఈ కేసులో సచిన్ జోషికి ప్రత్యేక (పీఎంఎల్ఏ) కోర్టు సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేసింది. రూ. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అంతే మొత్తంలో ఇద్దరికి షూరిటీతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుని ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ భారతదేశం విడిచిపెట్టి వెళ్లరాదని, అలాగే పాస్‌పోర్ట్‌ను ఈడీ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. దీంతోపాటు కేసు విచారణకు విఘాతం కలిగించే చర్యలకు, నేర ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి కార్యకలామాల్లో పాల్గొనద్దని పేర్కొంది. -
మనీలాండరింగ్ కేసులో ఖురేషీకి బెయిల్
న్యూఢిల్లీ : వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి మంగళవారం బెయిల్ లభించింది. ఈ మేరకు మనీలాండరింగ్ కేసులో ఖురేషీకి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ హవాలా కార్యకలాపాలతో నగదును ట్రాన్సఫర్ చేపడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో మొయిన్ ఖురేషిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై నేరపూరిత కుట్రలతో పాటుగా తన హవాలా ఛానళ్లను మనీ ఛేంజర్ సహాయంతో డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించాడనే అభియోగాలు ఉన్నాయి. చాలాకాలం ఈడీ అధికారుల కళ్లుగప్పి తిరిగిన ఖురేషిని ఎట్టకేలకు పట్టుకుని, కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసులో ఖురేషీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ‘లుక్ అవుట్ సర్కులర్’(ఎల్వోసీ) జారీ చేసింది కూడా. -
బెయిల్ రద్దు చేయండి
మియాపూర్ భూకుంభకోణం నిందితులపై ఏసీబీ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలా నగర్, కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్లు మహ్మద్ యూసఫ్, రాచకొండ శ్రీనివాసరావు, మేడ్చల్ సంయుక్త సబ్‌రిజిస్ట్రార్ టీవీ రమేశ్‌చందర్‌రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయా లని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి సోమవారం నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ఆదాయానికి మించి ఆస్తుల్ని కూడబెట్టారన్న కేసులో ఈ ముగ్గురూ నిందితులుగా ఉన్నారని, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఏసీబీ వాదించింది. నిందితుల నుంచి మరింత సమా చారం రాబట్టాల్సి ఉందని తెలిపింది. కనుక కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును కోరింది.