Big Basket
-
వామ్మో.. ఐఫోన్ 16 ని 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్న టాటా గ్రూప్
-
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..!
కోవిడ్-19 రాకతో భారత్‌లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. ఈ సేవలను అందించడంలో బిగ్ బాస్కెట్, ఇన్‌స్టామార్ట్, బ్లిన్క్ఇట్(గ్రోఫర్స్), జియో మార్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీ సేవలను అందించడంలో ఫ్యుచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ బిగ్ బజార్ భారీ ప్రణాళికలను సిద్ధమైన్నట్లు సమాచారం. బెంగళూరు కంపెనీతో భాగస్వామ్యం..! బిగ్ బజార్ ఆయా నగరాల్లో రెండు గంటల్లో కస్టమర్లకు గ్రాసరీ సేవలను అందిస్తోంది. మరింత వేగవంతమైన ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందించేందుకుగాను బెంగళూరుకు చెందిన ఈవెంట్ మార్కెటింగ్ టెక్నాలజీ స్టార్టప్ ఎర్సెస్ లైవ్ (Ercess Live)తో బిగ్ బజార్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్లోనే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం..ఎర్సెస్ లైవ్ ఆన్లైన్ గ్రాసరీ సేవల్లో భాగంగా బిగ్ బజార్‌కు స్ట్రాటిజిక్ వ్యూహాలను అందించనున్నట్లు సమాచారం. ఈ నెల జనవరిలో ఆన్లైన్ గ్రాసరీ సేవలను బిగ్ బజార్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణ భారత్‌లో తన కొత్త హోమ్ డెలివరీ సేవలను బిగ్ బజార్ ప్రారంభించనుంది. డంజోతో రిలయన్స్ భారీ డీల్..! దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అందుకోసం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవల్లో బిగ్ ప్లేయర్స్‌గా జియో మార్ట్, బిగ్ బాస్కెట్స్ ముందుస్థానంలో ఉన్నాయి. చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..! -
ఆన్లైన్లో అరటి ఆకులు.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
హైదరాబాద్: కాదేది వ్యాపారానికి అనర్హం అన్న చందంగా మారింది కార్పొరేట్ ఆన్లైన్ వ్యాపారస్తుల తీరు. వీరు పండుగల సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి మరీ భోగి పిడకల దగ్గరి నుంచి మావిడాకులు, పూజా సామాగ్రి, కొబ్బరిచిప్పలు, వేప పుల్లలు వరకూ అన్నింటినీ ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. తాజాగా అరటి ఆకులు కూడా ఆన్లైన్లో అమ్మకానికి రెడీ అయ్యాయి. హిందూ సంప్రదాయంలో అరటి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో దొరికినంత ఈజీగా పట్టణాల్లో అరటి ఆకులు దొరకవు. నగర వాసులు పండగలు, పబ్బాలు వస్తే వీటి కోసం మార్కెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. దీంతో ఆన్లైన్ వ్యాపారులు అరటి ఆకులను ఇంటికే డెలవరీ చేస్తామంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రీగా దొరికే వీటి ధర ఆన్లైన్లో ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఐదు అరిటాకులు ధర రూ. 50 లు అంటూ బిగ్ బాస్కెట్ అనే అస్లైన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ తమ సైట్లో ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ బిగ్ బాస్కెట్ వాళ్లు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారండోయ్. ఐదు ఆకుల అసలు ధర రూ. 62.50 అయితే, 20 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 50కి ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం.. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి! -
టాటా గ్రూప్ కిట్టీలోకి బిగ్‌బాస్కెట్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా సన్స్ కంపెనీ టాటా డిజిటల్ లిమిటెడ్(టీడీఎల్)కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను టీడీఎల్ సొంతం చేసుకోనుంది. తద్వారా ఇటీవల వేగవంత వృద్ధి సాధిస్తున్న ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్లో టాటా గ్రూప్ భారీ అడుగులు వేయనున్నట్లు విశ్లేషకులు చెప్పారు. డీల్‌లో భాగంగా బిగ్‌బాస్కెట్.కామ్ యజమాని సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్(ఎస్జీఎస్)లో టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టీడీఎల్ మెజారిటీ వాటాను కొనుగో లు చేయనుంది. బిగ్‌బాస్కెట్ ద్వారా ఎస్జీఎస్.. బీటూబీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే బిగ్‌బాస్కెట్ ద్వారా బీటూసీ అమ్మకాలు చేపడుతున్న ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్్ట్సలోనూ ఎస్జీఎస్ పూర్తి వాటాను కలిగి ఉంది. 2011లో ఏర్పాటైన బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు.. గ్రోఫర్స్‌తో బిగ్‌బాస్కెట్ పోటీ పడుతుండటం తెలిసిందే. చదవండి: లాక్డౌన్ భయం.. భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా? -
గడప గడపకి జియో మార్ట్ సేవలు
ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ(లాస్ట్ మైల్ డెలివరీ – ఎల్ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే.. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది. జియో మార్ట్.. పీవోఎస్ మెషీన్లతో పాటు నిల్వలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, రుణ సదుపాయాలు మొదలైనవి కూడా కలిపిస్తోంది. వాట్సాప్‌తో జట్టు కట్టడంతో ఈ లావాదేవీలన్నీ మరింత సులభతరంగా నిర్వహించేందుకు వీలు పడనుంది. అటు అమెజాన్ కూడా ఈ తరహా వ్యూహాన్ని మరో రకంగా అమలు చేస్తోంది. ఎల్ఎండీ కోసం ’ఐ హ్యావ్ స్పేస్’ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సుమారు 28,000 చిన్న రిటైలర్లు ఇందులో భాగంగా ఉన్నారు. తమ స్టోర్స్‌కి 2-4 కి.మీ. పరిధిలో ఉత్పత్తులను అందిస్తున్నారు. దీనితో సదరు స్టోర్స్‌కి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అమెజాన్ వర్గాలు తెలిపాయి. చదవండి: సరికొత్త రికార్డుకు చేరువలో టీసీఎస్! -
మరిన్ని పట్టణాలకు అమెజాన్ ప్యాంట్రీ
ముంబై: గ్రోసరీ వ్యాపారంలో మరింతగా విస్తరించే ప్రణాళికలతో అమెజాన్ ఇండియా ఉంది. నాన్ మెట్రో, ఇతర పట్టణాల్లోని మొదటి సారి కస్టమర్లను పెద్ద ఎత్తున సొంతం చేసుకోవాలనుకుంటోంది. గడిచిన ఏడాది కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు ఇతర పట్టణాల నుంచి అమెజాన్‌లో షాపింగ్ చేసిన కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త కస్టమర్లలో 85 శాతం.. అలాగే, ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాల నుంచే ఉన్నాయి. అమెజాన్ గ్రోసరీ వ్యాపారమైన అమెజాన్ ప్యాంట్రీలనూ కొనుగోలు చేసే మొత్తం కస్టమర్ల సంఖ్య పెరిగింది. అమెజాన్ ప్యాంట్రీలో కొనుగోలుదారులు రెట్టింపుయ్యారు. కరోనా తర్వాత అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ ఫ్రెష్‌పై ఆర్డర్లలో 60 శాతానికి పైగా నూతన కస్టమర్ల నుంచే, అది కూడా నాన్ మెట్రోల నుంచే ఉంటున్నాయి. వేగంగా డెలివరీ.. ఆర్డర్ చేసిన వెంటనే వేగంగా గ్రోసరీ డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్.. 10 పట్టణాల్లో ప్యాంట్రీ (డ్రై గ్రోసరీ/కిరాణా సరుకులు), ఫ్రెష్ (కిరాణా, పండ్లు, కూరగాయలు) సేవలను ఏకీకృతం చేసింది. మరింత వేగంగా డెలివరీ చేసేందుకు సమగ్ర ఆన్లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఆర్డర్లను ఇక్కడి నుంచే వేగంగా డెలివరీ చేయనుంది. ఇక మిగిలిన 290 పట్టణాల్లో ఫ్రెష్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్యాంట్రీ ద్వారా ఆయా పట్టణాల్లో గ్రోసరీ ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. ‘‘గ్రోసరీ విభాగం రెండు రెట్లు పెరిగి అమెజాన్ డాట్ ఇన్‌లో నూతన కస్టమర్లకు ఒక గేట్వేగా మారింది. ఆన్లైన్ గ్రోసరీ విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి. ఇది ఇప్పటికీ చాలా చిన్న మార్కెట్‌గానే ఉంది. భారత్‌లో ప్రజల గ్రోసరీ కొనుగోళ్ల తీరు పూర్తిగా పరిణామం చెందనుంది. రానున్న కొన్నేళ్లలో ఈ విభాగం ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. కొత్తగా వచ్చే కస్టమర్లలో ఎక్కువ శాతం చిన్న పట్టణాలు, గ్రామాల నుంచే ఉంటారని అంచనా వేస్తున్నాము. డ్రై గ్రోసరీ పరిధిని విస్తరించనున్నాము. టాప్-50 పట్టణాల్లో ఫ్రెష్, డ్రై గ్రోసరీలో పూర్తి శ్రేణిలో ఉత్పత్తులను అందించనున్నాము’’ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. టాటాలు సైతం.. టాటా గ్రూపు సైతం ఆన్లైన్ గ్రోసరీ వ్యాపారంపై భారీ అంచనాలతోనే ఉంది. టాటా డిజిటల్ లిమిటెడ్ ఇప్పటికే బిగ్ బాస్కెట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని, కాంపిటిషన్ కమిషన్ ఆమోదం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. రిలయన్స్ జియో సైతం జియోమార్ట్ పేరుతో పట్టణాల్లో గ్రోసరీ డెలివరీ చేస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ కూడా విస్తరణ ప్రణాళికలతో ఉంది. ఈ ఏడాది ఈ విభాగంలో మంచి వృద్ధి నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాయి. గతేడాది లాక్డౌన్లు విధించడం ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ విస్తరణకు మద్దతునిచ్చిన అంశంగా చెప్పుకోవాలి. 2019లో 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్లైన్ గ్రోసరీ వ్యాపారం 2020లో 3.3 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు రెడ్‌సీర్ సంస్థ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2025 నాటికి ఈ మార్కెట్ 24 బిలియన్ డాలర్లకు (రూ.1.75లక్షల కోట్లు) విస్తరిస్తుందని అంచనా వేస్తోంది. స్థానిక కిరాణా వర్తకుల భాగస్వామ్యంతో కూడిన అమెజాన్ ‘లోకల్ షాప్స్’ ఈ ఏడాది మార్చి నాటికి 450 పట్టణాల్లో 50,000 ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలకు విస్తరించగా.. ఈ ఏడాది చివరికి రెట్టింపు సంఖ్యకు చేరుకుంటామని అమెజాన్ ఇండియా అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ ఈ కామర్స్ వేదికగా స్థానిక కిరాణా వర్తకులు రిజిస్టర్ చేసుకుని విక్రయాలు చేపట్టవచ్చు. చదవండి: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే! -
టాటా గ్రూప్ చేతికి బిగ్‌బాస్కెట్!
ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు పురోగతిలో ఉన్నట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,350 కోట్లు)కు సొంతం చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఇటీవల అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ అంశంపై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం! పోటీ తీవ్రం బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్‌బాస్కెట్ ఇప్పటికే వాల్‌మార్ట్‌కు మెజారిటీ వాటాగల ఫ్లిప్‌కార్ట్, యూఎస్ దిగ్గజం అమెజాన్.. తదితరాలతో పోటీని ఎదుర్కొంటోంది. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో చైనీస్ ఆన్లైన్ దిగ్గజం అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డీల్‌లో భాగంగా అలీబాబా సైతం మొత్తం వాటాను విక్రయించే వీలున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా.. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కోసం టాటా గ్రూప్ 50-70 కోట్ల డాలర్లను వెచ్చించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల 20 కోట్ల డాలర్లను సమీకరించేందుకు టాటా గ్రూప్‌తో బిగ్‌బాస్కెట్ చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. -
అర్బన్ ల్యాడర్‌పై ఆర్ఐఎల్ కన్ను!
ఈకామర్స్‌లో వ్యాపార విస్తరణకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసుకునే యోచనలో ఉన్న ఆర్ఐఎల్ దేశీయంగా మరికొన్ని కంపెనీల కొనుగోలుకి చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీ ఆర్బన్ ల్యాడర్‌పై దృష్టిపెట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా మిల్క్ డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేసింది. తుది దశలో అర్బన్ ల్యాడర్‌తో కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అర్బన్ ల్యాడర్‌తో 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు) డీల్ కుదిరే వీలున్నట్లు అంచనాలున్నాయి. కాగా.. మరోవైపు ఈఫార్మసీ స్టార్టప్ నెట్మెడ్స్తోపాటు.. లింగరీ రిటైలర్ జివామీలోనూ మెజారిటీ వాటా కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆర్ఐఎల్వైపు చూపు! మిల్క్‌బాస్కట్ గతంలో ఆన్లైన్ గ్రోసరీస్ సంస్థ బిగ్బాస్కెట్తోపాటు.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తాజాగా ఆర్ఐఎల్ ప్రతినిధులతో మిల్క్‌బాస్కట్ సంప్రదింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతో ఇందుకు వేచిచూసే ధోరణితో మిల్క్‌బాస్కట్ ఉన్నట్లు మీడియా పేర్కొంది. 1.5 కోట్ల డాలర్ల విలువను మిల్క్‌బాస్కట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇటీవల మిల్క్ ప్రొడక్టులతోపాటు.. గ్రోసరీస్‌కు సైతం డిమాండ్ పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార విస్తరణకు పలు అవకాశాలు లభిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ హైజంప్!
దేశీయంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పలు రంగాలు డీలాపడినప్పటికీ.. ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ మాత్రం జోరందుకుంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్ అమలు చేస్తున్న నేపథ్యంలో హోమ్ డెలివరీలు చేసే ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ తదితర సంస్థల బిజినెస్ ఊపందుకుంది. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ 76 శాతం జంప్‌చేయనున్నట్లు ఫారెస్టర్ రీసెర్చ్ తాజాగా అభిప్రాయపడింది. వెరసి 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,500 కోట్లు)ను తాకనున్నట్లు అంచనా వేసింది. దేశవ్యాప్త లాక్‌డవున్ కారణంగా ఈకామర్స్ బిజినెస్‌కు 1.3 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు ఫారెస్టర్ అంచనా వేసింది. దీంతో తొలుత వేసిన 2 బిలియన్ డాలర్ల ఆన్లైన్ గ్రోసరీస్ బిజినెస్ 3 బిలియన్ డాలర్లను అధిగమించవచ్చని అభిప్రాయపడింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలు సైతం వినియోగదారులకు ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులను అందిస్తున్న విషయం విదితమే. 35.5 బిలియన్ డాలర్లకు ఈఏడాది దేశీయంగా మొత్తం ఈకామర్స్ బిజినెస్ 6 శాతం వృద్ధితో 35.5 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా. అయితే గత ఆరు వారాలుగా ఈకామర్స్ బిజినెస్‌లో నమోదైన అధిక డిమాండ్ కొనసాగకపోవచ్చని ఫారెస్టర్ రీసెర్చ్ పేర్కొంది. లాక్‌డవున్ తొలి రోజుల్లో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి కంపెనీలకు ఐదు రెట్లు అధికంగా ఆర్డర్లు లభించినప్పటికీ ఇటీవల నెమ్మదించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే మరికొంతకాలంపాటు ఈకామర్స్ బిజినెస్‌లో అమ్మకాల పరిమాణం అధికంగానే నమోదయ్యే వీలున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 35 శాతం అధికంగా ఆర్డర్లు లభిస్తున్నట్లు బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మీనన్ పేర్కొన్నారు. కోవిడ్-19కు ముందు బిజినెస్‌తో పోలిస్తే లాక్‌డవున్ కాలంలో 60 శాతం అధిక విలువగల ఆర్డర్లు లభించినట్లు గ్రోఫర్స్ సీఈవో అల్వీందర్ తెలియజేశారు. -
ఒక్క క్లిక్‌తో..
విక్రమ్ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి..లాక్డౌన్ నేపథ్యంలో వర్క్‌ఫ్రంహోంకే పరిమితమయ్యారు. దీంతోఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలను ఒక్క క్లిక్‌తో బిగ్‌బాస్కెట్‌కు ఆర్డరుచేస్తున్నారు. దీంతో సమయం ఆదా అవడమే కాదు నచ్చిన..మెచ్చిననాణ్యమైన సరుకులను సరసమైనధరలకు ఇంటి గడప వద్దనే పొందవచ్చని ఆయన చెబుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఇది విక్రమ్ ఒక్కడి పరిస్థితే కాదు..లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకే గ్రేటర్ సిటీజన్లు మక్కువ చూపుతున్నారు. దీంతో బిగ్‌బాస్కెట్, బిగ్»బజార్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ విక్రయ ఈ–కామర్స్ సంస్థల గిరాకీ అమాంతం పెరిగింది. నెటిజన్లుగా మారిన గ్రేటర్ సిటీజన్లు కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇళ్లకే పరిమితం కావడం..బయటకు వెళితే పోలీసుల ఆంక్షలు..కావాల్సిన వన్నీ ఒకేచోట దొరకవన్న కారణంతో ఈ–సైట్లను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ఐటీ, బీపీఓ, కెపిఓ, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్నవారే గతంలో ఈ–కామర్స్ సంస్థలకు నిత్యావసరాల కొనుగోలుకు ఆర్డర్లు చేసేవారు. ఇప్పుడు మద్యాదాయ, వేతన జీవులు, గృహిణులు, వృద్ధులు సైతం ఇప్పుడు ఈ సైట్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో సుమారు పది ఈ–కామర్స్ సంస్థలకుఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దైనందిన జీవితంలో అవసరమైన ఉప్పు..పప్పు..పేస్ట్, పండ్లు, కూరగాయలు..ఒక్కటేమిటి..అగ్గిపుల్లా..సబ్బుబిల్లా అన్న తేడాలేకుండా వీరివ్యాపారం ఊపందుకుంది. గత పదిరోజులుగా నగరంలో సుమారు రూ.500 కోట్ల మేర నిత్యావసరాలను విక్రయించినట్లు ఆయా సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణా నిలిచిపోవడంతో కస్టమర్లు కోరిన మొత్తంలో సరుకులు సరఫరా చేయలేకపోతున్నామన్నారు. ఇప్పటికే తమ గోడౌన్లలో కందిపప్పు, పెసరపప్పు, మినప గుండు తదితర సరుకుల నిల్వలు క్రమంగా నిండుకుంటున్నాయని బిగ్‌బాస్కెట్ సంస్థ జోనల్ మేనేజర్ ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు. డెలివరీకి 4–5 రోజుల సమయం... ♦ నగరంలో నిత్యం సుమారు 50 వేలకు పైగా ఆయా ఈ–కామర్స్ సంస్థలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని ఆయా సైట్ల నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆర్డరు చేసిన వినియోగదారులకు సరుకుల డెలివరీకి 4–5 రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు. ♦ తమ వద్ద పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ సైతం సగం మందికి పైగా విధులకు హాజరుకాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. కాగా కొన్ని సార్లు ఆయా సైట్లను సంప్రదిస్తే డెలివరీ స్లాట్స్ ఫుల్ అని చూపుతున్నారని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. పోలీసు ఆంక్షల నుంచి మినహాయింపు... నిత్యావసరాలు సరఫరా చేసే ఈ–కామర్స్ సంస్థల డెలివరీ బాయ్స్‌కు ప్రభుత్వం పోలీసు ఆంక్షల నుంచి పాక్షికంగా మినహాయింపు నిచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోగా కస్టమర్లకు సరుకులు డెలివరీ చేసే వెసులుబాటు కల్పించడం విశేషం. -
‘బిగ్ బాస్కెట్’కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: బిగ్ బాస్కెట్ సంస్థను నిర్వహించే ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగాయి. 2017–18లో రూ.179 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.348 కోట్లకు పెరిగాయి. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,410 కోట్ల నుంచి 69 శాతం వృద్ధితో రూ.2,381 కోట్లకు పెరిగింది. ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ సంస్థ బిగ్ బాస్కెట్నే కాకుండా ‘సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్’ పేరుతో హోల్‌సేల్ విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది. ఆర్థిక ఫలితాల వివరాలను ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ సంస్థ కేంద్ర కంపెనీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. -
బిగ్‌బాస్కెట్‌లోకి ఆలీబాబా 1,920 కోట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ సంస్థ, బిగ్‌బాస్కెట్ తాజాగా 30 కోట్ల డాలర్ల (రూ.1,920 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, అబ్రాజ్ క్యాపిటల్, శాండ్స్ క్యాపిటల్, ఐఎఫ్‌సీ తదితర సంస్థల నుంచి ఈ నిధులు సమీకరించామని బిగ్‌బాస్కెట్ సీఈఓ హరి మీనన్ చెప్పారు. ఈ నిధులతో రైతుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని, తమ సేవలను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,800 మంది రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, ఈ సంఖ్యను 3,000కు పెంచనున్నామని వివరించారు. మరోవైపు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా షారూక్ ఖాన్ కొనసాగుతారని, ఆయనతో కాంట్రాక్టును రెన్యువల్ చేశా మని పేర్కొన్నారు. ఇటీవలనే 80 లక్షల వినియోగదారుల మైలురాయిని దాటామని, హైదరాబాద్, బెంగళూరుల్లో బ్రేక్ ఈవెన్‌కు వచ్చామని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,410 కోట్ల ఆదాయం సాధించామని వివరించారు. గ్రోఫర్స్, అమెజాన్‌లకు గట్టిపోటీనివ్వడానికి బిగ్‌బాస్కెట్‌కు ఈ తాజా నిధులు ఉపయోగపడతాయని నిపుణులంటున్నారు. ఈ డీల్ ప్రాతిపదికన బిగ్‌బాస్కెట్ విలువ 90 కోట్ల డాలర్లని అంచనా. జొమాటొలో ఆలీబాబా పెట్టుబడులు కాగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటొలో చైనాకు చెందిన ఆలీబాబా అనుబంధ సంస్థ, ఆంట్ స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. -
101 కోల్డ్ చెయిన్ ప్రాజెక్టులకు ఓకే..
⇒ కేంద్ర ప్రభుత్వం ఆమోదం ⇒ రూ. 3,100 కోట్ల పెట్టుబడులు ⇒ లిస్టులో తిరుమల మిల్క్, అమూల్ తదితర సంస్థల ప్రాజెక్టులు న్యూఢిల్లీ: కూరగాయలు, పండ్ల వృథాను అరికట్టే లక్ష్యంతో కేంద్రం కొత్తగా 101 కోల్డ్ చెయిన్ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. సుమారు రూ. 3,100 కోట్ల పెట్టుబడులతో అమూల్, హల్దీరామ్, బిగ్ బాస్కెట్, తిరుమల మిల్క్ తదితర సంస్థలు వీటిని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ శాఖ రూ. 838 కోట్లు గ్రాంట్ కింద ఇస్తుందని, మిగతా రూ. 2,200 కోట్లు ప్రైవేట్ రంగం నుంచి వస్తాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం తెలిపారు. 101 కొత్త కోల్డ్ చెయిన్ ప్రాజెక్టుల సామర్థ్యం 2.76 లక్షల టన్నులుగా ఉంటుందని ఆమె వివరించారు. హట్సన్ ఆగ్రో, స్టెర్లింగ్ ఆగ్రో, ప్రభాత్ డైరీ, బామర్ లారీ, దేశాయ్ బ్రదర్స్, ఫాల్కన్ మెరీన్ (ఒరిస్సా) మొదలైన సంస్థల ప్రాజెక్టులు కూడా లిస్టులో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 21 ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ 14, గుజరాత్ 12, ఆంధ్రప్రదేశ్ 8, పంజాబ్..మధ్యప్రదేశ్‌లలో చెరి ఆరు ప్రాజెక్టులు రానున్నాయి. 53 ప్రాజెక్టులు కూరగాయలు.. పండ్లవి కాగా, డెయిరీలో 33, మాంసం.. పౌల్ట్రీ.. మెరీన్ విభాగాల్లో 15 ప్రాజెక్టులు ఉండనున్నాయి. 2.6 లక్షల మంది రైతులకు ప్రయోజనకరం.. సుమారు 2.6 లక్షల రైతులకు వీటివల్ల ప్రయోజనం చేకూరనుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 60,000 మందికి ఇవి ఉపాధి కల్పించగలవని బాదల్ పేర్కొన్నారు. వీటిలో సుమారు రూ. 12,000 కోట్ల విలువ చేసే 4.7 మిలియన్ టన్నుల అగ్రి, హార్టికల్చర్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ జరుగుతుందని, 13 శాతం మేర వృథాను అరికట్టవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా ఆమోదించిన కోల్డ్ చెయిన్స్ సంఖ్య 234కి చేరిందని, కొత్తగా మరో 50 ప్రాజెక్టులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. 2014 టోకు ధరల ప్రాతిపదికన చూస్తే దాదాపు రూ. 92,000 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయలు వృ«థా అవుతున్నట్లు బాదల్ తెలిపారు. -
ఆన్లైన్లో అమ్మ చేతి వంట!
ఈజీకుక్ ప్యాక్‌తో ఏ కూరలైనా వండటం తేలికే • ఫ్రెష్‌చాప్స్, బిగ్ బాస్కెట్లతోనూ ఒప్పందం • 2 నెలల్లో రూ.40 లక్షల నిధుల సమీకరణ పూర్తి • ‘స్టార్టప్ డైరీ’తో ఈజీకుక్ ఫౌండర్ శశాంక్ కామిశెట్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్స్ గురించే మనకు తెలుసు. కానీ, అంతకంటే తొందరగా పూర్తయ్యే కూరలు కూడా వచ్చేశాయి. పాలకూర పచ్చడి నుంచిమొదలుపెడితే చోలే మసాలా, రొయ్యలు, చేపల పులుసు, గోంగూర మటన్, నాటుకోడి కూర వరకూ అన్ని రకాల శాకాహార, మాంసాహార వంటలూ సులువుగా వండేసుకునే వీలుంది. అదికూడా అమ్మ చేతి వంటంత రుచిగా! మరిన్ని వివరాలు ఈజీకుక్.ఇన్ ఫౌండర్ శశాంక్ కామిశెట్టి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఈజీకుక్ స్టార్టప్ కంటే ముందు హెల్త్‌కేర్ స్టార్టప్ ప్రారంభించా. రెండేళ్ల పాటు సేవలందించా. ఆ సమయంలో గమనించిందొక్కటే.. మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ ఉద్యోగస్తులు కావటంతో ఇంట్లో వంట చేసుకునే సమయం,ఓపిక రెండూ లేక రెస్టారెంట్లోనో, చైనీస్ ఫుడ్ సెంటర్లలోనో తినడం తప్పనిసరవుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. అలాగని ఇంట్లో వంట చేసుకోవాలంటే అంత తేలిక్కాదు. ఇలాంటి సమస్యలేమీ లేకుండావంట గదిలో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేసుకోకుండా.. కేవలం ఒక్క గిన్నె, ఒక గరిటెతో ఏ కూరైనా వండుకోవటానికి వీలు కల్పించేదే మా ఈజీకుక్. అల్లం పద్మతో కలిసి ఈ ఏడాది మార్చిలో రూ.15 లక్షలపెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఈజీకుక్.ఇన్ను ప్రారంభించాం. కూరలు, వేపుళ్లు, పచ్చళ్లు కూడా.. ప్రస్తుతం ఈజీకుక్లో వెజ్, నాన్ వెజ్ కూరలతో పాటు కొన్ని రకాల వేపుళ్లు, పచ్చళ్లు కూడా అందిస్తున్నాం. శాకాహారంలో 26 రకాలు, మాంసాహారంలో 20 రకాలు, పలు రకాల వేపుళ్లు ఉన్నాయి. త్వరలోనే రైస్, స్వీట్ఐటమ్స్నూ తెస్తున్నాం. ప్రారంభ ధరలు చూస్తే పచ్చళ్లు 200 గ్రాములకు రూ.45, చికెన్ 380 గ్రాములకు రూ.105, మటన్ 380 గ్రాములకు రూ.220లుగా ఉన్నాయి. మేం పంపించే ప్రతి వస్తువూ నేరుగా రైతుల నుంచేకొంటాం. కారం, పసుపు, అల్లం, ధనియాల వంటి దినుసులను కూడా నేరుగా రైతుల దగ్గరి నుంచి కొని మెయిన్ కిచెన్‌లో మసాలాలు తయారు చేస్తాం. ప్రస్తుతానికైతే వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆర్డర్ బుకింగ్చేయవచ్చు. త్వరలోనే ఐఓఎస్ యాప్‌నూ తెస్తున్నాం. ప్రస్తుతం గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లిహిల్స్, కొండాపూర్, కొత్తగూడ, మణికొండ, కూకట్పల్లి, నిజాంపేట, మదీనాగూడ, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్నాం. ఫ్రెష్‌చాప్స్, బిగ్‌బాస్కెట్‌తో ఒప్పందం.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రెష్‌చాప్స్, బిగ్ బాస్కెట్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ప్రతి ఆర్డర్ మీద ఆయా సంస్థలకు 15–20 శాతం కమీషన్ వెళుతుంది. ప్రస్తుతం నెలకు 600–700 వరకు ఆర్డర్లొస్తున్నాయి.విస్తరణలో భాగంగా ఒక్కో ఏరియాకు ఒక్కో బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలని నిర్ణయించాం. వీరేం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ విధానంలో వారిచ్చే ప్రతి ఆర్డర్‌పై కమీషన్‌ను పొందుతారు. విస్తరణ కోసం నిధులుసమీకరిస్తున్నాం. 2 నెలల్లో రూ.40 లక్షల నిధుల సమీకరణ పూర్తి చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
60 నిమిషాల్లోనే ఇంటికి సరుకులు
- బిగ్‌బాస్కెట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ సూపర్‌మార్కెట్ బిగ్‌బాస్కెట్ తాజాగా బీబీ ఎక్స్‌ప్రెస్ పేరుతో కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 60 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు. బిగ్‌బాస్కెట్ తొలిసారిగా ఈ సర్వీసులను హైదరాబాద్‌లో ప్రారంభించింది. కంపెనీ ఈ సర్వీసుల కోసం ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసింది. సాధారణంగా గ్యారంటీడ్ డెలివరీ కింద నిర్దేశించిన సమయం దాటితే ఆర్డరు విలువలో 10 శాతం మొత్తాన్ని కస్టమర్ ఖాతాకు (వాలెట్) జమచేస్తోంది. అలాగే ఏదైనా ఉత్పత్తి అందించలేకపోతే దాని విలువలో 50 శాతం మొత్తాన్ని వాలెట్లో జమచేస్తారు. వినియోగదార్ల సౌకర్యార్థం బీబీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని కంపెనీ సహ వ్యవస్థాపకులు అభినయ్ చౌదరి బుధవారమిక్కడ తెలిపారు. కంపెనీ బిజినెస్ హెడ్ వి.హరి కృష్ణారెడ్డి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రాగలీనా శ్రీపాదతో కలసి మీడియాతో మాట్లాడారు. పరిచయ ఆఫర్లో భాగంగా ఫస్ట్ టైం యూజర్లకు పేటీఎం ద్వారా 20 శాతం క్యాష్ బ్యాక్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్ జనవరి 3 వరకు ఉంటుంది. ఆన్లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వృద్ధికి కొత్త సర్వీసులు దోహదం చేస్తాయని అభినయ్ అభిప్రాయపడ్డారు. ‘ఇతర నగరాలకూ బీబీ ఎక్స్‌ప్రెస్‌ను పరిచయం చేయనున్నాం. రోజుకు 30,000 డెలివరీలను చేస్తున్నాం. 2014-15లో రూ.210 కోట్ల టర్నోవర్ ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు చేరుకుంటాం’ అని వెల్లడించారు.