Black Friday sale
-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..
మన దేశంలో సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు వచ్చే ఆఫర్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తారన్న విషయం తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. ఆ బ్లాక్‌ఫ్రైడే (నవంబర్ 29) రానే వచ్చింది. ఇంతకీ ఈ బ్లాక్‌ఫ్రైడే ఎలా పుట్టింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ లభిస్తాయా? అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది?ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుస్తారు. అమెరికాలో అయితే.. బ్లాక్‌ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ డే పేరుతో సెలబ్రేట్స్ చేసుకుంటారు. బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది? అనటానికి చాలా సంఘటనలు ఉదాహరణలుగా చెబుతారు.నిజానికి బ్లాక్‌ఫ్రైడే అనే పదానికి.. షాపింగ్‌కు సంబంధమే లేదు. 1969 ఆర్ధిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు భారీ పడిపోవడంతో.. దాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుచుకున్నారు. అంతే కాకుండా 20వ శతాబ్దంలో.. ఒకసారి అమెరికాలో కార్మికుల సెలవు రోజుల తరువాత విధులకు లేటుగా వెళ్లారు.. దీన్ని కూడా బ్లాక్‌ఫ్రైడే అని పిలిచారు. ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడటంతో.. పోలీసులు దాన్ని బ్లాక్‌ఫ్రైడేగా పిలిచారు. ఆ తరువాత బ్లాక్‌ఫ్రైడే అనేది ఆన్లైన్ కొనుగోళ్ళకు.. డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారిపోయింది.శుక్రవారం రోజు మొదలయ్యే వ్యాపారం.. వారాంతంలో కూడా బాగా సాగుతుంది. ఇది సోమవారం వరకు సాగేది. ఇలా బ్లాక్‌ఫ్రైడేను వ్యాపారానికి ఆపాదించేసారు. ఆ తరువాత సోషల్ మీడియా / ఇంటర్నెట్ కారణంగా.. బ్లాక్‌ఫ్రైడే అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.2023 బ్లాక్‌ఫ్రైడే సేల్2023 బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచంలోని వినియోగదారులు ఏకంగా రూ. 6 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేసినట్లు.. అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫర్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సేల్స్ 2022తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. ఈ ఏడాది అమ్మకాలు 2023 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా.గొప్ప ఆఫర్స్ ఉంటాయా?మంచి ఆఫర్స్ ఉంటాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో వెల్లడించింది. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుకొన్ని దేశాల్లో అయితే బ్లాక్‌ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని ప్రజలు బ్లాక్ ఫ్రాడ్ అని విమర్శించారు. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కామర్లు కూడా దీనిని అదనుగా చూసుకుని.. మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆదమరిస్తే మోసపోవడం ఖాయం. -
బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు.రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్సర్వ్.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో రూ.22,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కస్టమర్లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. -
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బ్లాక్ ఫ్రైడే సేల్.. కళ్లు చెదిరే ఆఫర్స్
అగ్రరాజ్యం అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి మొదలైంది. యూఎస్ఏలో ప్రతి సంవత్సరం బ్లాక్ ఫ్రైడే పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. ఏటా థాంక్స్ గివింగ్ మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలోని ప్రముఖ కంపెనీలు బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభి.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. ప్రతి ఏడాది అమెరికన్లు నవంబర్ నాలుగో గురువారం థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ రాకను సూచిస్తూ శాంటా క్లాజ్ పరేడ్స్ జరుగుతుంటాయి. పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను అడ్వర్టైజ్ చేసుకునేందుకు ఈ పరేడ్లను స్పాన్సర్ చేస్తుంటాయి. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా చాలా కంపెనీలు కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులు.. కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తాయి. కొన్ని సంస్థలు 'బ్లాక్ థర్స్ డే' పేరుతో గురువారం నుంచే సేల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున కస్టమర్లు షాపింగ్ చేయటానికి తరలి వచ్చారు. దీంతో అన్ని షాపులు కిటకిటలాడాయి. ఇక ప్రధాన రోడ్లతో పాటు పార్కింగ్ స్థలాలు రద్దీగా మారాయి. -
కొనుగోలు దారులకు బంపరాఫర్.. ఈ ప్రొడక్ట్‌లపై 85 శాతం డిస్కౌంట్!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, ఆఫ్‌లైన్ దుకాణాలు అమ్మకాలు పెంచుకునేందుకు మరో విడత డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ ఫ్రైడే (నవంబర్ 24), సైబర్ మండే (నవంబర్ 27) సందర్భంగా మంచి డీల్స్‌ను ప్రకటిస్తుండడం కనిపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని ఈ కామర్స్ సంస్థలు, ప్రముఖ బ్రాండ్లు, రిటైలర్లు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మరోసారి అదే విధమైన వాతావరణం నెలకొంది. పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్, బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. అదే విధమైన సంస్కృతి క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఈ కామర్స్ సంస్థ టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ, టాటా క్లిక్ ప్యాలెట్ బ్లాక్ ఫ్రైడే సందర్భంగా భారీ ఆఫర్లతో డీల్స్‌ను ప్రకటించాయి. ‘థ్యాంక్స్ గాడ్, ఇట్స్ బ్లాక్ ఫ్రైడే’ అనే ట్యాగ్‌లైన్ వేశాయి. వస్త్రాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఆభరణాలు, వాచ్‌లపై ఆఫర్లు తీసుకొచ్చాయి. టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ నవంబర్ 22 నుంచి 27 వరకు ఈ సేల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. టాటా క్లిక్ ప్యాలెట్ అయితే ఈ నెల 17 నుంచి 27 వరకు సేల్స్‌ను చేపట్టింది. ‘‘బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నది ఎంతో ఆసక్తికరమైన కార్యక్రమం. వినియోగదారులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆఫర్లు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లపై అందిస్తున్నాం’’అని టాటా క్లిక్ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. పండుగల అమ్మకాలు క్రిస్మస్, నూతన సంవత్సరం వరకూ కొనసాగుతాయని టాటా క్లిక్ అంచనా వేస్తోంది. హ్యూగో బాస్, జిమ్మీ చూ తదితర బ్రాండ్లపై 85 శాతం వరకు తగ్గింపును టాటా క్లిక్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సైతం.. అమెజాన్ బ్యూటీ సైతం బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సందర్భంగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు ‘ద బ్యూటీ సేల్’ను నిర్వహిస్తోంది. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులపై 60 శాతం వరకు, లగ్జరీ బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 300 బ్రాండ్లపై 8,000 డీల్స్‌ను ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 8పీఎం డీల్స్ పేరుతో అర్థరాత్రి వరకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. ‘‘చర్మ, శిరోజాల సంరక్షణపై గడిచిన్న కొన్నేళ్లలో భారత వినియోగదారుల్లో ఎంతో అవగాహన పెరుగుతుండడం గమనించాం. దీంతో ప్రీమియం ఉత్పత్తుల కోసం చేసే ఖర్చు పెరిగింది’’అని అమెజాన్ ఇండియా సౌందర్య ఉత్పత్తుల విభాగం డైరెక్టర్ జెబా ఖాన్ తెలిపారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, ఫర్నిచర్‌పై 75 శాతం వరకు తగ్గింపుతో కూడిన టాప్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. -
బ్లాక్ ఫ్రైడే సేల్: షావోమీ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
Xiaomi Black Friday Sale Starts Goes On Till November 30: అమెరికాలో థ్యాంక్స్గీవింగ్తో సాగే భారీ డిస్కౌంట్ల బ్లాక్ ఫ్రైడ్ సేల్ ఇప్పుడు భారత్‌లోని పలు కంపెనీలు మొదలుపెట్టాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కూడా చేరింది. షావోమీ బ్లాక్ ఫ్రైడ్సేల్ను ప్రకటించగా, ఈ సేల్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవ్వగా నవంబర్ 30తో ముగియనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా టీవీలు, ల్యాప్టాప్స్, ఆడియో, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును షావోమీ ప్రకటించింది. చదవండి: ఇండియా కుబేరుడు.. 2 సార్లు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు కొనుగోలుదారులకు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటుగా..పలు ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు రానుంది. అంతేకాకండా పలు షావోమీ ఉత్పత్తుల కొనుగోలుపై 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా షావోమీ అందించనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా పలు ఉత్పతులపై షోవోమీ అందిస్తోన్న ఆఫర్లు ►ఎమ్ఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4 వేల తగ్గింపు. ►రెడ్మీ బుక్ 15 ల్యాప్‌టాప్ కొనుగోలుదారులకు రూ. 35,499కే లభించనుంది. ►ఎమ్ఐ టీవీ 4సీ 43ఇంచ్, ఎమ్ఐ టీవీ 4ఏ 43ఇంచ్ హరిజోన్ ఎడిషన్, రెడ్మీ స్మార్ట్‌టీవీ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీల కొనుగోలుపై రూ. 2000 వరకు డిస్కౌంట్. ►ఎమ్ఐ స్మార్ట్‌బ్యాండ్ 5 కొనుగోలుదారులకు రూ. 2270కు లభించనుంది. ►ఎమ్ఐ వాచ్ రివాల్వ్ క్రోమ్, ఎయిర్ పూరిఫైయర్ 3 ఉత్పత్తులపై 2 వేల తగ్గింపు.మరిన్ని ఆఫర్లను షావోమీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చును. చదవండి: స్మార్ట్ఫోన్లకు ఎండ్‌కార్డ్...! వాటి స్థానంలో పవర్ఫుల్..! -
ఫోన్లపై వంద శాతం డిస్కౌంట్.. చైనా కంపెనీ వెటకారం!!
గ్లోబల్ మార్కెట్లో అమెరికా వర్సెస్ చైనా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో రంగంలో పోటాపోటీ పైచేయితో దూసుకుపోతున్నాయి. అయితే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా ఆంక్షలు, నిషేధాలకు సైతం వెనుకాడడం లేదు. ఈ తరుణంలో హువాయ్‌పై నిషేధం విధించిన విషయమూ తెలిసిందే. హువాయ్అమెరికా తాజాగా తన వెటకారాన్ని ప్రదర్శిచింది. బ్లాక్ ఫ్రైడ్ పేరుతో ఫోన్లపై 100 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది కంపెనీ. ఇది అమెరికన్లను మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అంటూ సోమవారం తన ట్విటర్ పేజీలో ఓ పోస్ట్ కూడా చేసింది. అయితే అమెరికా నిషేధాన్ని నిరసిస్తూ ఈ రకంగా హువాయ్ సెటైర్లు వేసింది. Black Friday special! 100% OFF all phones we currently sell in the US.🙃 — HuaweiUSA (@HuaweiUSA) November 22, 2021 ఈ ట్వీట్‌కు విపరీతమైన లైకులు షేర్లు వచ్చాయి. దీంతో హువాయ్ మరో ట్వీట్ ద్వారా స్పందించింది. ఇదంతా జోక్అని, బ్లాక్ ఫ్రైడే సందర్భంగా తమ నుంచి ఎలాంటి అమ్మకాలు అమెరికాలో ఉండబోవని స్పష్టం చేసింది. ఇక నవంబర్ 26న బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ, హువాయ్ మాత్రం ‘చిప్ ఆంక్షల’ కారణంగా నిషేధం ఎదుర్కొంటూ గమ్మున ఉండిపోయింది. OK, everyone. It's just a joke. We can't sell anything in the USA 😭😭😭 #ReadyWhenYouAre — HuaweiUSA (@HuaweiUSA) November 22, 2021 ఒకప్పుడు హువాయ్ ఉత్పత్తులు అమెరికా మార్కెటింగ్ వల్లే ప్రపంచం మొత్తంలో భారీగా అమ్ముడు పోయేవి. అయితే అమెరికా ఆంక్షలు, నిషేధం తర్వాత నుంచి భారీగా పతనం అవుతూ వస్తోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 32 శాతం అమ్మకాలు పడిపోగా, మొదటి అర్థభాగంలో 29.4 శాతం క్షీణత కనిపించింది. -
రేపటి నుంచీ గ్లోబల్ హాలిడే అమ్మకాలు
న్యూఢిల్లీ, సాక్షి: గురువారం నుంచీ ప్రారంభంకానున్న గ్లోబల్ హాలిడే సీజన్లో భాగంగా ప్రొడక్టులను విక్రయించేందుకు దేశీ ఎగుమతిదారులు సిద్ధంగా ఉన్నట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. వార్షికంగా నిర్వహించే బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండేలలో భాగంగా ఈ నెల 26 నుంచి 30 వరకూ అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ సెల్లింగ్‌కు వీలుగా 70,000 మంది దేశీ ఎగుమతిదారులు తమ ప్రొడక్టులను లిస్టింగ్ చేసినట్లు పేర్కొంది. తద్వారా వేల కొద్దీ మేడిన్ ఇండియా ప్రొడక్టులను విక్రయానికి ఉంచినట్లు తెలియజేసింది. గతేడాది బ్లాక్ ఫ్రైడే సందర్భంగా 76 శాతం అధికంగా అమ్మకాలు నమోదుకాగా.. సైబర్ మండే రోజున సైతం 55 శాతం వృద్ధి కనిపించినట్లు ప్రస్తావించింది. గిఫ్ట్ ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా తమ కస్టమర్లకు వేలకొద్దీ ప్రొడక్టులు అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ పేర్కొంది. స్టెమ్ టాయ్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, టీ, తదితర పానీయాల దగ్గర్నుంచి.. బ్యూటీ ప్రొడక్ట్స్, లెదర్ జర్నల్స్, బ్యాగుల వంటి పలు గిఫ్టింగ్ ప్రొడక్టులను సైతం విక్రయానికి ఉంచినట్లు తెలియజేసింది. యూఎస్‌లో బ్లాక్ ఫ్రైడే నుంచి సైబర్ మండే వరకూ హాలిడే సీజన్ ప్రారంభమవుతుందని, దీనిలో భాగంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతులను ఇస్తుంటారని వివరించింది. థ్యాంక్స్ గివింగ్ మర్నాడు సెలబ్రేట్ చేసుకునే బ్లాక్ ఫ్రైడేపై రిటైలర్లు అధికంగా దృష్టి సారిస్తుంటారని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్‌ను కంపెనీలు ప్రకటిస్తాయని తెలియజేసింది. పలు విభాగాలలో ఆరోగ్యం, పరిశుభ్రత, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, గృహ అవసరాలు తదితర విభాగాలలో మేడిన్ ఇండియా ప్రొడక్టులకు భారీ డిమాండ్ కనిపిస్తుంటుందని అమెజాన్ పేర్కొంది. యూఎస్, కెనడా, యూరోప్, జపాన్ తదితర దేశాల నుంచి ప్రొడక్టులకు ఆర్డర్లు లభిస్తుంటాయని తెలియజేసింది. దేశీయంగా పండుగల సీజన్ తదుపరి ప్రారంభమయ్యే యూఎస్ హాలిడే సీజన్ ఇక్కడి ఎగుమతిదారులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్ అభిజిత్ కామ్రా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు, చిన్న ఎగుమతిదారులకు కంపెనీ ఇన్వెంటరీ నిర్వహణ, లాజిస్టిక్ సొల్యూషన్స్ తదితర అంశాలలో సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు. 2015లో గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమాన్ని 100 మంది ఎగుమతిదారులతో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం 70,000 మంది ఎగుమతిదారులకు విస్తరించినట్లు తెలియజేశారు. మొత్తంగా చూస్తే ఈ కార్యక్రమం ద్వారా ఎగుమతులు 2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. 2025కల్లా 10 బిలియన్ డాలర్ల బిజినెస్ అందుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. -
బ్లాక్ ఫ్రైడే సేల్: దుమ్ము రేపిన స్మార్ట్ఫోన్లు
శాన్ఫ్రాన్సిస్కో: బ్లాక్ ఫ్రైడే విక్రయాల్లో స్మార్ట్ఫోన్లు దుమ్ము రేపాయి. ఈ సందర్భంగా అమెరికాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. నవంబర్ మాసంలో నాలుగవ గురువారం జరుపుకునే థాంక్స్ గివింగ్ మరునాడు పలు విక్రయ సంస్థలు ఆఫర్ చేసే బ్లాక్ ఫ్రైడే సేల్ రికార్డ్ హైని నమోదు చేసిందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి. బ్లాక్ ఫ్రైడే అమ్మకాల్లో స్మార్ట్ఫోన్లు రికార్డులు బద్దలు కొట్టాయని అడోబ్ డిజిటల్ ఇన్సైట్స్ రిపోర్ట్ చేసింది. 61.1 శాతం వినియోగదారులు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లతో సహా మొబైల్ పరికరాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చినట్టు చెప్పింది. 2016లో అమ్మకాలతో పోలిస్తే 2017లో 4.9శాతం జంప్ చేసినట్టు గార్టనర్ నివేదించింది. ఈ ఏడాది 1.7 బిలియన్ యూనిట్ల విక్రయాలు జరిగినట్టు అంచనా వేసింది. ఈ హాలిడే సీజన్ షాపింగ్ అంటే మొబైల్ షాపింగే అన్నట్టుగా ఉందని అడోబ్ ఇన్సైట్ డివిజన్ ఉపాధ్యక్షుడు మిక్కీ మెర్రిక్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ నివేదించింది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా యూరోపియన్ దేశాల్లో నిర్వహించే బ్లాక్‌ఫ్రైడే సేల్ ఆన్లైన్ , ఆఫ్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో భారీ స్థాయిలో కొనుగోళ్లు నమోదు కావడం సాధారణం. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు ఐరోపా దేశాలలో షాపింగ్ సందడి నెలకొంటుంది. -
ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను భారత్‌లో పరిచయం చేస్తోంది. షాప్యువర్వరల్డ్డాట్కామ్ సంస్థతో కలిసి ఈ అమ్మకాలను ఆఫర్ చేస్తున్నామని ఈబే ఇండియా డెరైక్టర్, బిజినెస్ హెడ్ విద్మే నైని తెలిపారు. శుక్రవారం నుంచే ప్రారంభమైన ఈ అమ్మకాల ఆఫర్లు ఈ నెల 30 వరకూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఆఫర్లో భాగంగా అమెరికా ఉత్పత్తులను రూపాయల్లో (అన్ని దిగుమతి సుంకాలు కలుపుకొని) అందిస్తామని, గ్లోబల్ ఈజీ బై ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు ఉచితమని పేర్కొన్నారు. దాదాపు 10వేల డీల్స్ అందుబాటులో ఉన్నాయని, టెక్నాలజీ, జీవనశైలి ఉత్పత్తులు 80 శాతం డిస్కౌంట్‌కే లభించే అవకాశాలున్నాయని వివరించారు. అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. సాధారణంగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజున కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయి. షాపింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కాగా వచ్చే నెలలో గూగుల్ సంస్థ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) ను ఆఫర్ చేయనున్నది.