ఒకవైపు పాజిటివ్‌.. మరోవైపు నెగటివ్‌! | veedevadu movie release on September 8 | Sakshi
Sakshi News home page

ఒకవైపు పాజిటివ్‌.. మరోవైపు నెగటివ్‌!

Published Mon, Aug 28 2017 12:37 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

ఒకవైపు పాజిటివ్‌.. మరోవైపు నెగటివ్‌!

ఒకవైపు పాజిటివ్‌.. మరోవైపు నెగటివ్‌!

— సచిన్‌ జోషి
సచిన్‌ జోషి, ఇషా గుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి నిర్మించిన సినిమా ‘వీడెవడు’. సెప్టెంబర్‌ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్‌.ఎం.ఎస్, భీమిలి కబడ్డీ జట్టు, శంకర’ సినిమాలన్నీ రీమేక్‌ చిత్రాలే. తెలుగులో నేను చేసిన స్ట్రయిట్‌ సినిమా ‘వీడెవడు’. ఇదొక మంచి థ్రిల్లర్‌. ప్రేకుకులకు నచ్చే అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు.

నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో వస్తోన్న సినిమా ఇది. టైటిల్‌ చాలా ఆసక్తిగా ఉంది. సత్య చాలా ఇంటెలిజెంట్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాడు. సెప్టెంబర్‌ 2న సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘ఇందులో నాది ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌. నా పాత్రలో పాజిటివ్‌æయాంగిల్, నెగటివ్‌ యాంగిల్‌...  రెండూ ఉన్నాయి. లవ్, యాక్షన్, స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. యూనిక్‌ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 8న విడుదల చేస్తున్నాం’’ అన్నార్‌ సచిన్‌ జోషి. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శివప్రసాద్‌ గుడిమిట్ల  పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బినేంద్ర మీనన్, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement