అందుకే అవకాశాలు రాలేదు | Veedevadu to release on 15th September | Sakshi
Sakshi News home page

అందుకే అవకాశాలు రాలేదు

Published Fri, Sep 15 2017 12:52 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

అందుకే అవకాశాలు రాలేదు

అందుకే అవకాశాలు రాలేదు

ఎస్‌.ఎం.ఎస్, భీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య రూపొందించిన తాజా చిత్రం ‘వీడెవడు’. సచిన్‌ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లర్‌. హీరో భార్య హత్యకు గురవుతుంది. ఆ నేరం హీరో మీద పడుతుంది. అసలు ఆ హత్య హీరో చేశాడా? లేక వేరెవరైనా చేశారా? అన్నది సస్పెన్స్‌.

హీరో ప్రో కబడ్డీ ప్లేయర్‌. ఆటకి క్రైమ్‌ను మిక్స్‌ చేసి, ఆడుతుంటాడు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ హిట్‌ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోవడానికి కారణం నాకు సరైన పి.ఆర్‌. లేకపోవడమే. నేను పెద్దగా హీరోల్ని, నిర్మాతల్ని కలవను. అందుకే అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈ సినిమాతో నేను రీమేక్‌ సినిమాలు మాత్రమే చేయగలననే పేరు పోతుంది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో నానీకి ఒక లైన్‌ చెప్పాను. అతనితోనే చేయొచ్చు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement