sachin joshi
-
మనీ లాండరింగ్ కేసులో ఆ హీరోకు బెయిల్..
Special Court Grants Bail To Sachin Joshi In Money Laundering Case: 'మౌనమేలనోయి' సినిమాతో 2002లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వ్యాపారవేత్త సచిన్ జోషి. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తోనూ సచిన్ సుపరిచితుడే. ఇవే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ అలరించాడు సచిన్ జోషి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 (పీఎంఎల్ఏ) కింద 2021 ఫిబ్రవరి 14న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం, మళ్లించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సచిన్. తాజాగా ఈ కేసులో సచిన్ జోషికి ప్రత్యేక (పీఎంఎల్ఏ) కోర్టు సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేసింది. రూ. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అంతే మొత్తంలో ఇద్దరికి షూరిటీతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుని ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ భారతదేశం విడిచిపెట్టి వెళ్లరాదని, అలాగే పాస్‌పోర్ట్‌ను ఈడీ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. దీంతోపాటు కేసు విచారణకు విఘాతం కలిగించే చర్యలకు, నేర ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి కార్యకలామాల్లో పాల్గొనద్దని పేర్కొంది. -
నటుడు సచిన్ జోషి ఆస్తుల జప్తు
తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించిన సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ భారీ షాక్ ఇచ్చింది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. శనివారం ఈడీ విభాగం మొత్తం రూ.410 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ వెల్లడించింది. వ్యాపారవేత్త అయిన సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తోనూ సచిన్ సుపరిచితుడే. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈమేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు కూడా. -
హీరో సచిన్ జోషి అరెస్టు
హీరో, వ్యాపారవేత్త సచిన్ జోషి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓంకర్ రియల్టర్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సచిన్ జోషిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రముఖ బిజినెస్ మెన్ విజయ్ మాల్యాకు సంబంధించిన గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను ఇటీవల సచిన్ జోషి కొనుగోలు చేశాడు. అయితే ఈ విషయంలో ఓంకార్ రియాల్టీ కేస్, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవతతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో ఇంతకముందే ఈడీ అధికారులు జోషిని దర్యాప్తుకు పిలవగా నటుడు హాజరు కాలేదు. దీంతో ఈయన్ని ఆదివారం అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. విజయ్ మాల్యా కేసులో ఈయన్ని అరెస్ట్ చేయడం ముంబైలో సంచలనంగా మారింది. కాగా, గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, క్లబ్‌లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు. కాగా సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు. అయితే గతంలోనూ సచిన్ జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 2020లో ముంబై పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను సీజ్ చేశారు. ఈ కేసులో సచిన్ జోషి హస్తమున్నట్టు తెరపైకి రావడంతో హైదరాబాద్ పోలీసులు సచిన్ జోషిపై క్రిమినల్ పీనల్ కోడ్ 41 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్ -
టాలీవుడ్ హీరోపై కేసు నమోదు
ముంబయి: హీరో సచిన్ జోషీపై పుణెలోని ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతని మిత్రుడు పరాగ్ సంఘ్వి పిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిజినెస్ విషయంలో సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా సచిన్ జోషిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. పరాగ్ సంఘ్వి, సచిన్ జోషీ అతని భాగస్వాములతో కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ.58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ జోషి 2016 నుండి పరాగ్ సంఘ్వికి ఎటువంటి చెల్లింపులు చేయలేదు.(చదవండి: అనసూయ ట్వీట్.. మెగా ఫ్యామిలీలో కలకలం!) ఈ విషయంపై అప్పుడే సంఘ్వి పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదును పూణే పోలీసుల క్రైమ్ బ్రాంచ్ యొక్క ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా జోషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇదేకాకుండా సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యొక్క 30 మంది మాజీ ఉద్యోగులు జీతాలు చెల్లించలేదని గతంలో ఆరోపణలు ఉన్నాయి. అలాగే 2020 అక్టోబర్‌లో టాలీవుడ్ మాదకద్రవ్యాల కుంభకోణంలో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. -
సచిన్ జోషిపై ‘గుట్కా’ కేసు
శంషాబాద్(హైదరాబాద్): ప్రముఖ వ్యాపారవేత్త, సినీ హీరో అయిన సచిన్ జోషిపై హైదరా బాద్‌లో మరో ‘గుట్కా’ కేసు నమోదైంది. ట్రేడ్‌మార్క్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాన్ మసాలా తయారు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సచిన్‌తోపాటు ఆయన తండ్రి, గోవా పాన్ మసాలా కంపెనీ యజమాని జేఎం జోషిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. గగన్‌పహాడ్‌లో వారు నిర్వహి స్తున్న గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీపై దాడులు చేసి రూ. 1.25 కోట్ల విలువజేసే సరుకును స్వాధీనం చేసుకు న్నారు. అలాగే కంపెనీని సీజ్ చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం జేఎం జోషి, సచిన్ జోషిలు గగన్ పహాడ్‌లో గోల్డెన్ ఫింగర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్ కంపెనీకి చెందిన మాణిక్ చంద్ పాన్ మసాలాను తయారు చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నారు. అయితే ఆ ట్రేడ్‌మార్క్ తమదని, దాన్ని అతిక్రమించి సచిన్, ఆయన తండ్రి వాడు తూ వ్యాపారం చేస్తున్నారంటూ సురేశ్ రావు అనే వ్యక్తి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్ నేతృత్వంలోని బృందం గగన్‌పహడ్‌లోని గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీపై గురువారం దాడులు చేసింది. 60 బ్యాగుల మానిక్ చంద్ పాన్ మసాలా, వెయ్యి బ్యాగుల గోవా పాన్ మసాలా, 60 బ్యాగుల వజిర్ పాన్ మసాలాతోపాటు మడిసరుకు, ప్యాకింగ్ కవర్లు, మిక్సర్ యంత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ట్రేడ్‌మార్క్ యజమానులు ఎవరనే దానిపై చెన్నైలోని ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో బహదూర్‌పుర పోలీసు స్టేషన్లో సచిన్ జోషిపై ఓ కేసు నమోదైంది. ఈ కేసులో అతను నాలుగో నిందితుడిగా ఉన్నాడు. ఎన్వోసీ జారీ చేస్తే నాలుగు రోజుల క్రితం ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ముంబై వెళ్లిపోయాడు. -
సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ('గుట్టు'కా దందా!) కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. (గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు) ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్‌పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ('చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు') -
హారర్ జోనర్ సినిమాలు హిట్టే
‘‘నాకు హారర్ జోనర్ అంటే ఇష్టం. అందుకే ఆ నేపథ్యంలో చాలా సినిమాలు నిర్మించాను. హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడూ హిట్టే. సచిన్ మంచి నటుడు. తనకు చాలా వ్యాపారాలు ఉన్నా సినిమాపై ప్యాషన్‌తో నటిస్తున్నారు. ఆయన భార్య రైనా సచిన్జోషిగారు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సచిన్ జోషి, నర్గిస్ ఫక్రి జంటగా భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రైనా సచిన్‌జోషి, దీపెన్ ఆమిన్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పాటల్ని విడుదల చేశారు. సచిన్ జోషి మాట్లాడుతూ– ‘‘నేను చాలా కాలంగా హారర్ జోనర్లో ఓ సినిమా చేయాలనుకుంటన్న టైమ్‌లో భూషణ్ పటేల్ ‘అమావాస్య’ కథ చెప్పారు. ఇదొక క్లాసిక్ హారర్ మూవీ. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వి.ఎఫ్.ఎక్స్. వర్క్‌ను ఉపయోగించాం. హాలీవుడ్ స్థాయి హారర్ సినిమాని ప్రేక్షకులకు అందించాలని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మా టీం అంతా చాలా కష్టపడటం వల్లే ఈ సినిమా చాలా బాగా వచ్చింది’’ అని భూషణ్ పటేల్ అన్నారు. ‘‘మొదటిసారి ఒక హారర్ సినిమాలో నటించాను’’ అని నటుడు అలీ అస్గర్ అన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
యంగ్ హీరోతో మిల్కీ బ్యూటీ
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెలుతున్న హీరో సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్న యువ కథానాయకుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సైలెంట్ గా ఫినిష్ చేసేశాడు. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ తొలిసారిగా ఓ తెలుగు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించినా.. తమన్నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు, సందీప్ కిషన్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో మరో విశేషం ఉంది. ఈ సినిమాను హీరో సచిన్ జోషి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
అందుకే అవకాశాలు రాలేదు
ఎస్.ఎం.ఎస్, భీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య రూపొందించిన తాజా చిత్రం ‘వీడెవడు’. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లర్. హీరో భార్య హత్యకు గురవుతుంది. ఆ నేరం హీరో మీద పడుతుంది. అసలు ఆ హత్య హీరో చేశాడా? లేక వేరెవరైనా చేశారా? అన్నది సస్పెన్స్. హీరో ప్రో కబడ్డీ ప్లేయర్. ఆటకి క్రైమ్‌ను మిక్స్ చేసి, ఆడుతుంటాడు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ హిట్ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోవడానికి కారణం నాకు సరైన పి.ఆర్. లేకపోవడమే. నేను పెద్దగా హీరోల్ని, నిర్మాతల్ని కలవను. అందుకే అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈ సినిమాతో నేను రీమేక్ సినిమాలు మాత్రమే చేయగలననే పేరు పోతుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నానీకి ఒక లైన్ చెప్పాను. అతనితోనే చేయొచ్చు’’ అన్నారు. -
ఒకవైపు పాజిటివ్.. మరోవైపు నెగటివ్!
— సచిన్ జోషి సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి నిర్మించిన సినిమా ‘వీడెవడు’. సెప్టెంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్.ఎం.ఎస్, భీమిలి కబడ్డీ జట్టు, శంకర’ సినిమాలన్నీ రీమేక్ చిత్రాలే. తెలుగులో నేను చేసిన స్ట్రయిట్ సినిమా ‘వీడెవడు’. ఇదొక మంచి థ్రిల్లర్. ప్రేకుకులకు నచ్చే అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో వస్తోన్న సినిమా ఇది. టైటిల్ చాలా ఆసక్తిగా ఉంది. సత్య చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాడు. సెప్టెంబర్ 2న సినిమా ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘ఇందులో నాది ఛాలెంజింగ్ క్యారెక్టర్. నా పాత్రలో పాజిటివ్æయాంగిల్, నెగటివ్ యాంగిల్... రెండూ ఉన్నాయి. లవ్, యాక్షన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. యూనిక్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 8న విడుదల చేస్తున్నాం’’ అన్నార్ సచిన్ జోషి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ గుడిమిట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బినేంద్ర మీనన్, సంగీతం: ఎస్.ఎస్.తమన్. -
యార్ ఇవన్ ట్రైలర్ లాంచ్
నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యార్ ఇవన్. ఇంతకు ముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సచిన్ యార్ ఇవన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. వికింగ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు టి.సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇషాగుప్తా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభు, కిశోర్, సతీష్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సి.కల్యాణ్, కాట్రగడ్డప్రసాద్, ఎల్.సురేశ్ వచ్చి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక యువకుడి భార్య హత్యకు గురైతే అందుకతను హంతకులపై ఎలా రివెంజ్ తీసుకున్నాడన్న క్రైం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం యార్ఇవన్ అని చిత్ర వర్గాలు తెలిపాయి. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అతను తోడేలు: సచిన్
ఎవరి నమ్మకం గెలిచింది? చేతులు సాఫ్ట్‌గా ఉండేవాడు మర్డర్ చేయడని నమ్మే పోలీసాఫీసర్.. చంపడం చేతుల్లో ఉండదు మైండ్‌లో ఉంటుందని నమ్మే ప్రేమికుడు.. నచ్చిన అమ్మాయిని దక్కించుకునేందుకు చంపడం తప్పు కాదని నమ్మే విలన్. వీరిలో ఎవరి నమ్మకం గెలిచింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘వీడెవడు’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు తాతినేని సత్య. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్.ఎమ్.ఎస్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘శంకర’.. ఈ మూడూ రీమేక్ చిత్రాలే. ఇన్ని రోజుల తర్వాత స్ట్రైట్‌గా చేస్తున్న చిత్రం ఇది. సచిన్ అద్భుతంగా నటించారు. థమన్ మంచి సంగీతం అందించారు. మేలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అందరూ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. అందుకే అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు సచిన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కెమేరా: బినేంద్రమీనన్. అతను తోడేలు: సచిన్ నటుడు–నిర్మాత బండ్ల గణేశ్, హీరో సచిన్ మధ్య మనస్పర్థలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘వీడెవడు’ ప్రెస్మీట్లో గణేశ్ గురించి సచిన్ దగ్గర ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘బండ్ల గణేశ్‌తో నేను పోరాడను. ఎందుకంటే నా స్థాయితో పోల్చితే అతను చాలా తక్కువ. నా దృష్టిలో బండ్ల గణేశ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు బండ్ల గణేశ్ ఏదో ఇంటర్వ్యూలో సచిన్ జోషి ఎవరు? అని అన్నాడంట. నాకు మాత్రం ‘వీడెవడు’ అనిపిస్తోంది. ప్రపంచంలో కుక్కలు ఉంది మొరగడానికే. వాటి అరుపులకు బెదరనవసరం లేదు. నా దృష్టిలో బండ్ల గణేశ్ కుక్కగా కూడా పనికి రాడు. కుక్కలు విశ్వాసంగా, నిజాయితీగా ఉంటాయి. అతను తోడేలు లాంటివాడు. అతను ఏం సాధించాడన్నది నాకు అనవసరం. దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. చట్టం తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. నేను అతని గురించి, తాను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని సచిన్ అన్నారు -
'బండ్ల' మనిషి కాదు... తోడేలు...
హైదరాబాద్: సినీ నటుడు సచిన్ జోషి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇటీవల సచిన్ జోషి తనను చంపడానికి గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు డబ్బు ఇచ్చాడని, నయీమ్ చనిపోవడంతో ప్రాణాలతో బ్రతికి పోయానని బండ్ల గణేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సచిన్ జోషి బండ్ల ఆరోపణలపై స్పందించారు. సచిన్ ముఖ్యపాత్ర పోషించిన చిత్రం వీడెవడు టీజర్ విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సచిన్, బండ్ల ఆరోపణలపై స్పందించారు. "బండ్ల మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న తోడేలు,. ఒరేయ్ పండు సినిమా సమయంలో తినడానికి తిండిలేదన్నాడు. నమ్మించి మోసం చేశాడు. అలాంటి వాడితో కలిసి వ్యాపారం చేశాను. కోర్టులో 18 కేసులు వేశాం, సుమారు 27 కోట్లు ఇవ్వాలి. తీరా అరెస్టు చేసే సమయంలో బండ్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది". కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో ఆరోపణలు చేయడం తగదని సచిన్ విమర్శించారు. -
కోలీవుడ్‌కు సచిన్ జోషి
టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఒక రౌండ్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్‌కు వస్తున్నారు యువ నటుడు సచిన్‌జోషి. ప్రముఖ వ్యాపారవేత్త సచిన్‌జోషి. ఈయనకు సినిమా చాలా ఫ్యాషన్. ఇప్పటికే కథానాయకుడిగా పలు తెలుగు చిత్రాల్లో నటించారు. హిందీలోనూ రామ్‌గోపాల్ వర్మ తదితర దర్శకుల చిత్రాల్లో నటించారు. తాజాగా ఇవన్ యార్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో వీడెవడు అనే పేరును నిర్ణయించారు. టి.సత్య దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి ఈషాగుప్తా నాయకిగా నటిస్తున్నారు. ప్రభు, కిశోర్, సతీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యార్ ఇవన్ చిత్రానికి ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ తెలిపారు.ఇది కబడ్డీ క్రీడ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. యార్ ఇవన్ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఆదరిస్తే వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తానని చిత్ర కథానాయకుడు సచిన్‌జోషి అన్నారు. -
విడుదలకు రెడీ అవుతున్న బాలీవుడ్ వీరప్పన్
సౌత్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్లో మకాం వేసిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కూడా జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యే వీరప్పన్ సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ, అప్పుడే ఆ సినిమా రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. సౌత్‌లో కేవలం వీరప్పన్ కోసం సాగించిన వేటనే కథాశంగా సినిమా రూపొందించిన వర్మ హిందీలో మాత్రం వీరప్పన్ జీవితకథను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ భరద్వాజ్‌తో పాటు సచిన్ జోషి, ఉషా జాదవ్, లిసారే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కర్ణాటక మాఫియా డాన్ జీవిత కథ ఆధారంగా రాయ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో రాయ్ పాత్రలో వివేక్ ఒబరాయ్ నటిస్తున్నాడు. వర్మ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వివేక్. వీటితో పాటు టాలీవుడ్లో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలోవంగవీటి సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు వర్మ. -
ఆగస్టు 7న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎం.ఎస్. స్వామినాథన్ (వ్యవసాయ శాస్త్రవేత్త), సచిన్ జోషి (హీరో) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. ఈ రోజు నుండి తదుపరి బర్త్‌డే వరకు వీరిపై బుధుని ప్రభావం ఉంటుంది. బుధసంఖ్య వలన చేసే పనిలో నైపుణ్యం చూపిస్తారు. వీరికి ఈ సంవత్సరం గురు, చంద్ర యోగం; బుధ, గురుల కలయిక వలన చదివిన చదువుకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వీరు వీరి తాహతుకు మించి పెద్ద వాటికై ప్రయత్నించడం మంచిది. వీరికి అవకాశాలు కూడా అలాగే వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా గౌరవమర్యాదలు లభిస్తాయి. పదవులు పొందుతారు. విదేశీయానం చేస్తారు. గ్రీన్‌కార్డ్ లేదా స్థిరనివాసం, ఆస్తిపాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. వీరు 7వ తేదీన పుట్టినందువల్ల వీరిపై కేతు ప్రభావం ఉంటుంది. కేతువు మోక్ష కారకుడు కాబట్టి వీరికి ప్రాపంచిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ కలుగుతుంది. కేతుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత కలిగే అవకాశం ఉంది. సంవత్సర సంఖ్య 5. దీని ప్రభావం వల్ల వీరి లక్ష్యాలు నెరవేరతాయి. లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు; లక్కీ కలర్స్: రోజ్, పర్పుల్, గ్రీన్, గోల్డెన్, శాండల్; లక్కీ మంత్స్: మార్చి, మే, సెప్తెంబర్, అక్టోబర్, డిసెంబర్. సూచనలు: గణపతిని, పార్వతీ అమ్మవారిని ఆరాధించడం, కన్నెపిల్లలకు తగిన సాయం చేయడం మంచిది. వ్యాపార, ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యహరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థ బండ్ల గణేష్ కు నోటీసులు పంపింది. హీరో సచిన్ జోషి...వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 'ఆషికి 2' చిత్రాన్ని నీ జతగా నేనుండాలి పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే నీ జతగా నేనుండాలి సినిమాకీ గణేష్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. అయితే ఆ సినిమా విషయంలో గణేష్ తనని మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తానని చెప్పి... చివరికి నష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ తప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హిందీలో ‘మెంటల్’, తెలుగులో ‘ఎఫైర్’
జయాపజయాలతో సంబంధం లేకుండా రామ్‌గోపాల్‌వర్మ శరవేగంతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన సచిన్ జోషీతో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హిందీ వెర్షన్‌కు ‘మెంటల్’, తెలుగు వెర్షన్‌కు ‘ఎఫైర్’ టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. -
ద్విభాషా చిత్రంలో..
మౌనమేలనోయి, ఒరేయ్, నీ జతగా నేనుండాలి తదితర తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోగా నటించిన సచిన్ జోషి నటిస్తున్న తాజా చిత్రం ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’. ఇప్పటివరకు సోలో హీరోగా చేసిన ఆయన ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర అంగీకరించడం విశేషం. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అయుష్ రైనా దర్శకుడు. సచిన్ మాట్లాడుతూ -‘‘తొలిసారి బయటి బేనర్లో నటిస్తున్నాను. రచయిత ప్రవల్ రామన్ ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’ కథ మొత్తం చెప్పి కీలక పాత్రకు అడగ్గానే ఆశ్చర్యపోయాను. కానీ, కథ, పాత్ర నచ్చడంతో అంగీకరించాను. ఇందులో ధనిక పారిశ్రామికవేత్త పాత్ర నాది’’ అన్నారు. -
నీ జతగా నేనుండాలీ మూవీ ప్లాటీనమ్ డిస్క్ వేడుక
-
‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను
గత ఏడాది హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘ఆషికి 2’ ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో సచిన్ జోషి, నాజియా జంటగా జయరవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేశ్ పునర్నిర్మించారు. నేడు సచిన్ జోషి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలు పంచుకుంటూ -‘‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. కొంత విరామం తర్వాత తెలుగులో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని, ‘ఆషికి-2’ వంటి క్యూట్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందని ఈ రీమేక్‌లో నటించాలనుకున్నాను. ఇందులో హీరో ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. ముందు ఈ పాత్ర చేయడానికి కొంచెం భయపడ్డాను. తెలుగుకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా క్లయిమాక్స్ ఊహించని మలుపుతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే పాటలు పెద్దలు హిట్టయ్యాయి. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం’’ అని చెప్పారు. ‘ఆషికి-2’ తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాననీ, తెలుగులో ఓ హారర్, ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించనున్నానని సచిన్ తెలిపారు. అలాగే, థింక్ టాంక్ అనే సంస్థను ప్రారంభించి, లఘు చిత్రాలతో పాటు అన్ని రకాల సినిమాలు తీయాలని ఉందని వెల్లడించారు. -
ఆషిఖి 2 తెలుగు రీమేక్ మూవీ ఒపెనింగ్
-
తమన్నాను వద్దంటున్న బాలీవుడ్ హీరో!
-
జాక్‌పాట్ కొట్టిన సచిన్, సన్నీలియోన్!!