సీనియర్ శరత్ బాబు ఇటీవలే అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూసిన ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం చెన్నైలో అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రనయనాల అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో నటించారు.
(ఇది చదవండి: ఆ విషయం అందరికీ తెలుసు.. అర్థం కాకపోతే అంతే: మంచు విష్ణు)
నటి రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం లేదు. దీంతో శరత్ బాబు ఆనారోగ్యానికి గురి కావడంతో ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తుల గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ శరత్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయి? వాటిని ఎవరి పేరు మీదనైనా రాశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
వారి పేరు మీదే వీలునామా!
అయితే దీనికి ఆస్తులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఆయన బతికుండగానే ఓ వీలునామా రాశారని తెలిసింది. హైదరాబాద్, చెన్నై , బెంగళూరులో ఆయనకు ఇళ్లు, స్థలాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆస్తిని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల పిల్లల పేర్ల మీద వీలునామా రాశారట శరత్ బాబు. ఆయన మరణం తర్వాత ఈ విషయం బయటపడింది.
సోదరి కన్నీటి పర్యంతం
శరత్ బాబు మరణం తర్వాత ఆయన సోదరి సరిత స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్న మరణాన్ని తలచుకుని ఎంతో బాధపడిన ఆమె.. తనకు తల్లి, తండ్రి మొత్తం శరత్ బాబు అన్నయ్యే అంటూ బోరున విలపించారు. తన కొడుకును చదివించి.. తన కుమార్తె పెళ్లి కూడా చేశారని చెప్పారు. చివరగా తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగుళూరు వచ్చారని.. సోనియాని దత్తత తీసుకుంటానని అన్నయ్య చాలా సార్లు అన్నారని శరత్ బాబు సోదరి తెలిపారు.
(ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్)
శరత్ బాబు ప్రస్థానం
1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శరత్ బాబు జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. కాగా.. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిసారిగా నరేశ్-పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment