Fortune
-
భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్‌మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలువాల్మార్ట్అమెజాన్స్టేట్గ్రిడ్సౌదీ అరమ్కోసినోపెక్ గ్రూప్చైనా నేషనల్ పెట్రోలియంయాపిల్యూనైటెడ్ హెల్త్గ్రూప్బెర్క్షైర్ హాత్వేసివీఎస్ హెల్త్ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్‌లోని టాప్ కంపెనీలురిలయన్స్ ఇండస్ట్రీస్ఎల్ఐసీఇండియన్ ఆయిల్ఎస్బీఐఓఎన్జీసీభారత్ పెట్రోలియంటాటా మోటార్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ -
పెంపుడు జంతువులకు ఏకంగా రూ 23 కోట్ల ఆస్తిని రాసిన మహిళ!
దిగజారిపోతున్న కుటుంబ విలువలకు అద్దం పెట్టే గాథ ఆ మహిళ కథ!. కడుపున పుట్టిన వాళ్లను కష్టపడి ప్రయోజకులుగా చేస్తే..తీరా వాళ్లు వృద్ధాప్యంలో కన్నెత్తి చూడకపోతే ఆ పెద్దాళ్ల పరిస్థితి కడు దయనీయంగా ఉంటుంది. తమను అప్యాయంగా పిలిచే పిలుపు కానరాక, తామెందుకు బతుకుతున్నాం అనిపించేలా ప్రతి క్షణం ఓ యుగంలా వారిని వేధిస్తున్నప్పుడూ కోపంతో వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఇలానే ఉంటాయి. అలానే ఈ వృద్ధ మహిళ కూడా తట్టుకోలేని ఆవేదనలో తీసుకున్న కఠిన నిర్ణయం ఇది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అందుకు అక్కడ చట్టాలు ఒప్పుకోవు. దీంతో ఆ మహిళ.. అసలేం జరిగిందంటే..చైనాలోని షాంఘైకి చెందిన లియు తన పిల్లలకు ఊహించని రీతీలో గట్టి షాక్ ఇచ్చింది. తన పేరు మీద ఉన్న రూ. 23 కోట్ల ఆస్తిని పెంపుడు జంతువులక పేర రాసేసింది. ఇంతకు మునుపు తన ముగ్గురు పిల్లలకు పంచి ఇస్తున్నట్లుగా వీలునామా రాసి ఉన్నా..దాన్ని సడెన్‌గా మార్చేసింది. ఒక రోజు అనారోగ్యానికి గురయ్యింది లియు. అయితే ఆమెను చూసేందుకు గానీ, ఎలా ఉన్నావు అని ఫోన్లో పలకరించడం గానీ చేయలేదు ఆమె పిల్లలు. దీంతో తన గురించి పట్టించుకోనివాళ్లకు తన ఆస్తితో పని ఏమిట? అన్న కోపంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు చైనా చట్టాలు ఒప్పుకోవు. ఎందుకంటే చైనాలోని జంతువులకు నేరుగా విరాళాలు ఇవ్వడానికి చట్టాలు అంగీకరించవు, అందుకు కొన్ని చట్టపరిమితులు ఉన్నాయి. ఈ మేరకు బీజింగ్‌లోని విల్ రిజిస్ట్రేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారి చెన్ కై ముందుకొచ్చి ఆ మహిళ సమస్యను పరిష్కరించేలా పలు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన వెటర్నీ క్లినిక్‌లోని పెంపుడు జంతువులను సరిగ్గా చూసుకోవడం కోసం ముందుగా తనకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిని నియమించమని ఆ వృద్ధ మహిళకు సూచించారు. అంతేగాదు డబ్బు మొత్తం ఇలా వెటర్నరీ క్లినిక్ చేతిలో పెట్టడం వల్ల జరిగే నష్టాలు ఎదురయ్యే సమస్యలు గురించి కూడా అధికారులు ఆమెకు క్లియర్‌గా వివరించారు. అలాగే భవిష్యత్తులో పిల్లలకు మనుసు మార్చుకుని వస్తే గనుక నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచించి సరైన విధంగా నిర్ణయం తీసుకుందామని ఆమెకు సలహ ఇచ్చారు అధికారులు. ఐతే చైనాలో ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో టేనస్సీలోని ఒక సంపన్న వ్యాపారవేత్త తన పెంపుడు పిల్లులు కోలీ, లులుకు కూడా ఇలానే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని రాసివ్వడం జరిగింది. (చదవండి: నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?) -
న్యూ ఇయర్ రోజున ఇవి తింటే..అదృష్టానికి, డబ్బుకి ఢోకా ఉండదట!
కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఈ న్యూ ఇయర్‌ని తమదైన పద్ధతిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సంతోషకరంగా సాగిపోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే మంచిగా ప్లాన్ చేసుకుంటారు కూడా. అయితే కొత్త ఏడాది రోజున ఇవి తింటే ఏడాదంతా అదృష్టం కలిసొచ్చి సంతోషకరంగా సాగుతుందని కొన్ని దేశాల ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందామా! ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అంతా కలిసి సెలబ్రెట్ చేసుకునేది మాత్రం న్యూ ఇయర్ నాడే. ఈ రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ న్యూ ఇయర్‌ని ప్రారంభిస్తే ఆ ఏడాదంతా బావుండటమే కాకుండా అదృష్టం వస్తుందని కొందరి ప్రగాఢి నమ్మకం. ఇంతకీ మరీ ఈ రోజు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలంటే.. ద్రాక్ష ప్రేమను: స్పెయిన్, లాటిన్ అమెరిక దేశాలలో న్యూఇయర్ రోజున వీటిని తినడం అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా న్యూ ఇయర్ రోజు ద్రాక్ష తింటే ప్రతి నెలా అదృష్ట కలిసొస్తుందని ఒక నమ్మకం కూడా. అంతేగాదు సోషల్ మీడియాలో దాదాపు 12 ద్రాక్ష పండ్లను తింటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలుస్తారనే ట్రెండ్ తెగ నడుస్తోంది కూడా. కాయధాన్యాలు దీర్ఘాయుష్షును: ఈ రోజున పప్పుతో చేసిన రెసిపీలు లేదా సూప్ తినడం మంచిదట. ముఖ్యంగా ఇలా తింటే ఆర్థిక సమృద్ధి పుష్కలంగా ఉంటుందని భావిస్తారు. ఇటలీలో ఎక్కువగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దానిమ్మ పండు సంతానం: గ్రీకు సంప్రదాయంలో దానిమ్మని సంతానోత్పత్తి, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్ రోజున ఇవి తింటే సంతానం, సంపద, అదృష్టం వస్తాయని ఎక్కువమంది నమ్ముతారు. చేపలు తింటే లక్కు: వివిధ సంస్కృతుల్లో చేపలను అదృష్టవంతమైన వాటిగా పరిగణిస్తారు. అవి పురోగతి, సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారట. అందుకే కొన్ని ప్రదేశాల్లో నూతన సంవత్సరం రోజున చేపలు తినడంతో ప్రారంభిస్తారట కూడా. ఆకుకూరలు సంపదలు ఇస్తాయి: యూఎస్ఏలోని అనేక కుటుంబాలు కొల్లార్డ్ గ్రీన్స్ లేదా క్యాబేజీ వంటి ఆకుకూరలను తినడంతో న్యూ ఇయర్ రోజుని ప్రారంభిస్తారు. అలా చేస్తే సంపదలు పెరుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ఆకుపచ్చ రంగును సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆరోజు ఆకుకూరలు తింటే ఆర్థిక సమస్యలనేవే ఉండవనేది వారి విశ్వాసం. నూడుల్స్ అదృష్టాన్ని తెస్తాయి: చైనాలో పొడవైన నూడుల్స్ దీర్ఘాయువును సూచిస్తాయి. అందువల్ల న్యూ ఇయర్ రోజున న్యూడిల్స్ తింటే దీర్ఘాఆయుష్షు ఉంటుందనేది వారి నమ్మకం. చైనా సంస్కృతి ప్రకారం ఆ రోజు ఇవి తింటే అదృష్టం వస్తుందని చెబుతారు. కేక్ లేదా డోనట్స్: గుండ్రని ఆకారంలో మధ్యలో చిల్లు ఉండే ఇవి తింటే సంవత్సరాంతం బాగుటుందని, లక్ కలిసోస్తుందని కొందరూ భావిస్తారు. (చదవండి: 'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్! వీడియో వైరల్) -
ఆరోజు నాకు ఎవరూ జాబ్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నేనే ఉపాధి కల్పిస్తున్నా
ఒకప్పుడు ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఆయనే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వైకల్యం శరీరానికే తప్ప కష్టపడే తత్వానికి కాదని నిరూపిస్తున్నారు 31 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త సుమిత్ అగర్వాల్. తాజాగా హైదరాబాద్‌లో ఫార్చ్యూన్ అకాడమీ నిర్వహించిన లెగసీ బిల్డింగ్ లైవ్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాను. పుట్టినప్పటి నుంచే నాకు సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి ఉంది. ఓ జ్యోతిష్యుడు నేను 33 ఏళ్లకు మించి బతకనని మా తల్లిదండ్రులకు చెప్పాడు. విచిత్రం ఏంటంటే.. అతను ఇప్పుడు బతికి లేడు. కానీ నేను మీ ముందు ఉన్నాను. వైకల్యంతో ఏం సాధిస్తావ్ అన్నవాళ్లకు దేశంలోనే MBAలో అగ్రస్థానంలో నిలిచి సమాధానం ఇచ్చాను. చాలామంది నువ్వు ఏం చేస్తావ్, ఏమీ చేయలేవు అని విమర్శిస్తారు. కానీ వాళ్లకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నేను చేసి చూపిస్తాను. మీకు వీలైతే నన్ను ఆపండి. ఒకప్పుడు నా వైకల్యం వల్ల నాతో ఆడుకోవడానికి కూడా ఎవరూ వచ్చే వాళ్లు కాదు. దీంతో నా జీవితంలో నాకు ఫ్రెండ్స్ లేకుండా పోయారు. విద్యార్హత ఉన్నా జాబ్ ఇచ్చేవాళ్లు కాదు, కానీ ఇప్పుడు నేనే సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్నాను. సుమారు 500 మంది వికలాంగులకు ఉద్యోగం వచ్చేలా సహాయం చేశాను. గట్టిగా తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. సక్సెస్ అదే వస్తుంది. నాకు ఇప్పటివరకు నాలుగు శస్త్రచికిత్సలు జరిగాయి. దాదాపు 70% ఎలాంటి కదలికలు ఉండవు. ఇప్పటికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అయినా అధైర్యపడకుండా అడుగు ముందుకు వేస్తున్నా.సరైన పేరెంటింగ్ నా జీవితాన్ని కాపాడింది అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా బిజినెస్‌లో మెలకులు నేర్పించి మంచి ఆదాయ మార్గాలను అందించే లక్ష్యంగా ఫార్చ్యూన్ అకాడమీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
భారత కంపెనీల్లో టాప్ ర్యాంకర్‌గా రిలయన్స్
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500, 2023 జాబితాలో మెరుగైన స్థానాన్ని సంపాదించింది. 16 స్థానాలు మెరుగుపడి 88వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2022 జాబితాలో రిలయన్స్ స్థానం 104గా ఉండడం గమనించొచ్చు. భారత కంపెనీల్లో టాప్ ర్యాంకర్‌గా రిలయన్స్ నిలిచింది. 2021 నుంచి చూస్తే రిలయన్స్ అంతర్జాతీయంగా తన ర్యాంక్‌ని గణనీయంగా పెంచుకుంది. 2021లో రిలయన్స్ స్థానం 155గా ఉంది. ఇక ఈ ఏడాది ఫార్చూన్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 94వ స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాదితో పోలిస్తే 48 మెట్లు పైకెక్కింది. ఎల్ఐసీ 9 స్థానాలు దిగజారి 107వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఓఎన్జీసీ 158, బీపీసీఎల్ 233, ఎస్బీఐ 235 ర్యాంకులు దక్కించుకున్నాయి. టాటా మోటార్స్ ర్యాంక్ 33 స్థానాలు మెరుగుపడి 337కు చేరింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 84 స్థానాలు ముందుకు వచ్చి 353 ర్యాంకును సొంతం చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవడం 20వ ఏడాది కావడం గమనార్హం. -
Hyderabad: హైటెక్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయమైన హైటె క్ సిటీ సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలోని ఓ మార్కెటింగ్ కంపెనీలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న రోహిణి లేఅవుట్లోని ఓ భవనం మూడో అంతస్తులో మూవింగ్ నీడిల్ అనే మార్కెటింగ్ కంపెనీ ఉంది. ఆపైఅంతస్తులో ఇదే కంపెనీకి చెందిన క్యాంటీన్, కెఫెటేరియాను నిర్వహిస్తున్నారు. అయితే శనివారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్లో మంటలు చెలరేగాయి. అదిచూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్యాంటీన్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించిందని, ఫరీ్నచర్ పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో ఉద్యోగులెవరూ లేరని, ప్రాణనష్టం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!) -
రికార్డ్ల రారాజు, ఎలాన్ మస్క్ ఖాతాలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్!
ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ సరికొత్త చెత్త రికార్డ్లను క్రియేట్ చేశారు. సుదీర్ఘ కాలంగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వారిలో ఒకరిగా నిలిచి గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..2000 సంవత్సరం తర్వాత ప్రపంచ చరిత్రలో రెండో సారి అత్యధిక సంపదను కోల్పోయిన వారిలో మస్క్ ఒకరు. నవంబర్ 2021 నుంచి 182 బిలియన్ డాలర్ల సంపద కరిగింది. మరికొన్ని నివేదికలు ఆ మొత్తం 200 బిలియన్ డాలర్లు ఉన్నట్లు హైలెట్ చేస్తున్నాయి. అయితే మస్క్ ఎంత మొత్తం వెల్త్ నష్టపోయారనేది నిర్ధారించడం కష్టంగా ఉన్నా..గత రికార్డులను తిరగరాశారు. 2000 సంవత్సరంలో జపాన్ టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ 58.6 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు మస్క్ ఏకంగా 182 బిలియన్ డాలర్లను లాస్ అయ్యారని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తెలిపింది. ది హిల్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నెట్ వర్త్ నవంబర్ 2021 నుంచి జనవరి 2023 వరకు 320 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సంపద 137 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనంతటికి కారణం టెస్లా షేర్లు నిరాశపరచడమేనని తెలుస్తోంది. ట్విటర్ ముంచింది? మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు 7 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను భారీ ఎత్తున అమ్మేశారు. నవంబర్ నెలలో 4 బిలియన్ డాలర్లు,డిసెంబర్ నెలలో మరో 3.58 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించాడు. అలా గతేడాది ఏప్రిల్ నుండి 23 బిలియన్ల విలువైన టెస్లా స్టాక్స్‌ను సేల్ చేశారు. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయారు. ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ 190 బిలియన్ల నికర విలువతో ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. పునాదులు కదిలాయా? ట్విటర్ కొనుగోలుతో మస్క్ వ్యాపార సామ్రాజ్యపు పునాదులు కదిలిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022 అక్టోబర్ నెలలో 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ వ్యాపార రంగంలో ప్రాభవం తగ్గుతూ వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మస్క్‌ను తక్కువ అంచనా వేయొద్దు ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మసయోషి సన్ నికర విలువ ఫిబ్రవరి 2000లో గరిష్టంగా 78 బిలియన్ల నుండి అదే సంవత్సరం జూలైలో 19.4 బిలియన్లకు క్షీణించిందని, అతని కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ విలువ డాట్ కామ్ క్రాష్ అవ్వడంతో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. కానీ ఎలాన్ మస్క్ ట్విటర్ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో బౌన్స్ బ్యాక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, ఎందుకంటే అక్కడ ఉంది ఎలాన్ మస్క్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. -
చరిత్రకెక్కిన యంగ్ సీఈఓ.. రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి, 94 శాతం సంపద కరిగిపాయే!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. జీవితంలో ఒక్కోసారి అకస్మిక ప్రమాదాలు , అదృష్టాలు, అలానే నష్టాలు.. ఇవన్నీ సడన్ సునామీలా మన లైఫ్‌లోకి వచ్చి పలకరిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ యంగ్ బిలియనీర్‌కి భారీ షాక్ తగిలింది. రాత్రికి రాత్రి లక్షల కోట్లు పొయాయి. ఎలా అని అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.. క్రిప్టో కరెన్సీల (Cryptocurrency) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి నియంత్రణలో లేకుండా లావాదేవీలు జరుగుతున్న వ్యవస్థ. అందుకే ఇందులో షాకింగ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా క్రిప్టో ఎక్స్చేంజీ కంపెనీ అయిన FTX ఫౌండర్, సీఈఓ, అయిన సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాత్రికి రాత్రే తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. తన వ్యక్తిగత సంపద ఏకంగా 94 శాతం ఆవిరై ప్రస్తుతం 991.5 బిలియన్ డాలర్లకు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఒక్కరోజులో అత్యధిక సంపద కోల్పోయిన బిలియనీర్‌గా చరిత్రలోకెక్కారు ఈ యంగ్ బిలియనీర్. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టిఎక్స్‌ను( Crypto Exchange FTX) తన ప్రత్యర్థి కంపెనీ బినాన్స్( Binanace) కొనుగోలు చేస్తున్నట్లు ఈ యంగ్ బిలియనీర్ ప్రకటించిన తర్వాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సంపద కరిగిపోయింది. కాయిన్‌డెస్క్ ప్రకారం, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ FTX అమ్మకంపై వార్త వెలువడే ముందు $15.2 బిలియన్ల విలువ ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత అతని సంపద నుంచి దాదాపు $14.6 బిలియన్లు తుడిచిపెట్టుకుపోయాయి. బినాన్స్ హెడ్ చాంగ్‌పెంగ్ జావో ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం అయిన బినాన్స్.. FTXను కొనుగోలు చేయడానికి తమ కంపెనీ ఆసక్తి చూపిస్తుందని, డీల్ కూడా కుదిరిందని తెలిపారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?
సాక్షి,ముంబై: ఫార్చ్యూన్ ప్రచురించిన 2022 గ్లోబల్-500 ర్యాంకింగ్స్‌లో బీమారంగ సంస్థ ఎల్ఐసీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా నాలుగు ప్రైవేటు రంగానికి చెందినవి. ప్రైవేటు రంగంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ప్రత్యేకతను చాటుకుంది. (Edible Oil: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!) వరుసగా 19వ సంవత్సరం కూడా తాజా గ్లోబల్ 500 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకోవడమేకాదు తన ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకుంది రిలయన్స్. ఈ జాబితాలో భారతదేశపు అత్యున్నత ర్యాంక్‌సాధించిన ప్రైవేట్ రంగ సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఈ ఏడాది 51 స్థానాలు మెరుగుపడి 104వ స్థానానికి చేరుకుంది. 2021 ఏడాదిలో ఈ జాబితాలో రిలయన్స్ ర్యాంక్ 155 మాత్రమే. అయితే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లో నిలిచిన ప్రైవేట్ రంగ కంపెనీలు టాటా మోటార్స్, టాట్ స్టీల్ ,రాజేష్ ఎక్స్‌పోర్ట్స్. కాగా గత ఏడాది ఐపీవోకు వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏకైక ప్రభుత్వరంగ సంస్థ మాత్రమే కావడం విశేషం. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ను అధిగమించి మరీ 98వ స్థానంతో అగ్రస్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 142వ స్థానంలో ఉంది. ఐవోసీఎల్ భారతీయ కంపెనీలలో మూడో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. ఓఎన్జీసీ 190వ స్థానంతో భారతీయ కంపెనీలలో నాల్గవ స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 236వ స్థానం, భారత్ పెట్రోలియం 295వ స్థానంలో ఉన్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో మార్చి 31, 2022 లేదా అంతకు ముందు ముగిసిన సంబంధిత ఆర్థిక సంవత్సరాల్లోని మొత్తం రాబడుల ఆధారంగా కంపెనీలకు ర్యాంక్‌లను కేటాయిస్తుంది. (ఇదీ చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) -
అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!
Lic Stands Fortune 500 List: ఇటీవలే లిస్టయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకుంది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్ డాలర్ల లాభంతో 98వ స్థానంలో నిల్చింది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.98 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.15 బిలియన్ డాలర్ల లాభాలతో ఏకంగా 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్ గత 19 ఏళ్లుగా ఈ లిస్టులో కొనసాగుతోంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు (అయిదు ప్రభుత్వ రంగంలోనివి, నాలుగు ప్రైవేట్ రంగంలోనివి) చోటు దక్కించుకున్నాయి. దేశీ కార్పొరేట్లలో రిలయన్స్ కన్నా పైస్థాయిలో ఉన్నది ఎల్ఐసీ మాత్రమే. ఫార్చూన్ 500లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 28 స్థానాలు ఎగబాకి 142వ ర్యాంకు, ఓఎన్జీసీ 16 ర్యాంకులు దాటి 190వ స్థానంలో ఉన్నాయి. ఎస్బీఐ 17 స్థానాలు (236వ ర్యాంకునకు), బీపీసీఎల్ 19 ర్యాంకులు (295వ స్థానానికి) పెరిగాయి. టాటా మోటార్స్ 370, టాటా స్టీల్ 435, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 437 ర్యాంకుల్లో నిల్చాయి. (ఇది కూడా చదవండి: ఏడో రోజూ లాభాల రింగింగ్, ఐటీ జోరు) మరిన్ని విశేషాలు.. ► వరుసగా తొమ్మిదోసారి అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నంబర్ వన్ స్థానంలో నిల్చింది. అమెజాన్, చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం, సైనోపెక్ వరుసగా ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. ► జాబితాలోని కంపెనీల మొత్తం అమ్మకాలు 19 శాతం పెరిగి 37.8 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ► తొలిసారిగా గ్రేటర్ చైనా (తైవాన్‌తో కలిపి) సంస్థల ఆదాయాలు.. అమెరికన్ కంపెనీలను మించాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! -
నిరుపేదల డాక్టరమ్మ.. ఈ అపర్ణ
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డాక్టర్ అపర్ణకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది 25 ఏళ్ల గర్భిణి అరుణకు ప్రసవం చేయడానికి వెంటనే రావాలని. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు అపర్ణ. కానీ అప్పటికే గర్భంలో ఉన్న శిశువు మరణించింది. కనీసం తల్లినైనా కాపాడాలనుకున్నారామె. కానీ మూడు రోజుల తరవాత తల్లి కూడా మరణించింది. ఈ దుర్ఘటనను అపర్ణ మర్చిపోలేకపోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఉద్దేశ్యంతో ఆమె ‘ఆర్మాన్’ పేరిట 2008లో ఎన్జీవోను స్థాపించారు. నిరుపేద, అణగారిన వర్గాలకు చెందిన గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా... దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఆధారిత వైద్యాన్ని ఆర్మాన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఎన్జీవోలతో కలిసి ఆర్మాన్ అనేక సేవలందించింది. ఆర్మాన్ కృషిని గుర్తించిన ఫార్చ్యూన్ సంస్థ.. తాజాగా ఈ ఏడాది ప్రకటించిన ‘వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్’ జాబితాలో డాక్టర్ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. ప్రతిష్టాత్మక ఫార్చ్యున్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కగా.. వారిలో ఒకరైన డాక్టర్ అపర్ణ హెగ్డే 15వ స్థానంలో నిలిచారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, క్లీవ్స్లాండ్ క్లినిక్‌లో చదువుకున్న డాక్టర్ అపర్ణ హెగ్డేకు అంతర్జాతీయ యూరో గైనకాలజిస్టుగా మంచి పేరుంది. ఆర్మాన్ ఎన్జీవో వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ మరోపక్క ముంబైలోని కామా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. దాదాపు రెండున్నర కోట్లమందికి.. ఆర్మాన్.. లెవరేజ్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో తల్లి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపుతుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో పనిచేస్తూ.. మొబైల్ ఆధారిత ‘మెటర్నల్ మెస్సేజింగ్ ప్రోగ్రామ్(కిల్కరీ), ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు ట్రైనింగ్ ఇచ్చేందుకు మొబైల్ అకాడమీని నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో దాదాపు 2.40 కోట్ల మంది మహిళలు పిల్లలు, 17 వేల మంది ఫ్రంట్‌లైన్ హెల్త్ కార్యకర్తలకు అర్మాన్ సేవలందించింది. ఆర్మాన్ సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటీష్ మెడికల్ జర్నల్, జీఎస్కే సేవ్ ది చిల్డ్రన్ వంటి సంస్థలు అవార్డులతో సత్కరించాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 700 సంస్థలు ప్రతిష్టాత్మక ‘స్కోల్’ అవార్డుకు పోటీపడగా.. ఆసియా నుంచి ఆర్మాన్ ఈ అవార్డును దక్కించుకుంది. లాక్‌డౌన్‌లోనూ.. ‘ద ప్యాన్ ఇండియా ఫ్రీ వర్చువల్ ఓపీడి క్లినిక్‌ల ద్వారా 14వేలకు పైగా గర్భిణులు, పిల్లలకు ఉచితంగా వైద్యసాయం చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్రీ కాల్ సెంటర్ ద్వారా 60 వేలమందికి పైగా గర్భిణులు, పిల్లలకు సేవల్ని అందించారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే మూడు లక్షలమంది మహిళలకు వారం వారం ‘ఆటోమేటెడ్ వాయిస్ కాల్స్’ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఫోన్‌కాల్స్, ఎస్ఎమ్ఎస్ సదుపాయాలతో లక్షలాది మంది గర్భిణులకు చేరువైంది. ఆర్మాన్ తరపున వర్చువల్ వైద్య సేవలు, వీడియోకాల్స్ ద్వారా అపర్ణతోపాటు మరికొందరు డాక్టర్లు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. -
నా అదృష్టం...గర్వంగా ఉంది : నిర్మలా సీతారామన్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురువారం ఆమె కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్‌ను స్వీకరించారు. అనంతరం సీతారామన్ మాట్లాడుతూ భారతదేశంలో ఉండటం తన అదృష్టం ఇందుకు తనకు గర్వంగా ఉందంటూ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు టీకా వేసిన నర్స్ రమ్యకు థ్యాంక్స్ చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరసమైన ధరలో టీకా లభిస్తున్న దేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ ట్వీట్ చేశారు. (పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న ఢిల్లీ సీఎం) కాగా దేశంలో ప్రస్తుతం రెండో దశ వ్యా క్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 60 ఏళ్లుదాటినవారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలు కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రంగాల దిగ్గజాలు టీకాను వేయించుకున్నారు. Got my first dose of the vaccination against COVID-19 this morning. Thanking sister Ramya PC, for her care and professionalism. Fortunate to be in India, where development and dissemination has been prompt and affordable. #vaccinated pic.twitter.com/4ejylZdv1U — Nirmala Sitharaman (@nsitharaman) March 4, 2021 -
ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’
సాక్షి, ముంబై: ప్రస్తుత టెక్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేశారు. వ్యంగ్య బాణాలు, మీమ్స్‌తో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనవరి 3 న తేలికపాటి గుండెపోటుకు గురైన తరువాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎండార్స్ చేసిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనపై యూజర్లు భారీగా ట్రోల్ చేశారు. ఇది నిజంగా హెల్దీ అయిలేనా? అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా దాదా.. గెట్ వెల్ సూన్ అంటూ.. గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌పై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు. క్రీడాకారుడైన గంగూలీ రోజూ వ్యాయామం చేస్తారు. ఫిట్‌గా ఉంటారు...అయినా గుండెపోటుకు గురయ్యారు. గంగూలీ యాడ్‌లో చెప్పినట్టుగా ఆ ఆయిల్ నిజంగా ఆరోగ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. ఒత్తిడే ప్రధాన కారణం కావచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండాలి.. గాడ్ బ్లెస్’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు: దీంతో గంగూలీ నటించిన సదరు ప్రకటనను అన్ని ప్లాట్‌ఫాంనుంచి తొలగించడం గమనార్హం. ‘దాదా బోలే వెల్కం టూ ది ఫార్టీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె యాడ్ వస్తుంది. ఈ ప్రకటన ఏప్రిల్ 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయం నుంచి వివిధ ఛానళ్ల సమయంలో ప్లే అవుతోంది. అంటే 40ల ఏళ్ల వయసులో కూడా తమ నూనె గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అనేది ఈ ప్రకటన సారాంశం. అయితే తాజాగా గంగూలీకి గుండెపోటు రావడం, గుండెలో రెండు బ్లాక్ ఉన్నాయని తేలడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ నూనె ప్రామాణికతపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని, బ్రాండ్ క్రియేటివ్ ఫార్చ్యూన్ క్రియేటివ్ ఏజెన్సీ ఓగిల్వి & మాథర్ ప్రతినిధి తెలిపారు. అటు కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సంస్థ వేగిరమే తగిన చర్యలు చేపట్టాలని యాడ్ ఏజెన్సీ నిపుణులు భావిస్తున్నారు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఛాతీ నొప్పితో( జనవరి 2 న) పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. మూడు కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. యాంజియోప్లాస్టీ అనంతరం, గూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు( బుధవారం) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 Seen many tweets on the irony in Sourav Ganguly endorsing Fortune RiceBran Oil. Got to realise it’s the risk one takes in any endorsement. It isn’t that Ganguly lived an unhealthy lifestyle. Importantly, sportsmen with a 10-15 year playing life need to keep the earnings coming in — Lloyd Mathias (@LloydMathias) January 3, 2021 Now you know .. #Fortune does not work .. @SGanguly99 dada get well soon pic.twitter.com/tawBK0Uv5Q — Jaspal Singh (@JaspalSinghSays) January 3, 2021 Dada @SGanguly99 get well soon. Always promote tested and tried products. Be Self conscious and careful. God bless.#SouravGanguly pic.twitter.com/pB9oUtTh0r — Kirti Azad (@KirtiAzaad) January 3, 2021 -
ఫార్చ్యూన్ 40లో అంబానీ ట్విన్స్
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత అతని సంతానం కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ (29) అరుదైన ఘనత సాధించారు. 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ′40 అండర్-40′ లో రిలయన్స్ చైర్మన్ బిలియనీర్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ట్విన్స్ 28 ఏళ్ల ఇషా, ఆకాష్ నిలిచారు. టెక్నాలజీ జాబితాలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పేర్లను పొందుపరిచింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సవాళ్లను ఈ యువ ఎగ్జిక్యూటివ్‌లు సమర్థంగా ఎదుర్కొన్నారని పేర్కొంది. సోదరుడు అనంత్, (25) తో కలిసి తమ తండ్రి సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారని ఫార్చ్యూన్ మేగజీన్ ప్రశంసించింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన ఫార్మా దిగ్గజం,ప్రపంచంలోని అతిపెద్ద టీకాల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా భారతదేశపు ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ బైజు సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ (39), ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లలోపు ప్రభావవంతమైన ఫార్చ్యూన్ వార్షిక జాబితాలో నిలిచారు. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ప్రభుత్వ, రాజకీయాలు, మీడియా, వినోదం అనే ఐదు విభాగాలలో 40మంది ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించి ఈ వార్షిక జాబితాను రూపొందిస్తుంది. -
హోటల్లో అగ్ని ప్రమాదం
-
అగ్ని ప్రమాదం.. 25 మంది సురక్షితం..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ప్రముఖ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్ సమీపంలో ఫార్చ్యూన్ హోటల్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ భవనంలోని 1 నుంచి 3 వ అంతస్తు వరకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. (ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం) మొత్తం 8 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. అయితే హోటల్లో చిక్కుకున్న 25 మంది వైద్యులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చామని, వీరందరిని మరో హోటల్‌కు తరలించామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. కాగా షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింటుందని అధికారులు భావిస్తున్నారు. (బోరుబావిలో పడిన బాలుడి మృతి ) -
టెక్నో పెయింట్స్ మరో తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఫార్చూన్ పెయింట్స్ (టెక్నో పెయింట్స్) మరో తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్లాంట్, ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫార్చూన్ గ్రూప్ ఎండీ ఆకూరి శ్రీనివాస రెడ్డి చెప్పారు. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తామని, ఇందులో 50 మంది ఉద్యోగులుంటారని తెలియజేశారు. ఏపీఎస్ రీసెర్చ్ అండ్ మీడియా ఇంటర్నేషనల్ సంస్థ 2019వ సంవత్సరానికి ఫార్చూన్ పెయింట్స్‌కు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగంలో క్వాలిటీ మ్యానుఫాక్చరింగ్ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 20 వేల మెట్రిక్ టన్నులు.. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో రెండు, గుంటూరులోని నడికుడిలో మరో తయారీ కేంద్రం ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నులు. ‘‘ఇప్పటివరకు రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాల నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకొని, పెయింట్స్, సొల్యూషన్స్‌ను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రానైట్ టెక్స్చర్, మార్బుల్ ఫినిష్ పెయింటింగ్‌ల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాం’’ అని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రూ.100 కోట్ల టర్నోవర్..: ఫార్చూన్ గ్రూప్‌నకు ఫార్చూన్ పెయింట్స్, ఫినెట్రీ యూపీవీసీ, ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, టెక్నో ట్రేడర్స్ కంపెనీలున్నాయి. తమ గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్ నమోదు చేసిందని, దీన్లో పెయింట్ల విభాగానిది రూ.70 కోట్లని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ‘‘మా ఆదాయంలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 600కు పైగా ప్రాజెక్ట్‌లకు పెయింటింగ్‌ను పూర్తి చేశాం. మై హోమ్, అపర్ణా, శోభ, పూర్వాంకర వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ మా క్లయింట్లే. ఇటీవలే అమరావతిలో కార్యాలయాన్ని ప్రారంభించాం’’ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఫార్చూన్ 40లో నలుగురు భారతీయులు
న్యూయార్క్: పిన్న వయస్సులోనే వ్యాపార రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న 40 మంది ప్రముఖుల జాబితాలో భారత సంతతికి చెందిన వారు నలుగురు చోటు దక్కించుకున్నారు. 40 ఏళ్ల లోపు వయస్సు గల 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ‘40 అండర్ 40’ లిస్టులో జనరల్ మోటార్స్ సీఎఫ్‌వో దివ్య సూర్యదేవర (4వ స్థానం), విమియో సీఈవో అంజలీ సూద్ (14), రాబిన్‌హుడ్ సహవ్యవస్థాపకుడు బైజూ భట్ (24), ఫిమేల్ ఫౌండర్స్ ఫండ్ వ్యవస్థాపక భాగస్వామి అను దుగ్గల్ (32వ స్థానం) ఉన్నారు. ఈ జాబితాలో ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్‌స్ట్రామ్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిల్చారు. జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఎఫ్‌వోగా దివ్య సూర్యదేవర చరిత్ర సృష్టించారని ఫార్చూన్ పేర్కొంది. ఫార్చూన్ 500 కంపెనీల్లోని కేవలం రెండు కంపెనీల్లో మాత్రమే మహిళా సీఈవో, సీఎఫ్‌వోలు ఉన్నారని వివరించింది. ఈసారి ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల ముఖచిత్రాన్ని మారుస్తున్న యువ సూపర్‌స్టార్స్‌తో అనుబంధ లిస్టును కూడా ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించింది. ‘లెడ్జర్ 40 అండర్ 40’లో కరెన్సీ ఎక్సే్చంజ్ రిపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ బిర్లా, డిజిటల్ కరెన్సీ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్ సీటీవో బాలాజీ శ్రీనివాసన్, ఎంఐటీ డిజిటల్ కరెన్సీ ఇనీషియేటివ్ డైరెక్టర్ నేహా నరులా, కాయిన్‌బేస్ వైస్ ప్రెసిడెంట్ టీనా భట్నాగర్ ఉన్నారు. -
‘నారీ’ శక్తి వీరిదే!!
న్యూయార్క్: ఔను! స్త్రీలు శక్తివంతులే. ఆ రంగం ఈ రంగం అంటూ లేకుండా అన్ని చోట్లా వారి హవా కనిపిస్తోందిపుడు. వ్యాపార విభాగంలోనూ పవర్ఫుల్ మహిళలు అవతరిస్తున్నారు. ఫార్చ్యూన్ తాజా గా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. ఇద్దరూ బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో నిలవగా... జీఎస్కే సీఈవో ఎమ్మా వాల్మ్స్లే రెండో స్థానంలో, ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్ మూడో స్థానంలో నిలిచారు. ‘ఎనిమిదేళ్లుగా భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐకి చందా కొచర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈమె సారథ్యంలో బ్యాంక్ మంచి వృద్ధి బాటలో పయనిస్తోంది’ అని ఫార్చ్యూన్ పేర్కొంది. ‘భారత్‌లోని మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా శిఖా శర్మ రెండోమారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె డిజిటల్ సర్వీసులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు’ అని తెలిపింది. మరొక జాబితాలో ఇంద్రా నూయి ఫార్చ్యూన్.. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల పేరిట మరో జాబితాను ప్రకటించింది. దీన్లో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జనరల్ మోటార్స్ చైర్మన్, సీఈవో మేరి బర్రా టాప్‌లో ఉన్నారు. లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో మారిల్లిన్ హేవ్సన్ మూడో స్థానంలో నిలిచారు.a -
అరుంధతీ భట్టాచార్య.. ద లీడర్
ఫార్చ్యూన్ టాప్–50లో స్థానం న్యూయార్క్: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యకు అరుదైన గౌవరం లభించింది. ఫార్చ్యూన్ ‘ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల’ జాబితాలో ఈమె 26వ స్థానంలో నిలిచారు. ఈమెతో పాటు భారతీయ సంతతికి చెందిన లాస్ట్‌మైల్‌హెల్త్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్ పంజాబి కూడా జాబితాలో ఉన్నారు. ఈయన 28వ స్థానంలో నిలిచారు. ఇక జాబితాలో షికాగో కబ్స్ బేస్‌బాల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ థియో ఎప్స్టీన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన తర్వాతి స్థానంలో వరుసగా అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా.. పోప్ ఫ్రాన్సిస్.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కొ–చైర్మన్ మిలిందా గేట్స్.. అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ నిలిచారు. ఎస్బీఐకు సంబంధించి డీమోనిటైజేషన్, మొండిబకాయిలు వంటి పలు సమస్యలను ఎదుర్కోవడంలో భట్టాచార్య కీలకపాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది. బ్యాంక్‌ను డిజిటలైజేషన్ దిశగా నడిపిస్తున్నారని కితాబునిచ్చింది. ఇక నాన్–ఫ్రాఫిట్ సంస్థ అయిన లాస్ట్‌మైల్‌హెల్త్ 2014లో లైబీరియాలో ఎబోలా వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసిందని పేర్కొంది. కాగా జాబితాలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫెడరల్ రిజర్వు చీఫ్ జానెట్ యెలెన్ వంటి పలువురు ప్రముఖులు స్థానం పొందారు. -
ఆపిల్ టాప్.. శాంసంగ్ ఔట్
టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఫార్చ్యూన్ వరల్డ్ మోస్ట్ ఎడ్మైర్డ్ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా పది ఏడాది తన హవా చాటింది. సెకెండ్ ప్లేస్‌లో అమెజాన్ నిలవగా, మూడవ స్థానాన్ని స్టార్ బక్స్ దక్కించుకుంది. అయితే సౌత్‌కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ఈ జాబితాలో చోటును కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించబడే సంస్థల వార్షిక జాబితాను ఫార్చ్యూన్ ప్రకటించింది. ఇందులో ఆపిల్ వరుసగా పదవ సంవత్సరం టాప్ లో నిలిచింది. గత సంవత్సరం మూడో స్థానంలో అమెజాన్ మరో స్థానం ఎగబాకి సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. మరోవైపు గూగుల్ కు చెందిన అల్ఫాబెట్ గత ఏడాది సాధించిన రెండవ స్థానం నుంచి దిగజారి 6వ స్థానంలోకి పడిపోయింది. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఈ ర్యాంకింగ్‌లో భారీ పురోగతి సాధించాయి. ఫేస్బుక్ 14వ ర్యాంక్ నుంచి ఎగిసి 8వ, మైక్రోసాఫ్ట్ 17వ స్థానం నుంచి ఎగబాకి 9వ ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే గత ఏడాది 35వ ప్లేస్‌లో ఉన్న శాంసంగ్ ఏడాది అసలు జాబితాలొ లేకుండా పోయింది. గత సంవత్సరం గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణంగా ఇబ్బందుల్లో పడ్డ సంస్థ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలాగే దక్షిణ కొరియా కుంభకోణంలో చిక్కుకుని శాంసంగ్ ప్రతినిధి అరెస్ట్ కావడం కంపెనీకి భారీ షాక్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పరిశ్రమకు చెందిన దాదాపు 3,800 మంది ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు, ఎనలిస్టులు, ఇతర మేధావులునుంచి సేకరించిన డాటా ఆధారంగా ఫార్చ్యూన్, భాగస్వామి కార్న్ ఫెర్రీ హే గ్రూపు తో కలిసి ఈ సర్వే నిర్వహించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 డేటాబేస్ కోసం 10 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఉన్న అమెరికా, అమెరికాయేతర 1,000 సంస్థలను పరిశీలించినట్టు ఫార్చ్యూన్ ప్రకటించింది. -
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు..భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే, ప్రైవేట్ రంగ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ప్రైవేట్ రంగంలోనే చాలా వేగంగా వృద్ధి చెందుతోన్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో నిలిచారు. కాగా, అరుంధతీ భట్టాచార్య మొండి బకాయిల సమస్యకు పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియలో ఈమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. విలీనం అనంతరం ఎస్బీఐ ఆసియాలో ఒక అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది. భట్టాచార్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించే అవకాశముందని అభిప్రాయపడింది. రఘురామ్ రాజన్ పదవీ విరమణ తర్వాత భట్టాచార్య ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతుందని అప్పట్లో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, బ్యాంకు డిజిటలైజేషన్‌కు విశేష కృషి చేస్తున్నారని కొనియాడింది. ఇక యాక్సిస్ బ్యాంక్ వృద్ధిలో శిఖా శర్మ పాత్ర అనిర్వచనీయమని ఫార్చ్యూన్ తెలిపింది. -
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళ ఇంద్రా నూయి
51 మందిలో రెండో ర్యాంక్ న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన ‘ప్రపంచపు 51 అతిశక్తివంతమైన మహిళల’ జాబితాలో పెప్సికో సీఈవో, చైర్మన్ ఇంద్రా నూయి స్థానం పొందారు. భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక మహిళగా ఇంద్రా నూయి నిలిచారు. ఈమె రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అగ్రస్థానంలో జనరల్ మోటార్స్ సీఈవో, చైర్మన్ మేరీ బర్రా ఉన్నారు. గతేడాది కూడా ఇంద్రా నూయి రెండవ స్థానంలోనే ఉండటం విశేషం. ఇక 2014లో మూడవ స్థానంలో ఉన్నారు. గడచిన ఏడాది కాలంలో పెప్సికో మార్కెట్ క్యాపిటల్ 18 శాతం పెరుగుదలతో 155 బిలియన్ డాలర్లకి ఎగిసిందని ఫార్చ్యూన్ పేర్కొంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల కారణంగా కంపెనీకి గతేడాది లాభాలు తగ్గినా కూడా మార్కెట్ క్యాపిటల్ పెరగడంలో ఇంద్రా నూయి కీలకపాత్ర పోషించారని కొనియాడింది. ఇన్వెస్టర్లు ఇంద్రా నూయి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొంది. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ వృద్ధితో మేరీ బర్రా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబునిచ్చింది. టాప్-10లోని మహిళలు వీరే.. ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో పలువురు ప్రముఖులు స్థానం పొందారు. కాగా టాప్-10లో.. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో మెరిల్లిన్ హ్యూసన్ (3వ స్థానం), ఐబీఎం సీఈవో గిన్ని రొమెట్టీ (4), ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈవో అబిగెయిల్ (5), ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (6), హ్యూలెట్ పకార్డ్ ఎంటర్ప్రైస్ సీఈవో మెగ్ విత్‌మన్ (7), జనరల్ డైనమిక్స్ సీఈవో ఫెబె నొవాకొవిక్ (8), మాండలిజ్ ఇంటర్నేషనల్ సీఈవో ఐరెన్ రోసెన్ఫీల్డ్ (9), ఒరాకిల్ కో-సీఈవో సఫ్రా కాట్జ్ (10వ స్థానం) ఉన్నారు. -
ఫార్చ్యూన్-500లో మనవి ఏడు!!
♦ మన ఏడింట్లో నాలుగు చమురు కంపెనీలే ♦ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న వాల్‌మార్ట్ ♦ రెండు, మూడు స్థానాలు చైనా కంపెనీల సొంతం ♦ ఆదాయాన్ని బట్టి కంపెనీల్ని వర్గీకరించిన ఫార్చ్యూన్ న్యూయార్క్: భారత్‌కు చెందిన ఏడు కంపెనీలు తాజాగా ఫార్చ్యూన్-500 ‘ప్రపంచపు అతిపెద్ద కంపెనీల’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిల్లో నాలుగు ప్రభుత్వానివైతే.. మిగతావి ప్రైవేట్ రంగానివి. ఆదాయం పరంగా కంపెనీల ఎంపిక జరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’ 4,82,130 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానాన్ని సాధిం చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 54.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో 161వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆయిల్ తర్వాతి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇక యాపిల్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది జాబితాలో స్థానం పొందిన చమురు-గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ ఈ సారి చోటు కోల్పోయింది. కొత్తగా ఈసారి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్థానం దక్కించుకుంది. ఫార్చ్యూన్-500 జాబితాలోని కంపెనీలు 6.7 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ.. 33 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటి మొత్తం ఆదాయం గతేడాది 27.6 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
ఫార్చ్యూన్ లిస్ట్ లో ఐఆర్ సీటీసీ, జస్ట్ డయల్
న్యూఢిల్లీ : జస్ట్ డయిల్, ఐఆర్ సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు ఫార్చ్యూన్ నెస్ట్ 500 భారత కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. డైనమ్యాటిక్ టెక్నాలజీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మధ్యస్త కంపెనీలే ఈ జాబితాలో ఎక్కువగా చోటుదక్కించుకోగా, వార్షిక ఆదాయం రూ.1,693 కోట్లతో డైనమ్యాటిక్ టెక్నాలజీ టాప్ లో ఉంది. డైనమ్యాటిక్ తర్వాత రూ.1,692 కోట్లతో నెక్ట్రా లైఫ్ సైన్స్, రూ,1,689 కోట్లతో ఓస్వాల్ వుల్లెన్ మీల్స్, రూ.1,682.5 కోట్లతో వీఆర్ఎల్ లాజిస్టిక్స్, రూ.1,682.18 కోట్లతో హిటాచీ హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్ లు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ(442), జస్ట్ డయిల్(449)లు కొత్త కంపెనీలుగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచాయి. అయితే గతేడాది 328 ర్యాంకు తో ఉన్న ఇండియన్ రైల్వేస్ టూరిజం అండ్ కేటరింగ్ సంస్థ ఐఆర్ సీటీసీ తన ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుని, 199 ర్యాంక్ ను దక్కించుకుంది. మరో ఇతర నాలుగు కంపెనీలు సైతం గతేడాది కంటే తమ ర్యాంకింగ్ లను మెరుగుపరుచుకున్నాయి. నెస్ట్ 500 కంపెనీలు మొత్తం రెవెన్యూలు రూ.5,14,788 కోట్లగా నమోదైనట్టు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. వివిధ రంగాల నుంచి ఈ సంస్థలు ఫార్చ్యూన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఫైనాన్సియల్ సర్వీసులు, ఫుడ్ అండ్ అగ్రి ప్రొడక్ట్స్, ఫార్మా అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి -
భారత్ నుంచి ఇంద్రా నూయి ఒక్కరే...
‘ఫార్చ్యూన్’ ప్రపంచ శక్తివంత వ్యాపార మహిళల జాబితాలో రెండో స్థానం న్యూయార్క్: పెప్సికో సీఈవో ఇంద్రా నూయి.. భారత్ నుంచి ‘ఫార్చ్యూన్ 50 మంది శక్తివంతమైన వ్యాపార మహిళల’ జాబితాలో స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయురాలు. ఫార్చ్యూన్ జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా అగ్రస్థానంలో ఉంటే, ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది కంపెనీ 4 శాతం రెవెన్యూ వృద్ధిని ప్రకటించడంలో ఇంద్రా నూయి కీలక పాత్ర పోషించారు. గతేడాది ఇదే జాబితాలో ఆమె మూడో స్థానంలో ఉండేవారు. ఈ జాబితాలో ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టీ (3వ స్థానం), ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ (8వ స్థానం), యాహూ సీఈవో మరిస్సా మేయర్ (18వ స్థానం) తదితరులు ఉన్నారు. 2015 సంవత్సరానికి ఫార్చ్యూన్ విడుదల చేసిన ఉత్తమ ఔత్సాహిక మహిళావ్యాపారవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన పాయల్ కడాకియా స్థానం దక్కించుకున్నారు. ఆమె ఫిట్నెస్ తరగ తుల సేవలందించే ‘క్లాస్‌పాస్’ సహ వ్యవస్థాపకులు. ఈ స్టార్టప్ కంపెనీని ప్రారంభించి రెండేళ్లయ్యింది. అమెరికా, కెనడా, బ్రిటన్లలో ఫిట్నెస్ జిమ్‌లు, బాటిక్లకు వినియోగదారుల్ని ఈ క్లాస్‌పాస్ అనుసంధానిస్తుంది. -
‘ట్రిపుల్ మర్డర్’లో పోలీసుల పాత్రపై ఆరా
ఏసీపీ, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ఏసీపీ వీఆర్‌కు, సీఐ, కానిస్టేబుళ్ల సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ : పెద్దఅవుటపల్లి వద్ద జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యకేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి పోలీస్‌స్టేషన్ పోలీసులకు మొదటినుంచీ కల్పతరువుగా మారిందని సమాచా రం. పినకడిమికి చెందిన కొందరు విదేశాల కు వెళ్లి జాతకాలు చెప్పి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వారిని టార్గెట్ చేసి పెదవేగిలో పనిచేసే పోలీసులు లక్షల్లో సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. పినకడిమి వాసులు కేవలం జాతకాలు చెప్పడం ద్వారానే కోట్లలో డబ్బు ఎలా సంపాదిస్తున్నారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. జాతకాల పిచ్చి ఉన్న కొంతమంది పోలీసు అధికారులు పినకడిమి లో జాతకాలు చెప్పేవారికి కావాల్సిన అవసరా లు తీర్చడంలో ముందున్నారు. అటువంటివారిపై విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు ప్రత్యే క నిఘా వేశారు. పెద్దఅవుటపల్లి వద్ద ముగ్గు రు వ్యక్తులను కాల్చి చంపుతున్నప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్లు హతుల కారులోనే ఉండ టం, ఆ తరువాత వారు పరారు కావడం, కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అసలు విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. తాము హతులకు రక్షణగా వెళ్లామని కానిస్టేబుళ్లు చెప్పారు. అయితే వారు అనధికారికంగా ఎందుకు వెళ్లారనేది చర్చనీయాంశమైంది. ఏలూరు వన్‌టౌ న్ సీఐ మురళీకృష్ణ ఆదేశాలతో వారు వెళ్లినప్పటికీ ఆయన కానీ, కానిస్టేబుళ్లు కానీ జరిగిన విషయాన్ని విజయవాడ సీపీకి చెప్పలేదు. విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో సీపీకి మరింత అనుమానం వచ్చింది. బాధితు లు, నిందితులతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సీఐ, ఇద్దరు కాని స్టేబుళ్ల పాత్ర గురించి తెలిసిన వెంటనే సస్పెం డ్ చేశా రు. వీరిపై కేసు నమోదుకు న్యాయపరంగా ఎదురయ్యే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పోలీస్ అధికారికి కుట్రదారులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చా యి. విజయవాడలో స్పెషల్ బ్రాంచి ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సూర్యచంద్రరావు 2001లో పెదవేగి స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సీఐగా కూ డా అక్కడ పనిచేశారు. మూడు హత్యల గురిం చి ఆయనకు కొంత సమాచారం తెలిసే అవకాశం ఉందని సీపీ వెంకటేశ్వరరావు భావిం చారు. దీనిపై సూర్యచంద్రరావును వివరాలు అడిగారు. నిందితులు ఎక్కడ ఉన్నారనే దాని పై సూర్యచంద్రరావు నుంచి సమాచారం తెలుసుకునేందుకు సీపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆయన సూర్యచంద్రరావు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడనే విషయా న్ని తెలుసుకునేందుకు ఫోన్ కాల్‌డేటా తెప్పిం చి పరిశీలించారు. ముగ్గురి హత్యకేసులో ప్రధా న కుట్రదారుగా భావిస్తున్న భూతం గోవిం ద్‌తో ఏసీపీ అనేకసార్లు మాట్లాడినట్లు కాల్‌డేటాలో వెల్లడైంది. ఏసీపీ నిజం చెప్పకుండా నిందితునికి పరోక్షంగా సహకరిస్తున్నారనే అనుమానంతో డీజీపీతో మాట్లాడి సూర్యచంద్రరావును వేకెన్సీ రిజర్వుకు పంపించారు. గత ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగిన సందర్భంలోనూ నాగరాజు వర్గీయులతో ఈ పోలీసులకు సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దుర్గారావు హత్యకేసులో ప్రధాన కుట్రదారు నాగరాజు, పెదఅవుటపల్లి వద్ద జరిగిన ముగ్గు రి హత్యకేసులో ప్రధాన కుట్రదారు భూతం గోవింద్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. వీరిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక డీసీపీ నేతృత్వంలో ఢిల్లీలో పోలీసు ప్రత్యేక బృందం హంతకుల కోసం గాలిస్తోం ది. విజయవాడ కేంద్రంగా మరో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు సాగిస్తోంది. పశ్చిమగోదావరి ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయనతోపాటు విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు, మరో డీసీ పీ కలిసి ఎప్పటికప్పుడు ఈ కేసులో పురోగతి ని సమీక్షిస్తున్నారు. హత్యల కుట్రదారులతో పోలీసులకు ఉన్న సంబంధాలపై కూపీ లా గుతున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు పోలీసుల్లో వణుకు మొదలైంది. -
ఒక లక్కీ సెంటిమెంట్...!
పంచామృతం: అదృష్టాన్ని నమ్ముకోనక్కర్లేదు. అయితే ఒక్కోసారి అదృష్టమే మనల్ని నమ్ముకొంటుంది. విజయం దిశగా నడిపిస్తుంది. మరి ఆ అదృష్టాన్ని అలా కలిసి వచ్చేలా చేసే కొన్ని సంఘటనలనూ మనం గుర్తిస్తాం. వాటినే సెంటిమెంట్స్గా భావిస్తూ పాటిస్తూ ఉంటాం. మరి ఇలాంటి సెంటిమెంట్లకు పెద్ద పెద్ద వాళ్లు కూడా అతీతులు కాదు. అవి విజయాన్ని తెచ్చిపెడతాయనేది వారి విశ్వాసం. అలాంటి వారిలో కొందరు... వారి సెంటిమెంట్లు... షారూక్ ఖాన్... కింగ్ఖాన్ది కారు నంబర్ విషయంలో సెంటిమెంట్. కొత్త కారు కొనాలనిపించినప్పుడు ఏ మోడల్ కొనాలి, అందులోని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాల కన్నా ఆర్టీఏ అధికారులను సంప్రదించి తనకు 555 నంబర్ కేటాయించగలరా? అనే విషయాన్ని వాకబు చేస్తాడట షారూక్. భారీ మొత్తం చెల్లించి మరీ ఆ నంబర్‌ను తీసుకోవడానికి షారూక్ వెనుకాడడని సమాచారం. ఒకవేళ ప్రస్తుతానికి 555 నంబర్ అందుబాటులో ఉండదని ముంబై ఆర్టీఏ అధికారులు చెబితే కారు కొనడాన్నే వాయిదా వేసేస్తాడంతే! సల్మాన్ ఖాన్... చేతికి ధరించే బ్రాస్లైట్ను సెంటిమెంట్‌గా భావిస్తాడు సల్మాన్. షూటింగ్ సమయంలో అడ్డు అనిపిస్తే తప్ప ఎప్పుడూ ఇది సల్మాన్చేతికి ఉంటుంది. తండ్రి సలీమ్‌ఖాన్ సల్లూకు దీన్ని బహుమతిగా ఇచ్చాడట. ఒకసారి దీన్ని పొగొట్టుకొన్న సల్మాన్‌కు ఇది తిరిగి దొరికేంత వరకూ మనసు కుదుటపడలేదని ఈ హీరో సన్నిహితులు అంటారు. అలాగే తనకు ఇష్టమైన వాళ్లకు కూడా కలిసొస్తుందనే హామీని జత చేస్తూ సల్లూ ఇలాంటి బ్రాస్లైట్ను బహుమతిగా ఇస్తుంటాడట. సచిన్ టెండూల్కర్... క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ సచిన్ టెండూల్కర్ ఆట తీరును భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ మరిచిపోలేరు. మరి క్రికెట్లో రాణించడానికి అతని శక్తిసామర్థ్యాలు, కృషిలే కారణం అనుకొన్నా.. టెండూల్కర్‌కు మాత్రం కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. బ్యాటింగ్‌కు దిగే ముందు ముందుగా ఎడమకాలికి ప్యాడ్ కట్టుకోవడం టెండూల్కర్ అలవాటు. అలా చేస్తే సచిన్‌కు కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఆయనతో డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకొన్న సభ్యులు చెబుతారు. టైగర్ వుడ్స్... ప్రసిద్ధ గోల్ఫ్ ఆటగాడు, ఆ ఆట ద్వారా అత్యంత ఎక్కువ సొమ్మును ఆర్జిస్తున్న వ్యక్తిగా గుర్తింపు ఉన్న టైగర్ వుడ్స్‌కు ఎరుపు రంగు అంటే సెంటిమెంట్. వాడే వస్తువుల విషయంలో ముందుగా ఎరుపుకు ప్రాధాన్యం ఇచ్చే వుడ్స్ గోల్ఫ్ మ్యాచ్ సందర్భంగా కూడా జేబులో ఎర్రటి గుడ్డను పెట్టుకొని బరిలోకి దిగుతాడు. అది తోడుంటే తనకు తిరుగుండదనేది వుడ్స్ విశ్వాసం. ఆమీర్ ఖాన్... పనిలో పర్ఫెక్షనిస్టుగా పేరు పొందిన ఆమీర్‌కు సెంటిమెంట్లు, సంప్రదాయాలు ఉన్నాయి! మరి ఆమీర్ వాటిని నమ్ముతున్నాడో లేదో కానీ.. పాటించడం అయితే జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా విడుదలయ్యే సినిమాలు హిట్ కావడమే ఆమీర్ విషయంలో సెంటిమెంట్. 2007నుంచి ఇది మొదలైంది. ఆ సంవత్సరం తారేజమీన్ పర్ విడుదల అయ్యి సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా గజినీ వచ్చింది. మళ్లీ క్రిస్మస్కు త్రీ ఇడియట్స్, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కు ధూమ్-3. ఈ విధంగా ఆమీర్‌కు క్రిస్మస్ సెంటిమెంట్ కలిసొస్తోంది. దాన్ని ఫాలో అవుతూ ఈ ఏడాది కూడా క్రిస్మస్కు ‘పీకే’ సినిమాను విడుదల చేయనున్నారు! -
ఫార్చ్యూన్ శక్తివంత మహిళల్లో 8 మంది భారతీయులు
న్యూయార్క్: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన 25 మంది మహిళల్లో(వ్యాపార రంగం) ఈ ఏడాది ఎనిమిది మంది భారతీయులకు చోటుదక్కింది. అంతర్జాతీయ బిజినెస్ మేగజీన్ ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొం దించింది. టాప్-10లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ రెండో స్థానంలో నిలిచారు. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య(4వ స్థానం), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవ(5వ స్థానం) తొలిసారి జాబితాలో చోటుదక్కించుకున్నారు. వాసుదేవ ఒక భారతీయ ఆయిల్ కంపెనీకి తొలి మహిళా సారథి కావడం గమనార్హం. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ 10 ర్యాంక్‌లో నిలిచారు. ఆస్ట్రేలియా బ్యాంకింగ్ దిగ్గజం వెస్ట్‌ప్యాక్ సీఈఓ గెయిల్ కెల్లీ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఇక టాప్-25లో భారత్ నుంచి బయోకాన్ సీఈఓ కిరణ్ మజుందార్ షా(19వ ర్యాంక్), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) సీఈఓ చిత్రా రామకృష్ణ(22), హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ నైనా లాల్ కిద్వాయ్(23), టఫే సీఈఓ మల్లికా శ్రీనివాసన్(25) ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తలు అత్యంత కఠినమైన, భారీ సంస్థల్లో ఉన్నతమైన స్థానాలను అందుకుంటున్నారని.. ప్రపంచానికి మార్గనిర్ధేశం చేయడంలో తమ శక్తిసామర్థ్యాలను చాటిచెబుతున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. -
ఆ సీరియల్‌కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో! స్టార్ ప్లస్‌లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్‌ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్‌కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్‌కి పెద్ద ప్లస్! రవీందర్ కిచెన్‌లో మన వంటలు! వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్. రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది! పేదపిల్ల ప్రేమ పోరాటం! ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది? హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్‌ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి! -
ఆపదలోనూ అదృష్టం
ప్రాణాలు కాపాడిన ఎయిర్ బ్యాగ్‌లు వెంట్రుక వాసిలో తప్పిన పెను ప్రమాదం బాలరాజుకు తప్పిన ప్రాణాపాయం సీట్ల మధ్యన ఇరుక్కుని సతీష్‌వర్మ గాయాల పాలు నర్సీపట్నం : ఆపదలోనూ అదృష్టమంటే ఇదేనేమో. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి బాలరాజుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆ కోవలోకే వస్తుందేమో. జరిగిన ప్రమాదం తీవ్రమైనదైనా, బాలరాజు, కాంగ్రెస్ నాయకుడు సతీష్ వర్మ గాయాలతో బయిటపడడం చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. కారులోని ఎయిర్ బ్యాగ్‌లు వారి ప్రాణాలు కాపాడడంతో కీలక పాత్ర పోషించగా, చెట్లను, కరెంటు స్తంభాన్ని ఢీకొనకుండా కారు కాస్త పక్కగా పోవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఓ సన్నిహితుడి వివాహానికి బుధవారం జంగారెడ్డి గూడెం వెళ్లిన బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు సతీష్ వర్మ, ఇద్దరు గన్మెన్లతో కలిసి బాలరాజు కొత్తగా కొన్న మహీంద్రా కారులో రాత్రి తిరుగుపయనమయ్యారు. తెల్లవారు జామున మూడున్నర, నాలుగు గంటల మధ్య నాతవరం మండలం ములగపూడి, బెన్నవరంల మధ్య డ్రైవరు నిద్ర మత్తు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు కుడిపక్కగా ఉన్న రెండు చెట్లను రాసుకుంటూ కారు దూసుకుపోయి నిలిచిపోయింది. సంఘటన జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత అధికార వాహనం అప్పగిం చిన బాలరాజు ఈ కొత్త కారు కొనుగోలు చేశా రు. ఈ కారు వల్లే ప్రాణాలు నిలిచాయని స్థాని కులు అంటున్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పారు. స్పెషల్ వార్డులో చికిత్స విశాఖపట్నం, మెడికల్: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి బాలరాజు విశాఖలోని కేజీహెచ్‌లో మెన్స్ స్పెషల్వార్డులో చికిత్స పొందుతున్నారు. సతీష్‌వర్మ, మరో గన్‌మెన్ కూడా అక్కడే చికిత్స పొందుతున్నారు. బాలరాజుకు ముఖం కుడిభాగం, ఎడమ మోచేయి, మోకాలు భాగాల్లో చర్మం తెగిపోవడంతో సుమారు 100 వరకూ కుట్లు వేసినట్లు చికిత్స నందిస్తున్న ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ముఖం భాగంలో ఫ్రాక్చర్లు కనపడలేదన్నారు. సతీష్ వర్మకు కాలు విరిగిపోవడంతో అత్యవసర ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేసినట్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ బి.ఉదయ్‌కుమార్ తెలిపారు. మంత్రి గంటా పరామర్శ విశాఖపట్నం, మెడికల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలరాజును రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు గురువారం రాత్రి పరామర్శించారు. ప్రమాదానికి గురైన సంఘటన వివరాలను బాలరాజును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కేజీహెచ్ సీఎస్ఆర్ఎం ఓ బంగారయ్య, కేఎస్‌ఎల్‌జీ శాస్త్రిలను ఆదేశించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు గన్మెన్లను కూడా పరామర్శించారు. బాలరాజును అరకు ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు తదితరులు పరామర్శించారు. -
నమ్మకం: అరచేతిలో అంత కథ ఉందా!
అదృష్టం దురదృష్టం: అదృష్టం చేతి గీతల్లో ఉంటుంది అంటారు కొందరు. అయితే కొందరు చేతిలో పుట్టే దురదలో కూడా ఉంటుందంటారు. పలు దేశాల వారు అరచేతిలో పుట్టే దురదతో తమ అదృష్ట దురదృష్టాలను అంచనా వేసుకుంటున్నారు. నమ్మనివారికి ఇది విచిత్రం. నమ్మేవారికి ఓ బలమైన విశ్వాసం. అరచేయి దురదపెడితే ఏదో జరుగుతుందన్న నమ్మకం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచీ జనం దీన్ని నమ్ముతున్నారని తెలుస్తోంది. అయితే ఎక్కడా, ఏ ఒక్కరూ కూడా ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగని తమ విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టలేకపోతున్నారు. మన దేశంలో అరచేయి దురద పెడితే డబ్బులు వస్తాయని అంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాలవారు అదృష్టంతో పాటు దురదృష్టం కూడా కలుగుతుందని అంటున్నారు. కుడి అరచేయి దురద పెడితే మంచి జరుగుతుందని, ఎడమది పెడితే చెడు జరుగుతుందని కొందరు అంటే... కొన్ని దేశాల్లో మాత్రం ఇది రివర్సులో ఉంది. కుడి చేయి కనుక దురద పెడితే.. సంపద సర్వనాశనమైపోతుందట. ఎక్కడలేని ఖర్చులూ ఒకేసారి వచ్చి చుట్టుముడతాయట. దివాలా తీసి రోడ్డున పడేంత వరకూ శని వదలదట. అయితే ఎడమ చేయి దురద పెడితే... ఊహించని సంపద వెతుక్కుంటూ వస్తుందట. పేదవాడిని పేద్ద ధనవంతుడిగా మార్చేస్తుందట. కొన్ని దేశాల్లో అయితే... చేతి దురద అనేది శక్తికి సంబంధించినది అన్న నమ్మకం కూడా ఉంది. మనిషిలో అంతర్గతంగా ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఆ శక్తి, మనిషి అరచేతుల గుండా ప్రవహిస్తూ ఉంటుందని అంటారు వారు. అంతేకాదు, కుడి చేయి శక్తి వంతమైనదని, ఎడమచేయి బలహీనమైనదని నమ్ముతారు. అందుకే కుడి అర చేయి దురదపెడితే శక్తి పెరుగుతుందని, ఎడమచేయి దురదపెడితే శక్తి క్షీణిస్తుందని నమ్ముతారు. ఆ విధంగా శక్తి క్షీణించిపోయి అతడు మరణానికి చేరువవుతాడని కూడా చెబుతారు. మరి రెండు చే తులూ ఒకేసారి దురద పెడితే ఏంటి పరిస్థితి? ఉంది. దాని గురించీ ఒక విశ్వాసం ఉంది. రెండు చేతులూ కనుక ఒకేసారి దురదపెడితే... కచ్చితంగా మంచే జరుగుతుందట. అదృష్టమే వరిస్తుందట. కాబట్టి దిగులు చెందాల్సిన పని లేదు అంటారు. అసలు ఎలా నమ్మాలి వీటిని? దురద అనేది శరీరానికి కలిగే ఒక ఇబ్బంది. అపరిశుభ్రత వల్లనో, చర్మ సమస్య వల్లనో, ఏదైనా పురుగు వంటిది వాలడం వల్లనో, ఏదైనా కీటకం కుట్టడం వల్లనో కూడా దురద పుడుతుంది. మరి అలాంటిదాని గురించి ఇన్ని విశ్లేషణలు, ఇన్ని వివరణలు ఏమిటో అర్థం కాదు. అయినా శరీరంలో ఎక్కడ దురద పుట్టినా రాని అదృష్ట దురదృష్టాలు అరచేతిలో దురద పుడితేనే ఎందుకు వస్తాయి అంటే సమాధానం కూడా దొరకదు. కాబట్టి... దీనిని నమ్మాలో వద్దో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే! కుడి అరచేయి దురద పెడితే ఓ కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తారని ఐర్లాండు వారు భావిస్తారు! అమెరికాలో ఉన్న అటవీ ప్రాంతంలో నివసించే కొన్ని తెగల వారు... కుడి అరచేయి దురద పెడితే అదృష్టంగా భావిస్తారు. ఎడమ అరచేయి దురద పెడితే కంగారు పడిపోతారు. వెంటనే ఎడమ చేతిలో ఉమ్మి వేసి, ఆ చేతిని నడుము దగ్గర రుద్దుకుంటారు. అలా చేస్తే ఏ ఆపదా రాదంటారు! హంగేరీ వారు... అరచేయి కనుక దురద పెడితే వెంటనే జుట్టుతో చేతిని రుద్దుకుంటారు. తర్వాత అదే చేతితో జుట్టును ఒడిసిపడతారు. మొత్తం జుట్టుని ఒడిసి పట్టుకుంటే అదృష్టం వరిస్తుందట. అలా కాకుండా కాస్త బయట ఉండిపోతే కష్టాలు తప్పవని విశ్వసిస్తారు! రెండు చేతులూ ఒకేసారి దురదపెడితే... వెంటనే చేతుల్ని జేబుల్లో ఉంచుకోవాలట. అప్పుడా అదృష్టం ఎక్కడికీ పోదని పలు ఐరోపా దేశాల వారు నమ్ముతారు! -
ఫార్చూన్ పవర్ జాబితాలో నలుగురు భారత మహిళలు
న్యూయార్క్: ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన అంతర్జాతీయ అగ్రశ్రేణి 50 మహిళా వ్యాపార వేత్తల జాబితాలో నలుగురు భారత మహిళలకు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ(17 వ స్థానం), యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ(32వ స్థానం), హెచ్ఎస్బీసీ నైనా లాల్ కిద్వాయ్(42వ స్థానం)లో ఉన్నారు. గత ఏడాది జాబితాలో ఐదో స్థానంలో ఉన్న కొచర్ ఈ ఏడాది జాబితాలో ఒక స్థానం మెరుగై నాలుగో స్థానానికి ఎగబాకారు. ఎన్ఎస్ఈ చీఫ్ చిత్రా రామకృష్ణన్ తొలిసారిగా ఈ జాబితాలో చోటు సాధించారు. ఈ జాబితాలో తొలి స్థానాన్ని బ్రెజిల్‌కు చెందిన ఇంధన దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మరియా దాస్ గ్రేకాస్ ఫోస్టర్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో టర్కీకి చెందిన సుబాన్సి హోల్డింగ్స్ గులేర్ సుబాన్సి, ఆస్ట్రేలియా బ్యాంక్ దిగ్గజం, వెస్ట్‌ప్యాక్ సీఈవో గెయిల్ కెల్లీ ఉన్నారు. ఇక అమెరికాకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏడాది టాప్ 50 శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి తన రెండో స్థానాన్ని ఈ ఏడాది కూడా నిలుపుకున్నారు. మొదటి స్థానంలో ఐబీఎం గిన్ని రొమెట్టీ, మూడో స్థానంలో డ్యుపాంట్ ఎల్లెన్ కుల్మన్లు ఉన్నారు. కంపెనీ పరిమాణం, అంతర్జాతీయంగా ఆ కంపెనీ నిర్వహిస్తున్న వ్యాపారం ప్రాముఖ్యత, ఆ వ్యక్తి వ్యాపార కెరీర్, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు తదితర అంశాల ఆధారంగా ఆ జాబితాను రూపొందించామని ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది. చందా కొచర్ ఐసీఐసీఐ 4వ ర్యాంక్ చిత్రా రామకృష్ణన్ ఎన్ఎస్ఈ 17 శిఖా శర్మ యాక్సిస్ బ్యాంక్ 32 నైనాలాల్ కిద్వాయ్ హెచ్ఎస్బీసీ 42 -
అత్యుత్తమ సేవలే ‘ఫార్చ్యూన్’ లక్ష్యం
తిరుచానూరు, న్యూస్‌లైన్: అతిథులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఐటీసీ ఫార్చ్యూన్ గ్రూప్స్ డెరైక్టర్ రోహిత్ మల్హోత్ర, హోటల్ గ్రాండ్‌రిడ్జ్ చెర్మైన్ టీ కృష్ణప్రసాద్ తెలిపారు. హోటల్ రంగంలో నిష్ణాతులైన ఐటీసీ ఫార్చ్యూన్ గ్రూప్స్‌తో తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్‌రిడ్జ్ హోటల్ శ నివారం యాజమాన్య భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. దీంతో హోటల్ గ్రాండ్‌రిడ్జ్ పేరును ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్రిడ్జ్గా మార్పు చేసి శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ రంగానికి చెందిన వారికి అనువుగా తమ హోటల్లో వసతులు ఉన్నాయని తెలిపారు. దేశంలో దాదాపు వంద ఫార్చ్యూన్ గ్రూప్‌కు చెందిన హోటల్స్ ఉన్నాయని, అందులో 40 వరకు యా జమాన్య భాగస్వామ్యంతో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా గా తిరుపతిలో గ్రాండ్‌రిడ్జ్ భాగస్వామ్యంతో ఈ సంఖ్య 41కి చేరుకుందని తెలిపారు. ప్రతి 180 కిలోమీటర్లకు తమ హో టల్‌ను నెలకొల్పడమే సంకల్పమని చెప్పారు. చిన్న నగరాల్లో కూడా హోటళ్ల అన్ని హంగులతో నెలకొల్పుతామన్నారు. హోటల్ డెరైక్టర్లు శివరామకృష్ణ, లింగారావు, ఫార్చ్యూన్ సంస్థ కార్పొరేట్ హౌస్‌కీపర్ షిప్రానాయర్ పాల్గొన్నారు.