ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న బ్లాక్‌ఫ్రైడే సేల్స్ మొదలైపోయాయి, షాపింగ్ హడావిడి కూడా పెరిగిపోయింది. దీనిని అదనుగా తీసుకున్న స్కామర్లు.. ప్రజలను దోచుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారి జరిగే మోసాలు 89 శాతం ఎక్కువని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. దాదాపు 80 శాతం షాపింగ్ సంబంధిత ఇమెయిల్‌లు స్కామ్‌లుగా గుర్తించారు. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు గూగుల్ సెర్చింగ్ ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నట్లు సమాచారం.
బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సందర్భంగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్లాక్‌ఫ్రైడే, సైబర్ మండే, మిగిలిన సెలవు సీజన్‌లలో మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని.. మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ పేర్కొంది.
యూఎస్ మార్కెట్‌లో 95 శాతం ఆధిపత్యం చెలాయించే క్రోమ్, సఫారీ, ఎడ్జ్ వంటి ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్‌ల వినియోగదారులను కూడా ఎఫ్‌బీఐ హెచ్చరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే సమయంలో ఆఫర్ లేదా డిస్కౌంట్ వంటి వాటిలో ఏ మాత్రం అనుమానం అనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.
ఆఫర్లు చూసిన మోసపోయి.. స్కామర్‌లకు బాధితులవ్వకండి. ప్రతి సంవత్సరం, వేలాది మంది ప్రజలు ఈ స్కాములకు బలైపోతున్నారని ఎఫ్‌బీఐ వెల్లడించింది. స్కామర్ల చేతికి చెక్కితే.. సంపాదించినా డబ్బు, వ్యక్తిగత సమాచారం వంటి వాటిని దోచుకుంటారు.
ఎఫ్‌బీఐ ముందు జాగ్రత్త చర్యలు
ఆన్‌లైన్‌లో కొంతమంది వస్తువులపై ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తూ ఆకర్షిస్తారు. ఇది నిజమని నమ్మి డబ్బు చెల్లించి, మీరు దానిని బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డెలివరీ రాదు. ఇలాంటి తరహా నాన్ డెలివరీ స్కామ్‌లు, నాన్ పేమెంట్ స్కామ్‌లు, గిఫ్ట్ కార్డ్ మోసాలు జరుగుతుంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు.
Don't let #holiday excitement cloud your judgment! Always verify the legitimacy of online retailers and be cautious with unsolicited offers. Learn how to spot a holiday scam at https://t.co/rg1Twt4Nq2. pic.twitter.com/RBgftlHngh
— FBI (@FBI) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment