న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500, 2023 జాబితాలో మెరుగైన స్థానాన్ని సంపాదించింది. 16 స్థానాలు మెరుగుపడి 88వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2022 జాబితాలో రిలయన్స్ స్థానం 104గా ఉండడం గమనించొచ్చు.
భారత కంపెనీల్లో టాప్ ర్యాంకర్‌గా రిలయన్స్ నిలిచింది. 2021 నుంచి చూస్తే రిలయన్స్ అంతర్జాతీయంగా తన ర్యాంక్‌ని గణనీయంగా పెంచుకుంది. 2021లో రిలయన్స్ స్థానం 155గా ఉంది. ఇక ఈ ఏడాది ఫార్చూన్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 94వ స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాదితో పోలిస్తే 48 మెట్లు పైకెక్కింది.
ఎల్‌ఐసీ 9 స్థానాలు దిగజారి 107వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఓఎన్‌జీసీ 158, బీపీసీఎల్ 233, ఎస్‌బీఐ 235 ర్యాంకులు దక్కించుకున్నాయి. టాటా మోటార్స్ ర్యాంక్ 33 స్థానాలు మెరుగుపడి 337కు చేరింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 84 స్థానాలు ముందుకు వచ్చి 353 ర్యాంకును సొంతం చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవడం 20వ ఏడాది కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment