తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ భారీ షాక్ ఇచ్చింది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది.
శనివారం ఈడీ విభాగం మొత్తం రూ.410 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ వెల్లడించింది.
వ్యాపారవేత్త అయిన సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తోనూ సచిన్ సుపరిచితుడే.
ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈమేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment