యాపిల్ (Apple) తదుపరి తరం ఐఫోన్ ఎస్‌ఈ (iPhone SE)ని 2025 మార్చిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కాస్త బడ్జెట్ ధరలో లభించే ఈ మోడల్‌ను రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. రాబోయే ఐఫోన్ ఎస్‌ఈ4 (iPhone SE4)కి ఐఫోన్ 16ఈ (iPhone 16E) అని పేరు మార్చవచ్చు.
ఐఫోన్ 16ఈ అంచనా స్పెక్స్
» ఐఫోన్ 16ఈ బేస్ ఐఫోన్ 14కి సారూప్యమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని పుకారు ఉంది. ఆశిస్తున్న ఫీచర్లలో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, ఫేస్ ఐడీ, USB-C పోర్ట్ ఉన్నాయి.
» ఐఫోన్ 16ఈకి కొత్త ఏ-సిరీస్ చిప్ రానుంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే 48-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
» ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో ప్రారంభించిన యాక్షన్ బటన్ ఫీచర్ ఐఫోన్ 16ఈలో కూడా ఉంటుందా అనేది అస్పష్టంగానే ఉంది.
» ధరల విషయానికొస్తే.. ఐఫోన్ ఎస్‌ఈ3తో పోలిస్తే ఐఫోన్ 16ఈ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో దీని ధర దాదాపు రూ. 50,000గా ఉండవచ్చు.
ఇన్-హౌస్ 5G మోడెమ్
ఐఫోన్ 16ఈ ప్రధాన హైలైట్ యాపిల్ తొలి అంతర్గత 5G మోడెమ్. ఈ అప్‌డేట్ బాహ్య సప్లయిర్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దాని హార్డ్‌వేర్‌లో ఏకీకరణను మెరుగుపరచడానికి ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు.
బడ్జెట్ లైన్‌ను రీబ్రాండింగ్ చేయడం, ఆధునీకరించడం ద్వారా చైనా వంటి మార్కెట్‌లలో తిరిగి ఆదరణ పొందాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ యాపిల్.. హువాయ్, షావోమీ వంటి బ్రాండ్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment