![iPhone SE 4 to Launch This Valentines Week](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/iphone-se-4.jpg.webp?itok=qCJPB8HQ)
ఇండియన్ మార్కెట్లో యాపిల్ (Apple) ఐఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పడు 'ఎస్ఈ 4' ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథంనలో తెలుసుకుందాం.
గత రెండేళ్లుగా.. ఇప్పుడు, అప్పుడు అనుకుంటున్న 'ఐఫోన్ ఎస్ఈ 4' (iPhone SE 4) ఈ వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించడం లేదు. కాబట్టి వారం మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్.. యాపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ పొందనుంది. అయితే దీని డిజైన్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ 16లను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.
ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..
ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగి 60Hz ప్యానెల్ పొందే అవకాశం ఉంది. 48 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి ఇందులో ఉండవచ్చు. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Power On: Apple’s new iPhone SE coming this week will kick off one of the most pivotal periods in the iPhone’s nearly two decade history https://t.co/npwXOGgv63
— Mark Gurman (@markgurman) February 9, 2025
Comments
Please login to add a commentAdd a comment