Valentine's Day 2024
-
గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్
ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువకుడు తన ప్రియురాలికి పువ్వులు ఇవ్వాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు, అయితే అతని ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు, కానీ అతని బండారం మొత్తం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' సందర్భంగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు పంపించడం లేదని, ఎలాగైనా ఆమెకు పువ్వులు ఇవ్వాలని ఏకంగా 'బ్లింకిట్' (Blinkit) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో చాటింగ్ చేసాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంపెనీ సీఈఓ 'అల్బిందర్ ధిండ్సా' (Albinder Dhindsa) ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. మనోజ్ అనే వ్యక్తి బ్లింకిట్ సపోర్ట్ టీమ్‌తో చాట్ చేస్తూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌ను వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపడం లేదని, కాబట్టి ఆమె కోసం నేను ఆమె కోసం పువ్వులు ఆర్డర్ చేసి ఈ ఆర్డర్‌కి నేను మీ డెలివరీ పార్టనర్‌గా వెళ్లవచ్చా? అని అడిగాడు. కానీ సంస్థ దీనికి మేము హెల్ప్ చేయలేమని రిప్లై ఇచ్చింది. ఈ సంభాషణ మొత్తాన్ని అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఇండియా నాట్ ఫర్ బిగెనర్స్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ పోస్ట్‌ను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం.. India is clearly not for beginners 🤦♂️ https://t.co/JIqwpls2pN — Albinder Dhindsa (@albinder) February 14, 2024 -
పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇంకేముంది.. ఒక్క హిట్టు పడటంతో తనకు టాలీవుడ్లో తిరుగులేదనుకున్నారు. కానీ ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. అనగనగనగా ఓ అతిథి సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించింది. 3 రోజెస్ అనే సిరీస్ కూడా చేసింది. ప్రియుడితో వాలంటైన్స్ డే కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఆమెకు అజయ్ భూపతి మంగళవారం సినిమా ఛాన్స్ ఇచ్చాడు. గతేడాది రిలీజైన ఈ మూవీ హిట్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇకపోతే పాయల్‌కు సౌరభ్ ఢింగ్రా అనే ప్రియుడు ఉన్నాడు. తరచూ వీళ్లిద్దరు షికార్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) ఇలా సెలబ్రేట్ చేసుకున్నానంటూ పాయల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇంకోసారి కొట్టాల్సింది పబ్బులో ఉన్న ఆమె.. తన ప్రియుడు సౌరభ్ నెత్తిని బాటిల్‌తో పగలకొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు సౌరభ్ స్పందిస్తూ.. చాలా బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో రియల్ కాదు, రీల్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఏదైనా ఓ సినిమా షూటింగ్లో భాగంగా పాయల్ ఇలా చేసిందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) చదవండి: ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్ -
Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..!
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెలమాత్రమే కాదు. మరొకటి కూడా ఉంది. ఫిబ్రవరి 14 వరకు వారంరోజుల పాటు వాలెంటైన్స్ వీక్ సందడి ఉంటుంది. అంతా ప్రేమికులకు, ఓకే చెప్పడానికి అయితే.. తిరస్కరించడానికీ, భగ్న ప్రేమికులకీ ఉండాలిగా అన్నట్టు యాంటీ వాలెంటైన్స్ వీక్ సందడి కూడా షురూ అవుతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి! రోజ్ డే, ప్రపోజల్ డే, లవ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అంటూ ప్రేమ పక్షులు సందడి చేస్తే ..ఫిబ్రవరి 15నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ భగ్నప్రేమికులకు, ప్రేమను తిరస్కరించే కిక్కు అన్నట్టు..ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్‌తో తృప్తి పడతారు వాలెంటైన్స్ వీక్ అంతా. యాంటీ వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15, స్లాప్ డే: గుండె పగిలిన వారందరూ తమ బాధలన్నింటికీ కారణమైన తమ మాజీలను చెంపదెబ్బ కొట్టడానికి ఈ రోజు అనుమతిస్తుంది. ఒక విధంగా ఇది ఇబ్బంది పెట్టే చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను దూరం చేసే రోజు. ఫిబ్రవరి 16,కిక్ డే: ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలన్నింటినీ వదిలించుకోవడం, జీవితంలో నింపిన విషాదాన్ని, కోపాన్ని వదిలేయడం. అంతేకాదు వాళ్లిచ్చిన గిఫ్ట్స్‌లు, ఇతర గుర్తులను పూర్తిగా వదిలివేయడం. ఫిబ్రవరి 17, పెర్ఫ్యూమ్ డే: పదే పదే వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, మంచి పరిమళంతో కొత్త ఆహ్లాదాన్ని నింపుకోవడం ఫిబ్రవరి 18, ఫ్లర్ట్ డే: ఈ రోజున కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో సరదాగా గడపడం ఫిబ్రవరి 19, కన్ఫెషన్ డే: తప్పులను ఒప్పుకోవడం, ఎదుటివారిని క్షమించమని అడగడం ఫిబ్రవరి 20, మిస్సింగ్ డే : ఎవరైనా తమ వాలెంటైన్‌ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే వాళ్లకి మెమొరీస్‌ని గుర్తు చేయడం ఫిబ్రవరి 21, బ్రేకప్ డే:ఇది కీలకమైందీ.. చివరి రోజు కూడా అవతలి వారి ప్రేమ నిజమైంది కాదనిపిస్తే..నిస్సందేహంగా వదిలివేయడం హ్యాపీగా ఉండటం. ప్రేమ అందమైందే ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ తేడా వస్తే విడిపోతే భరించడం కష్టమే. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది.. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. మనలాంటివాళ్లని దక్కించుకోలేని దురదృష్టవంతులు అనుకొని వదిలేయాలి. నిజానికి గమనిస్తే.. నిస్వార్థంగా మనల్ని మనంగా ప్రేమించే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మనం గుర్తించగలగాలి అంతే. -
వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వాలెంటైన్స్ డే రోజునే తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసి అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అధికారికంగా తెలిపింది. తాను ప్రేమించిన సంతోష్‌తో పవిత్ర ఉంగరాలు కూడా మార్చుకుంది. ఓ రకంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లే అని త్వరలో పెళ్లితో ఒకటి అవుతారని అందరూ అనుకున్నారు. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంతోష్‌తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్ డే సమయంలోనే పవిత్ర ఇలా తెలిపింది. 'మా శ్రేయోభిలాషులందరికీ మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం చెబుతున్నాను. సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం. జీవితంలో మా వ్యక్తిగత ప్రయాణాలలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అంటూ ఇన్‌స్టాలో పవిత్ర తెలిపింది. గతంలో సంతోష్ గురించి పవిత్ర చెప్పిన మాటలు సంతోష్‌తో ప్రేమలో ఉన్నానంటూ గతంలో పవిత్ర ఇలా తెలిపింది. 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని పవిత్ర చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్,పవిత్ర ఇద్దరూ విడిపోవడంతో వారిని అభిమానించే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ.. ఇలాంటి సమయంలో ఇద్దరూ మరింత బలంగా ఉండాలని ఆశిస్తున్నారు. గతాన్ని వదిలేసి జీవితంలో కొత్త అడుగులు వేయాలని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) -
ప్రేమికుల దినోత్సవం.. ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం!
ఈ వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లను ఆర్డర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై గులాబీలు, చాక్లెట్స్, రొ**** గిఫ్ట్‌ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వేడుకలు జరుగుతాయి. కానీ భారత్‌లో మాత్రం వారం రోజుల ముందు నుంచే ఊపందుకున్నాయి. దీంతో ఈ-కామర్స్,డేటింగ్ సైట్స్ యూజర్ల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రొ**** ప్రోడక్ట్స్, గిఫ్ట్‌ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్, 406 చాక్లెట్స్ వినియోగదారులు కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరీ చేశామని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం బ్లింకిట్ సీఈవో అల్బిందర్ థిండ్సా ట్వీట్ చేశారు. మరో 20,000కిపైగా చాక్లెట్స్, చాక్లెట్ బాక్స్‌లు మరో పది నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయని తెలిపారు. The peak is here and currently running at 406 CPM! More than 20k chocolates and chocolate boxes are on the way and will be delivered in the next 10 minutes ✌️ https://t.co/8ZGzncSzq3 — Albinder Dhindsa (@albinder) February 9, 2024 వాలెంటెన్స్ డే రోజు అమ్మకాలపై స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ట్వీట్ చేశారు. భారతీయులు వాలెంటెన్స్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని ట్వీట్ షేర్ చేశారు. అందులో నిన్నటి నుంచి వాలెటెంటైన్స్ కోసం కేక్ ఆర్డర్లు పెరిగాయి. గరిష్టంగా రాత్రి 10 గంటల సమయంలో నిమిషానికి ఏడు కేకు ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. అలాగే, ఎఫ్ఎన్పీ. కామ్ సంస్థ వాలెంటైన్స్ డే కి ఒక్కరోజు ముందు (ఫిబ్రవరి 13) నిమిషానికి 350 గులాబీలను అందజేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. అంతే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆన్లైన్ పెట్టే కేక్ ఆర్డర్లు నిమిషానికి అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. -
రిజెక్ట్ చేశారా? ఎగతాళి చేస్తున్నారా?.. డోంట్ కేర్!
'ప్రేమంటే ఏమిటంటే.. నిను ప్రేమించినాక తెలిసే..', 'ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..' ఈ రెండు పాటలు ఈ రోజు మార్మోగడం ఖాయం.. ఈరోజు వాలంటైన్స్ డే కదా.. సక్సెస్ అయిన జంటలు బ్యాగ్రౌండ్లో హుషారైన ప్రేమపాటలు వేసుకుంటారు. ప్రపోజల్ రిజెక్ట్ అయిన వన్ సైడ్ లవర్స్ బ్రేకప్ సాంగ్స్ వింటూ బాధతో గడిపేస్తారు. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణాలు అనేకం! అందులో లవ్వంటే ఇంట్రస్ట్ లేదు అనేది మొదటి స్థానంలో ఉంటుంది. రంగు, ఎత్తు పొడుగు, శరీర సౌష్ఠవం, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తిపాస్తులు, ఫిట్నెస్.. ఇవి కూడా ఆ జాబితాలోనివే! సరే.. వాళ్లు నో చెప్పారే అనుకో.. ప్రపంచమే అంతరించిపోతున్నట్లు బాధపడాలా? అక్కర్లేదు.. బాహ్య సౌందర్యానికి, కరెన్సీ నోట్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవాళ్లు మనకవసరమే లేదని చిల్ అయిపోవాలి. ఒకరి ప్రేమ కోసం పరితపించడానికి ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ గురించే ఈ కథనం.. నవ్వులాట.. ఫెయిల్ అనేది రేపటి విజయానికి పునాది.. ఇప్పుడు తిట్టేవాళ్లే ఒకస్థాయి వస్తే చప్పట్లు కొడుతుంటారు. 12th ఫెయిల్ ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. ఇంట్లో ఉండే ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడుతుంటారు. కానీ ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అద్భుతాలూ సృష్టించగలదు. అందుకు ఇంగ్లీష్ - వింగ్లీష్ బెస్ట్ ఎగ్జాంపుల్. బొద్దుగా ఉన్నావ్.. రెండడుగులు నడిస్తే ఆయాసం, కూర్చుంటే నిలబడలేవు.. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఇలాంటి మాటలకైతే లెక్కలేదు. లావుగా ఉంటే అందవిహీనంగానా? లావుగా ఉన్నవాళ్లు కనిపిస్తేనే కొందరు ఫక్కుమని నవ్వుతుంటారు. ఏం పాపం? వాళ్లేం తప్పు చేశారు? లావుగా ఉండటం నేరమా? కొందరు ఆహారపు అలవాట్ల వల్ల లావెక్కితే మరికొందరు జెనిటిక్స్ వల్ల అలా ఉంటారు! అయినా అందానికి అసలైన నిర్వచనమేంటో సైజ్ జీరో చూస్తే అర్థమవుతుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే! అని అప్పుడు మీరే ఒప్పుకుంటారు. ఛామనచాయ, నలుపు రంగు ఉన్నవాళ్లను కొందరు హీనంగా చూస్తారు. ఎగతాళి చేస్తారు. అవి ఏ రేంజ్లో ఉంటాయో కలర్ ఫోటో సినిమా చూస్తే తెలిసిపోతుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు అయినా తక్కువరంగు ఉన్నవారు ఊసరవెల్లిలా రంగులు మార్చరే! మరి ఈ నలుపు రంగు వల్ల ఎవరికి హాని? ఎవరికి ఇబ్బంది? దీనికి ఎప్పటికీ సమాధానం దొరకదు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయ్.. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే అవతలివారి విమర్శలకు గట్టి సమాధానాలు ఇవ్వగలం. లేదంటే అక్కడే ఆగిపోతాం! జీవితమన్నాక అన్నీ ఉంటాయ్.. కష్టాలు కూడా క్లాస్మేట్స్ అనుకుని ముందుకు సాగిపోవాల్సిందే! కామెంట్స్ అంటారా.. డోంట్ కేర్ అంటూ లైట్ తీసుకోవాల్సిందే! ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని మర్చిపోకండి.. ఎవరినైనా ప్రేమించేముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. చదవండి: భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్ హీరో.. ఆయన మరణం కూడా మిస్టరీనే - పోడూరి నాగ ఆంజనేయులు -
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘6th జర్నీ’ నుంచి లవ్ సాంగ్
పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ‘ఆకాశంలోని చందమామ’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. మూవీకి ఎం.ఎన్.సింహ సంగీత సారథ్యం వహింస్తున్నారు. రామారావు మాతుమూరు రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా... దర్శకుడు బసీర్ ఆలూరి,నిర్మాత పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా అరుణకుమారి ఫిలింస్ బ్యానర్లో రూపొందుతున్న ‘6జర్నీ’ మూవీ నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘ఆకాశంలోని చందమామ..’ అనే పాటను విడుదల చేస్తున్నాం. ప్రేమ, థ్రిల్లింగ్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో ‘6జర్నీ’ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాలో రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి, అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు తదితరులు నటించారు. బసీర్ అలూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్ హీరో
గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమాపై ఏ టాక్ పూర్తి కాదు . హిందీ చలనచిత్ర చరిత్రలో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో మెప్పించాడు. ఇండియన్ సినిమాపై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. 1957లో విడుదలైన గురుదత్ మాస్టర్ పీస్ ‘ప్యాసా’. ఇప్పటి వారికి ఆ సినిమా పెద్దగా పరిచయం ఉండదు కానీ అప్పట్లో అదొక సంచలనం. హీందీ ఆల్-టైమ్ 100 ఉత్తమ చలనచిత్రాల జాబితాలో ప్యాసా ఉండటంలో ఆశ్చర్యం లేదు.ఆయన జీవితంలో పెళ్లి, ప్రేమ రెండూ ప్రత్యేకమే.. (గురుదత్- వహీదా రెహమాన్) వహీదా కోసం హీరోగా మారిన గురుదత్ ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి వహీదా రెహమాన్. 1955లో ‘రోజులు మారాయి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వహిదా. 1956లో విడుదలైన ఆ చిత్రం..అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. వహిదా అందానికి ముగ్ధుడైన డైరెక్టర్ గురుదత్ ఆమె కోసం హీరోగా అవతారమెత్తాడు. వహిదా కోసం ‘ప్యాసా’ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వాస్తవానికి తొలుత ఆ సినిమాకు హీరో దిలీప్ కుమార్. అయితే వహిదా రెహమాన్ హీరోయిన్గా చేస్తుందని తెలియడంతో దిలీప్ని తప్పించి తనే హీరోగా నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వహిదాకి గురుదత్ క్లోజ్ అయ్యాడు. తొలుత ఇద్దరి మంచి స్నేహితులుగా కొనసాగారు. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. ట్విస్ట్ ఇచ్చిన గురుదత్ వహీదా రెహమాన్‌కు తొలి బాలీవుడ్ సినిమా ఇచ్చిన గురుదత్.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. (సతీమణి గీతాదత్తో గురుదత్) భార్య కోసం ప్రేమ త్యాగం గురుదత్- వహిదా రెహమాన్‌ల ప్రేమ వ్యవహారం గీతాదత్‌కు కూడా తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరుగా జీవించడం ప్రారంభించింది. ఫ్యామిలీ అంతా దూరం అవ్వడాన్ని గురుదత్ తట్టుకోలేకపోయాడు. భార్య, పిల్లలు తిరిగి తన వద్దకు రావాలంటే.. ప్రేమను త్యాగం చేయాల్సిందే అనుకున్నాడు. అందుకే వహిదాను దూరం పెట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు గీతా దత్ తిరిగి ఇంటికొచ్చింది. గురుదత్ చాలా రోజుల వరకు వహిదాను మర్చిపోలేదట. ఆమె తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని అతని సన్నిహితులు చెప్పేవారు. కుంగిపోయిన వహీదా ప్రేమ విఫలం కావడంతో వహిదా కుంగిపోయింది. గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బీజీ అయింది. దేవ్ ఆనంద్‌తో ఎక్కువ సినిమా చేయడంతో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకారు మాత్రమే. గురుదత్ తర్వాత ఆమె ఎవరినీ ప్రేమించలేదు. 1974లో బాలీవుడ్ నటుడు శషిరేఖీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సోహైల్ రేఖీ, కాశ్వీ రేఖీ ఉన్నారు. 2000 సంవత్సరంలో శషిరేఖీ చనిపోయాడు. ప్రస్తుతం వహిదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది. మిస్టరీగా గురుదత్ మరణం వహిదా రెహమాన్ దూరం కావడంతో గురుదత్ కాపురంలో కూడా చిచ్చు రేగింది రేపింది. గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు. అక్టోబరు 10, 1964 రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ‘ఇన్ సర్చ్ ఆఫ్ గురుదత్’ పేరిట 1989లో డాక్యుమెంటరీ వచ్చింది. ఆయన బయోపిక్ నిర్మాణం కోసం బాలీవుడ్ డైరెక్టర్ భావనా తల్వార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని గతంలో ప్రకటించారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
సాయిపల్లవికి నాగచైతన్య లవ్ ప్రపోజల్.. వీడియో చూశారా?
నటుడు నాగచైతన్య వాలెంటైన్స్ రోజున ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో హీరోయిన్ సాయి పల్లవికి లవ్ ప్రపోజల్ చేస్తున్నట్లు ఉంది. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో వీరిద్దరూ ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిదే. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డైలాగ్‌తో ఇన్‌స్టాలో లెక్కలేనన్ని రీల్స్ వచ్చాయి. ఇప్పుడు నాగచైతన్య కూడా సాయి పల్లవితో ఒక రీల్ చేశాడు. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే అంటూ వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. తండేల్ గ్లింప్స్ పట్ల వస్తున్న రెస్పాన్స్ తనకు చాలా థ్రిల్లింగ్ ఉన్నట్లు నాగచైతన్య చెప్పాడు. దానిపై నెటిజన్లు రీల్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. దీంతో అందరిలా తాము కూడా ఒక రీల్ చేయాలని నిర్ణయించుకొని వాలెంటైన్స్ డే రోజున అందిస్తున్నట్లు ఆయన తెలిపాడు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ఈ స్టార్స్ 'ప్రేమకథ' ఎప్పటికీ ప్రత్యేకమే
ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆపై తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు గురించి అందరూ పలు రకాలుగా మాట్లాడుకున్నా ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా చివరి వరకు నిలిచారు. అలా బాలీవుడ్లో తమ ప్రేమ గొప్పదనాన్ని చూపారు ఈ లెజెండరీ కపుల్స్.. వారెవరో కాదు దిలీప్ కుమార్ - సైరా భాను. 1960ల నాటి సంగతి.. దిలీప్ కుమార్‌ను చూడ్డం కోసం ముంబైలో ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్‌కు హాజరైంది ఒక పదహారేళ్లమ్మాయి. అప్పుడే లండన్ నుంచి వచ్చింది స్కూల్ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్ కుమార్ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత యేడాదికి తనూ హీరోయిన్ అయింది ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీకపూర్ పక్కన. ఆమే సైరా బాను. ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది. (టాప్ హీరో రాజేంద్ర కుమార్‌తో సైరా భాను) మొదటి ప్రేమ రాజేంద్ర కుమార్‌తో ఆ రోజుల్లో దిలీప్ కుమార్ టాప్-1 స్థానంలో ఉంటే రాజేంద్ర కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సైరా బాను సినిమాల్లోకి రాకముందే రాజేంద్ర కుమార్ స్టార్. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ‘జంగ్లీ’ హిట్‌తో సైరా బానుకు స్టార్స్ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్ హీరోగా ‘ఆయీ మిలన్ కీ బేలా’ కూడా ఉంది. సైన్ చేసింది సైరా. ఆ సెట్స్‌లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ గుండె లయ తప్పింది. సైరా కళ్లల్లోని అమాయకత్వం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. ‘తుమ్హే క్యా దూ మై దిల్ కె సివా (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వ గలను)’ అంటూ సాగే ‘ఆయీ మిలన్ కీ బేలా’లోని పాటలో సైరా కోసం జీవించాడు. ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్ పట్ల ఆమెకూ ఆకర్షణ మొదలైంది. సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేమలో పడిపోయారిద్దరూ. ఆ మూవీ బాక్సాఫీస్ హిట్. దాంతో ఈ ఇద్దరి కలయికలోనే ‘ఝుక్ గయా ఆస్మాన్’ ప్రారంభమైంది. ఇందులోని ‘కౌన్ హై జో సప్నో మే ఆయా (నా కలలోకి వచ్చినదెవరు)’ పాటలో తన కళ్లల్లో సైరాను కొలువుంచుకొనే అభినయించాడు రాజేంద్ర కుమార్. ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆ జంటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెర మీది కెమిస్ట్రీతో పాటు వీళ్లిద్దరి ప్రేమాయణమూ బాలీవుడ్ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్యా,పిల్లలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర కుమార్. ఈ విషయం సైరా తల్లి నసీమ్ బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్ అంటే నసీమ్ కుటుంబానికి అపారమైన గౌరవం. ఒకరోజు ఆయన్ను కలిసి ‘సైరా చాలా మంచి పిల్ల. ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి’ అంటూ. రచ్చ కాకుండానే సైరాను ఆ ప్రేమ నుంచి తప్పించేసింది. అంతటితో వారిద్దరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. బర్త్‌డే పార్టీలో దిలీప్ కుమార్‌తో సైరా ప్రేమ చాన్స్ రానే వచ్చింది సైరా బాను బర్త్‌డే రూపంలో. పార్టీ అనౌన్స్ చేసి దిలీప్ కుమార్‌ను అతిథిగా ఆహ్వానించింది నసీమ్. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్ సాబ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్ కుమార్ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్ కుమార్ కళ్లల్లో మెరిసిన మెరుపు నసీమ్ దృష్టిని దాటిపోలేదు. అలా కొన్నేళ్లపాటు సైరా- దిలీప్‌లు కూడా తమ మధ్య మూగప్రేమనే మనసులో నింపుకొన్నారు. అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. సమయం చిక్కగానే అతణ్ణి అడిగింది.. ‘మీరంటే సైరాకు పిచ్చి.. చిన్నప్పటి నుంచీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటారా?’ అని. అప్పటికే వహీదా రెహ్మాన్‌తో డేటింగ్లో ఉన్నాడు దిలీప్ కుమార్. అయినా నసీమ్ ప్రతిపాదనను సమ్మతించాడు రెండో ఆలోచన లేకుండానే. అలా తనకన్నా ఇరవై రెండేళ్లు పెద్దవాడైన దిలీప్ కుమార్‌కు 1966లో జీవిత భాగస్వామి అయింది సైరా బాను. పెళ్లి తర్వాత అలాంటి కామెంట్లు అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారట! పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. ఎళ్లు గడుస్తున్నా వారి బంధాన్ని నిక్షేపంగానే కొనసాగించారు. 'మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది' అని తమ అనుబంధంతోనే నిరూపించారీ ఐకానిక్ కపుల్. పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు చెందిన ఆస్మా రెహ్మాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం రెండేళ్లకు మించి కొనసాగలేదు. సైరాను మరిచిపోలేకపోయాడు దిలీప్. రెండేళ్లపాటు సైరాకు దూరంగా ఉండటం ఒక నరకంగా భావించాడు. తిరిగి సైరాను చేరుకున్నారు. అంత జరిగినా దిలీప్ నా వాడే అంటూ సైరా కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం.. నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్లాంటి భర్త దొరకాలని. అల్లా రెండిటినీ నెరవేర్చాడు. అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్ నా వాడు! అంటూ తన భర్తపై అపారమైన ప్రేమను ఆమె బయటపెట్టింది. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్.. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్‌ను ఏలిన దిలీప్ 2021లో అనారోగ్యంతో కన్నుమూశారు. -
Valentine's Day లేటు వయసులో సెలబ్రిటీల ప్రేమ కూడా సెన్సేషనే!
ప్రేమ బంధానికి వయసుతో సంబంధం ఏముంది.. నువ్వే నా శ్వాసా..మనసున నీకై అభిలాషా ..ప్రియతమా ఓ ప్రియతమా.. ఇదేగా ఇరు మనుసులకు బాసట...ఊరట. లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ప్రముఖులు లిస్ట్ కూడా చాలా పెద్దది. అలాంటి వారిని ఒకసారి పరిశీలిద్దాం.! మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరు గాంచిన బిల్ గేట్స్ (Bill Gates) లేటు వయసులో ప్రేమలో పడ్డాడు. తొలి భార్య మిలిందాతో విడాకులు తీసుకున్న బిల్ గేట్స్ ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్‌తో ప్రేమలోపడ్డాడు. అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రియురాలు లేటు వయసులో తన ప్రేయసి లారెన్ సాంచెజ్ప్రేమలోపడ్డాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్ భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరితనాన్ని జయించేందుకు తోడు వెతుక్కున్నారు. 91 ఏళ్ల వయసులో ప్రేమను మళ్లీ పొందానని స్వయంగా ప్రకటించిన ఆయన జీవితంలో మనిషికి భాగస్వామి అవసరాన్ని నొక్కి చెప్పారాయన. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ 61ఏళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో నాలుగోసారి ప్రేమాయణం వార్తకూడా గత ఏడాది వార్తల్లో నిలిచింది. రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఇద్దరూ చాలా ఈవెంట్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా వీరి ప్రేమే లేటెస్ట్ సెన్సేషన్. ఇక టాలీవుడ్లో పరిచయం అవసరం లేని ప్రేమ జంట నరేష్, పవిత్రా లోకేష్. పెళ్లి చేసుకున్నాం ఆశీర్వదించండి అంటూ ‘మళ్లీ పెళ్లి’ సినిమా పెళ్లి వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసిన సంచలనం రేపిన ఈ జంట లీగల్ సమస్యల కారణంగా ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి భార్య అనిత అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన తేజస్వినితో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం తేజస్విని-దిల్ రాజు దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. టాలీవుడ్లో ప్రముఖ గాయని సునీత పెళ్లి ముచ్చటను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి, ఇద్దరు బిడ్డలు, ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. విడాకుల తరువాత చాలా కాలానికి మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని సునీత టీనేజ్ పిల్లలు అర్థం చేసుకోవడమే కాదు, దగ్గరుండి మరీ మనసారా వీరి పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించడం గొప్ప విశేషం. వీరే కాదు.. చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన అమ్మకు, భార్యను కోల్పోయిన తండ్రులకు కన్నబిడ్డలే పెళ్లిళ్లి చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. జీవితాలను త్యాగం చేసి, ఎన్నో కష్టనష్టాలకోర్చి, తమను పెంచి, ప్రయోజకుల్ని అమ్మా, నాన్నల ఒంటరితనాన్ని ప్రేమతో నింపి వారి రుణం తీర్చుకున్నారు. -
Valentine's Day: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..
ప్రేమ..అదో మధురానుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో.. అప్పుడు ఎవరిపైనో మనసులాగేసే ఉంటుంది. ఆ సందర్భంలో మనసులోని వింత అనుభావాలను ఆస్వాధించే ఉంటారు.. ‘ప్రేమించడం కన్నా.. ప్రేమించబడడం అదృష్టం’ అన్నాడో సినీ కవి. అలా దాన్ని చివరి వరకు నిలుపుకుని భాగస్వామి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రేమ..పెళ్లి పీటల వరకు చేరే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఒక్కటయ్యారు. ప్రేమలో గెలిచి దంపతులుగా అన్యోన్య జీవనం గడుపుతున్న కొన్ని జంటల జీవితాలను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ పాఠకుల ముందు ఆవిష్కరిస్తోంది. ప్రియురాలిని ప్రయోజకురాలిగా చేసి.. ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడేనికి చెందిన బంధువుల అమ్మాయి భవానిరెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరిలో ప్రేమను చిగురింపజేసింది. అయితే, నిరుపేద కుటుంబానికి చెందిన భవానీరెడ్డి డిగ్రీ మధ్యలో చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌రెడ్డి ప్రియురాలిని పీజీ వరకు చదివించాడు. ఆ వెంటనే ఆమెకు వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అయినా.. ఆమెను ప్రోత్సహించడంతో 2019లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో భవానీరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ ప్రాక్టీస్ చేస్తున్నారు. తొమ్మిది నెలల బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అడ్డంకులను అధిగమించి.. మోత్కూరు : వారిద్దరి మనసులు కలిశాయి. కులా లు అడ్డుగోడలుగా నిలిచినా ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.. మోత్కూరుకు చెందిన ఎడ్ల శ్రీకాంత్, సముద్రాల సింధూజ దంపతులు. మోత్కూరులో ఫొటోగ్రాఫర్ వృత్తి నేర్చుకుంటున్న శ్రీకాంత్‌కు పట్టణంలోని సముద్రాల వెంకన్న కూతురు సంధ్యతో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారింది. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అడ్డంకులు సృష్టించారు. సంధ్యను హైదరాబాద్‌లో బీటెక్ చదివిస్తూ అక్కడే సోదరుడి వద్ద ఉంచారు. శ్రీకాంత్ రెండేళ్ల ఎడబాటు తర్వాత సంధ్యను కలుసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి 15న యాదగిరిగుట్టలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యతిరేకించి సంధ్య తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై కేసు పెట్టినా కోర్టు ప్రేమజంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ దంపతులు మోత్కూరులో ఫొటో స్టూడియో, ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ తమ ఆరేళ్ల కుమారుడు రెహాన్‡్ష, నాలుగేళ్ల కూతురు శ్రీహన్షతో ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు రామగిరి (నల్లగొండ): మిర్యాలగూడకు చెందిన తుమ్ములూరి మురళీధర్ రెడ్డి హాలియాకు చెందిన పుష్పలత ఇద్దరు బంధువులు. అయినా మొదట్లో వీరికి పరిచయం లేదు. బంధువుల వివాహంలో పుష్పలత తొలిసారిగా మురళీధర్ రెడ్డిని చూసింది. ఆ తర్వాత మురళీధర్ రెడ్డి అడ్రస్ తెలుసుకొని ఉత్తరాలే రాసేది. అవి చూసి తను తెలిసీతెలియక రాస్తుందేమో అనుకునేవాడు. అలా చాలా సార్లు లెటర్లు రాసూ్తనే ఉండేది. అప్పుడు మురళీధర్‌రెడ్డికి అనిపించింది..ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందని. అప్పటికీ వారి చదువు పూర్తి కాలేదు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మురళీధర్ రెడ్డి నల్లగొండలో కంప్యూటర్ హార్డ్‌వేర్‌గా స్థిరపడగా, పుష్పలత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. అశుతోష్ రెడ్డి ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడగా, అమిత్ రెడ్డి డిఫెన్స్ అకాడమీలో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు.. భూదాన్‌పోచంపల్లి : తెలిసీ తెలియని వయస్సులో మైనర్‌ను ప్రేమించాడు. బాలికకు సైతం అతనంటే ఇష్టమే. కానీ తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఏమి అవుతుందోనని భయం. చివరకు ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించారు. అయినా పట్టువిడవకుండా అమ్మా యి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని 38 ఏళ్లుగా అన్యోన్య జీవనం సాగిస్తున్న భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి ప్రేమపెళ్లి గా«థ ఇది. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన కోట మల్లారెడ్డి పోచంపల్లి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతుండగా ఇదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సామల పుష్పలతను ప్రేమించాడు. ఈ విషయం పుష్పలత తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులకు తెలిసి రచ్చ అయ్యింది. దాంతో మల్లారెడ్డికి ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులు అడ్డు వచ్చి పుష్పలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఇంటర్ పూర్తి చేసిన నాలుగేళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి 1989 మే 10న పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పుష్పలత ప్రస్తుతం పోచంపల్లి మండల జెడ్పీటీసీగా ఉన్నారు. కాగా కోట మల్లారెడ్డి ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణికి గిఫ్ట్ ఇస్తూ ప్రేమను చాటుతున్నారు. ఒకే ఇంట్లో మూడు ప్రేమ వివాహాలు కోదాడ: తల్లిదండ్రులు కులాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకోగా.. వారి బాటలోనే వారి ఇద్దరు కుమారులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన దివ్యాంగుడు కందుల పాపయ్య అదే గ్రామానికి చెందిన వెంకట్రావమ్మను 1980వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెద్ద కుమారుడు కందుల మధు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ తన క్లాస్మేట్ విజయలక్షి్మని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాపయ్య చిన్న కుమారుడు కందుల విక్రమ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 2014లో తన తోటి ఉద్యోగి ఉషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రేమ వివాహాలు చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖండాలు దాటి.. ఇంగ్లండ్‌లో చిగురించిన ప్రేమ కోదాడ: ఇండియాలో పుట్టిన వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో కలిసిన మనస్సులు కులమతాలకు అతీతంగా వారిని ఒకటి చేశాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో వారిమధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వారు ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసముంటున్నారు. ప్రేమించడం కన్నా ఆ ప్రేమను నిలుపుకోవడం ముఖ్యమంటున్నారు లంకెల బాలకృష్ణారెడ్డి– నీనశ్రీ దంపతులు. కోదాడకు చెందిన లంకెల బాలకృష్ణారెడ్డి 2007లో ఎంఎస్ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు వెళ్లాడు. ఎంఎస్ కోసం అదే యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన నీనశ్రీ కూడా చేరారు. ఇద్దరు కులాలు వేరైనా అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇండియాలో ఉన్న పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఇంగ్లండ్ వారసత్వాన్ని పొందారు. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమించడం.. ప్రేమించబడడం అదృష్టమని దాన్ని చివరి వరకు నిలుపుకొని భాగస్వామి సంతోషాన్నే తమ సంతోషంగా ఇరువురు భావించినపుడే అ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని చెప్పారు. తొలి పరిచయంలోనే ఇష్టపడి.. హుజూర్నగర్ : రెండు భిన్న కులాలకు చెందిన యువతీ, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వివాహానికి అంగీకరించక పోడంతో రాజకీయ నాయకుల సహాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం వర్ధాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి బాబు, శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రవీణ 26 ఏళ్ల క్రితం హుజూర్‌నగర్‌లో తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో స్థానిక సీపీఐ నాయకుడు కేవీరాజు సహాయ సహకరాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెద్దమ్మాయి అఖిల అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై ఇటీవల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కాగా చిన్న కూతురు అచ్యుత బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వారి కుటుంబం హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. -
Valentine's Day: స్కూల్ డేస్ నుంచే..
నెల్లూరు: ప్రేమ.. అదో మధురమైన అనుభూతి.. ఈ ప్రేమ కొందరి జీవితాల్లో సంతోషాల పంట. యువతీ యువకులు చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే.. మరికొందరు వారిని ఎదిరించి దంపతులవుతారు. ఎలాగైతేనేం నిండునూరేళ్లు ఆనందంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్కూల్ డేస్ నుంచే.. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డి కాలనీకి చెందిన పిన్నమిరాజు శివరామప్రసాద్, 53వ డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన కల్పనల మధ్య చదువుకునే రోజుల్లోనే స్నేహం చిగురించింది. కాలేజీ రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన కల్పన తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో 2006 ఫిబ్రవరి 9వ తేదీన స్నేహితుల సహకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అరుణ్, హర్ష ఇద్దరు సంతానం. శివరామప్రసాద్ వార్డ్ నం.54, బకాసుర, బుల్లెట్ బాబు తదితర సినిమాల్లో హీరోగా నటిస్తూ వర్దమాన నటుడిగా ఎదుగుతున్నారు. కల్పన నెల్లూరు మెప్మాలో ఆర్పీగా కొనసాగుతున్నారు. వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఈ దంపతుల ప్రేమ ప్రయాణం నిండు నూరేళ్లు సాగాలని ఆశిద్దాం. ప్రేమను నిలుపుకున్నాం వీరు ఆత్మకూరు పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని – షేక్ ముజీబున్నీసా దంపతులు. 30 ఏళ్ల క్రితం సందాని అనంతసాగరం నుంచి ఆత్మకూరుకు చదువుకొనేందుకు వచ్చారు. మెడికల్ ల్యాబ్ శిక్షణ పొంది ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో ఎల్‌ఆర్‌పల్లిలో నివాసం ఉంటున్న ఆయనకు అదే ప్రాంతానికి చెందిన షేక్ ముజీబున్నీసా పరిచయమయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల్లో తొలుత అంగీకరించలేదు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న వీరు ప్రేమికులకు చెప్పేదేమిటంటే ‘ప్రేమించడం గొప్ప కాదు.. దానిని నిలుపుకోవాలి.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఆ కాపురం కలకాలం సంతోషంగా ఉంటుందని’ చెబుతున్నారు. -
Galentines Day: ఇది ఎవరు, ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
గాలెంటైన్స్ డే 2024. వాలెంటైన్స్ డే గురించి అందరికీ తెలుసు. లవ్‌బర్డ్స్ వారం రోజుల పాటు సంబరాలు చేసుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ రోజులు గడిచిపోయాక ఎనిమిదో రోజు ఫిబ్రవరి 14న వాలెండైన్స్ డేగా జరుపుకుంటారు. మరి గాలెంటైన్స్ డే గురించి తెలుసా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న, "లేడీస్ సెలబ్రేటింగ్ లేడీస్" కోసం గాలెంటైన్స్ డేని జరుపుకుంటారు. స్నేహితురాళ్లు ప్రేమపూర్వ బహుమతులను ఇచ్చిచ్చుకుంటారు ఇది మీ స్నేహితురాళ్ళతో ప్రేమతో పాటు కొన్ని బహుమతుతలో హ్యాపీగా గడిపే రోజు. మహిళా స్నేహితుల స్నేహాన్ని, ప్రేమను హైలైట్ చేయడానికి ఇలా ఒక నిర్దిష్ట రోజును కేటాయించారు. గాలెంటైన్స్ డేని లెస్లీ నోప్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. గాలెంటైన్స్ డే అనేది అమెరికన్ సిట్కామ్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ రెండో సీజన్ 16వ ఎపిసోడ్లో ఆ రోజు గురించి ప్రస్తావన ఉంది. ఈ ఎపిసోడ్లో, లెస్లీ నోప్ (అమీ పోహ్లర్) వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు తన మహిళా స్నేహితుల కోసం తన వార్షిక గాలెంటైన్స్ డే పార్టీని ఏర్పాటు చేసింది. ఇది మహిళల సెలబ్రేషన్ రోజు. ఈ రోజును ఎలా గడుపుతారు అనేది మీరు మీ స్నేహితుల ఇష్టం! ఇది మీ రోజు అని నోప్ ప్రకటించారు. అప్పటినుంచి గాలెంటైన్స్ డే ప్రాచుర్యంలో వచ్చింది. ( Valentines day: లవ్‌బర్డ్స్‌తో, ప్రేమికుల పోలిక: ఈ ఇంట్రస్టింగ్ సంగతులు తెలుసా?) కరీనా నటాషా గాలెంటైన్స్ డే బాలీవుడ్ నటి కరీనాకపూర్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనావాలా మంచి బెస్టీలు, గత ఏడాది వీరిద్ద విలాసవంతమైన వింటర్ ఫ్యాషన్‌లో దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఏడాది గ్యాలెంటైన్స్ డే సందర్భంగా నటాషా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమేజింగ్ ఫోటోలను షేర్ చేసింది, National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా? View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
Valentines day: లవ్‌బర్డ్స్ ప్రత్యేకతలు ఇవీ!
ప్రేమికుల దినోత్సవం.. ఏదో పులకింతకు గురి చేసే పదం. పెళ్లయి ఏళ్లు గడిచినా, ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినా, సిచ్యుయేషనల్ రిలేషన్షిప్లో ఉన్న లవ్‌బర్డ్స్ జీవితాల్లో ఈ రోజుకున్న ప్రత్యేకతే వేరు. అన్నట్టు ప్రేమికులను అందంగా వర్ణించాలంటే లవ్‌బర్డ్స్ అని ఎందుకు అంటాం. అసలు ఈ పోలిక ఎలా వచ్చింది? లవ్‌బర్డ్స్ గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇపుడు తెలుసుకుందాం. అత్యంత ప్రాచుర్యం పొందిన అందమైన, తెలివైనచిలుక జాతికి చెందిన పక్షులే ఈ లవ్‌బర్డ్స్. ఈ చిన్న పక్షులు 100 సంవత్సరాలకు పైగా ఆఫ్రికన్ చిలుకలలో అత్యంత ప్రియమైన రకాల్లో ఒకటి. కొన్ని చిలుకలు మనుషులను అనుకరిస్తూ, మాట్లాడగలవు కానీ. లవ్‌బర్డ్స్ సాధారణంగా మాట్లాడవు. ఈలలు లేదా డోర్‌బెల్స్ అనుకరిస్తాయి. కానీ చాలా చిన్నప్పటినుంచీ నేర్పితే మాట్లాడుతాయిట. లవ్బర్డ్స్లో రకాలు లవ్బర్డ్స్లో తొమ్మిది వేర్వేరు ఉప-జాతులు ఉన్నాయి. వీటిలో దేనికవే వాటి ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. మాస్క్డ్ లవ్‌బర్డ్, బ్లాక్-చెంపల లవ్‌బర్డ్, ఫిషర్స్ లవ్‌బర్డ్, న్యాసా లవ్‌బర్డ్, స్విండర్న్ లవ్‌బర్డ్, రెడ్-ఫేస్డ్ లవ్‌బర్డ్, అబిస్సినియన్ లవ్‌బర్డ్, మడగాస్కర్ లవ్‌బర్డ్ , లవ్లీ పీచ్-ఫేస్డ్ లవ్‌బర్డ్ ఉన్నాయి. అయితే పసుపు, గ్రీన్, బ్లూ కలర్లో ఉండే లవ్‌బర్డ్స్ బాగా పాపులర్. ప్రేమికులతో లవ్‌బర్డ్స్ అని పోలిక ఎందుకంటే లవ్‌బర్డ్స్ చాలా చురుకైన పక్షులు. ప్రేమ పక్షులు సాధారణంగా 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. జీవితాంతం ప్రేమలోనే మునిగి తేలతాయి. ఏకభాగస్వామితో మాత్రమే బలమైన ప్రేమబంధాన్ని కొనసాగిస్తాయి. ఒకదానికొకటి కొసరి..కొసరి తినిపించుకుంటూ,ఎపుడూ అచ్చిక బుచ్చిక లాడు కుంటూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటాయి. ఒకవేళ జంట వీడితే డిప్రెషన్‌కు కూడా లోనవుతాయట. జంట వీడితే తట్టుకోలేవు! మనుషుల మాదిరిగానే, ప్రేమపక్షులు కూడా తమ భాగస్వామి లేదా జట్టు నుండి విడిపోయినప్పుడు నిరాశకు గురవుతాయి. ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. దీంతో దిగులుతో ఆహారం మానేసి చివరికి చనిపోవచ్చు కూడా. లవ్బర్డ్స్లో ఆడ, మగ తేడాను సులభంగా గుర్తించవచ్చు. సాధారణంగా మగవి ఆడవాటి కంటే పెద్దగా ఉంటాయి. సాధారణంగా నల్లటి రెక్కలున్న మగ ప్రేమపక్షికి ఎర్రటి ఈకల కిరీటం ఉంటుంది. అంతేకాదు మేటింగ్ సమయంలో లవ్ బర్డ్స్ హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. దీంతోవాటిల్లో జెలసీ, దూకుడు తత్వంబాగా పెరుగుతుందిట. ఫలితంగా కొన్ని సందర్భాల్లో తగాదాలు, ఒక్కోసారి ఒకదాన్ని మరొకటి చంపుకునే దాకా పోతాయిట. ప్రేమ పక్షులు ఏమి తింటాయి? లవ్‌బర్డ్స్ చిన్ని చిన్ని గింజలు, విత్తనాలు, గడ్డి, పండ్లు , కొన్ని రకాల కూరగాయలను తింటాయి. చాలా ఇళ్లలో రంధ్రాలు ఉన్న మట్టి కుండల్లోనే లవ్‌బర్డ్స్ ని ఎందుకు పెంచుతారో ఎపుడైనా ఆలోచించారా? ప్రేమ పక్షులు.. అడవిలో చెట్లు, రాళ్ళు, పొదల్లోని రంధ్రాలలో నివసించడం వీటికి అలవాటు. అడవులు తగ్గిపోవడంతో భవనాల్లోని రంధ్రాల్లోగూడు కట్టుకుంటాయి. అందుకే ఇళ్లలో కూడా సహజంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆ ఏర్పాటు అన్నమాట. -
‘కిస్ డే’ ఎలా పుట్టిందో.. ప్రాధాన్యత ఏంటో తెలుసా?
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును ‘కిస్ డే’ అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13న ‘కిస్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలెంటైన్ వీక్‌లోకి ‘కిస్ డే’ ఎలా వచ్చింది? దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైర రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వాలంటైన్ వీక్‌లో వచ్చే ‘కిస్ డే’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ, దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలామందికి తెలియదు. నిజానికి ‘కిస్ డే’ అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్యనున్న రిలేషన్‌ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. ‘కిస్ డే’.. వాలెంటైన్స్ డేని మరింత రొమాంటిక్‌గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్ధం నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్డేని సీక్రెట్‌గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్త పరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమ లేఖలు ఇచ్చి, ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావడంతో భారత్‌లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.