
మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ మీ కోసం అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మే 10 నుంచి 14 వరకు ఆపిల్ డేస్ పేరిట ప్రత్యేక సేల్ జరగనుంది. మీ దగ్గర పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఆపిల్ ఐఫోన్‌ను కేవలం పదిహేను వేలకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్ ధర రూ.30,999 మాత్రమే. ఇక 128జీబీ వేరియంట్ ధర రూ.33,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. ఈ సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ రూ.15,150 విలువ చేస్తే మీరు చెల్లించాల్సింది ఇక రూ.15,849. ఒకవేళ మీరు మొదటి సారి మొబైల్ కొంటే మీకు సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల మీద 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా ఒక కార్డుపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మే 14 వరకే ఉంటుంది. ఇతర ఆపిల్ ఐఫోన్లపై కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే 4.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. యాపిల్ ఏ13 బయానిక్ చిప్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 7 మెగాపిక్సెల్.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment