ఈ వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లను ఆర్డర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై గులాబీలు, చాక్లెట్స్, రొ**** గిఫ్ట్‌ల ఆర్డర్లు వెల్లువెత్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వేడుకలు జరుగుతాయి. కానీ భారత్‌లో మాత్రం వారం రోజుల ముందు నుంచే ఊపందుకున్నాయి. దీంతో ఈ-కామర్స్,డేటింగ్ సైట్స్ యూజర్ల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రొ**** ప్రోడక్ట్స్, గిఫ్ట్‌ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్లు నమోదయ్యాయి.
ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్, 406 చాక్లెట్స్ వినియోగదారులు కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరీ చేశామని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం బ్లింకిట్ సీఈవో అల్బిందర్ థిండ్సా ట్వీట్ చేశారు. మరో 20,000కిపైగా చాక్లెట్స్, చాక్లెట్ బాక్స్‌లు మరో పది నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయని తెలిపారు.
The peak is here and currently running at 406 CPM!
— Albinder Dhindsa (@albinder) February 9, 2024
More than 20k chocolates and chocolate boxes are on the way and will be delivered in the next 10 minutes ✌️ https://t.co/8ZGzncSzq3
వాలెంటెన్స్ డే రోజు అమ్మకాలపై స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ట్వీట్ చేశారు. భారతీయులు వాలెంటెన్స్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని ట్వీట్ షేర్ చేశారు. అందులో నిన్నటి నుంచి వాలెటెంటైన్స్ కోసం కేక్ ఆర్డర్‌లు పెరిగాయి. గరిష్టంగా రాత్రి 10 గంటల సమయంలో నిమిషానికి ఏడు కేకు ఆర్డర్‌లు వచ్చినట్లు చెప్పారు.
అలాగే, ఎఫ్‌ఎన్‌పీ. కామ్ సంస్థ వాలెంటైన్స్ డే కి ఒక్కరోజు ముందు (ఫిబ్రవరి 13) నిమిషానికి 350 గులాబీలను అందజేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. అంతే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆన్‌లైన్ పెట్టే కేక్ ఆర్డర్‌లు నిమిషానికి అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment