ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో నాలుగు అవుట్‌లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.
ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్‌లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
మంబయిలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకెత్ పేరుతో రెండు అవుట్‌లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్‌లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్ ఐఓఎస్ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment