10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ | Blinkit And Big Basket Delivers iPhone 16 in 10 Minutes | Sakshi
Sakshi News home page

10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ

Published Fri, Sep 20 2024 2:37 PM | Last Updated on Fri, Sep 20 2024 3:09 PM

Blinkit And Big Basket Delivers iPhone 16 in 10 Minutes

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్‌ స్టోర్‌లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

బిగ్‌ బాస్కెట్
ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్‌ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్‌ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.

ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్

బ్లింకిట్
బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్‌ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement