assets
-
అదును చూసి సిరియాను దెబ్బ కొడుతున్న ఇజ్రాయెల్!
డమాస్కస్: మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం నుంచి పారిపోవడంతో సిరియాను అదును చూసి ఇజ్రాయెల్ దెబ్బ కొట్టింది. గడిచిన 48 గంటల్లో అక్కడి వ్యూహాత్మక మిలటరీ స్థావరాలపై 400 కంటే ఎక్కువ సార్లు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.24 ఏళ్లుగా సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న బషర్ అల్ అసద్ పాలనకు ముగింపు పలికాయి. దీంతో అసద్ సిరియా నుంచి రష్యా వెళ్లారు. అసద్ దేశం విడిచి వెళ్లారనే సమాచారంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.రసాయనిక ఆయుధాలు, రాకెట్లను నిల్వ ఉంచినట్లు అనుమానాలున్న ఆర్మీ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. 80 శాతంపైగా సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసింది. సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్-విలీనమైన గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న బఫర్ జోన్లోకి ఇజ్రాయెల్ తన దళాలను పంపింది.‘గత 48 గంటల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సిరియాలోని భారీ మొత్తంలో వ్యూహాత్మక ఆయుధాల నిల్వలను ఉంచిన స్థావరాలపై దాడులు చేసింది. వాటిని తీవ్రవాదుల చేతుల్లో పడకుండా నిరోధించాము’అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిల్లో సిరియా నేవీ స్థావరాలు, అల్ బైడా పోర్ట్, లటాకియా పోర్ట్ 15 నౌకాదళ నౌకలు, రాజధాని డమాస్కస్, ఇతర ముఖ్య నగరాల్లోని విమాన నిరోధక బ్యాటరీలు, ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. -
‘రియల్’ ఆస్తులే టాప్!
దేశంలోని మొత్తం కుటుంబాల ఆస్తుల్లో సగం శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు ఇళ్లరూపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ మేరకు అమెరికాలో ప్రముఖ పెట్టుబడి సంస్థగా పేరున్న జెఫరీస్తో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగణాంకాల ఆధారంగా వాణిజ్య వార్తా కథనాలు మాత్రమే ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానల్ నివేదిక స్పష్టంచేస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలోని కుటుంబాల అన్ని రకాల ఆస్తుల మొత్తం విలువ 11.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. (రూ.పదికోట్ల కోట్లు) ఈ ఆస్తులు ఏ రంగాల్లో ఉన్నాయో పరిశీలించిన ఆ టీవీ ఛానల్ .. సగానికి పైగా అనగా 50.7 శాతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటుఇళ్ల రూపంలోనే ఉన్నాయని గుర్తించింది. – సాక్షి, అమరావతిపీఎఫ్లో కన్నా ఇన్సూరెన్స్లోనే పెట్టుబడులు అధికంవృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడులు కన్నా మన దేశంలోని కుటుంబాలు అత్యధిక మొత్తం ఇన్సూరెన్స్ పాలసీల రూపంలోనే పెట్టిన పెట్టుబడులే అధికమని ఆ గణాంకాలు మరో ఆశ్చర్యకరమైన అంశాన్ని వెలుగులో తీసుకొచ్చాయి. దేశీయ కుటుంబాలు కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 5.8 శాతం మేర ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్ రూపంలో ఉండగా, ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో 5.9 శాతం మేర ఆస్తులున్నాయి. మన దేశ మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం.. దేశీయ మొత్తం ఆస్తుల్లో రెండో అతి పెద్ద స్థానంలో 15.5 శాతం మేర ఉండడం గమనార్హం. -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్‌ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్‌లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
బెయిల్ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది. అసలైన బాధితుడైన జగన్‌కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు వైఎస్సార్సీపీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇదీ... కాంగ్రెస్‌కు ఓటేయమని విజయమ్మ ఎలా అంటారు? ఆనాడే వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే... అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు అంతా జట్టు కట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి, తన కుమారుడు జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి ఓటేయమని కోరుతూ విజయమ్మ వీడియో విడుదల చేశారు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెడుతూ.. తాను షర్మిలవైపు ఉన్నాననే విషయాన్ని తద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా..! రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు...కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు. బాధపడ్డారు. సర్టిఫికెట్లు పోయాయని.. మోసపూరితంగా షేర్ల బదలాయింపు సరస్వతీ కంపెనీ వ్యవహారంలో షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో షేర్ల సర్టిఫికెట్లు పోయాయని విజయమ్మ చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండానే, జగన్ సంతకాలు లేకుండానే ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా షేర్లు బదిలీ చేశారు. తన కుమారుడికి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని, అది బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసినా అలా చేశారు. తద్వారా తాను షర్మిలతోనే ఉన్నానని మరోసారి స్పష్టంగా చెప్పారు. షర్మిలను ఏనాడూ ఒక్క మాట అనని జగన్.. వైఎస్ జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏమిటి...? ఇంత జరిగినా జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. కానీ షర్మిల ఎన్నోసార్లు వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో విజయవాడలో జగన్‌పై దాడి జరిగితే హేళనగా మాట్లాడారు. షర్మిలను సరిదిద్దాలని విజయమ్మ ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. బాధితుడు జగనే... కోర్టు కేసులపై ప్రతికూల ప్రభావితం పడేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉంటున్నాయి. ఓ వైపు ఆస్తులపై హక్కులు కోరుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులపై వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తనకు ఎలాంటి ఆందోళనలేనట్టు ఆమె ప్రవర్తిస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగూ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ఉంటోంది. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా జగన్ ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు...? ఒక తల్లిగా విజయమ్మ ఎవరికి బాసటగా ఉండాలనే బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రచ్చ కెక్కిందీ... పరువు తీసిందీ షర్మిలే రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్‌ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టికి... అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టికి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వచ్చారు. రాజకీయాలు ఇంతే అనుకున్నా ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి ఆజన్మ శత్రువు మాదిరిగా జగన్‌ను షర్మిల అనరాని మాటలు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేసి అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా..? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు... పరువుతీసింది ఎవరు... నిజమైన బాధితుడు ఎవరు... జగనే కదా..!! విచక్షణ విస్మరించిన విజయమ్మ కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లతో విజయమ్మ విచక్షణ విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణితో సరస్వతీ కంపెనీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. ఉమ్మడి ఆస్తులే అయితే ఒకరి కంపెనీల్లో ఒకరికి ఎందుకు వాటాలు లేవు? వైఎస్సార్ ఆ ఆస్తులను షర్మిలకు ఎందుకు పంచలేదు? వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడే జగన్ కంపెనీలు నడిపారు. అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్సార్ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది ? తన కుమార్తెకు వైఎస్సార్ పూరీ్వకుల ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారు. జగన్ ఆస్తులు తనవి కాదు కాబట్టే ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ జగన్ స్వార్జితం కాబట్టి. తన స్వార్జిత ఆస్తులను షర్మిలకు ఇచ్చిన జగన్ షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు జగన్ ద్వారా షర్మిల పొందినా ఆమె తన సోదరుడిపట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. షర్మిల ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా ? ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? వాటాలు ఉంటే ఇలా నష్టం చేస్తారా? ఈ కంపెనీల మీద, జగన్ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా షర్మిల వారిని బలపరుస్తున్నారు. కంపెనీలను బలహీనపరుస్తున్నారు. ఆమె నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? ఇలా జగన్‌ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా? కోర్టులే నిర్ణయిస్తాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.ఉమ్మడి ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు? తన స్వార్జిత ఆస్తులను ప్రేమానురాగాలతో షర్మిలకు ఇస్తున్నట్లు జగన్ ఎంఓయూ రాస్తే... దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని, ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కదా. నిజంగా ఉమ్మడి ఆస్తులే అయితే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదు... చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు. జగన్ స్వార్జిత ఆస్తి కోసం షర్మిల యాగీ ఏమిటి? జగన్ స్వార్జితమైన ఆస్తిలో ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో తనకు భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి తన ప్రేమానురాగాలను చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏం చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది. బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ఎందుకు ప్రస్తావించ లేదు?ప్రజలను పక్కదోవ పట్టించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డిని న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు... తద్వారా బెయిల్ రద్దుకు పన్నిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ తన లేఖలో కనీసం ప్రస్తావించ లేదు. అది ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో సహా పలువురి న్యాయసలహాలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా...! షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా...! విజయమ్మ తన లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను పక్కదోవ పట్టించడమే. -
సరస్వతీ పవర్ వాటాల బదిలీపై షర్మిల వాదన అసంబద్ధం
సాక్షి, అమరావతి: సరస్వతీ పవర్ వాటాల బదిలీ విషయంలో షర్మిల చేస్తున్న అసంబద్ధ వాదనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సరస్వతీ పవర్ వాటాలను జప్తు చేయలేదన్న షర్మిల వాదనతో న్యాయ నిపుణులు విబేధిస్తున్నారు. ఈడీ.. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులన్నింటినీ జప్తు చేసిందని, చరాస్తుల్లోకి షేర్లు కూడా వస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీల చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొంటున్నారు. కంపెనీల చట్టం సెక్షన్ 44 ప్రకారం షేర్లు, డిబెంచర్లను చరాస్తులుగా పరిగణిస్తారు. అందువల్ల సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినందున, ఆ కంపెనీ షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. కాబట్టి హైకోర్టు జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు సరస్వతీ పవర్ షేర్లకు కూడా వర్తిస్తాయి. షేర్లతో సహా జప్తులో ఉన్న ఏ ఆస్తులను కూడా ఇతరులకు విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయడానికి వీల్లేదు. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుడులకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది. ఇందులో జగన్మోహన్రెడ్డి, ఆయన గ్రూపునకు చెందిన పలు కంపెనీలున్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో సరస్వతీ పవర్‌కు చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్మోహన్రెడ్డి, సరస్వతీ పవర్లతో సహా పలు గ్రూపు కంపెనీలు మనీలాండరింగ్ నిరోధక అప్పిలెట్ ట్రిబ్యునల్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అప్పిలెట్ ట్రిబ్యునల్ 2019 జూలై 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో సరస్వతీ పవర్ స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. సరస్వతి పవర్ స్థిర, చరాస్తుల జప్తును తప్పుపట్టింది. ఆ జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2019 అక్టోబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టును కోరింది. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈడీ దాఖలు చేసిన అప్పీల్ తేలేంత వరకు ఆ రోజు నాటికి ఉన్న స్థితిని అన్ని రకాలుగా యథాతథంగా కొనసాగించాలంటూ 2019 డిసెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఈ రోజుకీ అమల్లో ఉన్నాయి. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల గురించే జగన్మోహన్రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగా సరస్వతీ పవర్లో వాటాలను బదలాయించడం అంటే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నది న్యాయ నిపుణుల మాట. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు సలహా రూపంలో జగన్మోహన్రెడ్డికి స్పష్టంగా చెప్పారు. ఈ సలహాను జగన్ తన చెల్లి షర్మిల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ న్యాయ సలహాను ఆమె ముందుంచారు.జగన్‌ను ఉద్దేశపూర్వకంగా సమస్యల్లోకి నెట్టిన షర్మిల...కోర్టులో ఉన్న కేసులన్నీ తేలిన తరువాత వాటాలు బదలాయించుకోవచ్చునని షర్మిలకు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వాటాలు బదిలీ చేస్తే తనకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని కూడా వివరించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్న షర్మిల తన అన్న జగన్ మాటలను పెడచెవిన పెట్టారు. ఆయన్ను న్యాయపరమైన సమస్యల్లోకి నెట్టేందుకే నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే సరస్వతీ పవర్లో ఉన్న వాటాలను అక్రమ పద్ధతిలో బదలాయించేశారు. అన్యాయమైన పని చేసిన షర్మిల మరోవైపు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఈడీ సరస్వతీ పవర్‌కు చెందిన భూములను మాత్రమే జప్తు చేసిందే కానీ, షేర్లను జప్తు చేయాలంటూ ఓ వాదనను తీసుకొచ్చారు. అందుకే వాటాలను బదలాయించినట్లు ఆమె చెబుతున్నారు. న్యాయ నిపుణులు మాత్రం ఆమె వాదన చట్ట విరుద్ధంగా ఉందని తేల్చి చెబుతున్నారు. షర్మిల దురుద్దేశపూర్వకంగా సృష్టించిన న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. షేర్ల బదిలీల విషయంలో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసి, తన వాటాలను తనకు వెనక్కి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సరస్వతీ పవర్ షేర్లు జప్తులో లేవని ఎలా చెబుతారు..?హైకోర్టు న్యాయవాది మరక్కగారి బాలకృష్ణసరస్వతీ పవర్ షేర్ల బదిలీ విషయంలో షర్మిల వాదన చట్ట విరుద్ధంగా ఉంది. ఎవరు ఇస్తున్నారో గానీ ఆమెకు సరైన న్యాయ సలహాలు ఇవ్వడం లేదు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 44ను చదివితే షేర్లు అనేవి చరాస్తుల కిందకు వస్తాయి. ఇందుకు పెద్దగా లా చదువుకుని ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్థిర, చరాస్తులను జప్తు చేసినప్పుడు, చరాస్తుల కిందకు వచ్చే షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. ఇందులో చర్చకు, వాదనకు ఆస్కారం ఏముంది? మనీలాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు సరస్వతి పవర్ షేర్లకు వర్తిస్తాయి. జప్తు ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునని ఏ చట్టం చెబుతుందో షర్మిలకే తెలియాలి. -
చట్టాన్ని గౌరవించటం తప్పా?
కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులున్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధానమివ్వటానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్ షేర్ల బదిలీ వ్యవహారంలో ఇదే జరిగింది. వైఎస్ జగన్‌కు తెలియకుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్ రిజిస్టర్డ్ గిఫ్ట్‌డీడ్‌ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజమాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్‌కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్‌కు లేదా? ఈ లావాదేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియకుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే..సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్ ఇస్తున్నారు. ఆస్తుల కోసం జగన్ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు.ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం. -
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్‌తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్-2లో కనిపించారు. -
గంటా ఆస్తులు వేలానికి పెట్టిన ఇండియన్ బ్యాంక్
-
లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హథ్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియరాలేదు.అయితే ఈ విషాదంపై దర్యాప్తులో భాగంగా ఆయన ఆదాయం, సంపద వెలుగు చూసింది. గత ఇరవై ఏళ్ల కాలంలో భేలే బాబా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాస్గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు.ఇక భోలే బాబా సూరజ్‌పాల్ మెయిన్‌పురిలోని విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివాసముంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రాజభవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ. 4 కోట్లతో నిర్మించారు.ఆయన భక్తులలో ఒకరు ఈ స్థలాన్ని బాబాకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా.. ముందు ఆయన కమాండోలు బైక్‌లపై దారిని క్లియర్ చేస్తారు. అదే విధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది.యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా 1999లో కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి బోధించడం ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, కార్లపై ప్రీతి కలిగిన ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని తన భక్తుల పేర్లతో కొనుగోలు చేసేవాడు.హథ్రాస్‌లోని భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సత్సంగ్‌ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేవలం 80,000 మందికి మాత్రమే అనుమతినివ్వగా.. దాదాపు 2.5 లక్షల మంది అనుచరులు తరలివచ్చారని పోలీసులు తెలిపారు. భోలే బాబా వేదిక నుంచి వెళుతున్న సమయంలో అతని కాన్వాయ్ ద్వారా తన్నిన ధూళిని సేకరించడానికి భక్తుల గుంపు పరుగెత్తుకొచ్చింది, ఇది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే గుంపును నియంత్రించే ప్రయత్నంలో వాలంటీర్లు, అతని భద్రత సిబ్బంది ప్రజలను వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతో అనేక మంది భక్తులు గుంపుగా పడి నలిగిపోయారు. అక్కడి నుంచి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.అయితే ఇప్పటి వరకు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని తెలిపారు. -
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
రఘురామ, గంటాకు బిగ్ షాక్
విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్‌లకు భారీ షాక్ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూములు, ప్లాంట్ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది. ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్‌పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌పై 2017లో చెన్నై సెండియం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్‌లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్‌కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్‌కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్‌కి గిఫ్ట్‌గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు లోకేశ్‌తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్‌లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు దేవాన్ష్‌తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
సుజనా చౌదరికి షాక్
-
Hema Malini Assets Worth: హేమమాలిని ఆస్తులు వంద కోట్లకు పైగానే..
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ. 43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్ -
రాహుల్ గాంధీ కోటీశ్వరుడేనా?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానం నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఆయన వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు, బ్యాంకు ఖాతాలో రూ.26.25 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తన వద్ద రూ. 55,000 నగదు ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,02,78,680 ఆర్జించినట్లు పేర్కన్నారు. #Congress leader Rahul Gandhi's Asset and Liability!!👇👇 Assets worth 20,29,52,000. Liability- 49,70,000. Also Invested in Stocks-Mutual Fund and Gold Bond.#stockmarkets #stockmarkets #RahulGandhi #BJP #NarendraModi pic.twitter.com/tx6eCcrWrf — House of Stocks~NISM certified (@CommonInsan) April 4, 2024 రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గరున్న ఆభరణాల విలువ రూ.4.2 లక్షలు. రాహుల్ గాంధీ చరాస్తుల మొత్తం విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.11.14 కోట్లు. ఆయన నామినేషన్‌తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అదే సమయంలో సుమారు రూ.49.7 లక్షల అప్పు కూడా ఉంది. -
భార్య కన్నా గడ్కరీ ఆదాయం తక్కువ.. భూములు కూడా లేవు!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఆయన తన ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేశారు. ఆదాయం విషయంలో నితిన్ గడ్కరీ తన భార్య కంచన్ నితిన్ గడ్కరీ కంటే చాలా వెనుకబడివున్నారు. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం నితిన్ గడ్కరీ 2022-23లో రూ. 13,84,550 ఆదాయం సంపాదించారు. ఆయన భార్య కంచన్కు 2022-23లో రూ.40,62,140 ఆదాయం అందుకున్నారు. నితిన్ గడ్కరీ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 32 లక్షల 90 వేల 605. ఆయన భార్య కంచన్ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 24 లక్షల 86 వేల 441. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.95,46,275 విలువైన చరాస్తులు ఉన్నాయి. గడ్కరీ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. వీటిలో అంబాసిడర్ కారు ఒకటి. 1994లో కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.10 వేలు. గడ్కరీ దగ్గర హోండా కంపెనీకి చెందిన కారు ఉంది. దీని ధర 6,75,000. గడ్కరీకి ఎల్సుజు కంపెనీకి చెందిన మరో కారు ఉంది. దాని విలువ రూ.12,55,000. నితిన్ గడ్కరీ భార్య కంచన్ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. అవి రూ.5,25,000 విలువైన ఇన్నోవా, రూ.4,10,000 విలువైన మహీంద్రా కంపెనీ కారు, రూ.7,19,843 విలువైన టాటా కంపెనీ కారు. బంగారం, ఆభరణాల విషయంలో భార్య కంచన్ కంటే నితిన్ గడ్కరీ ముందున్నాడు. నితిన్ గడ్కరీ వద్ద రూ.31,88,409 విలువైన బంగారం లేదా ఆభరణాలు ఉన్నాయి. అదే సమయంలో కంచన్ వద్ద రూ.24,13,348 విలువైన ఆభరణాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే నితిన్ గడ్కరీ పేరు మీద వ్యవసాయ భూమి లేదు. ముంబైలో అతని పేరు మీద ఓ ఇల్లు ఉంది. 960 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర రూ.4.95 కోట్లు. కంచన్కు ఇల్లు, భూమి ఉన్నాయి. వీటి ధర రూ.7 కోట్ల 99 లక్షల 83 వేలు. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.11 కోట్ల 55 లక్షల 11 వేల విలువైన స్థిరాస్తి ఉంది. నితిన్ గడ్కరీకి రూ. ఒక కోటీ 66 లక్షల 82 వేల 750 రుణం, ఆయన భార్య కంచన్కు రూ.38 లక్షల 8 వేల 390 రుణం ఉంది. -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. చెర్రీ ఇవాళ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుమలకు వెళ్లిన చెర్రీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బర్త్ డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ ఆస్తులపై నెట్టింట చర్చ మొదలైంది. రామ్ చరణ్ ఆస్తుల గురించి సినీ ప్రియులతో పాటు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఎంత? నెలకు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. ఓ నివేదిక ప్రకారం మెగా హీరో రామ్ చరణ్‌కు దాదాపు రూ.1370 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్కు ముందు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల పారితోషికం తీసుకునే చెర్రీ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటనకు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు. ప్రస్తుతం నెలకు కేవలం ప్రకటనల ద్వారానే రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. లగ్జరీ హోమ్ రామ్ చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఆధునాతన సౌకర్యాలున్నాయి. ఆ ఇంటి విలువు దాదాపు రూ.38 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంతే కాకుండా రామ్ చరణ్‌కు ముంబయిలోనూ ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్లు మన గ్లోబల్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.4 కోట్ల విలువైన మెర్సిడెజ్‌తో పాటు ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఈ బ్యానర్లో ఖైదీ నెం.150 మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు రామ్ చరణ్‌కు ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్ సంస్థను నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఆస్తులు, వాణిజ్య ప్రకటనలు, బిజినెస్ కలిపితే రామ్ చరణ్ ఆస్తులు రూ.1370 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
రాధిక శరత్‌కుమార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్‌కు సైతం బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్‌కుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విరుధునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం! ఆస్తుల జాబితా వింటే..
చాలామంది టైం బాగోకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఛీ.. కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటాంటారు. ఆ కుక్కలా లైఫ్ ఉంటే బాగుండును అనుకుంటారు. దాని ఆస్తుల వివరాలు, బ్యాంకు బాలెన్స్‌లు వింటే షాకవ్వుతారు. దానికున్న సెక్యూరిటీ, బతుకుతున్న రేంజ్ వింటే వామ్మో అంటారు. ఇప్పుడూ చెప్పబోయే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. దీని పేరు గున్థర్ VI. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. ఇది సుమారు రూ. 500 కోట్ల విలువచేసే విలాసవంతమైన ఇంటిలో ఉంటుంది. అలాగే తిరిగేందుకు బీఎండబ్ల్యూ కార్లు, సరదాగా షికారు చేయడానికి ప్రైవేట్ షిప్ సౌకర్యం తదితరాలు ఉన్నాయి. దీనికి స్వంత ఫుట్‌బాల్ క్లబ్ ఉంది. ఆ కుక్క డబ్బును పర్యవేక్షించేది 66 ఏళ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిజియో మియాన్. కుక్కకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాని బాగోగోలు చూసుకోవడం అతని బాధ్యత. అయితే ఈ కుక్కకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే..? అ కుక్క తాత గున్థర్ III నుంచి ఈ సంపదను వారసత్వంగా పొందాడు. జర్మన్ కౌంటెస్ కార్లోట్టా లీబెన్‌స్టెయిన్ అనే ధనికుడు ఈ గున్థర్ IIIని ప్రేమగా పెంచుకునేవాడు. అయితే ఆ ధనికుడు కొడుకు విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారుసులెవరూ లేకుండా పోయారు. దీంతో లీబెన్‌స్టెయిన్ చనిపోయేంత వరకు ఆ కుక్కనే ప్రేమగా చూసుకునేవాడు. అతను వెళ్తూ వెళ్తూ..దాదాపు రూ. 600 కోట్ల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాసి వెళ్లిపోయాడు. అంతేగాదు ఆ డబ్బును, కుక్కను పర్యవేక్షించేలా ఇటాలియన్ ఫార్మటిస్ట్ మౌరిజియో మియాన్‌కి బాధ్యతలు కూడా అప్పగించాడు. అలా గుంథర్ ట్రస్ట్ ఏర్పడింది. నాడు ఆరు వందల కోట్లగా ఉన్న ఆస్తి కాస్త గున్థర్ VI టైంకి వచ్చేటప్పటికీ దాని విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లకు చేరింది. యజమాని లిబెన్స్టెయిన్ వదలిపెట్టి వెళ్లిన సంపదతో విలాసవంతమైన ఇళ్లు, విల్లాలు, ఓ ప్రైవేట్ ఓడ కొనుగోలు మౌరిజియో మియాన్చేశాడు. అంతేగాదు ఈ కుక్క బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణిస్తుందట. అలాగే ఆ కుక్కుబాగోగులు చూసుకునేందుకు సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడూ చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉండటం విశేషం. అంతేగాదు ఈ గున్థర్ VI తర్వాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఈ గున్థర్ కుక్క వంశానికే చెందుతుందన్నమాట. ఈ గున్థర్ కుక్కలు గోల్డెన్ స్పూన్ బేబి మాదిరి కుక్కలన్నమాట. బిజినెస్ మ్యాగ్జైన్లో ఈ కుక్క గురించి పలు కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై పలు డాక్యుమెంటరీలు కూడా రావడం విశేషం. (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!) -
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. -
సోనియా గాంధీ ఆస్తుల విలువెంతో తెలుసా?
ఢిల్లీ: ఏడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ సారి రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఆమె ప్రకటించారు. ప్రస్తుతం తన వద్ద రూ. 90,000 నగదు ఉందని, తన మొత్తం ఆస్తుల విలువ రూ. 12,53,76,822 (రూ.12.53 కోట్లు)గా పేర్కొన్నారు తనకు రూ.12.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటలీలో తన తండ్రికి చెందిన రూ.27 లక్షల విలువైన ఆస్తిలో వాటా ఉందని, వీటితో పాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నట్లు సోనియా తెలిపారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో మూడు బిగాల వ్యవసాయ భూమి ఉందని, ఎంపీగా వచ్చే వేతనం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలను ఆదాయంగా ఆమె పేర్కొన్నారు. తన వద్ద రూ.90 వేల నగదు ఉందని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తం రూ. 11.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా సొంత కారు కూడా లేదన్న సోనియా.. సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు. ఇదీ చదవండి: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
రూ.250 కోట్లపైనే..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు రూ. 250 కోట్లపైనే ఉంటాయని ఏసీబీ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శివబాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగి సింది. ఆయన ఇంట్లో కొద్ది రోజులుగా జరుపుతున్న సోదాలు ముగిసినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలు వ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్‌తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్‌కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్‌గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సు«దీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్‌ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపా రు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయ న చెప్పలేదు..మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సు«దీంద్ర తెలిపారు. మిగతా అధికారుల్లో టెన్షన్.. హెచ్ఎండీఏలో పనిచేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హెచ్ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా, గతంలో అనుమతులు మంజూరు చేసిన లేఔట్లు, ప్లాట్లకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ పరిశీలించే యోచనలో ఏసీబీ ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైరేజ్ అపార్ట్మెంట్లకు అనుమతుల్లో హెచ్ఎండీఏ అధికారులు భారీగా లంచాలు పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు భారీఎత్తున లాండ్ కన్జర్వేషన్ జరిగిందని, హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పరిధిలోనూ భారీగా భూమారి్పడి జరిగిందని సమాచారం. ఆ రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల విలువైన భూములు చేతులు మారినట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఇందులోని పెద్ద తలకాయల భాగోతాలు బట్టబయలు అవుతాయని తెలుస్తోంది. కాగా ఉప్పల్‌లో శివబాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ సోదరి, ఇద్దరు కొడుకులు హెచ్ఎండీఏలో ఆయన దగ్గరే పనిచేశారు. వీరంతా బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. హెచ్ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు హెచ్ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి. శివబాలకృష్ణపై విచారణలో భా గంగా పలు కీలకమైన ఫైళ్లు ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం ఉదయమే అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కా ర్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. శివబాల కృష్ణ హయాంలో ఇ చ్చి న అనుమతులపైన ప్ర ధానంగా దృష్టి సారించి మూడురోజుల పాటు ఫైళ్లను పరిశీలించినట్టు తెలిసింది. ముఖ్యంగా కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో నిర్మించిన భారీ బహుళ అంతస్తుల భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇ చ్చి నట్టు ఏసీబీ అధికారుల పరిశీలనలో వెల్లడి కావడంతో, ఆ దిశగానే హెచ్ఎండీఏలో సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ రెరాకు బదిలీ అయిన తర్వాత కూడా పలు ఫైళ్ల కు పాత తేదీలపైన అనుమతులు ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. -
ఆస్తుల మానిటైజేషన్ డీలా.. టార్గెట్‌లో రూ.25 లక్షల కోట్ల లోటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లను అందుకోలేకపోవచ్చని తెలుస్తోంది. దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వివరాల ప్రకారం రూ. 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోనున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్రౌన్‌ఫీల్డ్(పాత) మౌలిక సదుపాయాల ఆస్తుల అంచనా విలువ రూ. 6 లక్షల కోట్లు. 2022–2025 మధ్య కాలంలో మానిటైజేషన్‌కు వీలున్న ఆస్తుల అంచనాలివి. కాగా.. ఈ ఏడాది ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 1.5 లక్షల కోట్లు సమీకరించగలమని తాజా ఇంటర్వ్యూలో పాండే తెలియజేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లు, మైనింగ్, రహదారులు, విద్యుత్ రంగంలో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(టీవోటీ) ద్వారా మానిటైజేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలియం రంగంలోనూ ఇకపై మానిటైజేషన్‌కు తెరతీయనున్నట్లు వెల్లడించారు. ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ బడ్జెట్లో ప్రతిబింబించదని, జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్హెచ్ఏఐ) దీనిని నిర్వహిస్తుందని వివరించారు. ఈ నిధులు ప్రభుత్వానికి చేరుతాయని, తద్వారా ఇవి బడ్జెట్లో ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. అయితే చాలా కేసులలో నిధులు సంస్థలకే చెందుతాయని, ప్రభుత్వానికి కాదని తెలియజేశారు. కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో ప్రయివేట్ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వీలుగా ఆస్తుల మానిటైజేషన్‌ను చేపడుతున్నామని, ఇది ప్రభుత్వ విధానమని తెలియజేశారు. తద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధితోపాటు పట్టణ, గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని సమ్మిళితం చేయవచ్చని వివరించారు. వ్యూహాత్మక వాటాల విక్రయంపై దృష్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్ తదితర సంస్థల ప్రైవేటీకరణను పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరే ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో కొత్తగా వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని పరిశీలించకపోవచ్చని స్పష్టం చేశారు. కాకపోతే లిస్టెడ్ ప్రభుత్వరంగ సంస్థల సబ్సిడరీల వాటాల విక్రయం ఉండొచ్చని సంకేతం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ గత మూడేళ్ల కాలంలో 500 శాతం పెరిగి రూ.58 లక్షల కోట్లకు చేరినట్టు పాండే చెప్పారు. భారత ప్రభుత్వం వాటాల విలువ 4 రెట్లు పెరిగి రూ.38 లక్షలకు చేరుకున్నట్టు తెలిపారు. బలమైన పనితీరు, వృద్ధి అవకాశాలు, మూలధన వ్యయాల పునర్నిర్మాణం, స్థిరమైన డివిడెండ్ పంపిణీ విధానం వల్ల ప్రభుత్వరంగ సంస్థల విలువ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ స్టీల్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదనలు అమలు దశలో ఉండడం గమనార్హం. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇవి పూర్తి కావాల్సి ఉండగా, పలు అవాంతరాలతో జాప్యం నెలకొన్నట్టు చెప్పారు. ఇక హిందుస్థాన్ జింక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. దీని విక్రయంపై పాండేకు ప్రశ్న ఎదురైంది. విడతల వారీగా వాటా విక్రయించాలన్న తమ ప్రతిపాదనకు హిందుస్థాన్ జింక్ యాజమాన్యం డీమెర్జర్ ప్రణాళికలతో అనిశ్చితి ఏర్పడినట్టు చెప్పారు. హిందుస్థాన్ జింక్‌ను మూడు వేర్వేరు కంపెనీలుగా డీమెర్జర్ చేసేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.