timcook
-
భారత్‌లో యాపిల్ కొత్తగా నాలుగు అవుట్లెట్లు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో నాలుగు అవుట్లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?మంబయిలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకెత్ పేరుతో రెండు అవుట్లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్ ఐఓఎస్ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. -
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ ఉంది. భారత్‌లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్‌తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్‌తో డేటింగ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్‌తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్‌గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
‘సంపాదన తగ్గింది’.. సీఈఓ టిమ్‌కుక్‌కు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు వచ్చే ఆదాయం తగ్గడంతో ఆ సంస్థ సీఈఓ టిమ్‌కుక్ సంపాదించే సంపాదన తగ్గించింది. 2022తో పోలిస్తే 2023లో ఆయన సంపాదన భారీగా తగ్గినట్లు యాపిల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. టిమ్‌కుక్ గత ఏడాది భారీ మొత్తంలో సంపాదించారని, కానీ అది 2022లో కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో ఆయన సంపాదించిన మొత్తం 99.4 మిలియన్లు కాగా 2023లో 63.2 మిలియన్లగా ఉందని నివేదికలో పేర్కొంది. రిపోర్ట్‌లో ఏముందంటే? ఇటీవల యాపిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అందులో టిమ్ కుక్కు అందించే పరిహారం, షేర్ హోల్డర్స్ సలహాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో మార్పులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించింది. అందులో యాపిల్ సీఈఓ సంపాదన తగ్గినట్లు హైలెట్ చేసింది. టిమ్‌కుక్ విమాన ఖర్చులు యాపిల్ 2022లో సీఈఓ కుక్కి అందించే శాలరీ, స్టాక్ అవార్డ్స్, నాన్ ఈక్విటీ బోనస్ (పరిహారం) 84 మిలియన్లగా నిర్దేశించింది. అయితే అతను అంచనాలను మించి 99.4 మిలియన్లను సంపాదించాడు. కానీ 2023కి కుక్ పరిహారం 40 శాతం తగ్గి 49 మిలియన్లకు పడిపోయింది. కుక్ అందించే పరిహారంలో 3 మిలియన్ల జీతం, స్టాక్ అవార్డులు మొత్తం 46,970,283 డాలర్లు, నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్ పరిహారం మొత్తం 10,713,450 డాలర్లు, ఇతర పరిహారం 2,526,112 డాలర్ల వరకు పొందారు. 2023లో కుక్ కోసం యాపిల్ వ్యక్తిగత విమాన ప్రయాణ కోసం 1,621,468 డాలర్లు ఖర్చు చేసిందని, 2022లో వెచ్చించిన మొత్తం కంటే రెండింతలు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. కంపెనీ కుక్ కోసం వ్యక్తిగత భద్రత కోసం 820,309 డాలర్లు పెట్టుబడి పెట్టింది యాపిల్ సగటు ఉద్యోగి వేతనం ఎంతంటే? 2023లో తన సగటు ఉద్యోగికి సగటు వార్షిక మొత్తం పరిహారం 94,118 డాలర్లు అని యాపిల్ తెలిపింది. ఇక టిమ్‌కుక్‌తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటీవ్లకు యాపిల్ భారీ మొత్తాన్ని అందించింది. వారిలో సీఎఫ్ఓ లూకా మాస్త్రి : 26,935,883 డాలర్లు జనరల్ కౌన్సెల్ అండ్ సెక్రటరీ కేట్ ఆడమ్స్ : 26,941,705 డాలర్లు రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రెయిన్ : 26,937,010 డాలర్లు సీఓఓ జెఫ్ విలియమ్స్ : 26,961,221 డాలర్లను అందిచినట్లు యాపిల్ తన నివేదికలో వెల్లడించింది. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త.. నష్టపరిహారం చెల్లిస్తున్న యాపిల్!
మీరు పాత ఐఫోన్లను వినియోగిస్తున్నారా? వాటిల్లో ఏమైనా బ్యాటరీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ తరహా ఇబ్బందులు తలెత్తుంటే ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నష్టపరిహారం చెల్లిస్తుంది. సుమారు 8 ఏళ్ల క్రితం నమోదైన యాపిల్‌పై ‘బ్యాటరీగేట్’ క్లాస్-యాక్షన్ లాసూట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఐఫోన్లను వినియోగిస్తుంటే యాపిల్ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. అసలేంటి యాపిల్ ‘బ్యాటరీగేట్’ వివాదం 2016లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, 7 సిరీస్‌తో పాటు ఎస్ఈ మోడల్ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐఫోన్ సిరీస్ మోడళ్లు స్లో అవ్వడంతో వాటిని ఆపరేట్ చేయలేపోతున్నామంటూ అమెరికాకు చెందిన సుమారు 33 రాష్ట్రాల యూజర్లు మూకుమ్మడిగా సంబంధిత రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు. యాపిల్ సంస్థ ధనార్జన కోసం కావాలనే తమ ఫోన్లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిందని, తద్వారా మేం వినియోగించే ఫోన్లు పనిచేయడం మందగిస్తే.. కొత్త ఫోన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కొనుగోలు చేస్తే ఐఫోన్ల అమ్మకాలు జరిగి.. యాపిల్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. యాపిల్ అనాలోచిత నిర్ణయం వల్లే వినియోగదారుల హక్కుల కోసం పోరాడే జస్టిన్ గుట్మాన్ సైతం యాపిల్‌కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్లతో పాటు పవర్ మేనేజ్మెంట్ టూల్ వల్ల ఐఫోన్లు అకస్మాత్తుగా షట్‌డౌన్ అవ్వడం, బ్యాటరీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. యాపిల్ నిర్ణయంతో ఐఫోన్ 6, 6ప్లస్, 6 ఎస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ,7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌ను వినియోగిస్తున్న యూకేలో 25 మిలియన్ల ఐఫోన్ యూజర్లకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం విలువ 768 మిలియన్లని కోర్టుకు ఆధారాల్ని అందించారు. తెరపైకి బ్యాటరీగేట్ వివాదం ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసేలా.. యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఉద్దేశపూర్వకంగా ప్రాసెసర్ పనితీరు మందగించేలా వ్యవహరించిందని తెలిపేలా ‘బ్యాటరీగేట్’ అనేపదాన్ని అనే పదాన్ని రూపొందించారు. ‘బ్యాటరీగేట్’ పేరును ట్రెండింగ్‌లోకి తెచ్చారు. బాధిత యూజర్లకు 92 డాలర్ల నష్టపరిహారం ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. వినియోగదారుల ఫిర్యాదు దెబ్బకు యాపిల్ దిగొచ్చింది. 2020లో బాధిత యూజర్లకు 500 మిలియన్ల నష్టపరిహారం చెల్లిస్తామని అంగీకరించింది. ఒప్పందం ప్రకారం.. యాపిల్ ఇటీవల ప్రతి ఒక్క బాధిత యూజర్‌కు 92 డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
టెక్ దిగ్గజం యాపిల్‌ను గడగడలాడిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌ను గడగడలాడిస్తున్నాడా? తమ దేశం కాదని ఇతర దేశాల్లో యాపిల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జిన్ పింగ్ నిర్ణయాలను చూస్తుంటే. ఇటీవల జిన్ పింగ్ ప్రభుత్వం దేశంలో మేడిన్ ఇన్ చైనా ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఐఫోన్‌లాంటి ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులను దేశంలో వినియోగించడాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డ్రాగన్ కంట్రీ స్థానికంగా తయారవుతున్న విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థలైన బ్యాంక్‌లు ఇతర రంగాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే సాఫ్ట్వేర్లను దేశీయ సంస్థల నుంచి పొందాలని, అదే సమయంలో సెమీ కండక్టర్ పరిశ్రమ వృద్దిలో పాలు పంచుకోవాలని కోరింది. ఈ తరుణంలో కనీసం ఎనిమిది ప్రావిన్సుల్లోని పలు రాష్ట్ర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఉద్యోగులు స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. అంతవరకూ బాగున్నా..ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఉన్న జెజియాంగ్, షాన్డాంగ్, లియోనింగ్, సెంట్రల్ హెబీ వంటి ప్రావిన్సులకు చెందిన నగరాల్లోని సంస్థలు, ఏజెన్సీలకు ఈ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. మేడిన్ ఇన్ చైనా నినాదం దేశ వ్యాప్తంగా అమలు చేయాలి గానీ.. కేవలం ఐఫోన్ తయారీ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయడం ఏంటని ఐఫోన్ లవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సెప్టెంబర్ నెలలో కనీసం మూడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని సిబ్బందికి కార్యాలయాల్లో ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. చివరిగా ఐఫోన్ల బ్యాన్ అంశంపై యాపిల్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. -
భారత్‌లో యాపిల్ ఆదాయం రూ.50వేల కోట్లు.. టిమ్ కుక్ ఊహించి ఉండరు..
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయంలో అదరగొట్టేస్తుంది. భారత్‌లో ఆ సంస్థ వ్యాపారం రూ.50 వేల కోట్ల చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. 2022-23 దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు 48 శాతం వృద్దితో ఆదాయం రూ.49,321 కోట్లకు చేరింది. నెట్ ప్రాఫిట్ సైతం 76 శాతం పెరిగి రూ.2,229గా నమోదైనట్లు రెగ్యూలరేటరీ ఫైలింగ్‌లో యాపిల్ తెలిపింది. యాపిల్ భారత్‌లో గత ఐదేళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి ఊహించని విధంగా బిజినెస్‌తో పాటు అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా, యాపిల్ ప్రొడక్ట్‌ల తయారీ కోసం ఉపయోగించి విడి భాగాల ధరల తగ్గింపుతో న్యూజనరేషన్ ప్రొడక్ట్‌లు మాక్, హోం ప్యాడ్, ఐఫోన్ 15ల అమ్మకాల షేర్, మార్జిన్ సేల్స్ పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాదిలో యాపిల్ రూ.45 వేలకంటే విలువైన ఐఫోన్లు 59 శాతం షేర్‌ను సాధించగా.. షిప్మెంట్ 56 శాతం జరిగింది. నిర్వహణ పరంగా చూస్తే.. నిర్వహణ ఖర్చు5.4 శాతంతో, ప్రొడక్ట్‌ల అమ్మకాలు 94.6 శాతంతో జరిగినట్లు యాపిల్ రెగ్యూలరేటరీలో ఫైల్ చేసింది. గత ఏడాది 2022తో పోలిస్తే విదేశీ మారకపు అవుట్ ఫ్లో 2023లో 2 శాతం పెరిగి రూ.18,140కి, విదేశీయ మారకం ఆదాయం 39 శాతంతో రూ.2,662గా నమోదైంది. ఈ సందర్భంగా గడిస్తున్న ఆదాయంతో భారత్‌లో యాపిల్ దీర్ఘ కాలం వ్యాపార శక్తి సామర్ధ్యాలు మెండుగా ఉన్నాయని నిరూపిస్తుందని బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ తరణ్ పాఠక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
భారత్‌లో యాపిల్, అమ్మకాల్లో సరి కొత్త రికార్డులు..సంతోషంలో టిమ్ కుక్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. 2023 జూన్ త్రైమాసికంలో గరిష్ట స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఐఫోన్లకు భారీ డిమాండ్ ఇందుకు కారణం. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారత్‌లో వృద్ధి పట్ల యాపిల్ సీఈవో టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడి మార్కెట్లో బలమైన రెండంకెల వృద్ధి సాధించామన్నారు. ‘అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి శక్తిని ఉపయోగిస్తాం. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటికీ చాలా నిరాడంబరమైన, తక్కువ వాటాను కలిగి ఉన్నాం. కాబట్టి ఇది మాకు గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. జూన్ త్రైమాసికంలో రెండు స్టోర్లను తెరిచాం. అంచనాలను మించి ఇవి పనితీరు కనబరుస్తున్నాయి’ అని చెప్పారు. -
భారత్‌లో యాపిల్ క్రెడిట్ కార్డ్.. విడుదల చేసేందుకు కసరత్తు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఆర్ధిక రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది యాపిల్ తన స్టోర్లను భారత్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశాన్ని సందర్శించిన ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ శశిధర్ జగదీషన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీలో యాపిల్ క్రెడిట్ కార్డ్ విడుదలతో పాటు ఇతర అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. తాజాగా,యాపిల్..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)తో సంప్రదింపులు జరిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, టెక్ దిగ్గజం ‘యాపిల్ పే’ పేరుతో క్రెడిట్ కార్డ్‌ను తేనుందని, ఈ కార్డ్ సాయంతో రూపే ప్లాట్ ఫామ్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ చేసుకునేలా చర్చలు జరిపినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. భారత్‌లోని బ్యాంక్‌లు తన కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే, వినియోగదారులు ట్రాన్సాక్షన్లను మరింత వేగంగా, సులభతరం చేసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బుల్ని సెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు యాపిల్ఏ తరహా క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేయనుందనే ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ క్రెడిట్ కార్డ్ విడుదలపై టెక్ దిగ్గజం ఆర్బీఐని సంప్రదించగా.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్ధిష్ట నిబంధనలను అనుసరించాలని ఆర్బీఐ సూచించింది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
యాపిల్ కొత్త ఆవిష్కరణలు.. ఈసారి ఏ ప్రొడక్ట్స్‌ను విడుదల చేయనుందంటే!
టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏటా నిర్వహించే వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (WWDC 2023)లో తమ ప్రొడక్ట్స్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఏడాది జూన్ 5 (రేపటి నుంచే) సోమవారం నుంచి జూన్ 9 శుక్రవారం వరకు ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు యాపిల్ వెల్లడించింది. యాపిల్ ఆవిష్కరించే ప్రొడక్ట్స్ ఇవేనా ఐదు రోజుల డెవలపర్ ఈవెంట్లో ప్రీమియం ప్రొడక్ట్‌లైన మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్)హెడ్సెట్, న్యూ మాక్‌బుక్ ఎయిర్, కొత్త ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేయనుంది. దీంతో పాటు వర్చువల్ రియాలిటీ (వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)ను అనుభూతి పొందేందుకు వినియోగించే మిక్స్డ్ రియాలిటీ హెడ్ సెట్ కోసం గత కొంత కాలంగా నిరీక్షిస్తున్న యూజర్లు కోరిక నెరవేరనుంది. ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? కాలిఫోర్నియాలోని కుపెర్టినో యాపిల్ పార్క్ కేంద్రంగా జరిగే ఈ ఈవెంట్‌కు డెవలపర్లు, విద్యార్థులు పాల్గొననున్నారు. భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం జూన్ 5 (సోమవారం) రాత్రి 10:30 గంటలకు వీక్షించవచ్చు. ఎలా వీక్షించాలి? వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను యాపిల్ డాట్‌కామ్‌లో లైవ్ స్ట్రీమ్ జరగనుంది. యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్ ఉంటే యాప్‌ను ఇన్స్టాల్ చేసి లైవ్‌లో చూడొచ్చు. -
సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్, ఇది అసలు ఊహించలేదు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రపంచ దేశాల రిటైల్ మార్కెట్‌పై దృష్టిసారించింది. ప్రస్తుతం, దేశీయంగా జరుగుతున్న ఊహించని బిజినెస్‌తో భారత్‌లో మరో మూడు స్టోర్లతో పాటు చైనా, ఆసియా, అమెరికా, యూరప్ దేశాలలో రీటైల్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే, తాజాగా యాపిల్ కీలక నిర్ణయానికి కారణం భారత్ మార్కెటేనని సమాచారం. ఇప్పటికే ఆ సంస్థ 26 దేశాల్లో 520 స్టోర్ల నుంచి ఉత్పత్తుల్ని విక్రయించింది. రానున్న రోజుల్లో మరో 53 రీటైల్ స్టోర్లను ప్రారంభించేలా భారత్‌లోని యాపిల్ స్టోర్లు దారి చూపినట్లు టెక్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కుపెర్టినో దిగ్గజం ఈ ఏడాది భారత్‌లో ఢిల్లీ, ముంబైలలో యాపిల్ రీటైల్ స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి సీఈవో టిమ్‌కుక్ హాజరయ్యారు. అయితే ఇటీవల ఈ రెండు స్టోర్లలోని యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఈ రెండు స్టోర్లలోని నెలవారీ విక్రయాలు రూ. 22 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారని, అందుకే 2027 నాటికల్లా ఆసియా - పసిపిక్ రీజియన్లలో 15 స్టోర్లు, యూరప్ - మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఐదు స్టోర్లు, అమెరికా - కెనడాలలో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక హైలెట్ చేసింది. దీంతో పాటు ఇప్పటికే కార్యకాలపాలు కొనసాగుతున్న ఆసియా దేశాల్లో ఆరు స్టోర్లు, యూరప్‌లో తొమ్మిది స్టోర్లు, నార్త్ అమెరికాలో ఉన్న 13 స్టోర్లను మరో ప్రాంతానికి మార్చేలా టిమ్ కుక్ సంబంధిత విభాగాల అధిపతులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ముఖ్యంగా..అమెరికా, యూరప్ తర్వాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో 2027 నాటికల్లా యాపిల్ స్టోర్ల పునరుద్దరణ, విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 2025 నాటికి ముంబైలోని సబర్బన్‌లోని బోరివాలి ప్రాంతంలో మూడో యాపిల్ స్టోర్‌ను, 2026 నాటికి ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ప్రోమెనేడ్ మాల్లో ఐదో స్టోర్‌ను, 2027 నాటికి ముంబైలోని వ్రోలి ప్రాంతంలో ఇలా మరో మూడు స్టోర్లను యాపిల్ ప్రారంభించనుంది. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే?
ఏ మార్పైన కొంత వరకు మంచిదే. కానీ అతిగా జరిగితే అనార్ధం తప్పదు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎటు చూసినా ఇదే చర్చ నడుస్తోంది. దీనిని నమ్మితే మానవజాతి వినాశనం తప్పదని, మానవుని ఎదుగుదలకు మూలమైన సృజనాత్మకతను అంతం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా దిగ్గజ టెక్ సంస్థలు ఈ ఏఐ రేసులో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ విభాగంలో సత్తా చాటేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు కృత్రిమ మేధస్సు వినియోగంలో కాస్త వెనుకంజలో ఉన్న మరో టెక్ దిగ్గజం యాపిల్ సైతం దృష్టి సారించింది. గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీతో ముందంజలో ఉంటే యాపిల్ ఏఐని విస్మరించింది. ఊహించని పరిణామలతో ఓపెన్ ఏఐ లాంటి సంస్థలతో పోటీపడలేక ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చీఫ్ జాన్ జియానాండ్రియా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా నివేదికల ప్రకారం.. ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురిలో శ్రీనివాస్ వెంకటా చారి, ఆనంద్ శుక్లాలు (స్టీవెన్ బాకెర్ కాకుండా) ఇద్దరు దిగ్గజ కంపెనీలకు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా కనిపిస్తున్నారు. అందుకే ఎంత ప్యాకేజీ కావాలంటే అంత చెల్లించి తమ సంస్థలో చేర్చుకునేందుకు పోటీపడుతున్నారు. యాపిల్‌ను వదిలేసి గూగుల్ వైపు యాపిల్ సెర్చ్ టెక్నాలజీలో పని చేస్తున్న ఆ ముగ్గురు యాపిల్‌ను వదిలేసి గూగుల్‌లో చేరారు. అందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)పై పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు ఐఐటీని పూర్తి చేశారు. ఆ ఇద్దరిని తమతో పాటు ఉంచుకునేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రయత్నిస్తుంటే.. యాపిల్ సంస్థ నుంచి గూగుల్‌కు వెళ్లిన ఆ ఇద్దరినే.. మళ్లీ తమవైపుకు తిప్పుకోవాలని సీఈవో టిమ్‌కుక్ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఐఐటీయన్ల కోసం టెక్ సంస్థలు పోటీ పడుతున్న తీరు ప్రపంచ టెక్ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ఎవరా ఇద్దరు భారతీయులు? ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌ను పూర్తి చేసిన వెంకటాచారి ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రొడక్ట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. మరొకరు ఆనంద్ శుక్లా. శుక్లా గూగుల్‌లో మంచి పేరున్న ఇంజినీర్‌గా చెలామణి అవుతున్నారు. లింక్డిన్ ఫ్రొఫైల్ ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో వెంకటచారీ యాపిల్‌కు రిజైన్ చేయగా.. అదే ఏడాది నవంబర్‌లో యాపిల్‌కు గుడ్‌పై చెప్పి గూగుల్‌లో చేరారు శుక్లా. బ్రతిమలాడి, బామాలి ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, ఆ ఇద్దరు భారతీయులు గూగుల్‌లో పనిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. గూగుల్ ఎల్ఎల్ఎంలో పనిచేసుందకు మంచి ప్రదేశమని భావించారని, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వాళ్లిద్దరికి ఇక్కడే ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించారని నివేదిక పేర్కొంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
న్యూ ఢిల్లీలో ఆపిల్ సెకండ్ స్టోర్ ప్రారంభం
-
అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి!
ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో టెక్ దిగ్గజం యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ‘యాపిల్ బీకేసీ’ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స్టోర్‌ను (ఏప్రిల్ 18న) యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రారంభించారు. రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానున్నడంతో స్టోర్‌ను వీక్షించేందుకు, అందులోని ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన యాపిల్ అభిమానులు యాపిల్ బీకేసీ స్టోర్ ఎదుట బారులు తీరారు. చాలా మంది సందర్శకులు స్టీవ్ జాబ్స్ ఇష్టపడేలా టీ-షర్టులను ధరించారు. వారి జుట్టును యాపిల్ లోగో ఆకారంలో కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఓ అభిమాని 1984లో ప్రారంభించిన మొదటి యాపిల్ కంప్యూటర్ వెర్షన్ (మాకింతోష్ కంప్యూటర్)ను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాపిల్ ఉత్పత్తులతో తమకున్న అనుబంధాల్ని, స్మృతులను నెమరేసుకున్నారు. అయితే రిటైల్ స్టోర్ ప్రారంభం అనంతరం అభిమానులతో కరచాలనం చేసిన టిమ్‌కుక్ సదరు ఫ్యాన్ తెచ్చిన కంప్యూటర్ను చూసి ‘వావ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘నేను తొలిసారి 1984 యాపిల్ కంప్యూటర్ను కొనుగోలు చేశా. నాటి నుంచి యాపిల్ ఉత్పత్తులనే వినియోగిస్తున్నా. తన చేతిలో ఉన్న కంప్యూటర్ను చూపిస్తూ ఇదిగో దీని డిస్కోస్టోరేజ్ కెపాసిటీ 2 మెగాబైట్స్. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్‌లో ఉంది. ఇప్పుడు ఇదే కంప్యూటర్ను యాపిల్ 4కే, 8కే రెసెల్యూషన్ డిస్ప్లేలను తయారు చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాపిల్ అభిమాని తన వెంట తీసుకొచ్చిన యాపిల్ కంప్యూటర్ను టిమ్ కుక్కు చూపించడం.. ఆ కంప్యూటర్ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సినీ హీరో హీరోయిన్లకే కాదు ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అభిమానులుంటారని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
ఆకాష్ అంబానీతో యాపిల్ సీఈవో టిమ్‌కుక్ భేటీ.. కారణం అదేనా?
భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) పేరిట ఏర్పాటైన ఈ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు రోజు అంటే ఏప్రిల్ 17న టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ రుచి చూడడం నుంచి దేశంలో ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్లను కలిసినట్లు తెలుస్తోంది. ఇక దేశీయంగా యాపిల్ వ్యాపార వ్యవహారాల నిమిత్తం కుక్ ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, ముంబై అల్టామౌంట్ రోడ్‌లోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాకు వెళ్లారు. అక్కడ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీని కలిశారు. ఆ తర్వాత టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిశారని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి ముంబై వీధుల్లో టిమ్‌కుక్ సందడి చేశారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అమితంగా ఇష్టపడే ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ (అంబానీల సూచన మేరకు) ఆరగించారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 దీనికి సంబంధించిన ఫోటోను మాధురి దీక్షిత్ ట్వీట్ చేశారు. ముంబైలో వడా పావ్ కంటే మెరుగైన స్వాగతం మరొకటి ఉండదు అంటూ పోస్ట్ చేశారు. దీనికి టిమ్ కుక్ 'నాకు మొదటిసారి వడ పావ్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది చాలా రుచిగా ఉంది’అంటూ టిమ్ కుక్ బదులిచ్చారు. చదవండి👉భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. ప్రారంభించిన టిమ్‌కుక్! -
Apple Store In India: భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. ప్రారంభించిన టిమ్‌కుక్!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టింది. యాపిల్ బీకేసీ (Apple BKC) పేరుతో ముంబైలో ఏర్పాటైన యాపిల్ రిటైల్ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. దీంతో ముంబై బాంద్ర కుర్లా కాంప్లెక్స్‌లో అందుబాటులోకి వచ్చిన రిటైల్స్టోర్లో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే సౌకర్యం కలిగినట్లైంది. ఏప్రిల్ 18న (ఈరోజు) వన్.. టూ..త్రీ అంటూ యాపిల్ ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య టిమ్‌కుక్ రిటైల్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ముందుగా అనున్నకున్నట్లుగా మూహూర్తపు సమయానికి యాపిల్ బీకేసీ స్టోర్ డోర్లను ఓపెన్ చేశారు. అనంతరం స్టోర్ లోపలి నుంచి ఎంట్రన్స్ వద్దకు వచ్చిన టిమ్‌కుక్ భారతీయుల్ని మరింత ఉత్సాహ పరిచేలా చేతులు జోడించి నమస్కరించి ముందుకు సాగారు. ఇక బీకేసీ.. బీకేసీ.. బీకేసీ అంటూ ఉద్యోగులు, వినియోగదారులకు నినాదాల మధ్య ఆ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. రిటైల్ స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభం ఇప్పటివరకు, యాపిల్ సంస్థ యాపిల్ వాచ్,ఐఫోన్, ఐప్యాడ్(Pad),ఐపాడ్ (iPod),ఐమాక్ ఇలా ప్రొడక్ట్‌లను ఆన్లైన్లో లేదంటే థర్డ్ పార్టీ సంస్థల నుంచి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. లేదంటే ఫ్లిప్‌కార్ట్,అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభించేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాపిల్ బీకేసీ రిటైల్ స్టోర్‌లో యాపిల్ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయొచ్చు. రూ.738 కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి యాపిల్ సంస్థలో ఏప్రిల్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్యకాలంలో సుమారు 9 బిలియన్ (దాదాపు రూ. 738 కోట్లు) విలువైన ప్రొడక్ట్‌లను ఎగుమతి చేసింది. అందులో 50 శాతానికి పైగా ఐఫోన్లు ఉన్నాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ నివేదిక తెలిపింది.ఇక స్టోర్ల ప్రారంభంతో యాపిల్ బిజినెస్ మరింత వృద్ది సాధింస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Apple CEO Tim Cook opens the gates to India's first Apple store at Mumbai's Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp — ANI (@ANI) April 18, 2023 తెల్లవారుజాము నుంచే పడిగాపులు మరోవైపు రిటైల్ స్టోర్‌ను యాపిల్ ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు స్టోర్ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. స్టోర్ ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మంగళవారం తెల్లవారు జాము నుంచి దీని ముందు పడిగాపులు కాశారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. -
‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో భారతీయులు అమితంగా ఇష్టపడే వడపావ్‌ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి యాపిల్ సీఈవో టిమ్‌కుక్ రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Can’t think of a better welcome to Mumbai than Vada Pav! pic.twitter.com/ZA7TuDfUrv — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 17, 2023 -
భారత్‌లో తొలి యాపిల్ స్టోర్.. ఫస్ట్ లుక్ అదిరింది!
భారత్‌లో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ దేశీయంగా రెండు యాపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ తెరవనుంది. ప్రపంచంలోని ఐకానిక్ బ్రాండ్ రీటైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి టిమ్ కుక్ హాజరు కానున్నారు. పలు నివేదికల ప్రకారం.. యాపిల్ సీఈవో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..యాపిల్ రీటైల్ స్టోర్లలో ఉండే 100 మంది సిబ్బంది 18 మంది భాషల్లో మాట్లాడతారని తెలిపారు. సంస్థ దేశంలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తోందని, యాప్ ఎకోసిస్టమ్ ద్వారా 10 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో పరోక్షంగా సహాయపడిందని ఆమె చెప్పారు. యాపిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఆ స్టోర్లలో ఉన్న ఫీచర్లే భారత్‌లో ప్రారంభించబోయే స్టోర్లలో ఉన్నాయి. అయితే స్థానికతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన రెండు స్టోర్లూ భారత వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచేలా దృష్టిసారించింది. ముఖ్యంగా స్టోర్ లోపల గోడల కోసం, కంపెనీ ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి రాయిని కొనుగోలు చేసింది. 4.5 లక్షల కలప ముక్కలు పైకప్పు గోడలను అలంకరించింది.స్టోర్‌లో ఉత్పత్తులు, కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్న గాడ్జెట్లను రిపేర్ చేయడం వంటి సేవలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ..కస్టమర్లు ప్రొడక్ట్‌లను తనిఖీ చేసుకోవచ్చని వాటిని ఎలా ఉపయోగించాలనే అంశంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. -
భారత్‌లో యాపిల్ రీటైల్ స్టోర్.. టిమ్‌కుక్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే భారత్‌లో తొలి రీటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతుంది. దేశంలో ఐఫోన్ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్ తన రిటైల్ స్టోర్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రీటైల్ స్టోర్ ప్రారంభం కంటే ముందే తన ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ‘బంద్రా కుర్లా కాంప్లెక్స్’లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుంది. రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయడం ద్వారా యాపిల్ స్పెషల్ డిస్కౌంట్ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకోసం టిమ్‌కుక్.. జియో వరల్డ్ డ్రైవ్ యాజమాన్యానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకు లోబడే యాపిల్ రీటైల్ స్టోర్ ఏర్పాటు అంగీకరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ షరతు ఏంటంటే? ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో రీటైల్ స్టోర్ ఏర్పాటు కోసం యాపిల్ సంస్థ 20,800 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 11 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. లీజు ఒప్పందం ప్రకారం.. నెలకు రూ.42 లక్షలను అద్దె రూపంలో చెల్లించనుంది. ఈ లెక్కన ఏడాదికి అద్దె రూపంలోనే రూ.5 కోట్లను చెల్లిస్తుండగా.. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అద్దె 15 శాతం మేర పెంపు ఉంటుంది. ఆ మూడేళ్లలో 2 శాతం రెవెన్యూ షేర్, మూడేళ్ల తర్వాత 2.5 శాతం రెవెన్యూ షేర్‌ను అంబానీ సంస్థకు చెల్లించనుంది. అదే సమయంలో కొన్ని కండీషన్లు పెట్టింది. డేటా అనలటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్ట్ ప్రకారం.. రీటైల్ స్టోర్ ఏర్పాటు అనంతరం ఆ ప్రాంతంలో 21 సంస్థలకు చెందిన బ్రాండ్ల యాడ్స్‌ను డిస్ప్లే చేసేందుకు వీలు లేదు. వాటిల్లో అమెజాన్,ఫేస్బుక్, గూగుల్, ఎల్జీ, మైక్రోసాఫ్ట్, సోనీ, ట్విటర్, బోస్, డెల్, డెలాయిట్ , ఫాక్స్‌కాన్, గార్మిన్, హిటాచీ, హెచ్‌పీ, హెచ్‌టీసీ, ఐబీఐఎం, ఇంటెల్, లెనోవో, నెస్ట్, ప్యానసోనిక్, తోషిబా, శాంసంగ్ వంటి సంస్థలు ఉన్నాయి. -
యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రిటైల్ స్టోర్ ప్రారంభం అప్పుడే!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో తొలి రిటైల్ స్టోర్ ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) ను ఏప్రిల్ 18న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. బ్లూమ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఏప్రిల్ 18న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఉదయం 11 గంటలకు భారత్‌లో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ప్రారంభించనున్నారు. రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నివేదిక పేర్కొంది. లాస్ ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ దేశాల తరహాలోనే ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో యాపిల్ సంస్థ రీటైల్ స్టోర్ల సంఖ్య 25 దేశాల్లో 552కి చేరినట్లైంది. -
స్వరం మారింది.. చైనాపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రశంసల వర్షం!
యాపిల్ సీఈవో టిమ్ కుక్ చైనా విషయంలో స్వరం మార్చారు. చైనా వేగవంతమైన ఆవిష్కరణలపై టిమ్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారంటూ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో డ్రాగన్ ప్రభుత్వం చైనా బిజినెస్ సమ్మిట్‌ను అధికారికంగా నిర్వహించింది. ఆ సమ్మిట్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారులు, టిమ్ కుక్‌తో పాటు కోవిడ్ తయారీ సంస్థల ఫైజర్, బీహెచ్పీ సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా..చైనాలో వేగంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవి మరింత వేగవంతమవుతాయని విశ్వసిస్తున్నా అని టిమ్‌కుక్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఇటీవల స్పై బెలూన్ విషయంలో అమెరికా-చైనా మధ్య నెలకొన్న వివాదం, యాపిల్ ప్రొడక్ట్‌లలో సప్లై చైన్ సమస్యలతో.. ఆదేశంపై ఆధారపపడం తగ్గించి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలను తరలించాలని యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో చైనాపై టిమ్ కుక్ వ్యాఖ్యలు వ్యాపార వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. -
యాపిల్‌పై షేర్ హోల్డర్ల విమర్శలు, టిమ్‌కుక్ శాలరీ తగ్గింపు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అందించే వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోనుంది. యాపిల్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో టిమ్‌కుక్ వేతనం తగ్గించాలని చర్చకు వచ్చింది. షేర్ హోల్డర్లతో జరిపిన సమావేశం అనంతరం వేతన తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. పెట్టుబడిదారుల అభిప్రాయం మేరకు తన వేతనాన్ని సర్దుబాటు చేయమని కుక్ స్వయంగా అభ్యర్థించారు.కాబట్టే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఆయన వేతనం 40శాతం పైగా తగ్గించి 49 మిలియన్లను మాత్రమే ముట్టజెప్పనుంది. 2023లో కుక్కు ఇచ్చే శాలరీ మార్పులు, యాపిల్ పనితీరుతో ముడిపడి ఉన్న స్టాక్ యూనిట్ల శాతం 50 నుంచి రానున్న రోజుల్లో 75శాతానికి పెరుగుతుందని పేర్కొంది. 2022లో కుక్ 99.4 మిలియన్ల మొత్తాన్ని శాలరీ రూపంలో తీసుకోగా, ఇందులో 3 మిలియన్ల బేసిక్ శాలరీ, సుమారు 83 మిలియన్లు స్టాక్ అవార్డ్లు, బోనస్‌లు ఉన్నాయి. కుక్ వేతనంపై యాపిల్ సంస్థ స్పందించింది. సంస్థ అసాధారణమైన పనితీరు, సీఈవో సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, యాపిల్ సంస్థ టిమ్ కుక్కు ఇచ్చే ప్యాకేజీపై వాటాదారులకు అభ్యంతర వ్యక్తం చేశారు. అదే సమయంలో కుక్ పట్ల యాపిల్ ప్రదర్శిస్తున్న విధేయతపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టిమ్‌కుక్ శాలరీ విషయంలో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో ప్రముఖ అడ్వైజరీ సంస్థ ఐఎస్ఎస్ (Institutional Shareholder Services) సైతం 2026లో టిమ్‌కుక్ రిటైర్ కానున్నారు. అప్పటివరకు ఈ ప్రోత్సహాకాలు ఇలాగే కొనసాగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్!
చైనా నుంచి ఒక్కొక్క కంపెనీ తరలి వెళ్లిపోతుంది. ప్రముఖ కంపెనీలు భారత్‌కు క్యూ కడుతున్నాయి. మొబైల్ దిగ్గజం యాపిల్‌కు విడి భాగాలు సరఫరా చేసే ఫాక్స్‌కాన్ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం..యాపిల్‌కు అతిపెద్ద తయారీ భాగస్వామి సంస్థ, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్..భారత్‌లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. చైనా నుండి ఉత్పత్తిని తరలించడంపై యాపిల్ ప్రయత్నిస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సూచించిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. విజృంభిస్తున్న కోవిడ్-19 డ్రాగన్ కంట్రీలో రోజుకు 20 వేలు అంతకన్నా ఎక్కువ కోవిడ్ కేసులు విజృంభిస్తున్న కారణంగా అక్కడ అమలు చేస్తున్న కఠిన లాక్ డౌన్ నిబంధనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈ సారి ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఫ్యాక్టరీలో తయారీని కొనసాగించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీలో క్వారంటైన్ కేంద్రాల్ని ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులో నెలల తరబడి ఉంచుతున్నారు. కొన్ని చోట్ల ఇనుప కంచెలు వేసి సిబ్బంది తప్పించుకోకుండా ఏర్పాట్లు చేశారు. కంపెనీలు, ఫ్యాక్టరీల వెలుపల భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. తిరగబడ్డ యాపిల్ ఉద్యోగులు ఫలితంగా నెలల తరబడి క్వారంటైన్ కేంద్రాల్లో మగ్గిపోతున్న కార్మికులు, సిబ్బంది ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా యాపిల్ ఫోన్ ప్రధాన తయారీ భాగస్వామి జెంగ్షూలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిని నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందితో వారు ఘర్షకు దిగారు. దీంతో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ‘నా దారి నేను చూసుకుంటా’ అక్కడి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడడంతో..ఐఫోన్ తయారీని చైనా వెలుపలి దేశాలకు తరలించాలని యాపిల్ తన కాంట్రాక్ట్ తయారీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. మార్కెట్ కేపిటలైజేషన్ వ్యాల్యూలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీగా యాపిల్ తన ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతుంది. ఈ తరుణంలో యాపిల్ సూచనతో ఫాక్స్‌కాన్ భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఫాక్స్‌కాన్ విషయానికి వస్తే ఫాక్స్‌కాన్ 2019 నుండి మనదేశంలో యాపిల్ ఐఫోన్ 11 నుంచి తయారీని ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 మోడల్‌ను అసెంబుల్ చేస్తోంది. ఇప్పుడు దాని సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ఇతర ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఐప్యాడ్‌ను భారత్ లో ఇతర ప్రొడక్ట్‌లను తయారు చేసే అవకాశలను అన్వేషించేందుకు కేంద్రంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇతర దేశాలకు ప్రత్యామ్నాయంగా యాపిల్.. తన ఐపాడ్లను అసెంబుల్ కోసం మనదేశం వైపు చూస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా వద్దు.. భారత్ ముద్దు భారత్‌లో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్,పెగాట్రాన్లు యాపిల్ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కంపెనీలు భారత్‌లో ఐప్యాడ్ అసెంబుల్ చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక నైపుణ్యం, ప్రతిభ గల సిబ్బంది లేకపోవడం ఆందోళన వ్యక్త మవుతుంది. అయినా సరే ఫాక్స్ కాన్ $500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో సమీకరణాలు మారనున్నాయని, యాపిల్ గతంలో కంటే ఉత్పత్తికి కేంద్రంగా భారత్ అనువైన దేశమని భావిస్తోందంటూ చర్చ జరుగుతోంది. -
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’?
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్విటర్లో యాడ్స్‌ను నిలిపి వేసింది. ఇదే విషయమంపై మస్క్ స్వయంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై యాపిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే యాపిల్ ట్విటర్లో యాడ్స్ నిలిపివేడయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యాపిల్ ట్విటర్లో ప్రకటనల్ని నిలిపి వేసింది. వారు అమెరికాలో వాక్ స్వాతంత్ర్యాన్ని ద్వేషిస్తారా ? టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది?’ అని ట్వీట్లో ప్రశ్నించారు. యాడ్స్ తగ్గించుకుంది యాడ్ మెజర్మెంట్ సంస్థ పాత్మాటిక్స్ నివేదిక ప్రకారం.. మస్క్ కొనుగులో చేయకముందు యాపిల్ ట్విటర్లో అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 22 వరకు 220,800 డాలర్లు ఖర్చు చేసింది. మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత నవంబర్ 10 నుండి నవంబర్ 16 మధ్య కాలంలో 131,600 డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. జనరల్ మిల్స్ ఇంక్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి సహా అనేక కంపెనీలు మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రకటన ఖర్చుల్ని తగ్గించు కుంటున్నాయి. అయితే జనరల్ మోటార్స్ ట్విటర్లో యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఆదాయం తగ్గుతోంది కొద్ది రోజుల క్రితం మస్క్ మాట్లాడుతూ..ట్విటర్ ఆదాయంలో భారీగా తగ్గుతోందన్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో యాడ్స్ ఇవ్వకుండా ఉండేలా సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. Apple has mostly stopped advertising on Twitter. Do they hate free speech in America? — Elon Musk (@elonmusk) November 28, 2022 What’s going on here @tim_cook? — Elon Musk (@elonmusk) November 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం..యాపిల్ కీలక నిర్ణయం
ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక మాంద్యం దెబ్బకు దిగ్గజ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాల నుంచి వారికి అందించే లంచ్ వంటి ఇతర సదుపాయాల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఆర్ధిక మాంద్యం కారణంగా అన్నీ దిగ్గజ సంస్థలు నియామకాల్ని నిలిపివేశాయి.యాపిల్ సంస్థ సైతం నియామాకల నిలుపుదలపై దృష్టి సారించిందని టిమ్‌కుక్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా 11,000 ఉద్యోగాలను తగ్గించింది. యాపిల్ కాకుండా గూగుల్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు నియామకాల్ని నిలిపివేశాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించాయి. ఎలాన్ మస్క్ కొనుగోలు తర్వాత ట్విటర్లో రెండు వారాల్లో సుమారు 5,000 మంది ఉద్యోగులను ఫైర్ చేశారు.అదే తరహాలో తొలగింపులు లేకపోయినా, నియామకాలు నిలిపివేస్తున్నట్లు టిమ్‌కుక్ పేర్కొన్నారు. -
ఆపిల్ ఐఫోన్లు, మనోళ్లు తెగ కొనేశారట: రికార్డు ఆదాయం
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో ఐఫోన్ అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఫోన్ అమ్మకాలలో అత్యధిక ఆదాయాన్నినమోదు చేసింది. భారతదేశంలో బలమైన రెండంకెల వృద్ధితో ఆల్-టైమ్ రికార్డు ఆదాయ రికార్డును సాధించింది ఈ ఏడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ వివరాలను వెల్లడించారు. ఒక్క సెప్టెంబర్ త్రైమాసికంలోనే ఐఫోన్ విక్రయాల్లో 10శాతం వృద్ధిని సాధించి 42.6 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ప్రపంచంలోని ప్రతి మార్కెట్లోనూ తమకు అద్భుతమైన ఆదాయం లభించిందని కుక్ తెలిపారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఇదే తరహాలో వృద్ధి నమోదు చేశామన్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో రెట్టింపు ఆదాయం సాధించామనీ, అలాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మరింత విజయవంతంగా అమ్మకాలు సాగిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్లో డీల్స్, ఆఫర్ల కారణంగా ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయన్నారు. -
‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐఫోన్ 14 సిరీస్‌పై యాపిల్ సీఈవో టిమ్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్ సిరీస్ ఫోన్లపై యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ వేసిన మీమ్స్ సమర్ధించారు. 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేయగా.. వాటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్లలో ఎలాంటి ఆవిష్కరణలు లేవనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి ఈ క్రమంలో ఐఫోన్ 14 సిరీస్‌పై టిమ్‌కుక్ స్పందించారు. గత పదేళ్లుగా యాపిల్ కస్టమర్లలో నేను ఒకరిని. తొలిసారి బ్లాక్ బెర్రీ నుంచి ఐఫోన్ 4ఎస్‌కు షిఫ్ట్ అయ్యా. నాటి నుంచి మార్కెట్లో ఏ ఐఫోన్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటా. ఈ ఏడాది కూడా 256 జీబీ సిల్వర్ కలర్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేశా. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను ఉద్దేశిస్తూ..‘‘నా కొత్త బొమ్మతో రెండు వారాల పాటు ఆడిన తరువాత, "డైనమిక్ ఐలాండ్" తప్ప.. ఆశ్చర్యపోయేలా ఆవిష్కణలు లేవని గట్టి నమ్మకంతో చెప్పగలను. సెల్ఫీ కెమెరా, నోటిఫికేషన్లు, అలెర్ట్స్, ఇతర కార్యకలాపాల్ని అనుసంధానం చేసేలా ఫేస్ ఐడి సెన్సార్ మాత్రమే ఉందని అన్నారు. స్టీవ్ జాబ్స్ కూతురు చెప్పింది నిజమే స్టీవ్ జాబ్స్ కూతురు ఈవ్ జాబ్స్ కొత్త ఐఫోన్ 14 సిరీస్‌పై సెటైర్ వేశారు. పాత స్మార్ట్ఫోన్ల లాగానే కొత్త జనరేషన్ ఫోన్లు ఉన్నాయని అర్ధం వచ్చే ఓ మీమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ అవుతున్నానని..ఓ వ్యక్తి తాను వేసుకున్న షర్ట్ లాంటిదే మరో షర్ట్ చేతిలో పట్టుకొని ఉన్న మీమ్‌ను ఈవ్ జాబ్స్ షేర్ చేసింది. ఆ మీమ్‌నే టిమ్ కుక్ సమర్ధించారు. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి -
ఐఫోన్ 14 సిరీస్ : ‘బెడిసి కొట్టిన యాపిల్ మాస్టర్ ప్లాన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రో తయారీని పెంచాలనే ప్రయత్నాల్ని విరమించుకుంటున్నట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. సెప్టెంబర్ 16 న ‘యాపిల్ ఫార్ అవుట్’ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ సిరీస్‌లోని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ పెరగడం.. ధర భారీగా ఉండడంతో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను యూజర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విడుదల ప్రారంభంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సేల్స్ బాగున్నా.. క్రమ క్రమంగా వాటి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల అమ్మకాలపై యాపిల్ పెట్టుకున్న భారీ అంచనాలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులు ఈ తరుణంలో యాపిల్ సంస్థ ధర ఎక్కువగా ఉన్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల తయారీని తగ్గించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి విడుదలకు ముందు ఐఫోన్ 14 సిరీస్‌పై అంచనాలు భారీగా పెరగడంతో ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 6 మిలియన్ యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు..ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను తయారు చేయాలని భావించింది. ఆదరణ అంతంత మాత్రమేనా కానీ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం, వాటి ఆదరణ అంతంత మాత్రంగా ఉండడంతో తయారీని తగ్గించాలని యాపిల్ సంస్థ ఐఫోన్ తయారీ సంస్థల్ని ఆదేశించినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. బదులుగా, అదే సమయానికి 90 మిలియన్ ఐఫోన్ 14 ఎంట్రీ లెవల్ ఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది. ఎంట్రీ లెవల్ ఫోన్ల కంటే ఐఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్ల డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని యాపిల్ తగ్గించనుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. -
యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 విడుదల, ధర ఎంతంటే?
టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అమెరికా క్యాలిఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో టిమ్ కుక్.. ఐఫోన్14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్, వాచ్ సిరీస్ 8, వాచ్ సిరీస్ ఎస్ఈ 2, వాచ్ ఆల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ ఎస్ఈ2, ఎయిర్ ప్రాడ్స్ ప్రో 2 గురించి తెలుసుకుందాం. యాపిల్ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు యాపిల్ వాచ్ అల్ట్రా 49ఎంఎం డయల్‌తో వస్తుంది. sapphire గ్లాస్‌తో, వాచ్‌ను టైటానియంతో రూపొందించారు. వాచ్ పెట్టుకుంటే ఎలాంటి ఇరిటేషన్లేకుండా చర్మానికి అనువుగా ఉంటుంది. అతిపెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ వాచ్‌ను 36 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. తక్కువ పవర్ మోడ్‌తో 60 గంటల వరకు పొడిగించవచ్చు. తక్కువ సెల్యులార్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో పనిచేసేలా డ్యూయల్ జీపీఎస్‌తో వస్తుందని యాపిల్ తెలిపింది. హైకింగ్, ఇతర కార్యకలాపాలలో సహాయపడుతుంది. డబ్ల్యూఆర్ 100 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ వాచ్‌ను నీటిలో 100అడుగుల లోతు వరకు ధరించవచ్చు. వీటితో పాటు క్రాష్ డిటెక్షన్, కంపాస్, డెప్త్ గేజ్, నైట్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 799 డాలర్లు ఉండగా (భారత్‌లో రూ.89,900) సెప్టెంబర్ 23 నుంచి లభించనుంది. యాపిల్ వాచ్ ఎస్ఈ (సెకండ్ జనరేషన్) స్పెసిఫికేషన్లు యాపిల్ వాచ్ ఎస్ఈలో రెటీనా ఓఎల్ఈడీ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 2020లో యాపిల్ వాచ్ ఎస్ఈ ( ఫస్ట్ జనరేషన్) కంటే ఈ వాచ్ 30 శాతం పెద్దగా ఉంది. వేగవంతమైన ఎస్8 ప్రాసెసర్‌ను అమర్చారు. యాపిల్ పాత మోడల్ ఎస్5 చిప్ సెట్ కంటే 20శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 8లో ఉన్న క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను సైతం యాపిల్ వాచ్ ఎస్ఈలో అందిస్తుంది. అంతేనా సెల్యులార్ కనెక్టివిటీ, ఫ్యామిలీ సెటప్ ఫీచర్‌తో స్మార్ట్‌వాచ్‌ని సెటప్ చేయడానికి అనుమతిస్తుంది. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అదే సమయంలో యాపిల్ వాచ్ సెకండ్ జనరేషన్ ప్రారంభ ధర ధర 249 డాలర్లు ( భారత్‌లో దాదాపు రూ. 19,800), జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ ధర 299 డాలర్లకు ( భారత్‌లో దాదాపు రూ. 23,800) లభించనుంది. వాచ్ సెప్టెంబర్ 16 నుండి మిడ్నైట్, సిల్వర్, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో: కొత్త హెచ్2 కలిగిన ఈ హెడ్ ఫోన్స్ గంటల పాటు పనిచేస్తుంది. అయితే పరిమాణాల్లో లభించే ఈ సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ధర 249 డాలర్లుగా ఉంది. -
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ విడుదల, ధర ఎంతంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ గురించి ఫీచర్లు, వాటి ధరల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను యాపిల్ అప్‌గ్రేడ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో పంచ్ హోల్ డిస్ప్లే, లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్ 13 కంటే ఈ ఫోన్ మోడల్ లు పెద్దగా ఉన్నాయి. ఇందులో ఫేస్ ఐడి, రెండవది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆసక్తికరంగా, యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఈ ఫోన్ల డిస్ప్లే చుట్టూ సన్నని బెజెల్స్, సర్జికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్,టెక్ట్స్ర్డ్ మాట్టే గ్లాస్ డిజైన్ లు ఉన్నాయి. ఐఫోన్ ప్రో మోడల్ 6.1-అంగుళాల స్క్రీన్ ఉండగా..ప్రో మాక్స్ 6.7-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్సెట్లు స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కాకుండా, ప్రో మోడల్స్ కొత్త ఏ16 బయోనిక్ చిప్సెట్తో విడుదలైంది. ఫోటోగ్రఫీ కోసం, 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇది పాత మోడళ్లలో కనిపించే 12-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే పెద్ద అప్‌గ్రేడ్. దీనికి 1.4 యూఏఎం పిక్సెల్‌లతో కూడిన కొత్త 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, హెచ్డీ క్వాలిటీ ఫోటోలు తీసేలా1.4యూఎం పిక్సెల్, సెటప్‌లో 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే మెరుగైన టెలిఫోటో కెమెరా కూడా ఉంది. ధరల విషయానికొస్తే ఐఫోన్ 14ప్రో ప్రారంభం ధర రూ.1,29,900, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 గా ఉంది. రెండు ఐఫోన్లు సెప్టెంబర్ 9న యూఎస్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. -
వావ్ ఏం ఫీచర్లు గురూ..అదరగొట్టేస్తున్నాయ్,యాపిల్ వాచ్ సిరీస్ 8 విడుదల!
Apple Watch Series 8 : ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ప్రమాదంలో యూజర్లను కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation (అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వాచ్‌లోని ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. స్మార్ట్ వేరబుల్ మార్కెట్లో యాపిల్ వాచ్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్నీ యాపిల్ వాచ్ సిరీస్‌ల కంటే యాపిల్ వాచ్ 8 సిరీస్ విభిన్నంగా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా క్యాలి ఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా నిర్వహించిన యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో టిమ్ కుక్ మహిళ ఆరోగ్యం కాపాడే లక్ష్యంగా విడుదల చేసిన యాపిల్ వాచ్ 8 సిరీస్ వాచ్ రించి మరిన్ని విషయాలు మీకోసం ovulation (అండోత్సర్గము) గురించి పెళ్లయిన జంటలన్నీ పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే ovulation (అండోత్సర్గము) గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి కోసమే అండోత్సర్గము అనే ఫీచర్‌ను తయారు చేసింది. టెంపరేచర్ సెన్సార్ తో పాటు హై ఎండ్ ఫీచర్లతో ఆపిల్ వాచ్ 8 ని పరిచయం చేస్తోంది. అయితే, మహిళల పర్సనల్ డేటా కేవలం వాళ్లు ధరించిన యాపిల్ వాచ్ 8లో నిక్షిప్తమై ఉంటుందని, ఆ డేటా యాపిల్ సర్వర్లలో స్టోర్ చేయడం లేదని జెఫ్ విలియమ్స్ స్పష్టం చేశారు. డిస్ప్లే సూపర్ ఇప్పటికే యూజర్లు వినియోగిస్తున్న అన్నీ యాపిల్ వాచ్‌ల కంటే ఈ యాపిల్ 8 సిరీస్ వాచ్ కింగ్ మేకరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వాచ్‌లో ఉన్న అప్డేటెడ్ ఫీచర్లు ఇతర వాచ్‌లలో లేవని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాపిల్ వాచ్ 49 రెక్టాంగిలర్ డిస్ప్లే తో పాటు 2000నిట్స్ల బ్రైట్నెస్, చేతికి ధరించినప్పుడు తేలికగా ఉండేందుకు వాచ్ కేస్ టైటానియంతో తయారు చేయబడింది. ఫిట్నెస్ ప్రియుల కోసం ఫిట్నెస్ ప్రియులకోసం యాపిల్ తయారు చేసిన ఈ వాచ్ డిజైన్, స్లైడ్స్ లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్డేట్ చేసింది. కొత్త ఆరెంజ్ యాక్షన్ బటన్, బటన్ గార్డ్, రీడిజైన్ చేసిన క్రౌన్, sapphire క్రిస్టల్ డిస్ప్లే తో పాటు ఆ డిస్ప్లేను ప్రొటెక్ట్ చేసేందుకు రిమ్ సైజును పెంచింది. ఈ తరహా ఫీచర్‌ను శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రోలో కూడా మనం చూడొచ్చు. కారు ప్రమాదంలో ఉంటే కారు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించినట్లయితే, అత్యవసర సేవలకు కాల్ చేయడంలో సహాయపడటానికి సిరీస్ 8లో కొత్త గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ కూడా ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో పొందుపరిచే యాక్సిలరోమీటర్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ మోషన్‌ను డిటెక్ట్ చేస్తుంది. wake-up screen వంటి ఆప్షన్‌కు కూడా ఈ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నారు. ధర ఎంతంటే యాపిల్ వాచ్ 8సిరీస్ ధర 499 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ..సెప్టెంబర్ 16 నుంచి కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉 దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 విడుదల! -
దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 సిరీస్ విడుదల!
ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ను యాపిల్ విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం..బుధవారం రాత్రి 10.30 గంటలకు 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేశారు. వాటిలోని ఐఫోన్ 14 (Iphone 14), ఐఫోన్ 14 ప్లస్ (Iphone 14 Plus) ఫోన్ ధరలతో పాటు.. ఈ-సిమ్స్,శాటిలైట్ కనెక్టివిటీ,యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్ వంటి ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అదిరిపోయేలా ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మిడ్ నైట్ స్టార్‌లైట్, పర్పుల్, రెడ్ వంటి ఐయిదు వేరియంట్ కల్సర్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్లలో ఏ15 బయోనిక్ చిప్, 6-కోర్ సీపీయూతో రెండు హై ఫర్మామెన్స్తో నాలుగు ఎఫెషెన్స్ కోర్లు, ఒక న్యూరల్ ఇంజిన్ ఉంది. ఐఫోన్ 14 లార్జర్ సెన్సార్లతో 12ఎంపీ మెయిన్ కెమెరా, 1.9 మైక్రాన్ పిక్సెల్స్, F1.5 ఎపర్చ్యూర్ (కెమెరా హోల్) OISతో వస్తుంది. ఓన్లీ ఈ-సిమ్స్ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో eSIMని పరిచయం చేసింది. తద్వారా ఎక్కువ సంఖ్యలో eSIMలను స్టోర్ చేసుకోవడానికి, సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక్క యూఎస్ ఐఫోన్ 14 సిరీస్‌లో మాత్రమే ఈ ఈ-సిమ్ సౌకర్యం ఉంది. ఎందుకంటే ఆ మోడళ్లలో ఫిజికల్ సిమ్ కార్డ్ పెట్టుకునే సిమ్ ట్రేస్‌లు లేవు శాటిలైట్ కనెక్టివిటీ యాపిల్ తన ఐఫోన్లో మొదటిసారి శాటిలైట్ కనెక్టివిటీని పరిచయం చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14 వినియోగదారులు ప్రాణ పాయ స్థితిలో ఉన్నా, లేదంటే ఎక్కడైనా చిక్కుకున్నా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ ఛేంజ్ టెక్నాలజీని కమ్యూనికేషన్ ప్రవేశపెట్టడానికి తమకు సంవత్సరాలు పట్టిందని యాపిల్ తెలిపింది. యానిమేషన్ రూపంలోఐఫోన్ 14లో ఐఫోన్ 14 చిన్న పిల్ ఆకారపు నాచ్‌తో కొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. డిస్ ప్లే వెనుక భాగంలో ప్రాక్సిమిటీ సెన్సార్, నోటిఫికేషన్లు యానిమేషన్ రూపంలో పాప్ అవుట్ అవుతాయి. యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (సుమారు రూ. 79,900) ఉండగా, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర 899 డాలర్లు (సుమారు రూ.89,900)గా ఉంది. ఈఫోన్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి అందుబాటులో ఉంటుంది. నవంబర్ నాటికి ఈ ఫోన్లు అమెరికా, కెనడా కొనుగోలు దారులకు అందనున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ ఫోన్ తయారీని నిలిపేస్తోందా, యాపిల్ సంచలన నిర్ణయం?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ త్వరలో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్ విడుదలతో ఇతర ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో పాటు ఐఫోన్ 11 ఫోన్‌ను తయారీని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది యాపిల్ కొత్త సిరీస్ ఫోన్ విడుదల సమయంలో కొన్ని పాత ఫోన్ల తయారీని నిలిపివేస్తుంది. 2021లో ఐఫోన్ 13 సిరీస్ విడుదల సమయంలో ఐఫోన్ ఎక్స్ఆర్ ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా ఐఫోన్ 14సిరీస్ విడుదలతో మూడేళ్ల క్రితం విడుదలైన ఐఫోన్ ఓల్డ్ మోడల్ ఐఫోన్ 11ను డిస్ కంటిన్యూ చేయనుంది. చెన్నై కేంద్రంగా యాపిల్‌కు చెందిన ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తన ప్లాంట్‌లో ఐఫోన్ 11ను తయారు చేస్తుండేది. మార్కెట్లో విడుదలైన ఫోన్ సైతం కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుంది. ఐఫోన్లలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే ఫోన్ మార్కెట్లో కనమరుగు కానుంది. ఐఫోన్ 11ను నిలిపి వేయడం అంటే ఐఫోన్ 11ను నిలిపి వేయడం అంటే.. యాపిల్ ఇకపై ఐఫోన్ 11 మోడల్‌ను తయారు చేయదని అర్ధం. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అనేక ఇతర థర్డ్ పార్టీ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఆస్టాక్ అమ్మకాలు పూర్తయితేనే ఆమోడల్ను విక్రయాల్ని నిలిపివేసే అవకాశం ఉంది. టిమ్ కుక్ కన్ఫాం చేయలేదు ఐఫోన్ 11 తయారీ నిలిపివేత, ధరల తగ్గింపుపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఐఫోన్ 11 నిలిపివేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ మోడల్‌ను వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 11 నిలిపివేసినా మరికొన్ని సంవత్సరాల పాటు అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను యూజర్లు పొందుతారని తెలుస్తోంది. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్!
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరల్ని ఐఫోన్ 13 ధరలకే యాపిల్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 ఉండవచ్చంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. కొరియన్ టెక్ బ్లాగ్ Naverలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పరిమిత సంఖ్యలో సప్లయ్ చైన్ సమస్యలు ఇతర కారణాల్ని పరిగణలోకి తీసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు యాపిల్ 14 ధరల్ని పెంచే యోచన లేదని టెక్ బ్లాగ్ పేర్కొంది. అయితే స్తబ్ధుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్, డిమాండ్ తగ్గుదల కారణంగా యాపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ నిర్ణయం తీసుకున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే యుఎస్‌లో ఐఫోన్14 ధర 799 డాలర్లు ఉండగా.. మనదేశంలో ఆ ఫోన్ ధర రూ. 63,200కే లభ్యం కానుంది. జీఎస్టీ, దిగుమతి సుంకం,ఇతర ఛార్జీల్ని కలుపుకొని ఈ ఫోన్ ధర పెరిగే అవకాశం ఉండనుంది. కానీ, గతేడాది యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 13 ఫోన్ సిరీస్‌కు సమానంగా భారత్ మార్కెట్లో అదే సిరీస్ ఫోన్ లభ్యమయ్యాయని.. కాబట్టి భారత్‌లో సైతం ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. -
కరోనా కల్లోలం,మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..ఐటీ కంపెనీల అమలు!
ప్రపంచ దేశాల్ని కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో దిగ్గజ కంపెనీలు ఆఫీస్‌కు వచ్చి (హైబ్రిడ్ వర్క్) పని చేస్తున్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. ఉద్యోగులు వీలును బట్టి ఆఫీస్‌కు రావాలని, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెబుతున్నాయి. దివెర్జ్ నివేదిక ప్రకారం..టెక్ దిగ్గజం యాపిల్ పూర్తి స్థాయిలో ఉద్యోగులకు రిటర్న్ టూ ఆఫీస్ పాలసీపై వెనక్కి తగ్గింది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసులు, ఆస్పత్రి పాలవుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే ఇంటర్నల్‌గా యాపిల్ సంస్థ ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగులు వారికి నచ్చినప్పుడు ఆఫీస్‌కు రావొచ్చని, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి విధులు నిర్వహించాలని మెయిల్స్‌లో పేర్కొన్నట్లు ది వెర్జ్ తన నివేదికలో చెప్పింది. యాపిల్ ఏం చెబుతుందంటే! ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని యాపిల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కామన్ వర్క్ స్పేస్, మీటిగ్ రూమ్స్, హాల్స్ ఇలా అన్నీ ప్రదేశాల్లో మాస్క్ వినియోగించాలని ఉద్యోగులకు యాపిల్‌కు జారీ చేసిన మెమోలో పేర్కొంది. ఒకవేళ ఆఫీస్‌లో పనిచేయడం ఇబ్బంది అని అనిపిస్తే ఇంటి నుంచి పనిచేయండని సూచించింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ ఏడాది మిడ్ ఏప్రిల్ నుంచి అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతున్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. వైరస్ మహమ్మారికి కారణంగా దేశం మొత్తం మీద 20వేల మంది ఆస్పత్రి పాలవ్వగా..గత వారంలో 16,500 మంది ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలిపింది. చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్‌కు రిజైన్ చేశాడు! -
యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు ఆ సంస్థ ఉద్యోగులు భారీ షాకిచ్చారు. యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తెచ్చిన కొత్తపాలసీని 75శాతం మంది ఉద్యోగులు తిరస్కరించారు. ఇప్పుడీ ఉద్యోగుల నిర్ణయం టిమ్ కుక్ ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా కారణంగా రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇతర రంగాలతో పాటు టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతున్నాయి. కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకొని ఆఫీస్‌లో కార్యకలాపాల్ని ముమ్మరం చేశాయి. దీంతో ఇంటికే పరిమితమైన ఉద్యోగుల్ని ఆయా టెక్ కంపెనీలు కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఇతర టెక్ దిగ్గజాలు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టగా..తాజాగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం మే23 నుంచి ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్ రావాలని మెయిల్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆ మెయిల్ పై యాపిల్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు రిజైన్ చేస్తాం. కానీ ఆఫీస్‌కు వచ్చేందుకు అంగీకరించేది లేమంటూ రహస్యంగా నిర్వహించిన సర్వేలో ఉద్యోగులు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్‌గా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని 'బ్లైండ్' అనే సంస్థ వెలుగులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో పేరు రహస్యంగా ఉంచిన ఓ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ బ్లైండ్ భాగస్వామ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు యాపిల్‌కు చెందిన 652 మంది ఉద్యోగల సమస్యలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా యాపిల్ ఉద్యోగుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. " 2020 నుంచి ఇప్పటి వరకు (గత నెల ఏప్రిల్) వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆఫీస్ రావాలని అంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లలేం. సుదీర్ఘ కాలంగా ఇంట్లో ఉంటూనే ప్రొడక్టివ్‌గా పనిచేస్తున్నాం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమని వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టారు. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని తప్పని సరిచేస్తే మా ఉద్యోగులకు రాజీనామా చేస్తాం. వర్క్ కంఫర్ట్ ఉన్న మరో సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తామంటూ " బ్లైండ్ చేసిన అభిప్రాయ సేకరణలో 56శాతం ఉద్యోగులు తెలిపారు. మరో 75 శాతం మంది ఉద్యోగులు వ్యతిరేకించారు. వెర్జ్ సైతం ప్రముఖ అమెరికన్ టెక్ బ్లాగ్ ది వెర్జ్ ఇప్పటికే యాపిల్ ఉద్యోగుల అసంతృప్తిపై పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. గత డిసెంబర్ నెలలో పలు దేశాలకు చెందిన యాపిల్ స్టోర్ ఉద్యోగులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నివేదికల్లో పేర్కొంది. ముఖ్యంగా యాపిల్ సంస్థలో గంటల వ్యవధి పనిచేసే ఉద్యోగులపై పన్ను విధించడంపై అసంతృప్తిలో ఉన్నట్లు గుర్తు చేసింది. అట్లాంటాలోని యాపిల్ స్టోర్ ఉద్యోగులు..తమకు యాపిల్ సంస్థ పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ఇటీవల యూనియన్ ఎన్నికల్ని నిర్వహించాలని పట్టుబడిన విషయాన్ని ప్రస్తావించింది. చదవండి👉చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్! -
చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్!
విమాన ప్రమాదంలో తండ్రీ- కూతుర్ని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని ఇప్పుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్న ఓ డాక్టర్‌ను. ఇలా ప్రాంతాలు వేరైనా ఆయా ఘటనల్లో బాధితుల్ని రక్షిస్తుంది మాత్రం వస్తువులే. మనం ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ అనే సినిమా డైలాగుల్ని వినే ఉంటాం. కానీ పై సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాల్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. వస్తువుల్ని సరిగ్గా వినియోగించుకుంటే మనుషుల ప్రాణాల్ని కాపాడుతాయని నిరూపిస్తున్నాయి. తాజాగా ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ డెంటిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్ 'సిరీల్4, సిరీస్ 5, సిరీస్ 6, సిరీస్ 7' లలో ఈసీజీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఈసీజీ యాప్' చేసే పని ఏంటంటే హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీని మెజర్ చేసి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్ వాచ్‌కు రెడ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో బాధితుల్ని వెంటనే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. హర్యానాకు చెందిన నితేష్ చోప్రా (34) వృత్తి రీత్యా డెంటిస్ట్. గతేడాది నితేష్‌కు అతని భార్య నేహా నగల్ ఈసీజీ యాప్ ఫీచర్ ఉన్న యాపిల్ వాచ్ 'సిరీస్ 6' ని బహుమతిగా ఇచ్చింది. అయితే నితేష్‌కు తాను ధరించిన యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఫీచర్ గురించి తెలియదు. ఈ నేపథ్యంలో మార్చి 12న నితేష్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడి భార్య వాచ్‌లో ఈసీజీ యాప్‌ను చెక్ చేయమని భర్తకు సలహా ఇచ్చింది. వెంటనే నితేష్ యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అతని గుండె పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేసింది. వాచ్ అలెర్ట్‌తో నితేష్ హుటాహుటీన వైద్యుల్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..నితేష్ గుండెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో ఉన్న తన భర్త ప్రాణాల్ని యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ మెయిల్ చేసింది. "నా భర్తకు 30వ పుట్టిన రోజు సందర్భంగా యాపిల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే వాచ్ నా భర్త ప్రాణాల్ని కాపాడుతుందని అనుకోలేదు. ప్రమాదంలో ఉన్నాడని స్మార్ట్ వాచ్ హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నా భర్త ఆరోగ్యం కుదుట పడింది. నా భర్తకు జీవితాన్ని ప్రసాదించిన మీకు, అందులో భాగమైన టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మెయిల్లో పేర్కొంది. అనూహ్యంగా నేహా మెయిల్‌కు టిమ్ కుక్ స్పందించారు. సకాలంలో మీ భర్తకు ట్రీట్మెంట్ అందినందుకు చాలా సంతోషిస్తున్నాను. స్మార్ట్ వాచ్ మీ భర్తను కాపాడిందనే విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ టిమ్ కుక్ నేహా మెయిల్‌కు రిప్లయి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!!
Apple Event 2022: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ టెక్ లవర్స్ సస్పెన్స్‌కు తెరదించింది. మంగళవారం జరిగిన యాపిల్ ఈవెంట్లో తన కొత్త ప్రొడక్ట్‌లను లాంఛ్ చేసింది. యాపిల్ పీక్ పర్ఫామెన్స్ 2022 పేరిట జరిపిన ఈవెంట్లో యాపిల్ నాలుగు కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసింది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో 5జీ ఐఫోన్ ఎస్ఈ, ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్, హైబ్రిడ్ డివైజ్ పేరుతో డిస్ప్లేతో పనిచేసే మాక్ స్టూడియో డివైజెస్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. యాపిల్ ఐఫోన్13 యాపిల్ ఈవెంట్ సందర్భంగా యాపిల్ ఐఫోన్13 రెండు వేరియంట్ కలర్స్‌ను ప్రకటించింది. అందులో ఐఫోన్13 కోసం గ్రీన్, ఐఫోన్ 13 ప్రో కోసం ఆల్పైన్ గ్రీన్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఏ15 బయోనిక్ చిప్సెట్తో ఐఫోన్ఎస్ఈ యాపిల్ ఈ మెగా ఈవెంట్లో బయోనిక్ చిప్ సెట్‌తో ఐఫోన్ ఎస్ఈ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్నీ ధరల్లో ఉన్న అన్నీ స్మార్ట్ ఫోన్ల కంటే ఏ15 బయోనిక్ చిప్ సెట్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. కొత్త ఐఫోన్ ఎస్ఈలో గ్రాఫిక్స్ పనితీరు ఇటీవల విడుదలైన ఐఫోన్13 సిరీస్ ఫోన్‌తో సమానంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ రెడ్, వైట్,బ్లాక్ కలర్స్ వేరియంట్‌తో గాజు, అల్యూమినియం డిజైన్‌ను కలిగి ఉంది. ఐఫోన్13, ఐఫోన్13 ప్రో మాదిరిగానే ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ట్రాంగ్ గ్లాస్ ఉండగా..స్మార్ట్‌ఫోన్ మునుపటి డిజైన్ల నుండి హోమ్ బటన్‌ను కలిగి ఉందని ఈవెంట్లో స్పష్టం చేసింది. దీంతో పాటు బ్యాటరీ లైఫ్ మెరుగుపడిందని పునరుద్ఘాటించింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర 429 (ఇండియన్ కరెన్సీలో రూ.32,953.21)డాలర్లు. ఐపాడ్ ఎయిర్ యాపిల్ కొత్త ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్‌ను విడుదల చేసింది. తద్వారా యూజర్లు భారీ ప్రొక్రియేట్ ప్రాజెక్ట్‌లను ఈజీగా చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ట్రెండింగ్‌లో ఉన్న గేమ్స్ ను ఈజీగా ఆడుకోవచ్చని సూచించింది. ఐపాడ్ ఎయిర్‌లోని ఫ్రంట్ కెమెరా సరికొత్త 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది యాపిల్ సెంటర్ స్టేజ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. 5జీ నెట్ వర్క్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తున్న ఐపాడ్ ఎయిర్ స్మార్ట్ కీబోర్డ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో యాపిల్ సెకండ్ జనరేషన్ పెన్సిల్ తోపాటు కొత్త ఐపాడ్ ఓఎస్ 15ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఐపాడ్ ప్రారంభ ధర 599డాలర్లు( ఇండియన్ కరెన్సీలో రూ.46,025.06గా) ఉంది. మార్చి18నుంచి ఈ ప్రొడక్ట్‌ను ఆన్లైన్లో సేల్కు ఉంచనుంది. ఎం1 ఆల్ట్రా చిప్ యాపిల్ ఎం1 అల్ట్రా అనే చిప్‌ని పరిచయం చేసింది. యాపిల్ ఎం1 మ్యాక్స్ ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్. అయితే తాజాగా యాపిల్ ఎం1 ఆల్ట్రా చిప్ ను తెచ్చింది. ఈ చిప్ పనితీరును మరింత పెంచేందుకు అల్ట్రాఫ్యూజన్ టెక్నాలజీని వినియోగిస్తుంది. ఎం1 అల్ట్రాతో భారీ బ్యాండ్‌విడ్త్, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎం1 చిప్ కంటే ఎనిమిది రెట్లు వేగంగా పని చేస్తుంది. 20-కోర్ సీపీయూ, 64-కోర్ జీపీయూని కలిగి ఉంది. ఎం1 అల్ట్రా 90శాతం తక్కువ శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు తోటి 16-కోర్ సీపీయూల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. మాక్ స్టూడియో.. మాక్ డిస్ప్లే సాధారణంగా యాపిల్ మాక్ మిని ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఎం1 అల్ట్రా పనితీరును ఏకీకృతం చేసింది. ఈ పోర్టబుల్ సీపీయూని స్టూడియో డిస్ప్లేతో ఉపయోగించవచ్చు, మాక్ స్టూడియో కనెక్టివిటీ కోసం బహుళ పోర్ట్‌లతో వస్తుంది. ఇది ఒకే సమయంలో గరిష్టంగా నాలుగు డిస్ప్లేలతో కనెక్ట్ చేయగలదు. మాక్ స్టూడియో పెద్ద ఎం1 చిప్‌లతో వస్తుంది. ఎం1 మ్యాక్స్ తో సహా మాక్ ప్రోని కూడా అధిగమిస్తుంది. అదనంగా ఎం1 అల్ట్రాతో కూడిన మాక్ స్టూడియో 26-కోర్ సీపీయూతో మాక్ ప్రో కంటే 60శాతం కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఎం1 మ్యాక్స్ మాక్ స్టూడియో 64జీబీ యూనిఫైడ్ మెమరీతో వస్తుంది. ఎం1 ఆల్ట్రా మ్యాక్స్ స్టూడియో 128జీబీ మెమరీతో వస్తుంది. స్టూడియో డిస్ప్లే అల్యూమినియం ఛాసిస్‌తో కూడిన ఆల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. స్టూడియో డిస్ప్లే 27-అంగుళాల డిస్ప్లే, 600 నిట్ల వరకు బ్రైట్నెస్,బిలియన్ కంటే ఎక్కువ కలర్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది యాపిల్ ట్రూ టోన్‌కు మద్దతు ఇస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది -
రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమంటారో!!
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న చర్యలపై ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హ్యాకర్లు సైతం తమ సొంత దేశమైన రష్యా తీరును విమర్శిస్తూ హ్యాకర్స్ సైబర్ దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటా పరిధిలోని ఫేస్బుక్లో రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్టైమెంట్లును జ్నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌తో పాటు టెక్ దిగ్గజం యాపిల్ తన కార్యకలాపాల్ని రష్యాలో నిషేధం ఉక్రెయిన్ ఉపాధ్యక్షుడు,డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రి మైఖైలో ఫెడోరోవ్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు లేఖ రాశారు. ప్రపంచమంతా ఆంక్షలు విధిస్తూ రష్యా తీరును ఎండగడుతోంది. శత్రువు గణనీయమైన నష్టాలను చవి చూడాలి. అందుకు మీ మద్దతు కావాలి. అందుకే యాప్ స్టోర్‌ను నిషేధించాలని కోరుతున్నామని ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల రష్యన్ ప్రజలు అక్కడి యువత ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దురాక్రమణను అడ్డుకుంటాయని భావిస్తున్నాం. ఈ దాడిని అడ్డుకోవాలని రష్యన్ ప్రజలకు మైఖైలో ఫెడోరోవ్ విజ్ఞప్తి చేశాడు. -
ఐఫోన్ అమ్మకాలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి,భారత్‌లో దూసుకెళ్తున్న సేల్స్!!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా భారత్‌లో ఐఫోన్లు ఈ స్థాయిలో అమ్మడుపోవడంపై ఐఫోన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ సంస్థ గతేడా కేలండర్ ఇయర్ 2021లో ఐఫోన్ షిప్మెంట్లో 48శాతం వృద్దిని సాధించింది. దీంతో మార్కెట్ షేర్ మరో 4శాతం పెరిగినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టెక్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ ప్రకారం..యాపిల్ ఈ ఏడాది మనదేశంలో రికార్డు స్థాయిలో 5.4 మిలియన్ ఐఫోన్లను డెలివరీ చేసింది. ముఖ్యంగా క్యూ4లో 2.2 మిలియన్లను డెలివరీ చేసింది. క్యూ4 ఫలితాల ప్రకారం..టెక్ దిగ్గజం అక్టోబర్-డిసెంబర్ కాలంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా సీఎంఆర్ ప్రతినిధి ప్రభురామ్ మాట్లాడుతూ..ఐఫోన్ అమ్మకాల్లో యాపిల్ భారత్‌లో ముందంజలో ఉంది. 5 మిలియన్లకు పైగా ఐఫోన్లను షిప్పింగ్ చేసింది. కాంపిటీటివ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో మరో 4.4 శాతం మార్కెట్ షేర్‌ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.ఏడాది పొడవునా దేశీయంగా పెరిగిన ఐఫోన్ల తయారీ , రిటైల్ మార్కెట్లో అమ్మకాలు జోరందుకోవడంతో పాటు పెస్టివల్ సీజన్ కారణంగా ఐఫోన్లకు డిమాండ్ పెరగడంతో లాభాలు నమోదు చేసిందని ప్రభురామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ 12కు భారీ డిమాండ్ భారత్‌లో 40 శాతం మార్కెట్ వాటాతో ఐఫోన్ 12 కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఐఫోన్ 11, ఎస్ఈ, ఐఫోన్ 13,ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా జూలై-సెప్టెంబర్ కాలంలో (క్యూ3) యాపిల్ దేశంలో 1.53 మిలియన్లకు పైగా ఐఫోన్ యూనిట్లను డెలివరీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..! -
సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు!
ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడు తన లైఫ్ స్టైల్‌ని, కంఫర్ట్ లెవల్స్‌ను పెంచుకోవడానికి ఎన్నో గొప్పగొప్ప ఇన్వెన్షలను అభివృద్ది చేశాడు. ఉదాహరణకు ఒకప్పుడు మాట్లాడానికి ఉపయోగపడే సెల్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌గా మారి మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. కరోనా పుణ్యమా అంటూ డిజిటల్ కొలాబరేషన్ పెరిగి స్మార్ట్ ఫోన్ అవసరాన్ని మరింత పెంచేసింది. అందుకే ఆయా టెక్నాలజీ సంస్థలు స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గం యాపిల్ తన ఐఫోన్లో మరో కొత్త టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రానుంది. యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ అధికారిక పోర్టల్ వివరాల ప్రకారం.. యాపిల్ సంస్థ ఐఫోన్ ఫంక్షనాలిటీని పూర్తిగా మార్చనుంది. ఇప్పటి వరకు ఐఫోన్ స్క్రీన్‌ను యాప్స్, కాంటాక్ట్స్,యాప్‌స్టోర్, పాడ్‌కాస్ట్ వినేందుకు ఉపయోగించేవాళ్లం. కానీ ఇకపై ఐఫోన్ స్క్రీన్‌ను బ్యాటరీ ఛార్జర్‌గా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్రాన్సాఫార్మ్ చేస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ టిమ్ కుక్ ఈ టెక్నాలజీని ఐఫోన్లలో అప్డేట్ చేస్తే యాపిల్‌కు చెందిన గాడ్జెట్స్‌ను ఐఫోన్ మీద ఉంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఈ కొత్త టెక్నాలజీపై ఐఫోన్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఈ కొత్త టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో టెక్ నిపుణులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. 'థ్రూ డిస్ప్లే వైర్లెస్ ఛార్జింగ్' ఫీచర్ సాయంతో కొన్ని యాక్ససరీస్‌కు డిస్ ప్లే ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. వాటిలో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని' చెబుతున్నారు. ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది యూజర్లు యాపిల్ గాడ్జెట్స్‌కు సంబంధించిన ఛార్జర్లు మరిచిపోయినప్పుడు ఈ డిస్ప్లే వైర్లెస్ ఛార్జింగ్‌ను వినియోగించుకోవచ్చు. ఐపాడ్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లను ఐఫోన్ పై పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కాగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే యాపిల్ ప్రొడక్ట్‌లు వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఐఫోన్లలో అదిరిపోయే ఫీచర్, సిమ్‌కార్డ్‌తో పనిలేకుండా..! -
ఐఫోన్లలో అదిరిపోయే ఫీచర్, సిమ్‌కార్డ్‌తో పనిలేకుండా..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. టెక్ మార్కెట్లో ప్రత్యర్ధుల్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విడుదల చేసే ప్రతి గాడ్జెట్‌లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూనే..మార్కెట్‌ను శాసిస్తుంది. తాజాగా యాపిల్ ఐఫోన్15 సిరీస్‌లో సిమ్ స్లాట్ లేకుండా ఈ-సిమ్(ఎలక్ట్రానిక్ సిమ్)తో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెక్ బ్లాగ్లు కథనాల్ని ప్రచురించాయి. యాపిల్ ఐఫోన్ 13సిరీస్ విడుదల నేపథ్యంలో ఐఓఎస్‌ను అప్ డేట్ చేసింది. త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో నాచ్ డిస్ప్లే కాకుండా సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ సెన్సార్లతో హోల్ పంచ్ డిస్ప్లేతో పరిచయం చేయనుంది. ఇక వాటికంటే భిన్నంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను సిమ్ స్లాట్ లేకుండా విడుదల చేయనున్నట్లు టెక్ బ్లాగ్లు కథనాల్లో పేర్కొన్నాయి. జీఎస్ఎం అరీనా కథనం ప్రకారం..2023లో విడుదల కానున్న ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఫోన్లలో ఫిజకల్ సిమ్ ఉండదని, ఇకపై యాపిల్ విడుదల చేయబోయే ఐఫోన్ సిరీస్‌లన్నీ ఈ-సిమ్‌తో వస్తాయని తెలిపింది. మరికొన్ని నివేదికలు..ఐఫోన్లు డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్‌తో వస్తాయని, యూజర్లు ఏకకాలంలో రెండు ఈ-సిమ్‌లను వినియోగించుకునే సౌకర్యం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయినప్పటికీ, నాన్-ప్రో మోడల్‌లలో పూర్తిగా ఈ-సిమ్ స్లాట్లు ఉంటాయా లేదా ఫిజికల్‌గా సిమ్ కార్డ్‌లను కొనసాగిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా యాపిల్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా ఐఫోన్‌ను లాంఛ్ చేసినప్పటికీ, ఈ-సిమ్‌లను ఉపయోగించలేని దేశాల్లో ఫిజికల్ సిమ్ స్లాట్ వెర్షన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ-సిమ్ అంటే ఏమిటి? ఈ-సిమ్ అనేది ఎలక్ట్రానిక్ సిమ్ కార్డ్. ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగించే ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లా కాకుండా చిప్ తరహాలో ఉంటుంది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లలో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. వాటిలో ఈ-సిమ్‌ను ఇన్సర్ట్ చేయడం చాలా సులభం. అందుకే టెక్ కంపెనీలు ఈ-సిమ్‌ను వినియోగించేందుకు సుమఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా యాపిల్ సైతం ఐఫోన్ 15లో ఈ ఈ-సిమ్‌ను ఇన్సర్ట్ చేయనుంది. చదవండి: షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే! -
Work From Home: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..!
Apple Work From Home End Latest Updates: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ పై కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా వర్క్ హోమ్ కే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యాపిల్ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయానికి రావాలని పలుమార్లు మెయిల్స్ పంపింది. కానీ కోవిడ్ వల్ల ఆఫీస్‌లో వర్క్ చేసే విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చింది. తాజాగా యాపిల్ మరోసారి ఉద్యోగులకు డెడ్ లైన్ విధించింది. ఫిబ్రవరి 1 నుంచే ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జనవరి 22 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీ కోరగా తాజాగా దీన్ని ఫిబ్రవరి 1కి పొడిగించారు. తాజా సమాచారం ప్రకారం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన ఉద్యోగులకు కొత్త వర్క్ ప్లాన్ గురించి మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. మెయిల్ గురించి వచ్చిన కథనాల ఆధారంగా..ఉద్యోగుల్ని దశలవారీగా ఆఫీస్‌లకు రావాలని టిమ్ కుక్ మెయిల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌లో పనిచేయాలని సూచించారు. ఈ వర్క్ప్లాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి1 నుంచి కొనసాగుతుంది. ప్లాన్‌లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం 3రోజులుమూడు రోజులు సోమవారం,మంగళవారం, గురువారం ఆఫీస్‌కు రావాలని తెలిపారు. బుధవారం,శుక్రవారం ఇంటి నుంచి పనిచేసేందుకు టిమ్ కుక్ అనుమతి ఇచ్చారు. చదవండి: విమాన ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..! -
టిమ్ కుక్ ను..ఎలన్ తిట్టినంత పనిచేస్తున్నారు?!
కొద్ది కాలం క్రితం యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను బూతులు తిట్టారంటా?' అనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్ని టీమ్ కుక్, ఎలన్ మస్క్‌లు ఆ కథనాల్ని కొట్టి పారేశారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం టిమ్ కుక్‌పై రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అందుకు ఊతం ఇచ్చేలా ఆ ఇద్దరి గురించి మరో చర్చ మొదలైంది. టిమ్ కుక్ నిజంగా ఎలన్‌ను తిట్టారో..? లేదో? కానీ ఎలన్ మాత్రం టిమ్ కుక్ ను టార్గెట్ చేస్తూ అన్నంత పని చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటారా? యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటుంది.ఆ విషయాన్ని మీడియా ఆధారాలతో సహా బయటపెట్టినా..అదేం లేదు. నాన్సెన్స్ అంటూ కొట్టి పారేస్తుంటారు. తాజాగా యాపిల్ గత సోమవారం(అక్టోబర్ 18) జరిగిన ఓ లాంఛ్ ఈవెంట్లో మాక్ బుక్ ప్రో, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను రిలీజ్ చేసింది. వీటితో పాటు పాలిషింగ్ క్లాత్ గురించి ప్రస్తావించింది. యాపిల్ గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు వాటిని శుభ్రం చేసేందుకు పాలిషింగ్ వస్త్రాన్ని వినియోగించాలని సూచించింది. అంతా బాగుంది కానీ పాలిషింగ్ క్లాత్ ధర రూ.1900 ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Introducing Apple Bağdat Caddesi, our beautiful new store in Istanbul. We’re glad to be a part of this vibrant community and we can't wait to welcome customers to this spectacular new space. pic.twitter.com/BtJiGDAeqq — Tim Cook (@tim_cook) October 22, 2021 Come see the Apple Cloth ™️ — Elon Musk (@elonmusk) October 22, 2021 యాపిల్ పాలిషింగ్ క్లాత్‌పై ట్రోలింగ్ కొనసాగుతుండగానే.. యాపిల్ సంస్థ ఇస్తాంబుల్‌లో యాపిల్ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ప్రారంభానికి ముందు స్టోర్ గురించి టిమ్ కుక్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ఎలన్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎలన్.. టిమ్ కుక్‌ను ఉద్దేశిస్తూ 'వచ్చి యాపిల్ పాలిషింగ్ క్లాత్ ను చూడండి టిఎం' అంటూ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. ఆ ట్వీట్‌కు నెటిజన్ల మాత్రం ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ బుక్ గురించి చర్చించుకుంటున్నారు. . ఆ బుక్‌లో ఏముంది ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రైటర్ టిమ్ హగ్గిన్స్ రాసిన ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ అనే బుక్ విషయంలో అదే జరిగింది. అప్పుడెప్పుడో ఎలన్ మస్క్ టెస్లా విలీన ప్రతిపాదనను యాపిల్ సీఈవో టిమ్ కుక్ ముందుంచారట. అంతేకాదు డీల్ ఒకే అయితే తననే యాపిల్ సీఈఓగా ప్రకటించాలని మస్క్ కోరాడట. అంతే మస్క్ ప్రతిపాదనతో ఒంటికాలిపై లేసిన టిమ్ కుక్.. ఎలన్‌ను బూతులు తిట్టినట్లు టిమ్ హగ్గిన్స్ తన బుక్‌లో రాసుకొచ్చారు. కానీ అలాంటి ఒప్పొందాలు జరగలేదని.. ఒకరంటే ఒకర్ని ఇన్స్పిరేషన్ అంటూ డైలాగులు చెబుతుంటారు. చదవండి: యాపిల్ సీఈవోగా మస్క్!!.. బూతులు తిట్టేసిన టిమ్ కుక్, నాన్సెన్స్.. -
Apple: ఇదే నా మాట..! నా మాటే శాసనం..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ ఉద్యోగులపై ఉక్కు పాదం మోతున్నట్లు తెలుస్తోంది. సంస్థలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులు, వివక్ష గురించి మాట్లాడిన ఉద్యోగుల్ని 'యు ఆర్ ఫైర్డ్' అంటూ విధుల నుంచి తొలగిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా తాజాగా ఆపిల్ మ్యాప్స్ బేస్డ్ ప్రోగ్రామ్ మేనేజర్ జన్నెకే పారిష్ ను విధుల నుంచి తొలగిస్తూ నోటీసులు జారీ చేసింది. గత కొద్ది కాలంగా ఆపిల్ సంస్థలో ఉద్యోగులపై దూషణలు, పే ఈక్విటీ, వర్క్ ప్లేస్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఇతర సమస్యల గురించి జన్నెకే పారిష్ పోరాటం చేస్తున్నారు. ఆపిల్ సంస్థలో ఉద్యోగుల చేదు అనుభవాలు, హరాస్ మెంట్స్, వివక్ష వంటి అంశాల ఆధారంగా #AppleToo పేరుతో సోషల్‌మీడియాలో స్టోరీస్‌ను పబ్లిష్ చేస్తున్నారు. ఈ అంశం ఆపిల్ సంస్థకు తలనొప్పిగా మారింది. అదే సమయంలో జీతాలకు సంబంధించిన వ్యవహారంలో ఆపిల్‌పై ఇద్దరు ఉద్యోగులు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆపిల్ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ జన్నెకే పారిష్ కంపెనీకి సంబంధించిన డేటాను డీలిట్ చేశారని, సంస్థకు సంబంధించిన కొన్ని కీలక అంశాల్ని మీడియా కాన్ఫిరెన్స్‌లో చర్చించారని ఆరోపిస్తూ ఆమెను విధుల నుంచి తొలగించింది. ఈ సందర్భంగా పారిష్ మాట్లాడుతూ.. సంస్థలో ఉద్యోగులు ఇబ్బందుల గురించి మాట్లాడడం వల్లే తనని తొలగించారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపిల్‌పై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్‌కు ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరు ఉద్యోగులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. సంస్థ లోపాల గురించి మాట్లాడినందుకే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు వ్యవహారం ఆపిల్‌లో చర్చాంశనీయంగా మారింది. చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? -
ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం
* పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధి చెందండి * యాపిల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో మేలైన వస్తూత్పత్తి సంస్థగా యాపిల్ కంపెనీ పేరొందినట్లే... పారిశ్రామిక విధానానికి తెలంగాణ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పురోభివృద్ధిలో పాలుపంచుకునేందుకు యాపిల్ ముందు కొచ్చినందుకు హర్షం వెలిబుచ్చారు. ‘‘హైదరాబాద్ విశ్వనగరంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులతో ముందుకురావటం ఆనందకరం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయి పారిశ్రామిక విధానాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులకు ఏ మాత్రం ఇబ్బందులు కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కలసికట్టుగా అభివృద్ధి చెందేందుకు దోహదపడండి..’ అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో యాపిల్ సంస్థ మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో పాటు ఆయన బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఆటంకాలేమీ లేకుండా, నిర్ణీత సమయంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలను తాము అమలుపరుస్తున్నామన్నారు. ఆ దిశగా ఇప్పటికే తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తున్నాయని చెప్పారు. ‘‘ప్రపంచ ఐటీ రంగ దిగ్గజాలైన ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించుకున్నాయి. వాటికి యాపిల్ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశ, దశ ప్రపంచ దిగ్గజమైన యాపిల్ సీఈవో టిమ్ కుక్ రాకతో రూఢీ అయ్యాయి. ఆయనకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని సీఎం అన్నారు. యాపిల్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ ఆనందంతో సీఎం కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, యాపిల్ సంస్థ అధికారులు, డిజిటల్ మీడియా డెరైక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, యాపిల్ సీఈవో టీమ్ కుక్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్నటి దాకా ఐటీ మంత్రి కేటీఆర్ లేవనెత్తిన సస్పెన్స్‌కు టిమ్ కుక్ రాకతో తెరపడిందని ఈ సందర్భంగా సీఎం చమత్కరించారు. -
కేటీఆర్ రేర్ సెల్ఫీ ఏంటో తెలుసా?
హైదరాబాద్ : తెలంగాణా ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు చివరికి ఆ బిగ్ న్యూస్ ను రివీల్ చేశారు. గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అంటూ ఊరించిన మంత్రి భాగ్యనగరంలో యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభంకావడమే బిగ్ న్యూస్ అని తేల్చేశారు. హైదరాబాద్ లో యాపిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం కావడం పట్ల ఐటీ శాఖా మంత్రి ఆనందంలోమునిగి తేలుతున్నారు. భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ గురువారం హైదరాబాద్ లోని వేవ్ రాక్ భవనంలో టెక్ సెంటర్ ను ప్రారంభించగా, మంత్రి కేటీర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేటీఆర్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి, తండ్రి, కేసీఆర్ సహా, టిమ్ కుక్ తో తీసుకున్న అరుదైన సెల్ఫీని మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫ్రెంజీ ఔట్ సైడ్ వేవ్ రాక్ అంటూ మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతోపాటు యాపిల్ సంస్థ ఎంబ్లమ్ 'యాపిల్' ను తమ పార్టీ గులాబీ రంగుతో పూర్తిగా నింపేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా తరువాత అతి పెద్ద డెపలప్ మెట్ సెంటర్ కు హైదరాబాద్ వేదిక అయిందని ట్విట్ చేశారు. గత ఏడాది మేనెలలో గూగుల్ వస్తే.. ఇపుడు యాపిల్ హైదరాబాద్ కు తరలి వచ్చిందని కమెంట్ చేశారు. ప్రపంచంలో అతి విలువైన దిగ్గజ టెక్ కంపెనీలు అయిందింటిలో యాపిల్ తో కలిపి నాలుగు కంపెనీలు( గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్) కార్యాలయాను స్థాపించడం విశేషమని, ఇది హైదరాబాద్ కు గర్వకారణమని కేటీర్ అన్నారు. కాగా యాపిల్ ప్రాభవాన్ని తిరిగి పునరుద్ధరించే చర్యలో భాగంగా టిమ్ కుమ్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత ఆయన ఈ ఉదయం భాగ్యనగరం చేరుకున్నారు. యాపిల్ సంస్థతో ప్రభుత్వంఎంవోయూ కుదుర్చుకున్న తరువాత గురువారం మీకో పెద్ద వార్త చెబుతా అని ట్వీట్ చేయడంతో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.