tatineni satya
-
అందుకే అవకాశాలు రాలేదు
ఎస్.ఎం.ఎస్, భీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య రూపొందించిన తాజా చిత్రం ‘వీడెవడు’. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లర్. హీరో భార్య హత్యకు గురవుతుంది. ఆ నేరం హీరో మీద పడుతుంది. అసలు ఆ హత్య హీరో చేశాడా? లేక వేరెవరైనా చేశారా? అన్నది సస్పెన్స్. హీరో ప్రో కబడ్డీ ప్లేయర్. ఆటకి క్రైమ్‌ను మిక్స్ చేసి, ఆడుతుంటాడు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ హిట్ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోవడానికి కారణం నాకు సరైన పి.ఆర్. లేకపోవడమే. నేను పెద్దగా హీరోల్ని, నిర్మాతల్ని కలవను. అందుకే అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈ సినిమాతో నేను రీమేక్ సినిమాలు మాత్రమే చేయగలననే పేరు పోతుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నానీకి ఒక లైన్ చెప్పాను. అతనితోనే చేయొచ్చు’’ అన్నారు. -
యార్ ఇవన్ ట్రైలర్ లాంచ్
నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యార్ ఇవన్. ఇంతకు ముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సచిన్ యార్ ఇవన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. వికింగ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు టి.సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇషాగుప్తా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభు, కిశోర్, సతీష్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సి.కల్యాణ్, కాట్రగడ్డప్రసాద్, ఎల్.సురేశ్ వచ్చి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక యువకుడి భార్య హత్యకు గురైతే అందుకతను హంతకులపై ఎలా రివెంజ్ తీసుకున్నాడన్న క్రైం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం యార్ఇవన్ అని చిత్ర వర్గాలు తెలిపాయి. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అమితాబ్ బచ్చన్ గుర్తుకొచ్చారు - కేయస్ రామారావు
‘‘రోహిత్ మంచి ఎనర్జిటిక్ హీరో. తమిళ చిత్రం ‘మౌనగురు’ని తనతో తెలుగులో రీమేక్ చేశాం. ఇందులో రోహిత్ నటన చూస్తుంటే, యాంగ్రీమేన్ అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చారు. మంచి యాక్షన్ హీరోగా రోహిత్ అందరికీ దగ్గరవుతాడు’’ అని కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో నారా రోహిత్, రెజీనా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో ఆర్వీ చంద్రమౌళి (కిన్ను) నిర్మించిన చిత్రం ‘శంకర’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చాముండేశ్వరీనాథ్ ఆవిష్కరించి హీరో నానీకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని కేయస్ రామారావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేను భారతీయ టీమ్‌లో క్రికెట్ ప్లేయర్ కావాలని, మంచి సినిమా తీయాలని నాన్నగారి ఆశయం. అందుకే ఈ సినిమా నిర్మించా. ఏడేళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. కేయస్ రామారావులాంటి మంచి ఫిల్మ్ మేకర్ సహాయంతో ఈ సినిమా నిర్మించా’’ అని తెలిపారు. ‘‘మొదట్నుంచీ ఇప్పటివరకు నేను చేసినవి విభిన్నమైన సినిమాలే. ‘శంకర’ కూడా చాలా బాగుంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, సాయికార్తీక్ మంచి పాటలు ఇచ్చారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రమేష్‌ప్రసాద్, టీఎల్వీ ప్రసాద్, మంచు మనోజ్, నాని, సుధీర్‌బాబు తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.