iphone 16
-
దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో తయారీ యూనిట్లను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. కర్ణాటకకు చెందిన ఏక్యూస్ గ్రూప్ యాపిల్ ఉత్పత్తుల తయారీదారుగా ఎదిగేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ట్రయిల్ స్టేజ్‌ను పూర్తి చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఒకవేళ ఈ ట్రయిల్ స్టేజ్‌లో యాపిల్ నిబంధనల ప్రకారం ఏక్యూస్ గ్రూప్ ఉత్పత్తులను తయారు చేస్తే, భారత్‌లో టాటా ఎలక్ట్రానిక్స్ తర్వాతి స్థానం కంపెనీదేనని భావిస్తున్నారు. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.ఏక్యూస్ గ్రూప్ ప్రస్తుతం ఏరోస్పేస్ విడిభాగాలు, టాయ్స్ తయారీ రంగంలో సేవలందిస్తోంది. ఈ కంపెనీ ట్రయల్ దశను అదిగమిస్తే యాపిల్ ఉత్పత్తుల సరఫరాదారుల జాబితాలో చోటు సంపాదించిన రెండో భారతీయ కంపెనీగా నిలుస్తుంది. మ్యాక్‌బుక్ పర్సనల్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్‌లు, యాపిల్ ఉత్పత్తుల విడిభాగాలను తయారు చేసే ఏకైక దేశీయ సంస్థగా అవతరించే అవకాశం ఉంది. ఏక్యూస్ ట్రయల్‌కు సంబంధించి యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్ మెకానికల్ భాగాల ఉత్పత్తిని ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ ట్రయిల్‌కు సంబంధించి ఇరు కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టాటా ఎలక్ట్రానిక్స్ మాత్రమే యాపిల్‌కు భారతీయ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ఇది ఐఫోన్లను తయారు చేస్తోంది.ఇదీ చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తిని పెంచుతోంది. దేశీయంగా ఐఫోన్ తయారీ విభాగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్లు సమకూర్చింది. ఇందులో రూ.85,000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం కీలకంగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. -
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు భారీగా పట్టుబడ్డాయి. ఇటీవలే యాపిల్ సంస్థ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అచితూ ఈ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన వ్యానిటీ బ్యాగ్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను టిష్యూ పేపర్లలో చుట్టి దాచిపెట్టిందని అధికారులు తెలిపారు. కాగా ఐఫోన్ సిరీస్‌లో.. 16 ప్రో మాక్స్ టాప్ మోడల్.ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమెను పట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖరీదు సుమారు 37 లక్షలు ఉంటుందని అంచనా. -
ఐఫోన్ 16పై రూ.37,900 డిస్కౌంట్! ఎలాగంటే..
ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ అధికారికంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ సీరీస్ లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందే మార్గం ఉంది. అదే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.అసలేంటి యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.. సింపుల్‌గా చెప్పాలంటే పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్‌పై డిస్కౌంట్ పొందడం అన్నమాట. కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్ 16పై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ట్రేడ్ చేసే ఐఫోన్ మోడల్ , స్థితిని బట్టి ఉంటుంది.ఐఫోన్ 16 బేస్ 128జీబీ మోడల్ రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్లైన్, యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 వంటి పాత మోడల్లను కూడా ఈ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.ఏ మోడల్‌తో ఎంత?మీ వద్ద ఐఫోన్ 15 ఉంటే దీన్ని ఇచ్చి యాపిల్ ట్రేడ్-ఇన్ క్రెడిట్లో ఐఫోన్ 16పై రూ. 37,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఐఫోన్ 14 ఇచ్చేవారు రూ. 32,100 వరకు తగ్గింపును ఆశించవచ్చు. మీ వద్ద ఐఫోన్ 13 ఉంటే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ గరిష్టంగా రూ. 31,000 వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 ఇవ్వడం ద్వారా వినియోగదారులు ట్రేడ్-ఇన్ విలువలో రూ. 20,800 వరకు పొందవచ్చు. ఈ తగ్గింపులు ఫోన్ నిల్వ సామర్థ్యం, బ్యాటరీ స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్ 20) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్ అవుట్లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్గ్లోటైమ్’ ట్యాగ్‌లైన్‌తో జరిగిన ఈవెంట్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83). -
#iPhone16 : ఐఫోన్ 16 కోసం బారులు తీరిన కస్టమర్లు (ఫొటోలు)
-
అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులు
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. దాంతో ముంబయిలోని యాపిల్ అవుట్లెట్ ముందు కస్టమర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలా అని వేచిచూస్తున్నారు. ఈమేరకు ముంబయిలోని యాపిల్ స్టోర్ ముందు వినియోగదారుల రద్దీని తెలియజేస్తూ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఏదో అన్నదానం కోసం వచ్చిన వారిలా గుంపులుగా చేరి స్టోర్‌లోకి పరుగెత్తుతూ వీడియోలో కనిపించారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది.ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ కోసం ముంబైలోని యాపిల్ స్టోర్‌కు జనం భారీగా వచ్చారు. ఉదయాన్నే స్టోర్ వద్ద లైన్లో నిల్చున్నారు. pic.twitter.com/hEIPKSoSGT— greatandhra (@greatandhranews) September 20, 2024భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ.79900256 జీబీ: రూ.89900512 జీబీ: రూ.109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ.89900256 జీబీ: రూ.99900512 జీబీ: రూ.119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ.119900256 జీబీ: రూ.129900512 జీబీ: రూ.1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ.144900512 జీబీ: రూ.1649001 టీబీ: రూ.184900ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు -
ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
ఐఫోన్ 16 వచ్చిందోచ్ (ఫొటోలు)
-
యాపిల్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ ఏటా నిర్వహించే ‘యాపిల్ ఈవెంట్’ తేదీని ప్రకటించింది. ముందుగా ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 10న నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరుపుతామని ప్రకటించారు. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.యాపిల్ కంపెనీ ఈ ఈవెంట్లో తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ దిగ్గజ కంపెనీ ఎలాంటి టెక్నాలజీపై పనిచేస్తుందో ఇతర కంపెనీలు ఒక అంచనాకు వస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అందుకే ఈ ఈవెంట్‌కు చాలా ఆదరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న దీన్ని ఏర్పాటు చేయాలని ముందుగా ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే సెప్టెంబర్ 9న ఈ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!ఈ కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్‌లో కొత్త ఫీచర్లు, రాబోయే మార్పుల గుర్తించి తెలియజేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలాఉండగా, ఈ ఈవెంట్‌కు ‘ఇట్స్ గ్లోటైమ్’ అనే ట్యాగ్ లైన్‌ను జత చేశారు. దాంతో ఈ కార్యక్రమంపై అంచనాలు పెరుగుతున్నాయి. -
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.