ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు | EBay brings Black Friday sale to India | Sakshi
Sakshi News home page

ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు

Published Sat, Nov 22 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

EBay brings Black Friday sale to India

 న్యూఢిల్లీ:  ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను భారత్‌లో పరిచయం చేస్తోంది. షాప్‌యువర్‌వరల్డ్‌డాట్‌కామ్ సంస్థతో కలిసి ఈ అమ్మకాలను ఆఫర్ చేస్తున్నామని ఈబే ఇండియా డెరైక్టర్, బిజినెస్ హెడ్ విద్మే నైని తెలిపారు. శుక్రవారం నుంచే ప్రారంభమైన ఈ అమ్మకాల ఆఫర్లు ఈ నెల 30 వరకూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఆఫర్‌లో భాగంగా అమెరికా ఉత్పత్తులను రూపాయల్లో (అన్ని దిగుమతి సుంకాలు కలుపుకొని) అందిస్తామని, గ్లోబల్ ఈజీ బై ద్వారా కొనుగోలు చేస్తే  రవాణా చార్జీలు ఉచితమని పేర్కొన్నారు.

దాదాపు 10వేల డీల్స్ అందుబాటులో ఉన్నాయని, టెక్నాలజీ, జీవనశైలి ఉత్పత్తులు 80 శాతం డిస్కౌంట్‌కే లభించే అవకాశాలున్నాయని వివరించారు. అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. సాధారణంగా క్రిస్‌మస్ షాపింగ్ సీజన్ ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజున కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయి. షాపింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కాగా వచ్చే నెలలో గూగుల్ సంస్థ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్‌ఎఫ్) ను ఆఫర్ చేయనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement