ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. జీవితంలో ఒక్కోసారి అకస్మిక ప్రమాదాలు , అదృష్టాలు, అలానే నష్టాలు.. ఇవన్నీ సడన్ సునామీలా మన లైఫ్‌లోకి వచ్చి పలకరిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ యంగ్ బిలియనీర్‌కి భారీ షాక్ తగిలింది. రాత్రికి రాత్రి లక్షల కోట్లు పొయాయి. ఎలా అని అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.. క్రిప్టో కరెన్సీల (Cryptocurrency) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి నియంత్రణలో లేకుండా లావాదేవీలు జరుగుతున్న వ్యవస్థ. అందుకే ఇందులో షాకింగ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా క్రిప్టో ఎక్స్చేంజీ కంపెనీ అయిన FTX ఫౌండర్, సీఈఓ, అయిన సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాత్రికి రాత్రే తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. తన వ్యక్తిగత సంపద ఏకంగా 94 శాతం ఆవిరై ప్రస్తుతం 991.5 బిలియన్ డాలర్లకు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఒక్కరోజులో అత్యధిక సంపద కోల్పోయిన బిలియనీర్‌గా చరిత్రలోకెక్కారు ఈ యంగ్ బిలియనీర్.
క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టిఎక్స్‌ను( Crypto Exchange FTX) తన ప్రత్యర్థి కంపెనీ బినాన్స్( Binanace) కొనుగోలు చేస్తున్నట్లు ఈ యంగ్ బిలియనీర్ ప్రకటించిన తర్వాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సంపద కరిగిపోయింది. కాయిన్‌డెస్క్ ప్రకారం, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ FTX అమ్మకంపై వార్త వెలువడే ముందు $15.2 బిలియన్ల విలువ ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత అతని సంపద నుంచి దాదాపు $14.6 బిలియన్లు తుడిచిపెట్టుకుపోయాయి.
బినాన్స్ హెడ్ చాంగ్‌పెంగ్ జావో ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం అయిన బినాన్స్.. FTXను కొనుగోలు చేయడానికి తమ కంపెనీ ఆసక్తి చూపిస్తుందని, డీల్ కూడా కుదిరిందని తెలిపారు.
చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
Comments
Please login to add a commentAdd a comment