online sales
-
గాడిద పాల సబ్బు.. డబ్బే డబ్బు
సాక్షి, అమరావతి: గాడిద పాలు లీటర్ రూ.3 వేలు. అదే లీటరు పాలతో సబ్బులు తయారు చేస్తే రూ.11,980 ఆదాయం. గాడిద పాలకంటే.. ఆ పాలతో తయారు చేసే ఉప ఉత్పత్తులు సైతం అధిక లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం గాడిద పాలకు ప్రపంచమంతా క్రేజ్ వచ్చింది. ఏపీలో తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని తోకాడ వద్ద ప్రారంభించిన అక్షయ డాంకీ ఫౌండేషన్ నాలుగేళ్లలోనే మంచి గుర్తింపు పొందింది. రూ.80 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో ప్రారంభించిన ఈ ఫామ్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి చేస్తోంది. ఈ పాలతో సబ్బులు, పాల పౌడర్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది. వారానికి 310 లీటర్ల పాల ఉత్పత్తిఅక్షయ డాంకీ ఫామ్‌లో దేశీయ నాటు గాడిదలతో పాటు అంతర్జాతీయంగా పేరొందిన హలారీ, కాట్వాడి, టోక్యో జాతులకు చెందిన గాడిదలున్నాయి. 80 గాడిదలతో ప్రారంభమైన ఈ ఫామ్‌లో ప్రస్తుతం వాటి సంఖ్య 120కు పెరిగింది. నాటు గాడిదలు రోజుకు సగటున 250–350 మిల్లీలీటర్ల పాలు ఇస్తుండగా, హలారి (గుజరాత్), కాట్వాడి (మహారాష్ట్ర), టోక్యో (ఇథియోఫియా) జాతి గాడిదలు రోజుకు 750 మిల్లీ లీటర్ల నుంచి 1.75 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ప్రారంభంలో వారానికి 240 లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా.. ప్రస్తుతం 310 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గాడిద పాలు పితికిన తర్వాత 3 గంటలకు మించి నిల్వ ఉండవు. పాశ్చురైజ్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే 3 రోజులు, డీప్ ఫ్రిజ్‌లో పెడితే 6 నెలలు, పౌడర్ రూపంలో అయితే రెండేళ్ల పాటు నిల్వ ఉంచొచ్చు. పిల్లలు తాగే పాలు లీటర్ రూ.3 వేలకు విక్రయిస్తుండగా.. కాస్మొటిక్ కంపెనీలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. మూత్రాన్ని లీటర్ రూ.450, పేడ కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువటగాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పాలలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ, ఈతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వే ప్రొటీన్, కాసియన్ ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడుతుందని, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగçపడుతుందని పేర్కొంటున్నారు. గాడిద మూత్రాన్ని ఆయుర్వేద మందుల తయారీ, పేడను ధూప్‌స్టిక్స్, ఎరువులుగా వాడతారు.ఈ–కామర్స్‌లో అమ్మకాలుగాడిద పాల సబ్బులు, గాడిద పాల పౌడర్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. త్వరలో స్కిన్ లోషన్‌తో పాటు మరిన్ని ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు ఫ్లేవర్స్‌లో సబ్బుల తయారీక్లియోపాత్ర చర్మ సౌందర్యానికి గాడిద పాలే కారణమని చెబుతారు. గాడిద పాలతోనే స్నానం చేసేదాననని తన స్వీయ చరిత్రలో ఆమె రాసుకున్నారు. గాడిద పాలతో తయారు చేసే సబ్బులను మోడల్స్, సినీతారలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటి వాడకం వలన శరీరం కాంతివంతమవుతుందని, చర్మం త్వరగా ముడతలు పడదని చెబుతారు.అక్షయ డాంకీ ఫౌండేషన్ ఇటీవలే ఫామ్‌లో కొత్తగా సబ్బులు, పాల పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. లావెండర్, గులాబీ, హనీ–బెంటోనైట్ క్లే, అలోవెరా–ఫ్రెంచ్ గ్రీన్ క్లే వంటి నాలుగు రకాల సబ్బులను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల సబ్బు తయారీకి 50 మిల్లీలీటర్ల పాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సబ్బును రూ.599 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఫామ్‌లో ఏడాదికి సుమారు 6 వేల సబ్బులు తయారవుతాయి.మిల్క్ పౌడర్కూ భలే గిరాకీగాడిద పాలతో తయారు చేసే పాల పౌడర్‌ను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు, బ్యూటీ కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారు. ఒక స్పూన్ పౌడర్ లీటర్ నీటిలో కలుపుకుంటే అవన్నీ పాలుగా మారిపోతాయి. ఆస్తమా రోగులు ఎక్కువగా ఈ పాలను సేవిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో పాల పౌడర్ ధర రూ.85 వేల పైమాటే. 13 లీటర్ల పాలతో కిలో పౌడర్ తయారవుతుంది. ఈ ఫామ్‌లో ఏటా 200 కేజీల పాల పౌడర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల పౌడర్ రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు. సబ్బులకు మంచి డిమాండ్నాలుగేళ్లలోనే ఫామ్‌ను విస్తరించాం. గాడిదల సంఖ్యతోపాటు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. సబ్బులు, పాల పౌడర్ తయారు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ఎం.ప్రదీప్, మేనేజర్, అక్షయ ఫౌండేషన్ -
ప్రేమికుల దినోత్సవం.. ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం!
ఈ వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లను ఆర్డర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై గులాబీలు, చాక్లెట్స్, రొ**** గిఫ్ట్‌ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వేడుకలు జరుగుతాయి. కానీ భారత్‌లో మాత్రం వారం రోజుల ముందు నుంచే ఊపందుకున్నాయి. దీంతో ఈ-కామర్స్,డేటింగ్ సైట్స్ యూజర్ల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రొ**** ప్రోడక్ట్స్, గిఫ్ట్‌ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్, 406 చాక్లెట్స్ వినియోగదారులు కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరీ చేశామని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం బ్లింకిట్ సీఈవో అల్బిందర్ థిండ్సా ట్వీట్ చేశారు. మరో 20,000కిపైగా చాక్లెట్స్, చాక్లెట్ బాక్స్‌లు మరో పది నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయని తెలిపారు. The peak is here and currently running at 406 CPM! More than 20k chocolates and chocolate boxes are on the way and will be delivered in the next 10 minutes ✌️ https://t.co/8ZGzncSzq3 — Albinder Dhindsa (@albinder) February 9, 2024 వాలెంటెన్స్ డే రోజు అమ్మకాలపై స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ట్వీట్ చేశారు. భారతీయులు వాలెంటెన్స్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని ట్వీట్ షేర్ చేశారు. అందులో నిన్నటి నుంచి వాలెటెంటైన్స్ కోసం కేక్ ఆర్డర్లు పెరిగాయి. గరిష్టంగా రాత్రి 10 గంటల సమయంలో నిమిషానికి ఏడు కేకు ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. అలాగే, ఎఫ్ఎన్పీ. కామ్ సంస్థ వాలెంటైన్స్ డే కి ఒక్కరోజు ముందు (ఫిబ్రవరి 13) నిమిషానికి 350 గులాబీలను అందజేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. అంతే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆన్లైన్ పెట్టే కేక్ ఆర్డర్లు నిమిషానికి అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. -
పోటెత్తుతున్న యూజర్లు.. ఆ సేవల్ని రద్దు చేసిన ‘ఫ్లిప్ కార్ట్’!
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్‌కార్ట్ పోర్టల్‌కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ సైట్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సైట్లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్లో చిన్న బ్యానర్‌ను డిస్ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం. ఫిర్యాదుల వెల్లువ అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సేవలు పున:ప్రారంభం అప్పుడే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రూ.90వేల కోట్ల ఆన్లైన్ అమ్మకాలు పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్‌సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్లైన్ విక్రయాలు జరిగాయి. -
తాజా గోల్డ్ బాండ్ @ రూ. 5926
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది. ఐదు రోజుల పాటు (19–23) స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ప్రకటిత ధరలో గ్రాముకు రూ.50 రిబేట్ లభిస్తుంది. అంటే ఆన్లైన్ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుందన్నమాట. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్ 19తో పాటు సెప్టెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ కూడా మరో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో ఉండే సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీమ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయొ చ్చు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసి యేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సగ టు ధర ఆధారంగా ఎస్జీబీ ధరను నిర్ణయిస్తారు. -
వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది!
ఇప్పటి వరకూ వివిధ రకాల వస్తువలు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో కార్లు ఆర్డర్ చేసే వెసులుబాటు వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల తన బెంగళూరు కస్టమర్ల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ‘వీల్స్ ఆన్ వెబ్’ పేరిట ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు షోరూంలకు వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి వద్దే ఉండి తమకు ఇష్టమైన టయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయొచ్చు. ఇంటి వద్దే కార్ డెలివరీ పొందవచ్చు. పత్రికా ప్రకటన ద్వారా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించిన టయోటా సంస్థ ‘వీల్స్ ఆన్ వెబ్’ అనేది బిజినెస్ టు కస్టమర్ (B2C) ప్లాట్‌ఫామ్ అని తెలిపింది. డిజిటల్ స్పేస్‌లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా కార్ కొనుగోలు చేసేవారు కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు, కలర్లు, వేరియంట్ల ప్రత్యేకతలను డిజిటల్‌గా వీక్షించవచ్చు. యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి విలువ-ఆధారిత సేవలను కూడా ఆన్లైన్లోనే ఎంచుకోవచ్చు. టయోటా వీల్స్ ఆన్ వెబ్‌లో కస్టమర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, పూర్తి మొత్తం లేదా డౌన్‌పేమెంట్‌ను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆన్లైన్ కార్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశనూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. తాము కొత్తగా ప్రారంభించిన వీల్స్ ఆన్ వెబ్ ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో కార్ల కొనుగోలు అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు. -
'నో కాస్ట్' ఈఎంఐ కిరికిరి, అసలు రహస్యం ఇది!
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రీటైల్, ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా పలు ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్నిఅందిస్తుంటాయి. అయితే ఈ నోకాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి? ఈ నోకాస్ట్ ఈఎంఐ వల్ల కొనుగోలు దారులకు లబ్ధి చేకూరుతుందా? దాని వెనుక ఏదైనా మతలబు దాగి ఉందా? ఏడాదిలో జరిగే ఫెస్టివల్స్ సీజన్లో సంస్థలు ప్రొడక్ట్‌ల అమ్మకాలు జరిగేలా నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. అందుకే కొనుగోలు దారులు గృహోపకరణాలు, వెహికల్స్, గాడ్జెట్స్‌ను ఫెస్టివల్ సీజన్లో కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఈ కొనుగోలు ముందు ఈ నోకాస్ట్ ఈఎంఐ గురించి తెలుసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే ముందుగా నో కాస్ట్ ఈఎంఐ అంటే? నోకాస్ట్ ఈఎంఐ కింద ఓ వస్తువును ఎంత ధర పెట్టి కొనుగోలు చేస్తామో.. ఆ మొత్తాన్ని నెలనెలా కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తానికే సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయవు. ఇలా నెలవారీ చెల్లించే ఈఎంఐలపై ఎలాంటి వడ్డీని విధించకపోవడాన్ని నోకాస్ట్ ఈఎంఐ అంటారు. నోకాస్ట్ ఈఎంఐ కిరికిరి ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అప్పుడే మార్కెట్లో విడుదలైన 5జీ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ కింద రూ.30వేలకు కొనుగోలు చేస్తాడు. ఆమొత్తాన్ని 10 నెలల టెన్యూర్ కాలానికి ఒక్కో నెల 3వేలు చెల్లించి.. ఈఎంఐని క్లియర్ చేస్తాడు. వడ్డీ లేదని తెగ సంబర పడిపోతుంటాడు. కానీ ఈ నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లో జరిగేది అదికాదు. రమేష్ ఫోన్ ధర వాస్తవానికి రూ.27వేలు ఉంటుంది. సంస్థలు అదనంగా మరో రూ.3వేలు జత చేసి.. ఫోన్ ధర రూ.30వేలు ఉందని, మీకు డిస్కౌంట్లో జీరోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఊదర గొట్టేస్తుంటాయి. మరో రకమైన వసూలు మరో రకంగా చెప్పాలంటే అదే రమేష్ కొన్న 5జీ ఫోన్ వాస్తవ ధర రూ.30 వేలు ఉంటుంది. కానీ ఫోన్ తయారీ సంస్థలు జీరో కాస్ట్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి. ఆ ప్రాసెసింగ్ ఫీజు ఏంటో తెలుసా? మీకు అందించే ఈఎంఐ కింద సంస్థలు వసూలు చేసే వడ్డీ. తస్మాత్ జాగ్రత్త కాబట్టి, కొనుగోలు దారులు నోకాస్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే.. తప్పని సరిగా నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. చదవండి👉 ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
దుమ్ములేపుతున్న ఆన్లైన్ అమ్మకాలు, ఏకంగా రూ. 94 వేల కోట్ల బిజినెస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ కంపెనీల జోరు కొనసాగుతోంది. దీపావళితో ముగిసే నెల రోజుల పండుగల సీజన్లో ఆన్లైన్ వేదికగా రూ.94 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే ఇది 28 శాతం అధికమని వెల్లడించింది. పెరిగిన వినియోగదార్ల సంఖ్యకు అనుగుణంగా అమ్మకాలు అధికంగా ఉంటాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేట్ పార్ట్నర్ సంజయ్ కొఠారీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ షాపర్స్ రెండింతలు కానున్నారని వివరించారు. ఫెస్టివ్ సేల్స్ పట్ల అవగాహన, విస్తృతి పెరగడం, కస్టమర్ల లక్ష్యంగా ఎంపికలు, ఉత్పత్తుల శ్రేణి విరివిగా అందుబాటు ధరలో ఉండడం ఇందుకు కారణమన్నారు. 2021లో ఆన్లైన్ సేల్స్ రూ.4,14,232 కోట్లు నమోదైంది. ప్రస్తుత సంవత్సరం ఇది 30 శాతం అధికమై రూ.5,41,688 కోట్లకు చేరనుందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. | నాలుగింతల వృద్ధి.. ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 2018తో పోలిస్తే ఈ ఏడాది నాలుగింతల వృద్ధి నమోదు కానుందని రెడ్‌సీర్ తెలిపింది. ‘డిజిటల్ వైపు కస్టమర్లు బాట పట్టడం, ద్వితీయ శ్రేణి నగరాల్లో వినియోగదార్ల సంఖ్య పెరగడం ఈ స్థాయి వృద్ధికి దోహదం చేయనుంది. సీజన్ తొలి వారం రూ.47 వేల కోట్ల వ్యాపారం జరిగే చాన్స్ ఉంది. ఫ్యాషన్ విభాగం గణనీయంగా దూసుకెళ్లనుంది. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి కస్టమర్లు పెరగడమే ఇందుకు కారణం. అలాగే తొలిసారిగా ఆన్‌లైన్‌కు మళ్లినవారు ఫ్యాషన్‌ను ఎంచుకుంటారు. ఫ్యాషన్ బ్రాండ్స్ ఎక్కువ మొత్తంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. మెరుగైన డీల్స్, నూతన ఆవిష్కరణల కారణంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్ విభాగం బలమైన పనితీరు కనబర్చనుంది. లైవ్, వీడియో కామర్స్‌తో ఆన్లైన్ షాపర్స్ సంఖ్య మరింత పెరుగుతుంది’ అని వివరించింది. -
మరో ఆరు లేపాక్షి షోరూమ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హస్తకళలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించడంతోపాటు వాటికి బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో లేపాక్షి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటి తయారీలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా కళాకారులు 23 రకాల హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మరింత ఉపాధి చూపడంతోపాటు ఆ కళలను బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతమున్న 17 లేపాక్షి ఎంపోరియంలకు అదనంగా ఇప్పుడు మరో ఆరు కొత్త షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విశాఖపట్నం, విశాఖ విమానాశ్రయం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుమల, తిరుపతి, తిరుపతి శ్రీనివాసమ్, విష్ణు నిలయం, తిరుపతి విమానాశ్రయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీలో లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయి, కొత్తగా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గండికోట, కడప, తిరుపతిలో కూడా మరిన్ని షోరూమ్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో షోరూమ్ ఏర్పాటుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. హస్తకళల ప్రోత్సాహానికి బహుముఖ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ’ ద్వారా హస్తకళలను ప్రోత్సహించేలా బహుముఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా క్రాఫ్ట్‌మేళా, ఎగ్జిబిషన్, ప్రచారం, మార్కెటింగ్ వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే.. మరికొంత మందికి ఉపా«ధి కల్పించేందుకు పెద్దఎత్తున శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ‘కామన్ ఫెసిలిటి సర్వీస్ సెంటర్ (సీఎఫ్‌ఎస్‌సీ)లను ఏర్పాటుచేస్తోంది. వాటికి అవసరమైన మౌలిక వసతులు, యంత్రాలు, పరికరాలను ఏర్పాటుచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతోంది. ఒకే గొడుగు కిందకు నైపుణ్యాన్ని, తయారీని, విక్రయాలను తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు ఇక రాష్ట్రంలో పేరెన్నికగన్న హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతోపాటు తోలు బొమ్మలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ–కామర్స్ పాŠల్ట్ఫామ్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో కూడా ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.35 లక్షలు విలువైన హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
పసిడి ‘ధనత్రయోదశి’ ధగధగలు
ముంబై: ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా కారణంగా గతేడాది డిమాండ్ తగ్గగా.. ఈ ఏడాది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. కొనుగోళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ఆన్లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. 15 టన్నుల ఆభరణాలు.. జ్యుయలరీ పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ మేర సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాలు విక్రయాలు ధనత్రయోదశి రోజున నమోదయ్యాయి’’ అని తెలిపింది. గత డిమాండ్ తోడవ్వడం, ధరలు అనుకూలంగా ఉండడం, లాక్డౌన్ ఆంక్షలు సడలిపోవడం డిమాండ్‌కు మద్దతునిస్తాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈవో సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి సంవత్సరాల్లోనే బంగారానికి అత్యంత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరామ్‌గార్గ్ సైతం తెలిపారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్ రెట్టింపైనట్టు ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొథారి పేర్కొన్నారు. 20–30 టన్నుల మేర.. ‘‘బంగారం ధరలు 2019తో పోలిస్తే పెరిగినప్పటికీ.. కరోనా ముందు నాటి స్థాయికి విక్రయాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాము’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆవిష్ పెథే తెలిపారు. ఏటా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల బంగారం అమ్ముడుపోతోందని.. ఈ ఏడాది విక్రయాలు కొంచెం అధికంగానే ఉంటాయని పరిపరిశ్రమ వరా>్గలు వెల్లడించాయి. బంగారం ధరలు తులం రూ.57,000 స్థాయి వరకు వెళ్లి దిగి రావడం కూడా డిమాండ్‌కు కలిసొచ్చింది. ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర రూ.47,644 (పన్నులు కాకుండా) పలికింది. అయితే 2020 ధనత్రయోదశి రోజున ఉన్న ధర రూ.39,240తో పోలిస్తే కాస్త పెరగడం గమనార్హం. బుధవారం ఉదయం వరకు త్రయోదశి తిథి ఉన్నందున ఆ రోజు కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగనున్నాయి. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనండి హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వద్ద నమోదైన వర్తకులకు చెందిన దుకాణాల్లో మాత్రమే హాల్‌మార్క్ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదార్ల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ‘బిల్లు/ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్‌మార్క్ ఆభరణాల విక్రయ బిల్లు, ఇన్వాయిస్లో.. ప్రతి ఆభరణం తాలూకు ప్రత్యేక వివరణ, విలువైన లోహం నికర బరువు, క్యారెట్లో స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ రుసుమును సూచిస్తుంది’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
రూ. 100కే గోల్డ్..! సరికొత్త వ్యూహంతో గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీలు..!
దేశవ్యాప్తంగా కరోనా, లాక్డౌన్ పరిస్థితుల ప్రభావంతో బంగారం అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే బంగారం అమ్మకాలు తిరిగి పుంజుకుంటున్నాయి. కొనుగోలుదారులు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో బంగారం కొనుగోలుపై గణనీయంగా దృష్టిసారించారు. దీంతో పలు జ్వువెలరీ కంపెనీలు కూడా ఆన్లైన్ అమ్మకాలపై దృష్టిపెట్టాయి. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే రూ.100 కే గోల్డ్..! తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్ జ్వువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా బంగారం అందించే ప్లాన్స్‌తో ముందుకువస్తున్నాయి. కంపెనీ వెబ్సైట్లలో లేదా ఇతర థర్డ్‌యాప్స్ ద్వారా విక్రయించే ఆఫర్లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్ జ్యవెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి. డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్‌కు కొత్తేమీ కాదు...పేటిఏమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి మొబైల్ వ్యాలెట్స్ డిజిటల్ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు , వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్గోల్డ్ ఆయా మొబైల్ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్లైన్లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్మాంట్ గోల్ట్ డైరక్టర్ కేతన్ కొఠారి పేర్కొన్నారు. అమ్మకాలను పెంచేందుకు..! దసరా, ధంతేరాస్, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జ్యువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్లైన్లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు గోల్డ్ జ్యువెలరీ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై ఎక్కువ బంగారం కొనుగోలు దారులు ఆసక్తిని చూపుతున్నారు. చదవండి: భారతీయుల హైట్ తగ్గిపోతోంది!!.. కాలుష్యంతో పాటు ఇవే కారణాలు -
ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు టెక్ నిపుణుల వెంట పడ్డాయేంటి? అన్న సందేహం రాకమానదు. కానీ, కరోనా అనంతరం మారిన పరిస్థితులు, ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కంపెనీలు టెక్నాలజీ నిపుణులపై పెద్ద ఎత్తున ఆధారపడడం తప్పడం లేదు. అధిక వేతనం ఆఫర్ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా టెక్నాలజీ నిపుణులను ఆటోమొబైల్ కంపెనీలు నియమించుకుంటున్నాయి. 35–40 శాతం అధిక వేతన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పెద్ద ఎత్తున డిజిటైజేషన్ నడుస్తుండడం.. వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడం కారణంగా.. ఆన్లైన్ విక్రయాలను పెంచుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో సమస్యలను అధిగమించేందుకు.. కొనుగోళ్లు, తయారీ కార్యక్రమాల పర్యవేక్షణకు టెక్నాలజీయే కీలకమని అవి గుర్తించాయి. వీరికి డిమాండ్ టీమ్‌లీజ్ సంస్థ వద్దనున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నిపుణల నియమాకాలు కరోనా ముందు 2019తో పోలిస్తే 45 శాతం పెరగడం గమనార్హం. ‘‘గత రెండేళ్ల నుంచి వినియోగదారులు ఆన్లైన్ వేదికలపై వాహనాల గురించి తెలుసుకొని, కొనుగోలు చేయడం పెరిగింది. దీంతో ఆటోమోటివ్ కంపెనీలు కార్యకలాపాలను డిజిటైజ్ చేసి, వర్చువల్ విక్రయాలకు (ఆన్లైన్) వీలు కల్పించేందుకు, సౌకర్యం, సమర్థత పెంచేందుకు ఎక్కువ సమయం కృషి చేస్తున్నాయి’’ అని టీమ్‌లీజ్ డిజిటల్ ఏవీపీ (డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్) మునీరా లోలివాలా చెప్పారు. వాహన తయారీదారులు తమ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా డిజిటల్‌గా మార్చేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల స్థాయిలో వనరులను మెరుగ్గా వినియోగించుకోవడంతోపాటు.. మొత్తం కొనుగోలు ప్రక్రియను మార్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నిపుణుల అవసరాలను గణనీయంగా పెంచినట్టు లోలివాలా చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, వాహన ముందస్తు నిర్వహణ విభాగాల్లో నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 18 వేల మంది.. ప్రస్తుత త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) 18,000 టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడినట్టు లోలివాలా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 25,000ను చేరుకోవచ్చని ఆమె చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్ 15–18 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. విక్రయాలు, మార్కెటింగ్ విభాగాల్లో డేటా అనలిటిక్స్ నిపుణుల నియామకాలను పెంచినట్టు కార్ల తయారీ సంస్థలు సైతం అంగీకరిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్ చానళ్లవైపు మళ్లడంతో విచారణ నిర్వహణకు హైపర్ లోకల్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ప్రస్తుతం 35 శాతం విచారణలు (కొనుగోళ్లకు సంబంధించి వివరాలు) డిజిటల్ చానళ్ల నుంచే వస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. లాక్డౌన్ల సమయాల్లో అయితే ఇది 50 శాతం వరకు ఉంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. విక్రయాలకు సంబంధించి 26 టచ్పాయింట్లకు గాను 24ను డిజిటల్‌గా మార్చినట్టు.. మిగిలినవి కేవలం పరీక్షల కోసం ఉద్దేశించినవిగా చెప్పారు. ‘‘డిజిటల్ టూల్స్‌తో మా ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో డేటాను ఉపయోగించుకుని కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలన్నది మా ప్రయత్నం. ఇటువంటి అధునాతన డిజిటల్ టూల్స్ వినియోగం వల్ల సీఆర్ఎం కార్యకలాపాలకు సంబంధించి నియామకాల్లో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డిమాండ్ ఇలా... - ఆటోమొబైల్ రంగంలో ఈ త్రైమాసికంలోనే 18,000 నిపుణులకు డిమాండ్ నెలకొంది. - ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 నియామకాలకు డిమాండ్ పెరగొచ్చన్న అంచనా. - 2022–23లో ఇటువంటి నిపుణులకు 15–18% అదనపు డిమాండ్ ఉండొచ్చు. - ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో చేయి తిరిగి నిపుణులకు డిమాండ్ 45 శాతం పెరిగింది. - 35–40 శాతం అధిక వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. చదవండి: ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు -
నేతన్నలకు బాసటగా శ్రీకాకుళం టెకీలు
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖద్దరు.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా రాజకీయ ప్రముఖులు దీనిని బాగా ఇష్ట పడతారు. ఇవన్ని నాణెనికి ఒక వైపు. పొందూరు ఖద్దరు ఎంత దర్జగా ఉంటుందో దాన్ని నేసే వారి బతుకులు అంత దీనంగా ఉంటాయి. ప్రాణం పెట్టి నేసిన బట్టలను అమ్ముకునే పరిజ్ఞానం కొరవడటంతో నేతన్నలు ఎంతో మోసపోతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలవడానికి కొందరు యువ టెకీలు ముందుకు వచ్చారు. పొందూరు ఖద్దరు ఉత్పత్తుల అమ్మకం కోసం ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఫైన్ కాటన్‌కు ఎంతో గుర్తింపు. కానీ సరైన మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియకపోవడంతో నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిపై డాక్యుమెంటరీ రూపొందించాలని శ్రీకాకుళానికి చెందిన నలుగురు యువ టెకీలు పోగిరి జవాంత్ నాయుడు, సూరజ్ పోట్నురు, సైలేంద్ర, భరద్వాజ్ నేతన్నలను సంప్రదించారు. ఈ క్రమంలో నేతన్నల కుటుంబాలు రోజుకు కనీసం రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుసుకుని షాక్ అయ్యారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: ‘సిరి’సిల్ల మురుస్తోంది..!) దానిలో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి గాను చేనేత కార్మికులను దీనిలో చేరేలా ప్రేరేపించారు. ప్రారంభంలో కొందరు ఎంపిక చేసిన కస్టమర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జశ్వంత్ నాయుడు మాట్లాడుతూ.. ‘పొందూరు నేతన్నలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మమ్మల్ని కదిలించాయి. వారికి సాయం చేయాలని భావించాం. ఇందుకు గాను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపిందించాము. దానిలో భాగంగానే ‘లూమ్2హోమ్’ వెబ్ పేజ్ క్రియేట్ చేశాం. ప్రస్తుతం దీన్ని రినోవేట్ చేస్తున్నాం. సోమవారం నుంచి అదనపు పేజీలతో అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. -
5జీ మొబైల్స్ సందడి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇప్పటికీ టెలికం రంగంలో 4జీ సేవలు విస్తరించలేదు. మరోవైపు 5జీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు దూకుడుగా ఉన్నాయి. 5జీ మోడళ్లతో పోటీకి సై అంటున్నాయి. ఐడీసీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబరులో భారత్‌లో 10 లక్షల పైచిలుకు 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఇది 500 శాతం అధికం. దీనినిబట్టి చూస్తే అటు కస్టమర్లూ నూతన టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 5జీ సేవలు రాకముందే ఈ స్మార్ట్ఫోన్లు పెద్ద ఎత్తున వినియోగదార్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని టెలికం రంగం అంచనా వేస్తోంది. క్వాల్‌కాం, మీడియాటెక్ వంటి చిప్సెట్ తయారీ సంస్థలు నూతన టెక్నాలజీ చిప్సెట్లను ఆఫర్ చేస్తున్నాయి. సేవల కంటే ముందే చిప్సెట్ల ధరలూ దిగొస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి.. యాపిల్, శామ్సంగ్, షావొమీ, వన్‌ప్లస్, ఆసస్, వివో, ఒప్పో, మోటరోలా, రియల్మీ, హువావే ఇప్పటికే భారత 5జీ హ్యాండ్సెట్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. హానర్, సోని, నోకియా, గూగుల్, ఎల్జీ, నూబియా, బ్లాక్‌షార్క్, జడ్‌టీఈ, టీసీఎల్, మీజు, షార్ప్ త్వరలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో 40 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ.24,000 నుంచి ప్రారంభం. త్వరలో 120కి పైగా కొత్త మోడళ్లు రానున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ స్మార్ట్ఫోన్ల ధర పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమని బిగ్–సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఇప్పటికే సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.14–15 వేలకు వచ్చింది. 5జీ విషయంలో తయారీ సంస్థలు, కస్టమర్లు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే 5జీ టెలికం సేవలు త్వరితంగా అందుబాటులోకి వస్తాయి’ అని అన్నారు. వచ్చే ఏడాది నుంచి.. భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 5జీ మోడళ్ల రాక క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021 ప్రారంభంలో రూ.15,000–25,000 ధరల శ్రేణిలో స్మార్ట్ఫోన్లన్నీ 5జీ టెక్నాలజీతో రానున్నాయని అంచనా. రూ.8–15 వేల ధరల శ్రేణిలో మోడళ్లు వస్తే కొనుగోళ్లు అనూహ్యంగా అధికమవుతాయని సెల్ పాయింట్ ఫౌండర్ మోహన్ ప్రసాద్ పాండే తెలిపారు. సోషల్ మీడియాలో యువత చాలా చురుకుగా ఉంటోంది. 5జీ టెక్నాలజీ వస్తే ఫొటోలు, వీడియోలు వేగంగా అప్లోడ్ చేసుకోవచ్చు, వీక్షించొచ్చు అని అన్నారు. 5జీ హ్యాండ్సెట్స్ కోసం కస్టమర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు. బ్రాండ్స్ దూకుడు చూస్తుంటే 4జీ నుంచి 5జీకి వినియోగదార్లు సులభంగా మళ్లుతారని టెక్ఆర్క్ అనలిస్ట్ ఫైజల్ కవూసా చెప్పారు. 3జీ నుంచి 4జీకి కస్టమర్ల ఆదరణకు నాలుగేళ్లు పట్టింది. 2012లో దేశంలో 4జీ ప్రారంభం అయినప్పుడు ఒక్క బ్రాండ్ నుంచి కూడా స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 5జీ విషయంలో ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఆరేళ్లలో 35 కోట్లకు 5జీ యూజర్లు ► ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల కనెక్షన్లు ► 2026 నాటికి ఎరిక్సన్ అంచనా న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ కనెక్షన్లు 2026 నాటికి 35 కోట్లకు చేరవచ్చని అంతర్జాతీయ టెలికం సంస్థ ఎరిక్సన్ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్స్ సంఖ్య 350 కోట్లకు చేరగలవని ’ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ 2020’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో స్పెక్ట్రం వేలం నిర్వహించిన పక్షంలో 2021లోనే భారత్‌లో తొలి 5జీ కనెక్షన్ అందుబాటులోకి రాగలదని ఎరిక్సన్ నెట్వర్క్ సొల్యూషన్స్ విభాగం హెడ్ (ఆగ్నేయాసియా, భారత్) నితిన్ బన్సల్ తెలిపారు. ‘2026లో ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ కవరేజీ ఉంటుంది. కనెక్షన్ల సంఖ్య 350 కోట్ల దాకా చేరొచ్చని అంచనా. భారత్‌లో 5జీ సబ్స్క్రైబర్స్ సంఖ్య 35 కోట్లు దాటిపోవచ్చు. 2026లో మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో దీని వాటా 27 శాతంగా ఉండవచ్చు‘ అని బన్సల్ పేర్కొన్నారు. టెలికం సేవలకు సంబంధించి భారత్‌లో ప్రస్తుతం ఎల్టీఈ (4జీ) టెక్నాలజీదే ఆధిపత్యం ఉందని, మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో దీని వాటా 63 శాతంగా ఉందని నివేదికలో వెల్లడైంది. 2026 నాటికి దశలవారీగా 3జీ సేవలు నిల్చిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఎల్టీఈ యూజర్ల సంఖ్య 2020లో 71 కోట్లుగా ఉండగా 2026 నాటికి సుమారు 2 శాతం వార్షిక వృద్ధితో 82 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
త్వరలో ప్రభుత్వం నుంచి దేశీ అమెజాన్
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త! త్వరలో దేశీయంగా అమెజాన్ తరహా ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఆవిర్భవించనుంది. ఇందుకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించడం విశేషం! ఇందుకు వీలుగా నిపుణులతో కూడిన ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. త్వరలో ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రభుత్వమే దేశీ ఈకామర్స్ బిజినెస్‌కు తెరతీయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తద్వారా ఈకామర్స్ రంగంలో జరుగుతున్న కొన్ని అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నళ్లుగా దేశంలో ఈకామర్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ వస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కోవిడ్-19 దీనికి జత కలిసింది. దీంతో దేశీయంగా పండుగల సీజన్ అయిన గత నెల రోజుల్లోనే ఈకామర్స్ ద్వారా రూ. 61,000 కోట్లకుపైగా(8.3 బిలియన్ డాలర్లు) బిజినెస్ జరగడం గమనార్హం! అయితే ఆన్లైన్ అమ్మకాలలో కొన్న అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని సీరియస్‌గా పరిగణిస్తున్న ప్రభుత్వం లోపాలకు చెక్ పెట్టేందుకు వీలుగా దేశీ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కఠిన నిబంధనలను రూపొందించేందుకు వీలుగా స్టీరింగ్ కమిటీని సైతం ఎంపిక చేసినట్లు తెలియజేశారు. కమిటీ ఇలా డిజిటల్ కామర్స్‌కు చెందిన ఓపెన్ నెట్వర్క్(ఓఎన్డీసీ) విధానాలకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి విధానాలు రూపొందించనుంది. ఇందుకు అనుగుణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల తరహా తుది స్టోర్ఫ్రంట్ తదితర మౌలిక సదుపాయాలను ఓఎన్డీసీ సమకూర్చనుంది. ఈ విషయాలపై వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో ప్రభుత్వ రంగానికి చెందిన పలు విభాగాల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసింది. డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. కమిటీలో ఈమార్కెట్, ఎంఎస్ఎంఈ, నితి ఆయోగ్, ఎన్పీసీఐ, ఎన్ఎస్డీఎల్ అధికారులతోపాటు.. జాతీయ ట్రేడర్ల సమాఖ్య, దేశీ రిటైలర్ల అసోసియేషన్ నుంచి ప్రతినిధులకు చోటు కల్పించింది. ఎందుకంటే? పలు అవకతవకలకు చోటున్న ఈకామర్స్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వివిధ ప్లాట్‌ఫామ్స్ వృద్ధి చెందేందుకు వీలు కల్పించడం, కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం తదితరాలకు తెరతీయాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో ఈకామర్స్ బిజినెస్‌ను పటిష్ట పరచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి సొంత ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్త విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. అంతేకాకుండా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈకామర్స్ సంస్థలు అవలంబిస్తున్న విధానాలపై కొద్ది నెలలుగా దేశీ రిటైల్ రంగ సంస్థలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రాండ్లతో భాగస్వామ్యం, భారీ డిస్కౌంట్లు, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అంశాలపైనా ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. -
30 రోజుల్లో రూ. 61,000 కోట్ల అమ్మకాలు
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈకామర్స్ కంపెనీలకు మాత్రం జోష్‌నిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్‌గా పేర్కొనే ఈ కాలంలో ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్‌చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ విడుదల చేసిన నివేదిక వివరాలివి. నిజానికి 7 బిలియన్ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్‌సీర్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయ్... 88 శాతం వృద్ధి గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ కస్టమర్లలో ఈ ఏడాది 88 శాతం వృద్ధి నమోదైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి నమోదైన 4 కోట్లమంది వినియోగదారుల కారణంగా అధిక వృద్ధి సాధ్యమైంది. కాగా.. అమ్మకాలలో ప్రధానంగా మొబైల్ ఫోన్ల హవా కనిపించింది. అయితే చిన్న పట్టణాల నుంచి పెరిగిన కొనుగోలుదారుల నేపథ్యంలో ఒక్కో కస్టమర్‌పై సగటు ట్రేడ్ విలువ అంటే జీఎంవీ రూ. 7,450 నుంచి రూ. 6,600కు తగ్గింది. అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాలలో 66 శాతం వాటాను ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకుంది. తాజా పండుగల అమ్మకాల ప్రకారం దేశీయంగా ఈకామర్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో ఫ్లిప్‌కార్ట్ ఈసారి 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదేవిధంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచీ కస్టమర్లను ఆకట్టుకుంది. రూ. కోటికిపైగా సుమారు 600 మంది అమ్మకందారులు రూ.కోటికిపైగా విలువైన విక్రయాలు సాధించగా.. 6387 పిన్‌కోడ్స్ నుంచి సెల్లర్స్‌కు ఆర్డర్లు లభించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక 6,500 మంది విక్రేతలు రూ. 10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించినట్లు తెలియజేసింది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించినట్లు పేర్కొంది. కారణాలివీ భారత్, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలోనూ ఈకామర్స్ కంపెనీలు గరిష్ట స్థాయిలో వస్తువులను అందుబాటులో ఉంచడం అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు రెడ్‌సీర్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బ్రాండ్లు, ఫైనాన్సింగ్ ఒప్పందాలు దీనికి జత కలసినట్లు తెలియజేసింది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ స్థాయి పట్టణాలకు పెరిగిన ఉద్యోగుల వలస, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు వంటి అంశాలు ఆన్లైన్ అమ్మకాలకు దోహదపడినట్లు అభిప్రాయపడింది. కొనుగోలుదారులు అటు ఖరీదైన లేదా ఇటు కారుచౌక వస్తువులకంటే అందుబాటు ధరల ఐటమ్స్‌కే మొగ్గు చూపినట్లు వివరించింది. -
కరోనా వైరస్ కలిసొచ్చింది...
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అమ్మకాలకు కరోనా వైరస్ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో జోరుగా సాగాయి. 2019తో పోలిస్తే 2020 పండుగ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదైందని క్రెడిట్, పేమెంట్ స్టార్టప్ స్లైస్ తెలిపింది. 74 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో, 26 శాతం ఆఫ్‌లైన్‌లో జరిగాయని పేర్కొంది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో 71 శాతం మంది నెలవారి వాయిదా (ఈఎంఐ) వినియోగించారు. గతేడాది ఈఎంఐ వాటా 58 శాతంగా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌కు యువతరం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, సగటున నాలుగు నెలల ఈఎంఐ వ్యవధి కాలాన్ని ఎంచుకున్నారని సర్వే తెలిపింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 2 లక్షల మంది యంగ్ ఇండియన్స్ వ్యయ సరళిని విశ్లేషించింది. సెప్టెంబర్ నెలలో యంగ్‌స్టర్స్ ఖర్చు ఎక్కువగా చేశారని, ఇది కోవిడ్ ముందు కంటే ఎక్కువగా జరిగాయని స్లైస్ ఫౌండర్ అండ్ సీఈఓ రాజన్ బజాజ్ తెలిపారు. ప్రతి కస్టమర్ లావాదేవీలో 150 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. స్లైస్ మొత్తం లావాదేవీల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కలిపి 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎన్నాడు లేనంతగా ఈ ఏడాది పండుగ సీజన్లో స్లైస్‌లో అత్యధిక లావాదేవీ పరిమాణాన్ని చూశామని ఆయన చెప్పారు. అమెజాన్‌లో 60 శాతం మంది వినియోగదారులు, 40 శాతం మంది ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేశారని తెలిపారు. మింత్ర, జబాంగ్ వంటి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌తో కలిపి చూస్తే మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య వరుసగా 45, 55 శాతం వినియోగదారులు షాపింగ్ చేశారు. -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు!
న్యూఢిల్లీ: దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు రూటు మార్చేశాయి. కొనుగోలుదారులు ఈ–కామర్స్ బాటపట్టడంతో ఎఫ్ఎంసీజీలు కూడా అదే బాటపట్టాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మొదలైన ఎఫ్ఎంసీజీల ఈ–కామర్స్ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా కంపెనీల మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 2–8 శాతం వరకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆన్లైన్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2020లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఈ–గ్రాసరీ మార్కెట్ 2024 నాటికి 18.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని రెడ్‌సీర్, బిగ్‌బాస్కెట్ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన నెస్లే, హిందుస్తాన్ యూనిలివర్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్, మారికో వంటి సంస్థల ఆన్లైన్ అమ్మకాలు క్యూ2లో అధిక స్థాయిలో జరిగాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే కొనుగోలుదారులు ఈ–కామర్స్ కొనుగోళ్ల మీదే మక్కువ చూపించడమే ఈ వృద్ధికి కారణం. గతేడాది హెచ్‌యూఎల్ మొత్తం అమ్మకాల్లో 3 శాతంగా ఉన్న ఆన్లైన్ అమ్మకాలు ఈ ఏడాది క్యూ2 నాటికి 6 శాతానికి పెరిగింది. నెస్లే కంపెనీ ఈ–కామర్స్ సేల్స్ కూడా సెప్టెంబర్ నాటికి రెట్టింపయింది. ‘గతేడాదితో పోలిస్తే నెస్లే ఆన్లైన్ సేల్స్‌లో 97 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా 4 శాతంగా ఉందని’’ నెస్లే చైర్మన్ సురేష్ నారాయనన్ తెలిపారు. ప్యాకేజ్ ఫుడ్స్‌కు డిమాండ్.. కొనుగోలుదారులు ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అందుకే మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్‌క్యాట్ చాక్లెట్స్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. లాక్డౌన్ సమయంలో ఈ–గ్రాసరీ షాపింగ్ జోరుగా సాగింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ–కామర్స్‌దే హవా నడుస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఈ–కామర్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదారులు ఎక్కువగా గ్రాసరీలను కొంటున్నారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. గతేడాది 2.3 శాతంగా ఉన్న ఐటీసీ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలు గత 12 నెలల్లో 4.2 శాతానికి పెరిగింది. ఐటీసీ ఉత్పత్తులైన సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ పిండి ఆన్లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడాదిక్రితం డాబర్ అమ్మకాల్లో 1.5 శాతంగా ఉన్న ఆన్‌ౖ లెన్ సేల్స్ వాటా ప్రస్తుతం 6 శాతానికి పెరిగింది. 2–8 శాతం ఆన్లైన్ వాటా.. దేశంలోని అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కనీసం 2–8 శాతం మధ్య ఉన్నాయి. ఈ–కామర్స్ వృద్ధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది స్థానిక కిరాణా స్టోర్లు కూడా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. గ్రాసరీ మార్కెట్లో ఆన్లైన్ వాటా 0.5 శాతంగా మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధిలో అమూల్ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు 3 శాతం నుంచి 7–8 శాతానికి పెరిగిందని కంపెనీ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. రాబోయే కాలంలో మరింత వృద్ధి కనబరుస్తుందని పేర్కొన్నారు. ఈ–కామర్స్ అమ్మకాలు దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తాయని మారికో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా తెలిపారు. మారికో ఉత్పత్తులైన పారాచ్యూట్ హెయిర్ ఆయిల్, సఫోలా ఓట్స్ ఉత్పత్తులు సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో ఆన్లైన్ వాటా 8 శాతంగా ఉంది. -
కరోనా ఎఫెక్ట్ : దూసుకుపోయిన అమెజాన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్ లాభాల్లో దూసుకుపోయింది. క్యూ3లో బ్లాక్ బస్టర్ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ భారీగా పుంజుకున్నాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో వృద్ది నమోదైంది. దీంతో మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఏడాది క్రితంతో పోలిస్తే లాభాలు మూడు రెట్లు పెరిగాయని కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం పెరిగాయి. దీంతో కరోనావైరస్ మహమ్మారి కాలంలో భారీగా లాభపడిన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. (అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు) ఏడాది క్రితం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,655 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం లాభం 6.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46,764 కోట్లు) గా నమోదయ్యాయి. ఆదాయం 37 శాతం పెరిగి 96.15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,12,824 కోట్లు) పెరిగాయి. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధిని 11.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 86,504 కోట్లు) సాధించిందని కంపెనీ తెలిపింది. -
ఈసారి ఈ–కామర్స్‌కు పండుగే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్‌సీర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు. ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ ఇందుకే.. కోవిడ్–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్ ఆధారిత షాపింగ్ విధానంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త షాపింగ్ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్ సంస్థ తెలిపింది. కస్టమర్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తులను భారీ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది పండుగ సీజన్ తొలి రోజుల్లోనే గతేడాది మొత్తం ఆన్లైన్ కస్టమర్ల సంఖ్యను అధిగమించవచ్చని సర్వే అంచనా వేస్తుంది. కోవిడ్–19తో పెరిగిన డిజిటల్ లావాదేవీలు: మాల్స్, రిటైల్ అవుట్‌లుక్ లాంటి అధిక సంచారం కలిగిన ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేసేందుకు ఇప్పటికీ ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ఆఫ్‌లైన్ అమ్మకాల రికవరీ ఇంకా బలహీనంగా నే ఉన్నట్లు సర్వే తెలిపింది. కిందటేడాది ఆన్లైన్ ద్వారా 40–50 మిలియన్ మంది షాపింగ్ చేశారు. కోవిడ్–19 డిజిటల్ లావాదేవీలను మరింత పుంజుకునేలా చేసింది. సంప్రదాయ ఆఫ్‌లైన్ వినియోగదారుల్ని, ఆన్‌లైన్‌కు మళ్లించింది. ఫలితంగా ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ వినియోగదారులు ఏకంగా 70శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని అంశాలు.. బలమైన జాతీయవాద మనోభావంతో కేంద్రం ఇచ్చిన ఆత్మనిర్భర్ నినాదంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ వంటి విభాగాల్లో కస్టమర్లు ‘‘బ్రాండ్’’ను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వే తెలిపింది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి ఆగిపోవడంతో మొబైల్, అప్లికేషన్లు గతేడాదితో పోలిస్తే డిమాండ్ కాస్త తక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. గృహోపకరణాలకు డిమాండ్ ఉంటుదని సర్వే చెబుతోంది. -
కరోనా బిలియనీర్లు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొందరి వ్యాపార జీవితాల్నే మార్చేసింది. ఓ వైపు కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. మరోవైపు సరికొత్త వ్యాపార అవకాశాలతో కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా చేతికి తొడుక్కునే గ్లవ్స్ తయారు చేసే కంపెనీల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మలేíసియాలో రబ్బరు గ్లవ్స్ తయారుచేసే సూపర్ మాక్స్ కంపెనీ తొలిసారిగా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరినట్టు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. కరోనా వేళ సూపర్ మాక్స్ షేర్ 400 శాతం పెరగడంతో ఆ సంస్థ ఫౌండర్ థాయ్ కిమ్ సిమ్ బిలయనీర్ల క్లబ్లో చేరారు. అదేవిధంగా టాప్ గ్లవ్స్ కంపెనీ షేరు ధర సుమారు రెండున్నర రెట్లు పెరగడంతో ఆ సంస్థ వ్యవస్థాపకుడు లిమ్ వీ చాయ్ కూడా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. హర్టేలిగా కోసన్ షేర్ ధరలు 100 శాతం పెరగడంతో వీటి అధిపతుల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ఇక దేశంలోని అన్ని ఫార్మా కంపెనీల షేర్లూ భారీగా పెరిగాయి. అదే బాటలో కొన్ని టెక్నాలజీ కంపెనీలు ► లాక్డౌన్ వల్ల పాఠశాలలు, సభలు, సమావేశాలు నిలిచిపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇందులో అమెరికాకు చెందిన జూమ్ యాప్ ముందు వరుసలో ఉంది. ► ఒకేసారి వందలాది మందితో మాట్లాడే అవకాశం ఉండటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి, రాజకీయ పార్టీలు కార్యకర్తలు, విలేకరులతో సమావేశాలు పెట్టడానికి ఈ యాప్‌ను అత్యధికంగా వినియోగించారు. ► దీంతో జూమ్ యాప్ సృష్టికర్త ఎరిక్ యువాన్ ఆస్తి విలువ ఈ సంక్షోభ సమయంలో 2.58 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే.. ఈ మూడు నెలల కాలంలో యువాన్ సంపద సుమారు రూ.19,350 కోట్లు పెరిగింది. ► ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు పెరగడంతో వాల్‌మార్ట్, అమెజాన్ వంటి కంపెనీల షేర్లు భారీగా పెరిగి వారి సంపద కూడా వేల కోట్లు పెరిగింది. వాల్‌మార్ట్‌కు చెందిన జిమ్, అలిసే, రాబ్ వాల్టన్ల ఒక్కొక్కరి సంపద 3 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ► ఈ సంక్షోభ సమయంలో రిలయన్స్ గ్రూప్ ఇప్పటికే వివిధ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.70 లక్షల కోట్లు సమీకరించగా.. మరో నలుగురు ఇన్వెస్టర్ల నుంచి రూ.30 వేల కోట్లు సమీకరించనుంది. ► కరోనా సమయంలో ఇలా సుమారు రెండు లక్షల కోట్లు సమీకరించడం తలపండిన ఇన్వెస్టర్లను కూడా ఆశ్చర్యపర్చింది. దెబ్బతో ముఖేష్ అంబానీ సంపద వారెన్ బఫెట్‌ను మించిపోయింది. ► ఈ ఏడాదిలో అంబానీ సంపద 9.64 బిలియన్ డాలర్లు పెరగడం ద్వారా 67.9 బిలియన్ డాలర్లకు చేరింది. ► డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ అధిపతి అరవింద్ లాల్, శ్రీరాం గ్రూప్ కంపెనీకి చెందిన అరుణ్ భరత్ రామ్ తొలిసారిగా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. కొత్త వ్యాపార అవకాశాలు ► కరోనా దెబ్బతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పుతుంటే మరికొంత మంది వినూత్న ఆలోచనలతో సరికొత్తగా ఉపాధి పొందుతున్నారు. ► ముఖ్యంగా ఇంటి వద్ద ఉండే మహిళలు వివిధ డిజైన్లలో మాస్క్‌లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వచ్చే ఏడాది కాలం పాటు మాస్క్‌ల వాడకం తప్పనిసరి కావడంతో డిజైనర్ మాస్క్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ► దీంతో పలు అంతర్జాతీయ కంపెనీలు బ్రాండెడ్ మాస్క్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ► మరోవైపు కార్యాలయాలు, షాపులు, కార్లు, బస్సులు ఇలా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వాటికి శానిటైజ్ చేయాల్సి ఉండటంతో శానిటైజేషన్ వ్యాపారానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. ► చాలా మంది నిరుద్యోగ యువత శానిటైజేషన్‌ను ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. -
ఈ మాస్క్ ఉంటే చాలు.. వైరస్ ఖతం
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు మాస్కులకు భలే గిరాకీ పెరిగిపోయింది. ఎన్–95, సర్జికల్ మాస్కులు.. ఇలా బోలెడన్ని మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇవేవీ వైరస్‌ను చంపవు. కాకపోతే గాలిలో లేదా ఇతరుల దగ్గు, తుమ్ము, తుంపర్ల ద్వారా వచ్చే వైరస్లు నేరుగా మన నోటిలోకి, ముక్కులోకి చేరకుండా అడ్డుకుంటాయి. అయితే వీటితో వైరస్ సోకదన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న లివింగ్‌గార్డ్ తయారుచేసిన మాస్కు మాత్రం వీటికి చాలా భిన్నమైంది. మూడు పొరలతో సిద్ధమైన ఈ మాస్కులో ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది. దీనిపై కొన్ని రసాయనాలను బలమైన రసాయనిక బంధాల ద్వారా పోగుబడేలా చేశారు. ఫలితంగా ఈ మాస్కుపై నిత్యం 0.1 నుంచి 0.8 మిల్లీవోల్టుల ధనాత్మక విద్యుదావేశం పుడుతుంటుంది. సూక్ష్మజీవులన్నీ రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి.(మళ్లీ లాక్డౌన్ ఉండదు) కాబట్టి వైరస్ మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు సైతం ఈ విద్యుదావేశం బారిన పడి నశిస్తాయి. ప్రతి చదరపు సెంటీమీటరుకు ఏకంగా 3,600 కోట్ల విద్యుదావేశాలు పుడుతుంటాయి. కాబట్టి వీటిని తాకిన సూక్ష్మజీవుల పైపొరలు బద్ధలైపోతాయి. అక్కడికక్కడే మరణిస్తాయి లేదా నిర్వీర్యమవుతాయని కంపెనీ సీటీవో, భారతీయ శాస్త్రవేత్త సంజీవ్ స్వామి బుధవారం జరిగిన ఓ వెబినార్‌లో తెలిపారు. సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ఏ మషేల్కర్ కూడా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వెయ్యి వరకు పాలి కాటయానిక్ రసాయనాలను పరిశీలించామని, వాటి నుంచి అవసరమైన లక్షణాలున్న 3 నుంచి 7 రసాయనాలను ఎంపిక చేసి ప్రత్యేక పద్ధతుల్లో కలిపి, వస్త్రంపై అవి అతుక్కునేలా చేశామని స్వామి వివరించారు. వీటిని ఉతుక్కుని తిరిగి వినియోగించుకోవచ్చని తెలిపారు. విస్తృత పరీక్షల తర్వాత అందుబాటులోకి.. లివింగ్‌గార్డ్ మాస్కును మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే ముందు పలు యూనివర్సిటీల్లో దానిపై విస్తృత పరీక్షలు చేశారు. బెర్లిన్‌లోని ఫ్రీ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ మాస్కు 99.9 శాతం వరకు వైరస్‌లను అడ్డుకుని నిర్వీర్యం చేస్తున్నట్లు తేలింది. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీ కూడా దీన్ని పరిశీలించి బాగా పనిచేస్తుందని నిర్ధారించింది. అమెరికా మిలిటరీ వర్గాలు, ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు, కొంతమంది పారిశుధ్య కార్మికులు కొంతకాలంగా ఈ మాస్కులను వాడుతున్నారు. అమెరికాలోని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మాస్కుల తయారీకి ఉపయోగించిన ప్రత్యేక వస్త్రాన్ని క్షుణ్నంగా పరిశీలించిందని, మానవ శరీరానికి హానికరం కాదని నిర్ధారించినట్లు స్వామి తెలిపారు. ధర సంగతేంటి..? లివింగ్‌గార్డ్ సంస్థ మొత్తం మూడు రకాల మాస్కులను తయారు చేయగా వీటి ఖరీదు రూ.1,490– 1,990 మధ్య ఉంటుంది. మొత్తం 3 పొరలు ఉండే ఈ మాస్కు ద్వారా 5 రకాల రక్షణ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. వారానికి ఒకసారి ఉతుక్కుంటూ మొత్తం 210 రోజుల పాటు ఈ మాస్కును వాడొచ్చు. లివింగ్ గార్డ్ మాస్కుతో పాటు చేతితొడుగులు తొడుక్కుంటే ఉపరితలాలపై ఉండే వైరస్‌లను అక్కడికక్కడ చంపేయొచ్చని, త్వరలో బాడీ సూట్లు కూడా అందుబాటులోకి తెస్తామని సంజీవ్ స్వామి ‘సాక్షి’ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నవీ ముంబైలోని ఓ ఫ్యాక్టరీలో వస్త్రాన్ని తయారు చేస్తున్నామని, బెంగళూరు పరిసరాల్లో మాస్కులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హోటళ్లు, విమాన ప్రయాణాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. తిరిగి వాడుకునే వీలు ఉండటంతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో వారానికి 1.5 లక్షల మాస్కులు తయారు చేసే సామర్థ్యం ఉందని, దశల వారీగా ఉత్పత్తి పెంచుతామని వివరించారు. వారం రోజుల్లో ఆన్లైన్లో అమ్మకాలు మొదలుకానున్నాయి. -
లాక్డౌన్ సడలింపులు : మారుతి జోరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటోంది. గత మాసంలో జీరో అమ్మకాలతో కుదేలైన మారుతి తాజాగా ఆన్లైన్ విక్రయాల్లో జోరందుకుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇప్పటికే 5000 ఆన్లైన్ బుకింగ్‌లను సాధించింది. అలాగే 2300 కార్లను డీలర్లకు పంపించింది. నిబంధనల మేరకు కార్లను ఆయా వినియోగదారులకు వారం రోజుల్లో డెలివరీ చేస్తామని మారుతి సుజుకి ప్రకటించింది. భారతదేశంలో 2500 టచ్ పాయింట్లను కలిగి ఉన్న మారుతి సుజుకి తన మూడవ వంతు అవులెట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది. (మారుతీ లాభం 28 శాతం డౌన్) కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల కారణంగా మూసివేసిన 1900 వర్క్‌షాప్‌లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయని సంస్థ ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ వెల్లడించారు. ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కొనుగోళ్లపై దృష్టి పెట్టిన తమకు భారీ మద్దతు లభిస్తోందని తెలిపారు. అయితే చాలా నగరాలు ఇప్పటికీ రెడ్ లేదా ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్నందున డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు, అయితే ఈ నెలలో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించిన మానేసర్ ప్లాంట్‌నుంచి 2300 కార్లను పంపించామన్నారు. (కరోనా : అయ్యయ్యో మారుతి!) చదవండి : ‘పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్‌లో తమ కార్పొరేట్ ఆఫీస్‌ను, కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్‌లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్‌ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
ఆన్లైన్లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్‌లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్‌లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్‌లో మళ్లీ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే, ఈ–కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది. -
పండుగ ఆఫర్లపై భగ్గుమన్న ట్రేడర్లు..
ముంబై : ఈ కామర్స్ దిగ్గజాలు పోటీపడి వెల్లడిస్తున్న పండుగ ఆఫర్లతో వ్యాపారులు కలత చెందుతున్నారు. ఈ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లతో అతితక్కువ ధరలకే వస్తువులను అమ్మడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకుంది. ఆన్లైన్ రిటైల్ పోర్టల్స్‌ను ఇలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉంచాలని వీరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ కంపెనీలు న్యాయసమ్మతం కాని ధరలకు వస్తువులు విక్రయించడాన్ని ప్రభుత్వం అనుమతించదని మంత్రి గోయల్ ఇటీవల చేసిన ప్రకటనను సీఏటీఐ ప్రస్తావించింది. పలు ఈ కామర్స్ పోర్టల్స్ అతితక్కువ ధరలకు వస్తువుల అమ్మకాలను చేపట్టడంలో హేతుబద్ధతను సీఏఐటీ అధ్యక్షులు బీసీ బర్తియ, ప్రధాన కార్యదర్శి ఖండేల్వాల్ ప్రశ్నించారు. ఆయా వస్తువుల స్టాక్ కలిగిన వారు మాత్రమే ఈ ధరలకు విక్రయించగలరని, ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం మార్కెట్ సదుపాయం మాత్రమే కల్పిస్తారని, వారు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు యజమానులు కాదని సీఏఐటీ పేర్కొంది. 2016 ఎఫ్‌డీఐ విధానానికి అనుగుణంగా ఈకామర్స్ పోర్టల్స్ అమ్మకాలు లేదా ధరలను ప్రభావితం చేయరాదని స్పష్టంగా ఉన్నప్పటికీ, వీరు తమ పోర్టల్స్‌లో సేల్స్‌ను ప్రకటించడం ద్వారా ఎఫ్‌డీఐ విధానానికి తూట్లు పొడుస్తున్నారని ఆక్షేపించింది. ఈ కామర్స్ పోర్టల్స్ వస్తువులను తమ గోడౌన్లలో నిల్వ చేస్తున్నాయని ఇది భారత ప్రభుత్వ రిటైల్ విధానానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ పోర్టల్స్ ప్రకటించిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను తక్షణమే నిలిపివేయాలని ఇది ధరలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.