Black Friday
-
ఆన్లైన్ షాపింగ్ కోసం అత్యుత్సాహం వద్దు!: హెచ్చరికలు జారీ
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న బ్లాక్‌ఫ్రైడే సేల్స్ మొదలైపోయాయి, షాపింగ్ హడావిడి కూడా పెరిగిపోయింది. దీనిని అదనుగా తీసుకున్న స్కామర్లు.. ప్రజలను దోచుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారి జరిగే మోసాలు 89 శాతం ఎక్కువని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. దాదాపు 80 శాతం షాపింగ్ సంబంధిత ఇమెయిల్‌లు స్కామ్‌లుగా గుర్తించారు. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు గూగుల్ సెర్చింగ్ ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నట్లు సమాచారం.బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సందర్భంగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్లాక్‌ఫ్రైడే, సైబర్ మండే, మిగిలిన సెలవు సీజన్లలో మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని.. మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ పేర్కొంది.యూఎస్ మార్కెట్లో 95 శాతం ఆధిపత్యం చెలాయించే క్రోమ్, సఫారీ, ఎడ్జ్ వంటి ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్ల వినియోగదారులను కూడా ఎఫ్‌బీఐ హెచ్చరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆన్లైన్లో షాపింగ్ చేసే సమయంలో ఆఫర్ లేదా డిస్కౌంట్ వంటి వాటిలో ఏ మాత్రం అనుమానం అనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.ఆఫర్లు చూసిన మోసపోయి.. స్కామర్లకు బాధితులవ్వకండి. ప్రతి సంవత్సరం, వేలాది మంది ప్రజలు ఈ స్కాములకు బలైపోతున్నారని ఎఫ్‌బీఐ వెల్లడించింది. స్కామర్ల చేతికి చెక్కితే.. సంపాదించినా డబ్బు, వ్యక్తిగత సమాచారం వంటి వాటిని దోచుకుంటారు.ఎఫ్‌బీఐ ముందు జాగ్రత్త చర్యలుఆన్లైన్లో కొంతమంది వస్తువులపై ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తూ ఆకర్షిస్తారు. ఇది నిజమని నమ్మి డబ్బు చెల్లించి, మీరు దానిని బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డెలివరీ రాదు. ఇలాంటి తరహా నాన్ డెలివరీ స్కామ్‌లు, నాన్ పేమెంట్ స్కామ్‌లు, గిఫ్ట్ కార్డ్ మోసాలు జరుగుతుంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు.Don't let #holiday excitement cloud your judgment! Always verify the legitimacy of online retailers and be cautious with unsolicited offers. Learn how to spot a holiday scam at https://t.co/rg1Twt4Nq2. pic.twitter.com/RBgftlHngh— FBI (@FBI) November 29, 2024 -
బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..
మన దేశంలో సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు వచ్చే ఆఫర్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తారన్న విషయం తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. ఆ బ్లాక్‌ఫ్రైడే (నవంబర్ 29) రానే వచ్చింది. ఇంతకీ ఈ బ్లాక్‌ఫ్రైడే ఎలా పుట్టింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ లభిస్తాయా? అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది?ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుస్తారు. అమెరికాలో అయితే.. బ్లాక్‌ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ డే పేరుతో సెలబ్రేట్స్ చేసుకుంటారు. బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది? అనటానికి చాలా సంఘటనలు ఉదాహరణలుగా చెబుతారు.నిజానికి బ్లాక్‌ఫ్రైడే అనే పదానికి.. షాపింగ్‌కు సంబంధమే లేదు. 1969 ఆర్ధిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు భారీ పడిపోవడంతో.. దాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుచుకున్నారు. అంతే కాకుండా 20వ శతాబ్దంలో.. ఒకసారి అమెరికాలో కార్మికుల సెలవు రోజుల తరువాత విధులకు లేటుగా వెళ్లారు.. దీన్ని కూడా బ్లాక్‌ఫ్రైడే అని పిలిచారు. ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడటంతో.. పోలీసులు దాన్ని బ్లాక్‌ఫ్రైడేగా పిలిచారు. ఆ తరువాత బ్లాక్‌ఫ్రైడే అనేది ఆన్లైన్ కొనుగోళ్ళకు.. డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారిపోయింది.శుక్రవారం రోజు మొదలయ్యే వ్యాపారం.. వారాంతంలో కూడా బాగా సాగుతుంది. ఇది సోమవారం వరకు సాగేది. ఇలా బ్లాక్‌ఫ్రైడేను వ్యాపారానికి ఆపాదించేసారు. ఆ తరువాత సోషల్ మీడియా / ఇంటర్నెట్ కారణంగా.. బ్లాక్‌ఫ్రైడే అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.2023 బ్లాక్‌ఫ్రైడే సేల్2023 బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచంలోని వినియోగదారులు ఏకంగా రూ. 6 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేసినట్లు.. అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫర్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సేల్స్ 2022తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. ఈ ఏడాది అమ్మకాలు 2023 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా.గొప్ప ఆఫర్స్ ఉంటాయా?మంచి ఆఫర్స్ ఉంటాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో వెల్లడించింది. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుకొన్ని దేశాల్లో అయితే బ్లాక్‌ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని ప్రజలు బ్లాక్ ఫ్రాడ్ అని విమర్శించారు. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కామర్లు కూడా దీనిని అదనుగా చూసుకుని.. మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆదమరిస్తే మోసపోవడం ఖాయం. -
చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ బ్లాక్ ఫ్రైడే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి.. కోర్టుల్లో ఇవాళ బ్యాక్ టూ బ్యాక్ ఝలక్‌కు తగిలాయి. ఒకవైపు ఆయన రిమాండ్‌ను రెండు రోజులు పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. ఇంకోవైపు.. ఆయన్ని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. వీటితో పాటు ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలను కూడా అనిశా(ACB) కోర్టు వాయిదా వేయడం గమనార్హం. స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడిని ఐదురోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరగ్గా.. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. తీర్పు సమయంలో చంద్రబాబును ఎక్కడ విచారిస్తారనే దానిపై సీఐడీ సమాధానం ఆధారంగా తీర్పు ఉంటుందని తొలుత ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. అయితే.. ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దు ఆయన్ని జైల్లోనే విచారిస్తామని సీఐడీ సమాధానం ఇవ్వడంతో.. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే రెండ్రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ‘‘విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వండి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గం. లోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతిస్తాం. ఇబ్బందులేమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. చంద్రబాబు విచారణ జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని జడ్జి ఈ సందర్భంగా సీఐడీ అధికారులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు కస్టడీ తీర్పుతో.. రేపు(శనివారం), ఆదివారం జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అలా ఎలా వింటాం? మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కస్టడీ విచారణ జరిగే సమయంలో వాదనలు ఎలా వింటామని?.. అలా వినడం సరికాదని పేర్కొంది ఏసీబీ కోర్టు. ఆపై.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం వింటామని తెలిపింది. అంతకు ముందు రెండు అంతకు ముందు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ముగిసి పోవడంతో.. ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టులోనూ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ‘‘ఇంత దర్యాప్తు జరిగిన తర్వాత.. ఈ దశలో తాము జోక్యం చేసుకోమని.. దర్యాప్తును ఆపే ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. -
ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను భారత్‌లో పరిచయం చేస్తోంది. షాప్యువర్వరల్డ్డాట్కామ్ సంస్థతో కలిసి ఈ అమ్మకాలను ఆఫర్ చేస్తున్నామని ఈబే ఇండియా డెరైక్టర్, బిజినెస్ హెడ్ విద్మే నైని తెలిపారు. శుక్రవారం నుంచే ప్రారంభమైన ఈ అమ్మకాల ఆఫర్లు ఈ నెల 30 వరకూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఆఫర్లో భాగంగా అమెరికా ఉత్పత్తులను రూపాయల్లో (అన్ని దిగుమతి సుంకాలు కలుపుకొని) అందిస్తామని, గ్లోబల్ ఈజీ బై ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు ఉచితమని పేర్కొన్నారు. దాదాపు 10వేల డీల్స్ అందుబాటులో ఉన్నాయని, టెక్నాలజీ, జీవనశైలి ఉత్పత్తులు 80 శాతం డిస్కౌంట్‌కే లభించే అవకాశాలున్నాయని వివరించారు. అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. సాధారణంగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజున కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయి. షాపింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కాగా వచ్చే నెలలో గూగుల్ సంస్థ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) ను ఆఫర్ చేయనున్నది. -
బ్లాక్ ఫ్రైడే!
-
బ్లాక్ ఫ్రైడే!
* వికటించిన ఆర్థిక వైద్యం * 2,00,000 కోట్ల సంపద ఆవిరి * సెన్సెక్స్ 769 పాయింట్లు పతనం * రూపాయిదీ రికార్డే.. డాలర్‌తో పోలిస్తే రూ. 62కు పతనం * రూ. 31,000 స్థాయికి ఎగసిన పసిడి సాక్షి బిజినెస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్ ఫ్రైడే నమోదయింది. రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కలిసి దేశం వెలుపలికి వెళ్లే నిధులపై ఎక్కడ నియంత్రణలు విధిస్తాయోనన్న భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఉవ్వెత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. ఈ అమ్మకాల వెల్లువలో... చిన్నా పెద్దా కంపెనీలని గానీ, ఆ రంగమూ ఈ రంగమూ అని గానీ తేడా లేకుండా అన్నీ పతనం వైపు కొట్టుకుపోయాయి. ఆఖరికి ఈ భయాలు మన కరెన్సీ రూపాయిని కూడా పాతాళానికి తీసుకెళ్లిపోయాయి. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 769 పాయింట్లు పతనం కాగా... చరిత్రలో ఎన్నడూ లేని రీతిన డాలరుతో రూపాయి మారకం ఘోరంగా పడింది. 62 రూపాయలకు చేరింది. ఈ రెండింటి ప్రభావం బంగారంపై పడటంతో దాని ధర ఒక్కసారిగా భగ్గుమంది. ఒకే రోజులో వెయ్యి రూపాయలకు పైగా పెరిగి 31,000 రూపాయలకు చేరువలోకి దూసుకెళ్లింది. సమస్యాత్మకంగా మారిన కరెంట్ ఖాతా లోటుకు పగ్గం వేయడంతోపాటు, నిరవధికంగా పతనమవుతున్న రూపాయి విలువను నిలబెట్టేందుకు అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంకు కొన్నాళ్లుగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. దీన్లో భాగంగానే... విదేశీ కరెన్సీ నిల్వల్ని పొదుపుగా వాడుకునేందుకు బుధవారం ఆర్బీఐ కొన్ని చర్యలు ప్రకటించింది. దీన్లో పెట్టుబడుల నిమిత్తం దేశం నుంచి విదేశాలకు నిధులు తరలించకుండా కొన్ని నియంత్రణలూ ఉన్నాయి. అయితే 1991 సంవత్సరానికి ముందున్న తరహా క్యాపిటల్ నియంత్రణలకు ఆర్బీఐ తెరతీయవచ్చన్న భయాలు విదేశీ మదుపరులను వెంటాడాయి. గురువారం మార్కెట్లకు సెలవు కావటంతో ఈ నిర్ణయాల ప్రభావం కనిపించపోయినా... శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకోకుండా పతనమవుతూనే వచ్చా యి. చివరికి 769 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ 18,598 పాయింట్ల వద్ద క్లోజయింది. ఎన్ ఎస్ఈ నిఫ్టీ సైతం 234 పాయింట్లు పతనమైంది. ఎఫ్ఐఐలు ఒక్క రోజులోనే నికరంగా రూ.562 కోట్ల విలువైన షేర్లను విక్రయించటంతో... గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ ఆర్జించిన 700 పాయింట్లూ ఒక్క రోజులోనే తుడిచిపెట్టుకుపోయాయి. అన్ని రంగాల షేర్లూ కుదేలవటంతో శుక్రవారం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద(లిస్టెడ్ కంపెనీల మార్కె ట్ విలువ) రూ.2 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. మరోవంక డాలర్ల కొనుగోళ్లకు దేశీ మదుపరులు ఎగబడటంతో రూపాయి విలువ చరిత్రాత్మక స్థాయిలో పతనమైంది. ఒకదశలో 62.03ని తాకినా.. బ్యాంకులు జోక్యం చేసుకుని డాలర్లను విక్రయించటంతో 61.65 వద్ద ముగిసింది. ఇది కూడా కనిష్టంలో కొత్త చరిత్రాత్మక స్థాయే. 31,000 చేరువకు పసిడి దేపనిగా దిగుమతి సుంకాన్ని పెంచుతుండటం... డాలర్ బలపడుతూ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా బంగారం ధర ఉవ్వెత్తున ఎగసింది. గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా 10 గ్రాముల మేలిమి బంగారం 31,050కి పైకి ఎగబాకింది. దిగుమతి సుంకాన్ని 8 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, రూపాయి మరింత క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో ధర 2 శాతం పెరగడం వంటివన్నీ దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపర్చడం ద్వారా దిగుమతుల్ని తగ్గించుకోగలిగితే రూపాయి బలపడుతుందనే అంచనాలతో ప్రభుత్వం ఈ సుంకాన్ని పెంచుతూ వస్తోంది. అయినా బంగారం డిమాండ్ పెరుగుతోంది. క్రాష్ కారణాలేంటి ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో పెట్టేందుకు వీలుగా ఫెడరల్ రిజర్వ్ నెలకు 80 బిలియన్ డాలర్ల నిధులను బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి విడుదల చేస్తోంది. వీటితోపాటు కొన్నేళ్లుగా రుణాలకు నామమాత్ర వడ్డీని కొనసాగిస్తోంది. దీంతో ఈ పెట్టుబడులు షేర్లు, చమురు, బంగారం తదితర కమోడిటీలలోకి ప్రవహిస్తూ వచ్చాయి. ఫెడ్ వీటిని నిలుపు చేస్తుందని, ఉపసంహరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే వడ్డీ రేట్లూ పెరుగుతాయి. ఫలితంగా విదేశీ నిధుల రాక ఆగిపోవడమేకాకుండా, ఇప్పటికే తరలి వచ్చిన బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు వెనక్కు మళ్లుతాయి. తాజాగా చెలరేగిన ఈ ఆందోళనలు ఇన్వెస్టర్లలో భయాలను రేపాయి. ఇవికాకుండా దేశీయంగా... పసిడిబాటలోనే ఎఫ్ఐఐల పెట్టుబడులపై కూడా ప్రభుత్వం నియంత్రణలు విధించవచ్చునన్న అంచనాలు వీటికి జత కలిశాయి. ఇప్పటికే భారతీయులు విదేశాలకు పంపే డాలర్లపై రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించింది. దీనితోపాటు దేశీయ కంపెనీలు చేపట్టే విదేశీ పెట్టుబడులపైనా నియంత్రణలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇవ న్ని అంశాలూ కలగలసి షేర్లతోపాటు, రూపాయిని పడగొట్టాయి.