iPhone SE
-
ఐఫోన్‌కు పోటీగా సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్..! అది కూడా బడ్జెట్ రేంజ్లో
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రీమియం స్మార్ట్ఫోన్లలో బడ్టెట్ రేంజ్లో ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌కు చెక్ పెట్టే పనిలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సోనీ నిమ్నగ్నమైంది. న్యూ ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా Sony Xperia Ace III స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సోనీ సన్నాహాలను చేస్తోంది. తాజాగా Sony Xperia Ace III సంబంధించిన ఫీచర్స్ ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. సోనీ ఎక్స్‌పీరియా ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లను 2019లో సోనీ లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ హెమ్మెర్స్టోఫర్ , జోల్లేజ్ షేర్ చేసిన రెండర్స్ ప్రకారం...సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో 5.5 అంగుళాల డిస్ప్లేతో రానుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను కల్గి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేత ఆకుపచ్చ,బ్లాక్ కలర్ వేరియంట్లలో లభించనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ చిప్‌తో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందనుంది. యూఎస్బీ టైప్‌సీ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టిప్‌స్టర్స్ తమ రెండర్స్లో పేర్కొన్నారు. ఇక ధర విషయానికి వస్తే..కొత్తగా లాంచైన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 33 వేలుగా ఉండగా..దీని కంటే తక్కువ ధరలో సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్స్ అభిప్రాయపడ్డారు. చదవండి: అనూహ్య నిర్ణయం! అక్కడ ఏటీఎంలు అన్నీ బంద్..! కారణం ఇదే..! -
ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ యాపిల్ ఐఫోన్లపై బంపరాఫర్లు ప్రకటించింది. ఐఫోన్11, ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్లతో పాటు, ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. పలు రిపోర్ట్‌ల ప్రకారం..టెక్ జెయింట్ యాపిల్ మార్చి 8న ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అంతకంటే ముందే మార్కెట్లో విడుదల చేసిన పలు ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ మార్చి 4 నుంచి మార్చి 6 వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌తో పాటు ప్రత్యేకంగా ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఈ పై ఆఫర్లకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్11 అసలు ధర రూ.32,000 ఉండగా..ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.17,800కే పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్‌తో పాటు యాక్సిస్ కార్డ్ వినియోగదారులు ఫోన్ కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదే సమయంలో మరో ఈకామర్స్ సంస్థ అమెజాన్ సైతం రూ.14,900వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది. మరో యాపిల్ ఐఫోన్ ఎస్ఈని రూ.15,499కే కొనుగోలు చేయోచ్చు. వాస్తవంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39,900 ఉండగా..రూ.30,299కే యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఎక్ఛేంజ్ ఆఫర్‌ను రూ.14,800కే అందిస్తే ఆఫోన్ ధర రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. మీ ఫోన్ పై ఎక్ఛేంజ్ ఆఫర్ ఎంతుందో ఇలా తెలుసుకోండి ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో ఐఫోన్లపై ఎక్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లో మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలంటే సింపుల్ గా రెండు ఈ కామర్స్ సైట్లలో మీ ఫోన్బ్రాండ్ నేమ్, మోడల్, ఐఎంఈ నెంబర్ ఎంటర్‌చేస్తే మీ ఫోన్ పై యాపిల్ సంస్థ ఎక్ఛేంజ్ ఆఫర్లో ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవచ్చు. ఐఎంఈ నెంబర్ కావాలంటే ఫోన్లో *#06# డయల్ చేసి పొందవచ్చు. చదవండి: రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమంటారో!! -
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్
మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ మీ కోసం అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మే 10 నుంచి 14 వరకు ఆపిల్ డేస్ పేరిట ప్రత్యేక సేల్ జరగనుంది. మీ దగ్గర పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి ఆపిల్ ఐఫోన్‌ను కేవలం పదిహేను వేలకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్ ధర రూ.30,999 మాత్రమే. ఇక 128జీబీ వేరియంట్ ధర రూ.33,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. ఈ సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ రూ.15,150 విలువ చేస్తే మీరు చెల్లించాల్సింది ఇక రూ.15,849. ఒకవేళ మీరు మొదటి సారి మొబైల్ కొంటే మీకు సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల మీద 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా ఒక కార్డుపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మే 14 వరకే ఉంటుంది. ఇతర ఆపిల్ ఐఫోన్లపై కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే 4.7 అంగుళాల డిస్ప్లే ఉంది. యాపిల్ ఏ13 బయానిక్ చిప్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 7 మెగాపిక్సెల్. చదవండి: లాక్డౌన్లతో బంగారం ధరకు రెక్కలు -
భారత్‌లో ఐఫోన్–12 అసెంబ్లింగ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్–12 స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌ను భారత్‌లో మొదలుపెట్టింది. స్థానిక కస్టమర్ల కోసం వీటిని దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. ఈ మోడల్‌ను థర్డ్ పార్టీ అయిన ఫాక్స్‌కాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్–10ఆర్, ఐఫోన్–11 మోడళ్లను ఫాక్స్‌కాన్, విస్ట్రన్ కంపెనీలు అసెంబుల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2017లో తొలుత ఐఫోన్ ఎస్ఈ మోడల్‌తో భారత్‌లో ఫోన్ల తయారీకి యాపిల్ శ్రీకారం చుట్టింది. భారతదేశాన్ని మొబైల్, విడిభాగాల తయారీకి పెద్ద కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని అన్నారు. జోరుమీదున్న అమ్మకాలు.. ఆన్లైన్ స్టోర్ మెరుగైన పనితీరుతో డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెండింతలైందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ జనవరిలో వెల్లడించారు. కంపెనీ తన ఉనికిని పెంచుకోవడానికి దేశంలో రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్టోర్లు నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబరులో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దేశంలో ఆరవ స్థానంలో ఉన్న యాపిల్ అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 171 శాతం వృద్ధి సాధించింది. 2019తో పోలిస్తే గత సంవత్సరం 93 శాతం అధికంగా సేల్స్ నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 15 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. సంస్థ ఈ స్థాయి అమ్మకాలు ఒక త్రైమాసికంలో సాధించడం ఇదే తొలిసారి. గతేడాది యాపిల్ టర్నోవర్ 29 శాతం పెరిగి రూ.13,756 కోట్లు నమోదు చేసింది. నికరలాభం రూ.926 కోట్లుగా ఉంది. -
త్వరలోనే ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ నిలిపివేత?
టెక్ దిగ్గజం ఆపిల్ మరికొన్ని నెలల్లో తన మెగా హార్డ్‌వేర్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఆ ఈవెంట్లో గత ఎంతో కాలంగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న కొత్త ఐఫోన్లను కంపెనీ లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు 2018లో భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చే అవకాశాలున్నాయని కూడా టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే వీటికి డిమాండ్ భారీ ఎత్తున్న ఉండబోతున్న తరుణంలో, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్‌ను, ఐఫోన్ ఎస్ఈ లను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కొత్తగా విడుదల చేయబోతున్న ఆ మూడు ఐఫోన్లపైనే ఉంచనున్నట్టు పేర్కొంటున్నారు. బ్లూఫిన్ రీసెర్చ్ విడుదల చేసిన ఓ ఇన్వెస్టర్ నోట్లో.. గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌గ్రేడ్ లేకపోవడంతో, తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. ఆపిల్ ఆ మెగా ఈవెంట్లో 5.8 అంగుళాల ఐఫోన్ ఎక్స్ సక్ససర్, 6.5 అంగుళాల ఐఫోన్ ఎక్స్ ప్లస్ మోడల్, అఫార్డబుల్ 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్‌ను లాంచ్ చేస్తుంది. అఫార్డబుల్ ఎల్సీడీ ఐఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ వస్తుందని చాలా కాలం నుంచే విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2018 మూడు, నాలుగు క్వార్టర్లలో 9.1 కోట్ల యూనిట్ల 2018 ఐఫోన్‌ను తయారు చేస్తుందని బ్లూఫిన్ విశ్లేషకులు చెప్పారు. మరో 9.2 కోట్ల యూనిట్లను 2019 తొలి రెండు క్వార్టర్లలో రూపొందిస్తుందని పేర్కొన్నారు. షిప్మెంట్లను కూడా భారీగానే చేపట్టనుందని తెలిపారు. ఐఫోన్ ఎక్స్ ధర(999 డాలర్లు) మాదిరే ఐఫోన్ ఎక్స్ ప్లస్ ధరను నిర్ణయిస్తుందని, అదేమాదిరి మూడు ఐఫోన్లలో కెల్లా 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్ ధరనే అత్యంత తక్కువగా ఉంచనుందని తెలుస్తోంది. దీని ధర 600 డాలర్ల నుంచి 700 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఇది ఐఫోన్ ఎస్ఈని రీప్లేస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈలను నిలిపివేయబోతున్నట్టు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ ఐఫోన్ ఎక్స్‌ను కనుక ఆపిల్ నిలిపివేస్తే, లాంచ్ అయిన ఏడాదిలో నిలిచిపోయిన ఫోన్ ఇదే అవుతుంది. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రారంభించింది. ఆపిల్ వీక్ సేల్ పేరుతో ఈ ఈ-కామర్స్ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్, ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, మే 27 వరకు జరుగనుంది. ఐఫోన్ ఎక్స్... ఆపిల్ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256జీబీ మోడల్ ధర ఐఫోన్‌ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 (64జీబీ మోడల్) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ మోడల్‌ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్‌ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ 6ఎస్.. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ.. ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్‌ను 17,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఆపిల్ వీక్ సేల్‌లో ఇదే బెస్ట్ డీల్. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తోంది. ఇతర డీల్స్... ఆపిల్ ఎయిర్‌పాడ్స్ బ్లూటూత్ హెడ్సెట్ విత్ మిక్‌ను 11,499కు విక్రయిస్తోంది ఆపిల్ ఇయర్‌పాడ్స్ విత్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ ప్లగ్ వైర్డ్ హెడ్సెట్ విత్ మిక్‌ను 1,899కు అందుబాటులోకి ఆపిల్ టీవీ 32 జీబీ మోడల్ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ 32జీబీ మోడల్‌ను 22,900 రూపాయలకు ఆఫర్ 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్(6వ జనరేషన్)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు ఆపిల్ వాచ్ సిరీస్‌ల ప్రారంభ ధర 20,900 రూపాయలు -
మరింత చౌకగా ఐఫోన్ ఎస్ఈ
భారత్‌లో లభ్యమవుతున్న ఆపిల్ ఐఫోన్లలో అత్యంత చౌకగా దొరికేది ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మరింత చౌకగా మారింది. ఐఫోన్ ఎస్ఈపై భారీగా ధర తగ్గింది. రూ.26వేలుగా ఉన్న ఐఫోన్ ఎస్ఈ 32జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ.17,999కే లభ్యమవుతుంది. అంటే రూ.8వేల మేర ధర తగ్గింది. అయితే ఈ ధర కోత అధికారికంగా కాదని, ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ఈ ఫోన్ ధర రూ.26వేలుగానే ఉన్నట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా ఐఫోన్‌కు అధికారిక రీసెల్లర్స్ కావు. ఐఫోన్ ఎస్ఈపై ధర తగ్గడం ఇది రెండోసారి. కస్టమ్ డ్యూటీ పెరిగిన నేపథ్యంలో ఐఫోన్లపై రేట్లు పెరిగిన వారంలో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గడం విశేషం. అయితే కస్టమ్ డ్యూటీ నేపథ్యంలో పెరిగిన ధరల్లో ఐఫోన్ ఎస్ఈ లేదు. ధర తగ్గడంతో ఐఫోన్ ఎస్ఈ ప్రస్తుతం మోటో జీ5ఎస్ ప్లస్, నోకియా 6, షావోమి ఎంఐ ఏ1 వంటి ఆండ్రాయిడ్ ఫోన్ల రేంజ్లో దొరుకుతోంది. అంతేకాక ఎక్స్చేంజ్లో ఈ ఐఫోన్ ఎస్ఈపై అమెజాన్ రూ.15వేల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది. ఐఫోన్ ఎస్ఈ ఫీచర్లు... 4 అంగుళాల డిస్ప్లే ఐఓఎస్ 11 వెనుక వైపు 12 ఎంపీ ఐసైట్ కెమెరా ముందువైపు 1.2 ఎంపీ కెమెరా టచ్ ఐడీ -
ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్, మనకే ఫస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ అమెరికా, ఇతర యూరోపియన్ దేశాల కంటే ముందస్తుగా మొట్టమొదటిసారి భారత్‌లో ఓ సరికొత్త ఐఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు తైవాన్ ఎకనామిక్ డైలీ న్యూస్ రిపోర్టు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎస్ఈకి చెందిన రెండో తర స్మార్ట్‌ఫోన్ అని పేర్కొంది. దీని పేరు ఐఫోన్ ఎస్ఈ2గా తెలిపింది. విస్ట్రోన్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కూపర్టినోకి చెందిన ఈ దిగ్గజం, బెంగళూరులో ఐఫోన్ ఎస్ఈ2 స్మార్ట్‌ఫోన్‌ను అసెంబుల్ చేస్తుందని రిపోర్టు చేసింది. తైవనీస్ వెబ్సైట్ ఫోకస్ తైవాన్ కూడా ఐఫోన్ ఎస్ఈకి చెందిన తర్వాతి తరం స్మార్ట్‌ఫోన్‌ను 2018 ప్రథామర్థంలో తీసుకురాబోతుందని రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మేడిన్ ఇండియా ఐఫోన్‌గా పేర్కొంది. ఆన్లైన్లో వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ కంపెనీకి చెందిన స్వంత ఏ10 ఫ్యూజన్ చిప్సెట్తో రూపొందుతుందని, రెండు స్టోరేజ్ ఆప్షన్లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో ఇది లభ్యం కాబోతుందని తెలుస్తోంది. 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెకండరీ కెమెరా, 2జీబీ ర్యామ్, 1700 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ఫీచర్లుగా తెలుస్తున్నాయి. ఒరిజినల్ ఐఫోన్ ఎస్ఈ భారత్‌లో 2016 ఏప్రిల్‌లో లాంచ్ అయింది. -
పేటీఎంలో ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింది!
ప్రస్తుతం భారత్‌లో దొరుకుతున్న ఆపిల్ స్మార్ట్ఫోన్లలో అత్యంత సరసమైన ఫోన్ ఏదైనా ఉందా? అంటే అది ఐఫోన్ ఎస్ఈనే. ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ మోడల్‌ను ప్రస్తుతం పేటీఎం ఆన్లైన్ రిటైల్ స్టోర్‌లో రూ.22,990కే విక్రయిస్తోంది. అంతేకాక అదనంగా 3000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పేటీఎం ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ ఎస్ఈ ధర ఫైనల్‌గా రూ.19,990కి దిగొచ్చింది. అసలు పేటీఎం మాల్లో ఐఫోన్ ఎస్ఈ ధర 27,200 రూపాయలు. ఈ ప్రొడక్ట్‌ను కార్ట్‌లో యాడ్ చేసుకున్న అనంతరం ప్రోమో కాడ్‌ను ఆధారితంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది. ప్రోమో కోడ్‌ను వాడుకుని, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందే కస్టమర్లకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉండదట. ఆశ్చర్యకరంగా ఈ హ్యాండ్‌సెట్‌పై 9000 రూపాయల బైబ్యాక్ గ్యారెంటీని కూడా పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ ఎస్తో పాటు ఐఫోన్ 5ఎస్ నుంచి ఐఫోన్ 7 ప్లస్ వరకున్న పలు ఐఫోన్లపై క్యాష్‌బ్యాక్, ఫ్లాష్ ఆఫర్లను పేటీఎం మాల్ ప్రకటించింది. ఐఫోన్ ఎస్ఈ ఫీచర్లు... 4 అంగుళాల రెటీనా డిస్ప్లే ఆపిల్ ఏ9 ఎస్ఓసీ 12ఎంపీ రియర్ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ -
ఐ ఫోన్ ఎస్ఈ ధర ఎంత తగ్గిందో తెలుసా?
న్యూఢిల్లీ: భారీ అమ్మకాలపై కన్నేసిన ఆపిల్ అధీకృత ఆఫ్‌లైన్ విక్రయదారులు ఐఫోన్ ఎస్ఈ(స్పెషల్ ఎడిసన్) ను చవక ధరలకే అందించనున్నారు. ఐ ఫోన్ మేకర్ ఆపిల్ ఈ అమ్మకాలను ప్రకటించకపోయినా దాని ఆఫ్‌లైన్ రీటైలర్ ఐ నెట్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఐఫోన్ ఎస్ఈ రెండు వెర్షన్ లను తక్కువ ధరకే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఐఫోన్ ఎస్ఈ 16 జీబీ వెర్షన్ రూ 19.999, 64 జీబీ వెర్షన్ ను రూ 25.999కి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ రెండు ఫోన్లను క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా మాత్రమే ఉపయోగించి కొనుగోలు చేయొచ్చని తెలిపింది. దీని ద్వారా రూ .5,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ తరువాత ఈ ధర అని వివరణ ఇచ్చింది. అంతేకాదు ప్రాంతాన్ని బట్టి ధరలో కొంత తేడా వుండొచ్చని పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్, ఆర్బీఎల్, బ్యాంక్, ఎస్బిఐ, స్టాండర్డ్ చార్టర్డ్, పేరు, మరియు ఎస్ బ్యాంక్ చెందిన క్రెడిట్ / డెబిట్ కార్డులను ఈ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని ట్వీట్ చేసింది. పూర్తి వివరాలకు ఐటీ నెట్ ఇన్ఫోకాం ట్విట్టర్‌ను పరిశీలించగలరు. iPhone SE Now available in India at Lower price than US. 16 GB @ 19999 64 GB @ 25999 . Offer only for Card Purchase . Call us at 9995800818 pic.twitter.com/815jKF4m5h — ITNET (@itnetinfocom) March 18, 2017 The iPhone SE offer is an official offer from Apple of 5000 Rs Cashback. You can check with the Local Authorised Apple Store for details . — ITNET (@itnetinfocom) March 19, 2017 -
ఐఫోన్ ఎస్ఈకి యూఎస్ లో ఫుల్ క్రేజ్
భారత్ లో పేలవమైన స్పందన వస్తున్న యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈకి, అమెరికాలో మాత్రం ఫుల్ క్రేజ్ ఉందట. అక్కడ ఈ బ్రాండ్ కు అధిక డిమాండ్ పలుకుతుందని యాపిల్ కంపెనీ ఇన్ సైడర్ విశ్లేషకులు తెలుపుతున్నారు. యాపిల్ ఇన్ సైడర్ రిపోర్టు ప్రకారం యాపిల్ రిటైల్ అవుట్ లెట్స్ లో అన్ని మోడల్స్ విపరీతంగా అమ్ముడు పోతున్నాయని, యాపిల్ ఎస్ఈ స్టాక్ ను ముందుగానే కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. న్యూయార్క్ లో ఉన్న యాపిల్ స్టోర్ లో ఐఫోన్ ఎస్ఈ స్టాక్ త్వరగా అయిపోతుందని, ముందస్తు ఆర్డర్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. నాలుగు అంగుళాలు కల్గిన ఈ ఫోన్, ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో కాని దొరకడం చాలా కష్టంగా ఉందని పేర్కొంది. కంపెనీ ఎప్పడికప్పుడూ స్టాక్ వివరాలు తెలుసుకుంటూ స్టోర్ ల్లో అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. -
ఐఫోన్‌కు కలిసి రాని కాలం
ఐఫోన్... ఓ బ్రాండ్, ఓ ఇమేజ్ అంటూ వినియోగదారుల మదిలో తెగ ఆశలు కల్పించిన యాపిల్ కంపెనీకి 2016 నిరాశపరుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతవారం ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు మొత్తం ఐఫోన్ మోడల్ ఫోన్లలో 0.1 శాతం మాత్రమేనని లోకలిస్టిక్ సర్వేలు వెల్లడించాయి. పాత ఐఫోన్ మోడళ్ల కంటే వీటి అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాయి. పాత మోడళ్లకు కొన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిపిన యాపిల్, ఐఫోన్ ఎస్ఈని 399 డాలర్లతో (రూ.26,557) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాని ఆ ఫోన్ విడుదలైనప్పటి నుంచి ఐఫోన్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. ఐఫోన్ 7ఎస్ మోడల్ విడుదల చేసినా కూడా అది ఈ ఫోన్ అమ్మకాలను పెద్దగా కాపాడగలిగే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. -
ఇండియాలో ఐఫోన్ ఎస్ఈ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: యాపిల్ కొత్త ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ భారత్‌లో త్వరలోనే అడుగుపెట్టనుంది. ఏప్రిల్ 8 నుంచి భారత్‌లో ఐఫోన్ ఎస్ ఈ అమ్మకాలు ప్రారంభించనున్నట్లు యాపిల్ సంస్థ అధికారులు తెలిపారు. ఇండియాలో యాపిల్ ఫోన్ పంపిణీదారులైన రెడింగ్టన్, బీటెల్ టెలీటెక్ ఈ మేరకు రెండు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఇది అచ్చం ఒకప్పుడు విడుదల చేసిన ఐఎఫోన్ 5ఎస్ లాగే ఉండి కొత్త ఫీచర్స్‌తో పనిచేయనుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.39,000 ఉండే అవకాశం ఉంది. రెడింగ్టన్ సంస్థ మొత్తం 3,000 ఔట్ లెట్ల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభించనుండగా బీటెల్ సంస్థ 3,500 రిటెయిల్ ఔట్ లెట్ ద్వారా ఫోన్లను విక్రయించనుంది. ముందస్తుగా ఆర్డర్ చేయాలనుకున్నవారు మార్చి 29 అర్థరాత్రి 12.00గంటల బుక్ చేసుకోవచ్చు. యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ను వచ్చే నెల 8 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. 16 జీబీ, 64 జీబీ మోడళ్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,000 వేలు ఉండనుంది. ఈ కొత్త ఐఫోన్లో నాలుగు అంగుళాల స్క్రీన్, వేగవంతమైన ఏ9 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, లైవ్ ఫొటోస్, వేగవంతమైన వెర్లైస్ వంటి ఫీచర్లున్నాయి. -
వచ్చే నెల 8 నుంచి భారత్‌లోకి ఐఫోన్ ఎస్ఈ
ధర రూ.39,000 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ను వచ్చే నెల 8 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. 16 జీబీ, 64 జీబీ మోడళ్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,000ల నుంచి బీటెల్ టెలిటెక్, రెడింగ్టన్ కంపెనీలు విక్రయించనున్నాయి. భారత్, చైనా దేశాల్లో విక్రయాలు పెంచుకోవడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ ఈసారి తక్కువ ధరలో చిన్నదైన ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న కొన్ని ఐఫోన్ మోడళ్ల కంటే ఈ కొత్త ఐఫోన్ ధర భారత్‌లో అధికంగా ఉంది. ఈ కొత్త ఐఫోన్లో నాలుగు అంగుళాల స్క్రీన్, వేగవంతమైన ఏ9 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, లైవ్ ఫొటోస్, వేగవంతమైన వెర్లైస్ వంటి ఫీచర్లున్నాయి. ఈ కొత్త ఐఫోన్‌ను 3,000 రిటైల్ అవుట్లెట్లలో అందిస్తామని రెడింగ్టన్, 3,500 అవుట్‌లెట్లలలో అందిస్తామని బీటెల్ టెలిటెక్‌లు తెలిపాయి. ఈ నెల 29 నుంచి ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని ఈ రెండు సంస్థలు వెల్లడించాయి.