
ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువకుడు తన ప్రియురాలికి పువ్వులు ఇవ్వాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు, అయితే అతని ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు, కానీ అతని బండారం మొత్తం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' సందర్భంగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు పంపించడం లేదని, ఎలాగైనా ఆమెకు పువ్వులు ఇవ్వాలని ఏకంగా 'బ్లింకిట్' (Blinkit) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో చాటింగ్ చేసాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంపెనీ సీఈఓ 'అల్బిందర్ ధిండ్సా' (Albinder Dhindsa) ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు.
మనోజ్ అనే వ్యక్తి బ్లింకిట్ సపోర్ట్ టీమ్‌తో చాట్ చేస్తూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌ను వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపడం లేదని, కాబట్టి ఆమె కోసం నేను ఆమె కోసం పువ్వులు ఆర్డర్ చేసి ఈ ఆర్డర్‌కి నేను మీ డెలివరీ పార్టనర్‌గా వెళ్లవచ్చా? అని అడిగాడు. కానీ సంస్థ దీనికి మేము హెల్ప్ చేయలేమని రిప్లై ఇచ్చింది.
ఈ సంభాషణ మొత్తాన్ని అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఇండియా నాట్ ఫర్ బిగెనర్స్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ పోస్ట్‌ను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం..
India is clearly not for beginners 🤦♂️ https://t.co/JIqwpls2pN
— Albinder Dhindsa (@albinder) February 14, 2024