ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ(లాస్ట్ మైల్ డెలివరీ – ఎల్‌ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే.. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది.
జియో మార్ట్.. పీవోఎస్ మెషీన్లతో పాటు నిల్వలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, రుణ సదుపాయాలు మొదలైనవి కూడా కలిపిస్తోంది. వాట్సాప్‌తో జట్టు కట్టడంతో ఈ లావాదేవీలన్నీ మరింత సులభతరంగా నిర్వహించేందుకు వీలు పడనుంది. అటు అమెజాన్ కూడా ఈ తరహా వ్యూహాన్ని మరో రకంగా అమలు చేస్తోంది. ఎల్‌ఎండీ కోసం ’ఐ హ్యావ్ స్పేస్’ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సుమారు 28,000 చిన్న రిటైలర్లు ఇందులో భాగంగా ఉన్నారు. తమ స్టోర్స్‌కి 2-4 కి.మీ. పరిధిలో ఉత్పత్తులను అందిస్తున్నారు. దీనితో సదరు స్టోర్స్‌కి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అమెజాన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment