
యాపిల్ కంపెనీ మార్కెట్లో.. సరసమైన 'ఐఫోన్ ఎస్ఈ4' (iPhone SE 4) లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు కొత్త మోడల్ రానున్నట్లు 'టిక్ కుక్' కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించారు. లాంచ్ కావడానికి ముందే ఈ ఫోనుకు సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి.
భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. వెనుక భాగం ఎస్ఈ 3 మాదిరిగా ఉంటుంది. ముందు భాగంలో నాచ్ & సన్నని బాటమ్ బెజెల్ ఉంటుందని తెలుస్తోంది.
ఐఫోన్ ఎస్ఈ 4 రియర్ కెమెరా సిస్టమ్ కూడా స్వల్ప మార్పును పొందినట్లు తెలుస్తోంది. 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరా పిక్సెల్ ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎస్ఈ 3లోని 12 మెగా పిక్సెల్ సెన్సార్ కంటే అద్భుతంగా ఉంటుంది. హై-ఎండ్ మోడళ్లతో పోలిస్తే రియర్ సెన్సార్ చిన్నదనే చెప్పాలి.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
ఐఫోన్ ఎస్ఈ 4లో పెద్ద 6.1 ఇంచెస్ ఓఎల్ఇడి డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment