blinkit
-
క్విక్ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..
కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్‌పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యతిరేక పోటీ విధానాలుక్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.ఆకర్షణీయ ధరలుసాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ పెట్టుబడుల దుర్వినియోగంక్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్‌ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.ప్రభుత్వ సంస్థల దర్యాప్తుక్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్ఏం చేయాలంటే..ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి. -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు జొమాటో, స్విగ్గీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతుల ద్వారా మార్కెట్ తటస్థతకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా వేలాది రెస్టారెంట్ల మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఎన్ఆర్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది.ఎన్ఆర్ఏఐ ఆందోళనకు కారణాలుప్రైవేట్ లేబులింగ్: ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడానికి జొమాటో, స్విగ్గీలు బ్లింకిట్ బిస్ట్రో(Blinkit Bistro), స్విగ్గీ స్నాక్(Swiggy Snacc) వంటి ప్రత్యేక యాప్‌లను ప్రారంభించాయి. దీనివల్ల మార్కెట్‌పై గుత్తాధిపత్యాన్ని చలాయించాలని భావిస్తున్నాయి. ఇది న్యాయబద్ధమైన పోటీకి వ్యతిరేకం అని విమర్శలున్నాయి.డేటా మానిటైజేషన్: సంబంధిత వినియోగదారుల డేటాను రెస్టారెంట్లతో పంచుకోకుండా పోటీ ఉత్పత్తులను సృష్టించడానికి జొమాటో(Zomato), స్విగ్గీ పకడ్బందీ విధానలు అనుసరిస్తున్నాయి. రెస్టారెంట్ డేటాను మాత్రం తమకు అనుకూలంగా వినియోగిస్తున్నాయని ఎన్ఆర్ఏఐ పేర్కొంది.ఎన్ఆర్ఏఐ స్పందన..రెస్టారెంట్ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. జొమాటో, స్విగ్గీలు మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధించకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి చేస్తున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్జొమాటో బ్లింకిట్ బిస్ట్రోజొమాటో, స్విగ్గీ తమ వినియోగదారులకు భోజనంతోపాటు ఇతర ప్రత్యేక సేవలందించేందుకు కొన్ని యాప్‌లను ఇటీవల ప్రారంభించాయి. జొమాటో బ్లింకిట్ బిస్ట్రో పేరుతో జనవరి 10, 2025 కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. భోజనం, స్నాక్స్, పానీయాలను 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో డెలివరీ చేస్తామని తెలిపింది. ప్రిజర్వేటివ్స్, ఫుడ్ ప్రాసెసర్లు, మైక్రోవేవ్ ప్రాసెసింగ్ లేకుండా ఆహారాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చింది.స్విగ్గీ స్నాక్స్విగ్గీ స్నాక్ యాప్‌ను జనవరి 7, 2025న లాంచ్ చేశారు. స్నాక్స్, పానీయాలు, భోజనాలను 10-15 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. తొలుత బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
10 నిమిషాల్లో అంబులెన్స్.. ‘జాగ్రత్తగా వ్యవహరించాలి’
బ్లింకిట్ వంటి క్విక్‌కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) ఇటీవల ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ (ambulance)సేవను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అలాంటి సర్వీసులు ప్రారంభించాలనుకునే కంపెనీలకు మంత్రి సూచనలు చేశారు.‘అంబులెన్స్ సేవలు అందించడం, ఔషధాలు వంటివి త్వరగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో బ్లింకిట్ కొత్త సర్వీసులు ప్రారంభించింది. అయితే సదరు సర్వీసులు అందించే క్రమంలో తప్పకుండా చట్టాలను, ప్రభుత్వ నియమాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. క్విక్ కామర్స్, ఇ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని కిరాణాదారులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోటీ నిబంధనల ఉల్లంఘన జరిగితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించిన సమయంలో కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాం. ప్రాథమికంగా గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించాం’ అన్నారు. -
10 నిమిషాల్లో అంబులెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్విక్ కామర్స్ రంగంలో సంచలనానికి బ్లింకిట్ తెరతీసింది. ఇప్పటి వరకు ఆహారం, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు పరిమితమైన క్విక్ కామర్స్(Quick Commerce) రంగంలో ఏకంగా అంబులెన్స్ సేవలకు కంపెనీ శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాతిపదికన ఈ సేవలను మొదట గురుగ్రామ్‌లో ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను విస్తరించనుననట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు ఈ అంబులెన్సులో ఉంటాయి. డ్రైవర్‌తోపాటు పారామెడిక్, డ్యూటీ అసిస్టెంట్ సైతం ఉంటారు. ‘నగరాల్లో త్వరిత, విశ్వసనీయ అంబులెన్స్(Ambulance) సేవలను అందించే విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా మొదటి అడుగు వేస్తున్నాం. గురుగ్రామ్‌లో తొలి ఐదు అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. లాభం లక్ష్యం కాదు. కస్టమర్లకు సరసమైన ధరతో ఈ సేవను నిర్వహిస్తాం. దీర్ఘకాలికంగా ఈ క్లిష్ట సమస్యను నిజంగా పరిష్కరించడంలో పెట్టుబడి పెట్టాం’ అని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా చెప్పారు. -
10 నిమిషాల్లోనే అంబులెన్స్.. బ్లింకిట్ కొత్త సర్వీస్
క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. 10 నిమిషాల అంబులెన్స్ (ambulance)సేవను గురుగ్రామ్ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అల్బిందర్ ధింద్సా తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాము" అని ధిండ్సా పేర్కొన్నారు. గురుగ్రామ్ నగరంలో కంపెనీ ఈరోజు (జనవరి 2) నుండి ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన కూడా ఉందని ఆయన వెల్లడించారు.“మొదటి ఐదు అంబులెన్స్‌లు గురుగ్రామ్‌లో రోడ్‌పైకి వస్తాయి. సర్వీస్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేసినప్పుడు, బ్లింకిట్ యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌ని బుక్ చేసుకునే ఎంపికను మీరు చూస్తారు" అని ధిండ్సా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.బ్లింకిట్ అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED), స్ట్రెచర్, మానిటర్ వంటి పరికరాలతోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని ధిండ్సా వివరించారు. ప్రతి అంబులెన్స్‌లో ఒక పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇందులో తమకు లాభం ముఖ్యం కాదని, తక్కువ ధరకు ఈ సేవలు అందిస్తామని వివరించారు.Ambulance in 10 minutes.We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z— Albinder Dhindsa (@albinder) January 2, 2025 -
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
ఆర్డర్ పెట్టిందొకటి.. డెలివరీ అయ్యిందొకటి
ధన్‌తేరాస్ సందర్బంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి వాటి ద్వారా కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు బంగారు, వెండి నాణేలను అందించారు. అయితే ఆన్లైన్లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి బ్లింకిట్ ద్వారా మోహిత్ జైన్ అనే వ్యక్తి.. 24 క్యారెట్ల 1 గ్రామ్ లక్ష్మి గోల్డ్ కాయిన్, 10 లక్షి గణేష్ సిల్వర్ కాయిన్ ఆర్డర్ చేశారు. అయితే అతనికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ స్థానంలో 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను షేర్ చేస్తూ.. బ్లింకిట్ డెలివరీ చేసే సమయానికి నేను ఇంట్లో లేను, అందుకే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడికి ఓటీపీ చెప్పి తీసుకోమన్నాను. కానీ నేను 20 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయి ఉండటం చూసి ఖంగుతిన్నాను వెల్లడించారు.వచ్చిన డెలివరీకి ఆర్డర్ చేద్దామనుకుంటే.. రిటర్న్ విండో గడువు ముగిసింది. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన వస్తువులను బ్లింకిట్‌లో ఆర్డర్ చేయడం ఇదే మొదటిసారి. అయితే డెలివెరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉందని కూడా పేర్కొన్నారు. ఇది చూసిన చాలామంది ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపైన మండిపడ్డారు.Got scammed by blinkitI ordered 1 gm gold coin from blinkit, along with the 1gm silver coin. It was all prepaid. I wasn't there at home to receive the order, so I gave the otp to my younger brother to get it received. After 20 mins I reached home and saw wrong item was… pic.twitter.com/N15wSfIhpt— Mohit Jain (@MohitJa30046159) October 29, 2024 -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి..
అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్‌లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్లో హామ్లీస్, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం. -
ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమెడియన్ స్వాతి సచ్‌దేవా కాసేపు నవ్వులు పూయించారు. ఇటీవల జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచిన నేపథ్యంలో మృదువుగా జోకులు వేశారు. ఈమేరకు విడుదలైన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఇటీవల జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.5 నుంచి రూ.6కు పెంచినట్లు ప్రకటించింది. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. ఇది నేరుగా కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో తాజాగా జరిగిన జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా మాట్లాడేందుకు స్టేజ్‌పైకి వస్తూ ‘జొమాటో వాళ్లు ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో.. దీనికి మాత్రం ఎలాంటి ఫీజు వసూలు చేయరని ఆశిస్తున్నా’నని అనడంతో అందరూ నవ్వుకున్నారు.ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?ఈ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Swati Sachdeva (@swati.sachdeva95) -
హైదరాబాద్ బ్లింకిట్ గోదాంలో కాలంచెల్లిన ఆహార పదార్థాలు
జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్‌కు చెందిన హైదరాబాద్ గోదాంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరిలోని దేవరయాంజల్ వేర్‌హౌజ్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను కనుగొన్నట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం తన ఎక్స్‌ఖాతాలో వివరాలు వెల్లడించింది.ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్లింకిట్ గోదాంలో ప్రాథమిక పరిశుభ్రత నిబంధనలు పాటించడంలేదు. గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వలున్నాయి.గోదాంలో ఆహార పదార్థాలను నిల్వచేసే ర్యాక్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయి.ఫుడ్‌సేఫ్టీ ట్రెయినింగ్ అండ్ సెర్టిఫికేషన్(ఫాస్టాక్) ట్రెయినీ అందుబాటులో లేరు. గోదాంలో పనిచేస్తున్నవారు గ్లౌజులు, ఏప్రాన్లు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.సరుకులు డెలివరీ ఇచ్చే వక్తుల వద్ద మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. గోదాంలో ఆహార ఉత్పత్తులను కాస్మటిక్ ప్రొడక్ట్‌లను కలిపి నిలువ చేశారు.ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం హోల్ ఫార్మ్ కన్గ్రూయెన్స్ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామా, లేబుల్‌పై ఉన్న అడ్రస్‌లో తేడాలున్నాయి. దీనికి సంబంధించి నోటీసులు ఇస్తామని తెలిపారు.కామాక్షి ఫుడ్స్ లైసెన్స్ ద్వారా తయారు చేసిన రూ.30వేలు విలువచేసే మైదా, వేరుశెనగ పిండి, బాజ్రా, పోహా..వంటి ఆహార ఉత్పత్తులు గడువు ముగిశాయి.పాడైపోయినట్లు అనుమానిస్తున్న రూ.52వేలు విలువచేసే రాగుల పిండి, పప్పు నిల్వలను స్వాధీనం చేసుకుని నమూనాలను ల్యాబ్‌కు పంపారు.ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించి కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘కంపెనీ భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులు కనుగొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీ గిడ్డంగి భాగస్వామి, ఆహార భద్రతా విభాగంతో కలిసి పని చేస్తాం’ అన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మెజొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్ కంపెనీ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, టాటా గ్రూప్ యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్ మాదిరి ఆన్లైన్ గ్రాసరీ వ్యాపారం చేస్తోంది. ఇది దేశంలోని వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వినియోగదారులు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే సరుకులు డెలివరీ ఇస్తోంది. డార్క్ స్టోర్ల(సరుకులు ఎక్కడివో వివరాలుండవు) ద్వారా డెలివరీలు అందిస్తోంది. ఈ స్టోర్లు నివాస ప్రాంతాల్లో సాధారణంగా 2,500-3,500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ డెలివరీలను అంతర్గత సిబ్బంది ద్వారా మాత్రమే అందిస్తారు. Task force team has conducted inspection in 𝗕𝗹𝗶𝗻𝗸𝗶𝘁 𝗪𝗮𝗿𝗲𝗵𝗼𝘂𝘀𝗲 at Devar yamjal, Medchal Malkajgiri District on 05.06.2024. * The premises found to be very disorganised, unhygienic and dusty at storage racks.* There is no Fostac trainee available.* Food… pic.twitter.com/FmZROCrGcC— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 6, 2024 -
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడిపోయారు జనాలు. అంతకు ముందు కూడా చేశారు గానీ. ఆ మహమ్మారి తర్వాత నుంచి ఆన్లైన్ షాపింగ్ మహా ఎక్కువయ్యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇలానే ఓ మహిళ కొడుకు బ్లింకిట్ నుంచి పెద్ద మొత్తంలో కూరగాయాలు కొనుగోలు చేశాడు. డెలివరీ అయ్యాక బిల్ చూసి తల్లి షాకయ్యింది. ఏంటిది ఇంత మొత్తంలో కూరగాయాలు కొన్న కొత్తిమీరకు కూడా బిల్లు వేస్తారా అని విస్తుపోయింది. ఈ విషయమై తన కొడుకుతో చెప్పింది. తన తల్లి ఆలోచననను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ..'నేను బ్లింకిట్ (Blinkit)లో కూరగాయలు కొనుగోలు చేశా. అందులో కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు బాధ కలిగింది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా! అని ఆమె భావిస్తోంది.' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీన్ని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధింద్సాకి ట్యాగ్ చేశారు. వినియోగదారుడు సోషల్ మీడియా పోస్ట్‌కి రెస్పాండ్ అయిన అల్మిందర్ ధింద్సా దీని గురించి పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత జస్ట్ నాలుగు గంటల్లోనే ఫాలో అప్ పోస్ట్‌లో ధింద్సా ఫ్రీగా కొత్తిమీర ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్ సావంత్ తల్లిగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేస్తాం అని ధింద్సా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇలా ఓసామన్య వినియోగదారుడి పోస్ట్‌పై సీఈవో సత్వరమే స్పందించడంపై ప్రశంసల జల్లు కురిపించారు నెటిజన్లు. అంతేగాదు మరిన్నింటిని ఉచితంగా ఇవ్వొచ్చు అంటూ సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు.It’s live! Everyone please thank Ankit’s mom 💛 We will polish the feature in next couple of weeks. https://t.co/jYm2hGm67a pic.twitter.com/5uiyCmSER6— Albinder Dhindsa (@albinder) May 15, 2024 (చదవండి: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో) -
గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్
ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువకుడు తన ప్రియురాలికి పువ్వులు ఇవ్వాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు, అయితే అతని ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు, కానీ అతని బండారం మొత్తం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' సందర్భంగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు పంపించడం లేదని, ఎలాగైనా ఆమెకు పువ్వులు ఇవ్వాలని ఏకంగా 'బ్లింకిట్' (Blinkit) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో చాటింగ్ చేసాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంపెనీ సీఈఓ 'అల్బిందర్ ధిండ్సా' (Albinder Dhindsa) ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. మనోజ్ అనే వ్యక్తి బ్లింకిట్ సపోర్ట్ టీమ్‌తో చాట్ చేస్తూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌ను వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపడం లేదని, కాబట్టి ఆమె కోసం నేను ఆమె కోసం పువ్వులు ఆర్డర్ చేసి ఈ ఆర్డర్‌కి నేను మీ డెలివరీ పార్టనర్‌గా వెళ్లవచ్చా? అని అడిగాడు. కానీ సంస్థ దీనికి మేము హెల్ప్ చేయలేమని రిప్లై ఇచ్చింది. ఈ సంభాషణ మొత్తాన్ని అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఇండియా నాట్ ఫర్ బిగెనర్స్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ పోస్ట్‌ను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం.. India is clearly not for beginners 🤦♂️ https://t.co/JIqwpls2pN — Albinder Dhindsa (@albinder) February 14, 2024 -
ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మనచెంతకే వచ్చేలా చేసుకుంటున్నాం. అలాంటి వాటి కోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఒకటి 'బ్లింకిట్' (Blinkit). కిరాణా, ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసరాలను డెలివరీ చేసే ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం ఐఫోన్స్ కూడా డెలివరీ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. ఈ మొబైల్ సేల్స్ నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్లు ఓపెన్ చేయక ముందు నుంచే కస్టమర్లు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్ ఐఫోన్ డెలివరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు! ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లో బ్లింకిట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేస్తున్నట్లు నెటిజన్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం బ్లింకిట్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Love this 🫶 https://t.co/qhCUjDqbKc — Albinder Dhindsa (@albinder) September 22, 2023 -
జొమాటోకు మరో ఎదురు దెబ్బ!
ట్రాఫిక్ కష్టాల్ని దాటుకుని వన్.. టూ.. త్రీ.. రన్ అంటూ పది నిమిషాల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని డెలివరీ చేసే ఉద్యోగులు బ్లింకిట్‌కు భారీ షాకిచ్చారు. వారం రోజుల పాటు డెలివరీ ఉద్యోగులు చేసిన స్ట్రైక్ దెబ్బకు సంస్థ స్పందించకపోవడంతో ఇతర సంస్థల్లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని గంటల్లో డెలివరీ చేస్తాం’ అంటూ సంస్థలు ప్రచారం చేసేవి. కానీ ఇప్పుడు అలాంటి మాటలు వినిపించడం లేదు. ఆర్డర్ పెట్టడం ఆలస్యం పదే పదినిమిషాల్లో మీ కాలింగ్ బెల్ కొట్టేస్తాం.. అంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు. ఆ కోవకే చెందుతుంది జొమాటోకి చెందిన బ్లింకిట్ అనే గ్రోసరీ యాప్. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌కు పోటీగా బ్లింకిట్ క్విక్ కామర్స్ సేవల్ని అందిస్తుంది. పది నిమిషాల్లో ఆర్డర్స్‌ను డెలివరీ చేయడంలో మంచి పేరు సంపాదించింది. కానీ ఆర్డర్ తీసుకొని బయలుదేరిన మరుక్షణం నుంచి సరుకును చేరవేసే వరకూ.. ప్రతిక్షణం ఒత్తిడికి గురయ్యే డెలివరీ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదనే కారణంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇదివరకు డెలివరీపై రూ.50 ఉండే చార్జీని రూ.25కు తగ్గించిందని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.15 చేయడం వల్ల తమ ఆదాయం చాలా తగ్గిపోతోందని, న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో కార్యకలాపాల్ని నిలిపి వేశారు. దీంతో బ్లింకిట్ ఆయా స్టోర్ల కార్యకలాపాల్ని నిలిపి వేసింది. ఈ తరుణంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ గురుగావ్, గజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బ్లింకిట్‌కు చెందిన ఢిల్లీ -ఎన్సీఆర్లలో దాదాపు వందల స్టోర్లు మూత పడ్డాయి. సమ్మెకు ముందు బ్లింకిట్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దాదాపు 3,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. వారిలో మూడింట ఒక వంతు మంది ఇతర ఫ్లాట్ఫారమ్లలో కార్యకలాపాలకు ఉపక్రమించారు. బ్లింకిట్‌లో పని చేసే ఉద్యోగులు తక్కువ వేతనం కారణంగా ఇతర సంస్థల్లో చేరాల్సి వచ్చింది. వేతనం విషయంలో బ్లింకిట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఉద్యోగులకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు స్ట్రైక్‌తో బ్లింకిట్ భారీగా నష్టపోవడంతో కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! -
జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు!
‘ఆలస్యం విషం, వేగమే అమృతం’.. దేశంలోని ప్రముఖ డెలివరీ స్టార్టప్స్ ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉదయాన్నే వంటింట్లో నుంచి ఘుమఘుమలు ఇంటిల్లాపాదిని పలకరిస్తుంటే కూరలోకి ఉప్పు లేకపోతే.. గాభరా పడాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమని ఉడికేలోగా లవణం లావణ్యంగా ఇంటికి వచ్చేస్తుంది. ‘మాటకు పది నిమిషాలని అంటున్నాం కానీ, మా సగటు డెలివరీ సమయం ఎనిమిది నిమిషాల పైచిలుకే’ అంటున్నాయి డెలివరీ సంస్థలు. ఇదంతా బాగానే ఉన్నా బైక్ పంక్చర్, ట్రాఫిక్ సిగ్నల్,అన్నిటికీ మించి స్పీడ్ బ్రేకర్ల కన్నా స్పీడుగా బ్రేకులు వేయించే గుంతలతో వ్యయప్రయాసలకు ఓర్చి పది నిమిషాల్లో డెలివరీ చేసే ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? అంటే లేదనే అంటున్నారు జొమాటోకి చెందిన ‘బ్లింకిట్’ ఉద్యోగులు. బ్లింకిట్ యాప్‌కు చెందిన సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. డెలివరీ చేయడం మానేశారు. దీంతో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీసుల్ని అందిస్తుండగా.. ఉద్యోగుల నిర్ణయంతో వాటిలో పదుల సంఖ్యలో స్టోర్లు మూత పడ్డాయి. మరోవైపు సిబ్బంది ఆందోళన చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్దతిని అమలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జొమాటో మెయిల్ కాగా,ఉద్యోగులకు జొమాటో మెయిల్ పెట్టింది. ఆ మెయిల్లో రైడర్ల కోసం కొత్త చెల్లింపుల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ పద్దతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని, షట్‌డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది. చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!