బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే.. | Reliance Digital Black Friday Sales Details | Sakshi
Sakshi News home page

బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..

Published Thu, Nov 28 2024 5:36 PM | Last Updated on Thu, Nov 28 2024 6:53 PM

Reliance Digital Black Friday Sales Details

రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్‌లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్‌సర్వ్.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో రూ.22,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్‌లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్‌ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్‌లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.

ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్‌
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కస్టమర్‌లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్‌లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్‌ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement