ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రిపబ్లిక్ డేకి ముందే.. మాన్యుమెంటల్ సేల్‌ను నిర్వహిస్తోంది. సేల్ సమయంలో, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు & ఇతర అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్యాంక్ ఆఫర్‌లు మాత్రమే కాకుండా.. భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16 కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ వివరంగా చూసేద్దాం.
ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16)
ఐఫోన్ 16 125జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అయితే ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో ఇది రూ. 69,999లకే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 16పై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోందని స్పష్టమవుతోంది. డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్స్ & ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి పొందవచ్చు.
ఇతర ఆఫర్స్
ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే.. 10 శాతం లేదా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.అంతే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 42150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్‌ఛేంజ్ చేస్తున్న మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 16 డీటెయిల్స్
ఐఫోన్ 16 కొత్త కెమెరా లేఅవుట్, కొత్త జెన్ చిప్‌సెట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది . ఆపిల్ కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి లేదా ఏఐ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా పరిచయం చేసింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8జీబీ ర్యామ్ కలిగిన ఏ18 చిప్ కూడా పొందుతుంది.
ఆపిల్ విజన్ ప్రో కోసం.. స్మార్ట్‌ఫోన్ నిలువుగా ఉన్న కెమెరా మాడ్యూల్స్ పొందుతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. కాబట్టి ఇది మంది ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని స్పష్టమవుతోంది.
భారీగా పెరిగిన ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్ ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్‌ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్
ఆపిల్ తయారీ కేంద్రాలు
భారతదేశంలో ఆపిల్ ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment