Special Court Grants Bail To Sachin Joshi In Money Laundering Case: 'మౌనమేలనోయి' సినిమాతో 2002లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వ్యాపారవేత్త సచిన్ జోషి. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తోనూ సచిన్ సుపరిచితుడే. ఇవే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ అలరించాడు సచిన్ జోషి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 (పీఎంఎల్‌ఏ) కింద 2021 ఫిబ్రవరి 14న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం, మళ్లించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సచిన్.
తాజాగా ఈ కేసులో సచిన్ జోషికి ప్రత్యేక (పీఎంఎల్‌ఏ) కోర్టు సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేసింది. రూ. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అంతే మొత్తంలో ఇద్దరికి షూరిటీతో ప‍్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుని ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ భారతదేశం విడిచిపెట్టి వెళ్లరాదని, అలాగే పాస్‌పోర్ట్‌ను ఈడీ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. దీంతోపాటు కేసు విచారణకు విఘాతం కలిగించే చర్యలకు, నేర ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి కార్యకలామాల్లో పాల్గొనద్దని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment